NRI-NRT

విదేశాల్లో పాస్‌పోర్ట్‌ పోయిందా … భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు ఏం చేయాలంటే..

విదేశాల్లో పాస్‌పోర్ట్‌ పోయిందా …  భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు ఏం చేయాలంటే..

విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్ట్(Passport) తప్పనిసరి అనే విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ విదేశాలకు వెళ్లిన తర్వాత అక్కడ మీ పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే. ఇది ఊహించడానికే భయంగా ఉంటుంది కదూ. ఇక పాస్‌పోర్ట్ లేకుండా స్వదేశానికి రావడం అసాధ్యం. అయితే, దీనికి ఒక పరిష్కారం ఉంది. అక్కడి మన ఎంబసీ లేదా కాన్సులేట్ కార్యాలయాల ద్వారా ఎమర్జెన్సీ సర్టిఫికేట్ (Emergency Certificate) లేదా ఔట్‌పాస్(Out pass) పొందడం ద్వారా తిరిగి స్వదేశానికి రావొచ్చు. ఇక యూఏఈ (UAE) లోని భారతీయులు పాస్‌పోర్ట్ పోగొట్టున్న సందర్భంలో ఎమర్జెన్సీ సర్టిఫికేట్ లేదా ‘అవుట్‌పాస్’ ఎలా పొందాలి అనే విషయాన్ని తాజాగా అబుదాబిలోని భారత ఎంబసీ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

ఎమర్జెన్సీ సర్టిఫికెట్ అంటే ఏమిటి?ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అనేది విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులు తమ వద్ద చెల్లుబాటు అయ్యే ప్రయాణపత్రం లేనట్లయితే భారతదేశానికి వన్ వేలో ప్రయాణించడానికి అనుమతిస్తుంది. ఈ సర్టిఫికేట్ సాధారణంగా విదేశాల్లో పాస్‌పోర్ట్ కోల్పోయిన భారతీయులకు జారీ చేయబడుతుంది.

UAEలో ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?ఇండియన్ ఎంబసీ పాస్‌పోర్ట్ సేవా ద్వారా ఎమర్జెన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫారమ్‌ను మొదట ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు తప్పనిసరిగా భారతీయ పాస్‌పోర్ట్, వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసే అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ అయిన బీఎల్ఎస్ (BLS) ఇంటర్నేషనల్ సెంటర్‌కి మీ అసలు పాస్‌పోర్ట్ కాపీతో పాటు ఫారమ్ యొక్క ప్రింట్-అవుట్ తీసుకుని వెళ్లాలి. అధికారులు మీ భారతీయ పౌరసత్వాన్ని ధృవీకరించిన తర్వాత మాత్రమే ఎమర్జెన్సీ సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది.

కావలసిన ధృవ పత్రాలు..దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ ప్రకారం.. మీరు BLS సెంటర్‌లో సమర్పించాల్చిన ధృవ పత్రాలు ఇవే.1. ఎమర్జెన్సీ సర్టిఫికేట్ దరఖాస్తు ఫారమ్.2. మునుపటి పాస్‌పోర్ట్ కాపీ లేదా దాని వివరాలు
3. మీ వద్ద పాస్‌పోర్ట్ కాపీ లేకుంటే మీరు తప్పనిసరిగా భారత ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు పత్రాన్ని అందించాలి. దీనిలో భాగంగా మీ భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి మన దగ్గర జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డ్, ఆధార్ కార్డ్ లేదా జనన ధృవీకరణ పత్రం వంటివి ఇవ్వాల్సి ఉంటుంది.
4. ఒకవేళ మీరు UAE నివాసి అయితే, మీరు మీ ఎమిరేట్స్ ఐడీని కూడా అందించవచ్చు.మీరు సమర్పించిన దరఖాస్తు, ధృవ పత్రాలను పరిశీలించి ధృవీకరించిన తర్వాత మాత్రమే ఎమర్జెన్సీ సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది. ఇక దీనికి 60 దిర్హమ్స్(సుమారు రూ.1300) రుసుముగా చెల్లించాల్సి ఉంటుందని భారత ఎంబసీ వెల్లడించింది.
https://twitter.com/IndembAbuDhabi/status/1544205500945993731/photo/1