Movies

షూటింగ్‌ సమయంలో దర్శకుడితో కాస్త ఇబ్బంది పడ్డా

షూటింగ్‌ సమయంలో దర్శకుడితో కాస్త ఇబ్బంది పడ్డా

‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ప్రస్తుతం హీరో రామ్‌ పోతినేని సరసన ఆమె నటించి తాజా చిత్రం ‘ది వారియర్’. తమిళ డైరెక్టర్‌ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కృతిశెట్టి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘నా మాతృభాష తుళు. తెలుగు కూడా బాగానే మాట్లాడుతాను. ఇప్పటికే వరకు నేను తెలుగు బాగా తెలిసిన డైరెక్టర్స్‌తోనే వర్క్‌ చేశాను. అయితే లింగుస్వామి గారు తమిళ డైరెక్టర్‌ కావడంతో భాష పరంగా కాస్తా ఇబ్బంది పడ్డాను. ఆయన తెలుగులో తమిళ యాస ఉంటుంది. నాకు తమిళం తెలియదు.