సన్నని చినుకులు పడుతూ ఉంటే ఎర్రని నిప్పులమీద మొక్క జొన్న పొత్తు కాలుస్తుంటే వచ్చే ఆ కమ్మని వాసనకి గులాం కాని వాళ్లు ఉంటారంటే అతిశయోక్తి కాదేమో! వాటిల్లో ఉండే రుచి గురించి వేరే చెప్పాలా …. గింజల్ని ఉడికించి కాస్త వెన్న జోడించి అందించే స్వీట్ కార్న్ వాసనకి ఎవరైనా ఫిదా కావాల్సిందే. అంతేనా.. పాలొద్దు టిఫినొద్దు అంటూ మారాం చేసే పిల్లలకు పాలల్లో కాసిని కార్న్ ఫ్లేక్స్ వేసిస్తే మారుమాట్లాడకుండ తినేస్తారు. సూప్ తాగినా సలాడ్ తిన్నా ఏ రూపంలో తీసుకున్నా మొక్కజొన్న రుచే వేరు. అందుకే సుమారు తొమ్మిది వేల సంవత్సరాల క్రితమే మెజో అమెరికన్లు పండించిన మొక్కజొన్న నేడు ప్రపంచవ్యాప్త ఆహారంగా మారింది. ఒకప్పుడు మెజో అమెరికన్లు పండించిన మొక్కజొన్నను మాయన్లు పెంచి పోషించారని చెప్పాలి. నాటి నుంచి ఈనాటి వరకూ దీన్ని వాళ్లు కూరగాయగానూ అల్పాహారంగానూ చిరుధాన్యంగాను వాడుతూనే ఉన్నారు. అంతేకాదు. జన్యుమార్పుల ద్వారా మేలైన వంగడాలనూ సృష్టిస్తున్నారు. మనం ఎక్కువగా పసుపు, తెలుపు మొక్కజొన్న పొత్తులనే చూసుటాం. ఎరుపూ, గులాబీ, ఊదా, ఆకుపచ్చా, నలుపూ నీలం, హరివిల్లూ ఇలా మనకు తెలీని రంగులు చాలానే ఉన్నాయి. మొక్కజొన్నతో రొట్టెలూ కూరలూ పలు రకాల స్నాక్ వెరైటీలూ చేసుకోవచ్చు. ఉడికించిన గింజల్ని సలాడ్లూ సూపుల్లోనూ వాడుకోవచ్చు.
*****పోషకాల గని:
* తాజాగా ఉడికించి తింటే ఏ రకం మొక్కజొన్న అయినా మంచిదే. శక్తివంతమైన పోషకాలతోబాటు ఎ,బి,సి,ఇ విటమిన్లూ కొన్ని ఖనిజాలు కూడా అభ్యమవుతాయి. కార్న్‌కి కాస్త నిమ్మకాయ రాసుకుని తినడం వల్ల వాటిల్లో శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, నియాసిస్ లాంటి పోషకాల శాతం మరింత పెరుగుతుంది.
*రోజువారీ అవసరమైన పీచు ఓ కప్పు కార్న్ గింజల నుంచి దొరుకుతుంది. ఇది జీర్ణసంబంధ సమస్యల్ని నివారిస్తుంది. మల బద్ధకంతోబాటు కొలొరెక్టల్ ,పేగు క్యానర్లనూ అడ్డుకుంది.
* మొక్కజొన్నలో పుష్కలంగా ఉండే థైమీన్,నియాసిస్ అనే విటమిన్లు నాడీ వవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి. పాంటో థెనిక్ ఆమ్లం జీవక్రియకు దోహదపడుతుంది. గర్భిణులకు అవసరమైన ఫోలేట్ శాతం కూడా మొక్కజొన్నల్లో ఎక్కువే. ఇవిటమిన్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
*మొక్కజొన్నలో ఖనిజాల శాతమూ ఎక్కువే. ఫాస్పరస్ మూత్రపిండాల పని తీరుకి తోడ్పడితే, మెగీషియం ఎముక బలాన్ని పెంచుతుంది.
*ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్ నిరోధకాలు గానూ పనిచేస్తాయి. ఫరూలిక్ ఆమ్లం క్యాన్సర్ నిరోధకంగా పని చేస్తూ రొమ్ము, కాలేయ క్యాన్సర్లతో పోరాడుతుంది. ఊదారంగు మొక్కజొన్న కారకాలను అడ్డుకుంటాయి. ఆల్జీమర్స్, మధుమేహం, బీపీ హృద్రోగాలనూ నివారిస్తాయని తాజా పరిశోధనలూ చెబుతున్నాయి. మిగిలిన ఆహార పదార్థాలకు భిన్నంగా ఉడికించడం వల్ల స్వీట్ కార్న్‌లో యాంటీ ఆక్సిడెంట్ల శాతం మరింత పెరుగుతుంది.
*పసుపురంగు కార్న్‌లో కంటికీ, చర్మానికీ అవసరమైన బీటా కెరోటిస్ సమృద్ధిగా ఉంటుంది.
* మొక్కజొన్నల నుంచి తీసిన నూనెలో అన్ శాచురేటెడ్ కొవ్వులూ స్టెరాల్స్ ఎక్కువగా ఉండటంవల్ల అవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదపడతాయట. పక్షవాతం వంటివి రాకుండా చేస్తాయి. బీపీనీ తగ్గిస్తాయట.
* కార్న్‌లోని ఐరన్ రక్తహీనతనీ తగ్గిస్తుంది.
* మొక్కజొన్నలోని ఫైటోకెమికల్స్ శరీరంలో ఇన్సులిన్ శాతాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర నిల్వలు పేరుకోకుండా తినే రుచికరమైన మొక్కజొన్నలో ఎంత ఆరోగ్యం దాగుందో. తియ్యదనం కోసం మొక్కజొన్న నుంచి తీసినన కార్న్ సిరప్‌ను ప్రాసెస్‌డా ఆహరపదార్థాలు, శీతల పానీయాల్లో విరివిగా వాడుతుంటారు. ఈ సిరప్‌లో ఫ్రక్టోజ్ శాతం ఎక్కువ. అది ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. కాబట్టి వాటితో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి.