Politics

గనుల అక్రమ తవ్వకాలు చేస్తున్నట్లు నిరూపిస్తే.. బాధ్యత వహిస్తా – TNI రాజకీయ వార్తలు

గనుల అక్రమ తవ్వకాలు చేస్తున్నట్లు నిరూపిస్తే.. బాధ్యత వహిస్తా  – TNI  రాజకీయ వార్తలు

* గనుల అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు నిరూపిస్తే బాధ్యత వహిస్తానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా గనుల అక్రమ తవ్వకాలు జరగటం లేదని.. కావాలనే తెదేపా తమపై లేనిపోని ఆరోపణలు చేస్తుందన్నారు. కుప్పంలో చంద్రబాబు బినామీలే అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గనుల అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు నిరూపిస్తే.. బాధ్యత వహిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రుషికొండలో అక్రమాలు జరగడం లేదని.. అనుమతులు ఉన్న ప్రాంతంలోనే తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పారు. గనుల తవ్వకాల ద్వారా ప్రభుత్వానికి 6 కోట్ల రూపాయల రాయల్టీ వచ్చిందన్నారు.కుప్పంలో చంద్రబాబు బినామీలే అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. కుప్పం నియోజకవర్గ పరిధిలో 31 గనులకు సంబంధించి తవ్వకాలు చేస్తున్నారని.. మరో 71 గనులకు వర్కింగ్ లీజులు ఉన్నాయని తెలిపారు. లీజులు అన్ని తెదేపా, కాంగ్రెస్ పాలనలో ఇచ్చారని.. వైకాపా అధికారంలోకి వచ్చాక ఎలాంటి లీజులు ఇవ్వలేదన్నారు. సీఎం జగన్పై బురద చల్లడానికి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

*కేంద్రం వద్ద ఏపీ ప్రయోజనాలు తాకట్టు : బీవీ రాఘువులు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీడలో వైసీపీ కాలం వెల్లదీస్తుందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టేసి స్వప్రయోజనాలకు ఆ పార్టీ నాయకులు పాకులాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నా వాటి గురించి మాట్లాడకపోవడం విచారకరమని అన్నారు.ప్రతిపక్ష టీడీపీ కూడా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు మద్దతివ్వడం వెనుక ఉద్దేశ్యం ప్రాపకం కోసమేనని ఎద్దేవా చేశారు. పోలవరం నిర్వాసితులను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నిఘా, దర్యాప్తు సంస్థలను పక్కాగా ఉపయోగించుకుంటూ ప్రతిపక్షాలను ఇరుకున పెడుతున్నారని విమర్శించారు.

*పేద ప్రజల ఆకలి బాధలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం: సోము వీర్రాజు
కేంద్రం ఇచ్చే బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయకుండా.. వైకాపా నేతలు అమ్ముకుంటున్నారా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. గరీబ్‌ కల్యాణ్‌ యోజన ద్వారా ప్రతినెలా అందించే ఉచిత బియ్యాన్ని అందించడం లేదంటూ..విజయవాడలో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం ద్వారా పేదలకు అందించే ఉచిత బియ్యాన్ని.. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలలుగా ఇవ్వడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా వచ్చినప్పటి నుంచి కేంద్రం సబ్సిడీ బియ్యాన్ని ఉచితంగా అందిస్తుందని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పేద ప్రజలకు ఆకలి బాధలు తప్పడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రాష్ట్రం నీరుగారుస్తోందని విమర్శించారు. నీతి అయోగ్ 86 లక్షల మంది లబ్దిదారులను గుర్తిస్తే.. రాష్ట్రం మాత్రం కోటి 47 లక్షల మందికి పంపిణీ చేస్తుందని… మిగతా వారు వైకాపా కార్యకర్తలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి పేదలకు బియ్యం ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్ధృతం చేస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు.

