సింహాద్రి అప్పన్న సన్నిధిలో నిర్వహించే గిరిప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే గిరి ప్రదక్షిణ కోసం దూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. అధికారికంగా మధ్యాహ్నం 3 గంటలకు స్వామి రథంతో గిరి ప్రదక్షిణను ప్రారంభిభించారు. సుమారు 10 లక్షల మంది భక్తులు గిరిప్రదక్షిణలో పాల్గొన్నారని అధికారులు అంచనా. శాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో విశిష్టతను సంతరించుకున్న గిరి ప్రదక్షిణకు భక్తులు తరలివస్తున్నారు. అధికారికంగా మధ్యాహ్నం మూడు గంటలకు స్వామివారి పుష్ప రథం ప్రారంభమైంది. కానీ ఉదయం నుంచే భక్తులు ప్రదక్షిణ ప్రారంభించారు. గిరి ప్రదక్షిణ సుమారు 32 కి.మీ మేర కొనసాగనుంది. సింహాచలం నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డు మీదుగా హనుమంతవాక జంక్షన్, తెన్నేటి పార్కు, ఎంవీపీ డబుల్ రోడ్డు, సీతమ్మధార, మాధవధార, ఎన్‌ఏడీ, గోపాలపట్నం, బుచ్చిరాజుపాలెం, ప్రహ్లాదపురం మీదుగా భక్తులు తిరిగి సింహాచలం చేరుకోనున్నారు. తొలి పావంచా దగ్గర సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు చేసారు. గిరిప్రదక్షిణతో సింహగిరి సమీపంలోని అడివివరం గ్రామంలో భక్తుల సందడి నెలకొంది. పాత గోశాల కూడలి, పాత అడవివరం కూడలి వద్ద వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు బయటకి వెళ్లి వచ్చే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు.
2.బంగారు ఆభరణాలతో పూరి జగన్నాథుని దర్శనం – సునా బేషా (సోనా వేష)
సునా బేషా ఏకాదశి తిథిలో జరిగే ఆచారం. దశమి నాటికి ప్రదాన ఆలయంకు చేరుకున్న రథంలో ఉన్న దేవతలను బంగారు ఆభరణాలతో అలంకరించబడతారు దీనినే సునా బేషా అంటారు.దీనిని రాజధీరాజ భేషా లేదా రాజా బేషా అని కూడా అంటారు. 1430 సంవత్సరంలో ఈ ‘సునా బేషా’ ను రాజు కపిలేంద్ర దేబ్ పాలనలో ప్రవేశపెట్టబడిందని చరిత్ర చెబుతోంది. దేవతలు దాదాపు మూడు క్వింటాళ్ల బరువున్న మెరిసే బంగారు ఆభరణాలను ధరిస్తారు. ఈ ఆభరణాలను శ్రీమందిర్ ఖజానా వద్ద భధ్రపరుస్తారు. దీనిని రత్న భండార్ అని పిలుస్తారు.సాంప్రదాయం ప్రకారం, సేవకులు రత్న భండార్ నుండి బంగారు మరియు వెండి ఆభరణాలను తెచ్చి, రథాలపై పుస్పాలక మరియు దైతాపతి సేవకులకు అప్పగిస్తారు, తరువాత చతుర్ధ మురతిని ఆభరణాలతో అలంకరిస్తారు.ముగ్గురు దేవతలను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. భగవంతుడు జగన్నాథ్ మరియు బలభద్ర బంగారంతో చేసిన చేతులు మరియు కాళ్ళతో కనిపిస్తారు. జగన్నాథుడు తన కుడి చేతిలో బంగారు చక్రం మరియు ఎడమ చేతిలో ఒక వెండి శంఖాన్ని కలిగి ఉన్నాడు. బాలభద్ర ఎడమ చేతిలో బంగారు నాగలిని, కుడి చేతిలో బంగారు జాపత్రిని పట్టుకొని కనిపిస్తాడు.సునా బేషంలో ఎవరైతే భగవంతుడిని చూస్తారో అతని చెడ్డ కర్మలన్నిటి నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు.
***సునా వేశంలో దేవతలను అలంకరించడానికి ఈ క్రింది ఆభరణాలు ఉపయోగించబడతాయి:
*హస్తా (చేతి),
*పాయర్ (అడుగులు),
*ముకుటా (తలపాగా లేదా పెద్ద కిరీటం),
*మయూర్ చంద్రికా- ఒక నెమలి ఈక రూపకల్పన, దీనిని శ్రీకృష్ణుడు, చులపతి తల అలంకరణగా ఉపయోగించారు,
*ముఖ సౌందర్యం, కుండల్ (చెవి వేలాడదీయడం) రింగులు),
*రాహురేఖా- దేవత ముఖం మీద అలంకరించబడిన సగం చదరపు ఆకారపు అలంకరణ,
*పద్మం (తామర),
*సేవతి (చిన్న సూర్య పువ్వు),
*చంద్రుని పువ్వు ఆకారంలో అగస్తి,
*వివిధ రకాలైన మాలాలు లేదా కంఠహారాలు. బంగారు పూసలు),
*నెమలి ఈకలు రూపంలో మేయర్, మరియు *చంపా- ఒక పసుపు పువ్వు,
*దేవతల మూడవ కన్ను సూచించే శ్రీ చితా, చక్ర లేదా చక్రం, గడా లేదా జాపత్రి, పద్మ ఒక తామర పువ్వు, మరియు శంఖం కొన్ని ప్రత్యేక సందర్భంలో అలంకరించడానికి ఉపయోగించే బంగారు నమూనాలు.
3. తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమంజనం తర్వాత స్వామివారి మూలవిరాట్లుకు ఆగమోక్తంగా పూజాదికాలు చేపట్టారు. ఏడాదిలో నాలుగు పర్వదినాలైన ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మూత్సవం, వైకుంఠ ఏకాదశికి ముందు మంగళవారం రోజున ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర వాటితో తయారుచేసిన పరిమళ లేపనంతో ఆలయగోడలకు సంప్రోక్షణ చేపట్టారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు అత్యంత పవిత్రంగా ఒక మహా యజ్ఞంలా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు.
4. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎప్పుడంటే..
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండున్నర సంవత్సరాల తర్వాత జరగబోయే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరువీది ఊరేగింపుగా నిర్వహించాలని నిర్ణయించింది.
***అందులో భాగంగా..
సెప్టెంబరు 27 నుండి అక్టోబర్ 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు. సెప్టెంబరు 27వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అక్టోబర్ 1న గరుడ సేవ. సర్వదర్శనం ప్రతీరోజులాగే కొనసాగుతుంది. స్లాట్ విధానంపై త్వరలోనే నిర్ణయం.ఇక, తిరుమలలోని పార్వేట మండపం ఆధునీకరణ కోసం రూ. 2.20 కోట్ల నిధులు కేటాయించినట్టు తెలిపారు. అలాగే, అమరావతిలో శ్రీవారి ఆలయం చుట్టూ ఉద్యానవన అభివృద్ధికి రూ. 2.20 కోట్లు కేటాయింపు. టీటీడీ డైరీలు, క్యాలెండర్ల ముద్రణకు ఆమోదం. బేడీ ఆంజనేయ స్వామి కవచాలకు బంగారు తాపడం. ఆనంద నిలయం బంగారు తాపడం పనులను ఈ ఏడాది నుంచి చేపట్టనున్నట్టు తెలిపారు. దీని కోసం ఆగమశాస్ర్తం పండితులతో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే తిరుప్పావడ సేవను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.