Movies

తగిన గుర్తింపు ఏది?

Auto Draft

మహిళా ప్రాధాన్య చిత్రాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నది తాప్సీ పన్ను. స్త్రీ సాధికారత, మహిళ శక్తిపై తరచూ తన గొంతుక వినిపిస్తూ ఉంటుంది తను. క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘శభాష్‌ మిథు’ చిత్రంలో లీడ్‌రోల్‌ పోషించింది తాప్సి. ఈ చిత్రం 15న విడుదల కానుంది. క్రీడల పట్ల ఆసక్తి ఉన్నా.. చూడటం తప్పించి ఎన్నడూ ఆడింది లేదని చెప్పుకొచ్చింది తాప్సి. బ్యాట్‌ పట్టుకోవడం కూడా సరిగ్గా తెలియని తనకు మిథాలీ పాత్రను పోషించే అవకాశం రావడం ఆశ్చర్యమే అని అంటున్నది.“మహిళలు ఎన్ని విజయాలు సాధిస్తున్నా, వారికి సమాజంలో తగిన గుర్తింపు రావడం లేదు. ‘మీ అభిమాన నటులు ఎవరు?’ అని ఎవరినైనా అడిగితే.. ఆ చెప్పే ఐదుపేర్లలో నాలుగు హీరోలవే అయి ఉంటాయి. ఆడవాళ్లను అంతగా గుర్తించకపోవడం బాధాకరం. మిథాలీరాజ్‌ విషయానికే వస్తే.. ఆమె 1999లో క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. కానీ తన క్రికెట్‌ విన్యాసాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ 2006 తర్వాత గానీ అందుబాటులో లేదు. క్రికెట్‌లో మహిళలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చేవారో దీన్నిబట్టే అర్థమవుతున్నది” అని చెబుతున్నప్పుడు తాప్సి గొంతులో ఆవేదన తొంగిచూస్తుంది.