*చంద్రబాబుకు చిన్న మెదడు చితికినట్లుంది : మంత్రి రోజా
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి ఆర్‌కే రోజు మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ప్రజాదరణ కోల్పోయారని చంద్రబాబు అనడం ఆయనకు చిన్న మెదడు చితికిపోయిందే అన్న అనుమానం కలుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రులకు ర్యాంకింగ్‌ సర్వేపై కూడా రోజా మండిపడ్డారు. పది రోజుల ముఖ్యమంత్రికి ర్యాంకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.ఏపీ మంత్రి ఆర్కే రోజా గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శనంలో నటి రవళితో కలిసి రోజా శ్రీవారిని దర్శించుకుని ప్రసాదాలు తీసుకున్నారు. ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎంలకు ర్యాంకింగ్‌ ఇస్తూ చేసిన సర్వేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన సర్వే చేశారో వెల్లడించాలని ఆమె డిమాండ్‌ చేశారు. పది రోజుల క్రితం ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన వ్యక్తికి ఐదో ర్యాంకు ఇచ్చి.. మూడేండ్లుగా నిరంతరాయంగా ప్రజల కోసం పరితపిస్తూ సంక్షేమ పథకాలు తెస్తున్న సీఎం జగన్‌కు అట్టడుగు ర్యాంకు ఇవ్వడమేంటని ఆమె ప్రశ్నించారు. మా నేత జగన్‌కు చివరి ర్యాంకు ఇవ్వడంతోనే సర్వే సంస్థ లక్ష్యమేమిటో తెలిసిపోయిందన్నారు.

*మోదీ వైఫ‌ల్యాల‌కు అద్దం ప‌ట్టే ప‌దాలు ఇప్పుడు అన్‌పార్ల‌మెంట‌రీ : రాహుల్ గాంధీ
జుమ్లా, కొవిడ్ స్ప్రెడ‌ర్‌, క‌ర‌ప్ట్ వంటి ప‌లు ప‌దాల‌ను అన్‌పార్ల‌మెంట‌రీగా ప‌రిగ‌ణిస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ చర్చ‌లోకి ఎంట‌రై ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌డుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి.ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పాల‌న‌ను స‌రైన రీతిలో ఎండ‌గ‌డుతూ చేసే వ్యాఖ్య‌లు ఇప్పుడు అన్‌పార్ల‌మెంట‌రీ ప‌దాలుగా మారాయ‌ని, వీటిని మాట్లాడ‌కుండా నిషేధించార‌ని రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు రాహుల్ గాంధీ న్యూ డిక్ష‌న‌రీ ఫ‌ర్ న్యూ ఇండియా అనే క్యాప్ష‌న్ ఇచ్చారు.జుమ్లా జీవి, కొవిడ్ స్ప్రెడ‌ర్‌, స్నూప్‌గేట్‌తో పాటు త‌ర‌చూ వాడే సిగ్గుచేటు, వేధింపులు, బూట‌కం, డ్రామా, హిపోక్ర‌సీ, అస‌మ‌ర్ధ‌త అని అర్ధం ధ్వనించే ప‌దాల‌ను కూడా లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లో అన్‌పార్ల‌మెంట‌రీగా పేర్కొంటూ లోక్‌స‌భ సెక్ర‌టేరియ‌ట్ బుక్‌లెట్‌ను విడుద‌ల చేసింది. ఈ ప‌దాల‌ను అన్‌పార్ల‌మెంట‌రీ జాబితాలో ప్ర‌స్తావించడం ప‌ట్ల టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ కేంద్ర ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ఈ ప‌దాల‌ను తాను వాడ‌తాన‌ని, ద‌మ్ముంటే స్పీక‌ర్ త‌న‌ను స‌స్పెండ్ చేయాలని ఆయ‌న స‌వాల్ విసిరారు.

*పర్యావరణ పరిరక్షణ ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం: Bode prasad
పర్యావరణ పరిరక్షణ ఒక్క తెలుగుదేశం పార్టీతో సాధ్యమని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్) స్పష్టం చేశారు. గురువారం కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలోని జాతీయ రహదారిపై మొక్కలు నాటే కార్యక్రమంలో బోడె ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో ఇదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలో చేపడతామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో పాటు సామాన్య ప్రజలు తమ వంతుగా ప్రతిరోజు ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవినేని రాజా, సర్పంచ్ పందిపాటి ఇందిరా, మాజీ సర్పంచ్ షేక్ మహబూబ్ సుభాని, స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు

*గోదావరి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి: మంత్రి Errabelli
గోదావరి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. గురువారం స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాలలో పర్యటించిన మంత్రి… వరదతో కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలించారు. అనంతరం ఏబీఎన్‌తో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని, అధికారయంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో ఉంచామని తెలిపారు. మరో మూడు రోజుల పాటు వరదల ప్రభావం ఉంటుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గోదావరి పరివాహక ప్రాంతాల వైపు వెళ్లొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.

