చూడటానికి కిడ్నీ షేప్‌లో ఉండే జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. జీడిపప్పు కంప్లీట్ ఫుడ్ ప్యాక్‌గా చెప్పుకోవచ్చు. జీడిపప్పును‘ కాజు’ అని కూడా పిలుస్తారు. రుచికరమైన వంటకాలు తినడానికి ఎవరైనా ఇష్టపడతారు. వండుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రత్యేక పదార్థాలు కూడా ఉంటాయి. వాటిలో జీడిపప్పు కూడా ఒకటి. జీడిపప్పులను వంటల్లో, అటు స్వీట్లలోనూ, ఇటు హాట్‌లలోనూ వాడుతారు. పాయసం, ఖీర్, రకరకాల స్వీట్లు వంటి వాటిపైన కనపడుతూ నోరూరిస్తూ ఉంటాయి. ఫ్రైడ్ రైస్, బిర్యాని వంటి మరెన్నింటిలోనూ కలుపుకున్నా వాటి రుచిని మరింత పెంచుతాయి. నేతిలో వేయించి కారం, ఉప్పు చల్లుకుంటే సాయంత్రం స్నాక్‌లా తినవచ్చు. పిల్లలకు, పెద్దలకు అందరికీ బలమైన ఆహారం అని చెప్పవచ్చు. వాటిని ముద్ద చేసి కూరలకు, కూర్మాలలో వాడితే చిక్కదనాన్ని, కమ్మదనాన్ని అందిస్తాయి. అయితే వీటి ధర కాస్త ఎక్కువే.జీడిపప్పు శరీర విధులు సరిగా నిర్వహించటానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలుంటాయి. విటమిన్‌లు, మినరల్‌లు అన్నీ దీనిలో ఉంటాయి. మొదటగా బ్రెజిల్‌కి చెందినవి. కానీ 16వ శతాబ్దలంలో ఇది మన దేశానికి వచ్చింది. వీటి వల్ల పోషకాలు అందించడమే కాకుండా వివిధ రకాల వ్యాధులను కలుగచేసే కారకాలకు వ్యతిరేకంగా పని చేస్తుంది.ప్రయోజనాలు ఇతర నట్స్‌తో పోలిస్తే జీడిపప్పుల్లో తక్కువ శాతం కొవ్వు ఉంటుంది. అంతేకాకుండా, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే ‘ఒలిక్ ఆసిడ్’ కూడా ఇందులో ఉంటుంది. కొవ్వు పదార్థాలను తక్కువగా కల్గిఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌లు ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా ట్రై గ్లిజరైడ్ అనే కంటెంట్ గుండె ఆరోగ్యానికి ఎక్కువగా సహాయపడుతుంది.
*జీడిపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, కండరాలు, నరాలను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. కాబట్టి, మనకు రోజుకు 300,-750 మిల్లీగ్రాముల మెగ్నీషియం అందుతుంది. ఎముకల ఉపరితలంపై మెగ్నీషియం ఒక పూతలా ఉండి, కండర కణాలలోకి కాల్షియం ప్రవేశాన్ని నిలిపి రక్తనాళాలకు, కండరాలకు విశ్రాంతి చేకూరుస్తుంది. కానీ శరీరంలో మెగ్నీషియం లోపం ఏర్పడి నట్లయితే, కాల్షియం రక్తనాళాలలోకి చేరుతుంది. ఫలితంగా అధిక రక్తపీడనం, మైగ్రేన్ తలనొప్పి కలిగే అవకాశం ఉంది. జీడిపప్పులో మెగ్నీషియం అధికమొత్తంలో ఉండి ఈ చర్యను నివారించి, వ్యాధులను, సమస్యలను కలుగకుండా కాపాడుతుంది.
*జీడిపప్పులో ఉన్న పుష్కలంగా ఉన్న మెగ్నీషియం బ్లడ్‌ప్రెజర్‌ను తగ్గిస్తుంది. ఇక రక్తపోటు(బీపీ) ఉన్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడాల్సిన పనిలేదు. ఇందులో సోడియం శాతం తక్కువగానూ, పోటాషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి. జీడిపప్పులో యాంటీఆక్సిడెంట్ అంటే సెలీనియం, విటమిన్ ‘ఇ’ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ ఆక్సిడేషన్‌ను నివారిస్తాయి. దాంతో క్యాన్సర్ రిస్క్‌ను అరికట్టి, వ్యాధి నిరోధకతను పెంచుతాయి. ఇందులో జింక్ అధికంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్‌తో పోరాడుతుంది.
*జీడిపప్పులో ఉండే అధిక కాపర్ కంటెంట్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ముఖ్యంగా ఎంజైమ్ యాక్టివిటీ, హార్మోన్ ప్రొడక్షన్, బ్రెయిన్ ఫంక్షన్ మొదలగు వాటి క్రియల కోసం ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఇంకా అనీమియాను ఎదుర్కోవడానికి అవసరం అయ్యే రెడ్ బ్లడ్ సెల్స్‌ను ఉత్పత్తి చేయడానికి జీడిపప్పులో ఉండే కాపర్ ఎక్కువగా సహాయపడుతుంది.
*జీడిపప్పులో కాపర్ అనే మినరల్ మీ జుట్టుకు నేచురల్ కలర్‌ను అందించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మరి కాపర్ కంటెంట్ పుష్కలంగా ఉన్నా ఈ జీడిపప్పును తీసుకోవడం వల్ల నల్లటి, పొడవాటి జుట్టును సొంతం చేసుకోవచ్చు.జీడిపప్పు పలుకులను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటాన్ని 25శాతం తగ్గిస్తుంది.
*బరువు తగ్గడానికి:
ప్రొటీన్లు 21 శాతం, తేమ 6శాతం, కార్బొహైడ్రేట్ 2శాతం, పీచు 3శాతం, 0.5శాతం కాల్షియం, ప్రతీ వంద గ్రాములకు 5గ్రాముల ఐరన్ ఉంటుంది. వీటితో పాటు శరీర బరువును పెంచకుండా శక్తినిచ్చే ప్యాట్ 41శాతం ఉంటుంది. ఈ ఫ్యాట్ వల్ల ఆరోగ్య రీత్యా ఎటువంటి హాని జరగదు. జీడిపప్పును రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే న్యూక్లియర్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎముకలకు చాలా మంచిది. అది దంత ఆరోగ్యానికి చాలా బాగా సహాయ పడుతుంది. చిగుళ్లను ఆరోగ్యంగా ఉం చుతుంది. మోనోపాజ్ తర్వాత, తగినంత నిద్రను పొందడానికి జీడిపప్పులు అద్భుతంగా సహాయపడుతాయి.