హీరోయిన్లు ఒక స్థాయికి చేరుకున్న తరువాత పెళ్లి, ఇతర విషయాలపై దృష్టి పెడుతారు. దానికోసం వారు దేవాలయాలు సందర్శిస్తూ ఆధ్యాత్మిక బాట పడుతుంటారు. దీనికి సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఉదాహరణ. పెళ్లికి ముందు నయన్ గుళ్లు గోపురాలు తిరిగి పూజలు నిర్వహించారు. తాజాగా నయన్ బాటలోనే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఆధ్యాత్మిక చింతన బాట పట్టారని తెలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన ఈ అమ్మడు టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. ఇంతవరకు పెళ్లి ఊసెత్తని ఈ గుజరాతి భామ షూటింగ్ విరామ సమయంలో ఆలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. అంతేకాదు ఇటీవల హిమాలయ ప్రాంతాలను కూడా చుట్టివచ్చారు.
ప్రసిద్ధి చెందిన వైష్ణవీ దేవి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక పయనం తనకు మంచి అనుభూతి, ఉత్సాహాన్ని కలిగించిందని చెప్పారు. దీనితో పాటు ఆమె ఈశా యోగా మైదానానికి వెళ్లి ధ్యానం చేసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అందులో ఈశ యోగి మైదానంలో తాను గడిపిన మూడు రోజులు జీవితంలో మధురమైనవని పేర్కొన్నారు. ఆరోగ్య పరంగానూ పలు మంచి విష యాలు జరిగాయని, ప్రపంచం ఎంతో ఆశీర్వకరమైన దంటూ అనుభవపూర్వకంగా తెలిసిందన్నారు.