*కేంద్రం ఇచ్చిన బియ్యాన్ని ప్రభుత్వం తప్పుదారి పట్టించింది: Kanna
కలెక్టరేట్ ఎదుట బీజేపీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కన్నా లక్ష్మీ నారాయణ), పాటిబండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. కరోనా కాలం నుంచి దేశంలోని పేదలకు కేంద్రం ఉచితంగా.. ఆరు విడతలుగా బియ్యం పంపించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని పక్కదారి పట్టించిందన్నారు. కేంద్రం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని జగన్ రెడ్డి పేదలకు పంచలేదని కన్నా పేర్కొన్నారు. సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటూ పేదల బియ్యాన్ని దారి మళ్లించారన్నారు. కేంద్రం 130 పథకాలు పేద ప్రజలకు ఇస్తోందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో జగన్ రెడ్డి నవ రత్నాల పేరుతో సంక్షేమ పథకాలు ఇస్తున్నారని విమర్శించారు. వైసీపీ జండా కప్పుకున్న వారికే సంక్షేమ పధకాలు ఇచ్చే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని కన్నా డిమాండ్ చేశారు

*కమీషన్‌ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం: Komati reddy
కమీషన్‌ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… నీటిని వృధా చేసే ప్రాజెక్టులకు లక్ష కోట్లు ఖర్చుపెట్టారని మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే బ్రాహ్మణ వెళ్ళెంల ప్రాజెక్టుకేమో పైసా నిధులు లేవన్నారు. రాష్ట్రం మొత్తం వరదలతో చెరువులు పొంగి పొర్లుతుంటే నల్గొండ జిల్లాలో ఒక్క చెరువు నిండలేదని అన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, అధికారంలోకి రాగానే శ్రీశైలం సొరంగపనులను పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లకు 12 గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తప్పుడు సర్వేలను జనం నమ్మరని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు

*కౌలు రైతులకు వైసీపీ సరైన న్యాయం చేయడం లేదు: Nadendla
కౌలు రైతులకు వైసీపీ(YCP) సరైన న్యాయం చేయడం లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్వి మర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… కౌలు రైతుల ఆత్మహత్యలపై వైసీపీ నాయకులు హేళనగా మాట్లాడుతున్నారన్నారు. రైతుల కష్టాలపై సరైన తీరులో ముఖ్యమంత్రి స్పందించడం లేదని ప్రజలకు అర్ధమైందని తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్నవారు రైతులే కాదని వారిని అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. ఎనిమిది వందల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు సర్కార్ అంగీకరించిందని…వారందరికీ ఏడు లక్షల రూపాయలు చొప్పున ఇచ్చారా అని ప్రశ్నించారు. ఈనెల 16న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) మండపేట చేరుకుని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల ఇంటికి వెళ్లనున్నట్లు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. 16న పవన్ కళ్యాణ్ సభకు రాకుండా పోలీసుల ఆంక్షలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో 3 వేల మంది చనిపోతే… కేవలం 800 మంది చనిపోయారు అని వైసీపీ నాయకులు చెప్పడం దారుణమని నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

*కేంద్రం ఇచ్చిన బియ్యాన్ని ప్రభుత్వం తప్పుదారి పట్టించింది: Kanna
కలెక్టరేట్ ఎదుట బీజేపీ(BJP) నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కన్నా లక్ష్మీ నారాయణ , పాటిబండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. కరోనా కాలం నుంచి దేశంలోని పేదలకు కేంద్రం ఉచితంగా.. ఆరు విడతలుగా బియ్యం పంపించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని పక్కదారి పట్టించిందన్నారు. కేంద్రం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని జగన్ రెడ్డి పేదలకు పంచలేదని కన్నా పేర్కొన్నారు. సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటూ పేదల బియ్యాన్ని దారి మళ్లించారన్నారు. కేంద్రం 130 పథకాలు పేద ప్రజలకు ఇస్తోందన్నారు.

*పర్యావరణ పరిరక్షణ ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం: Bode prasad
పర్యావరణ పరిరక్షణ ఒక్క తెలుగుదేశం పార్టీతో నే సాధ్యమని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్స్ప ష్టం చేశారు. గురువారం కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలోని జాతీయ రహదారిపై మొక్కలు నాటే కార్యక్రమంలో బోడె ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో ఇదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలో చేపడతామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో పాటు సామాన్య ప్రజలు తమ వంతుగా ప్రతిరోజు ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవినేని రాజా, సర్పంచ్ పందిపాటి ఇందిరా, మాజీ సర్పంచ్ షేక్ మహబూబ్ సుభాని, స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.

*దేశాన్ని, రాష్ట్రాన్ని రాజకీయ నాయకులు నాశనం చేస్తున్నారు: KA Paul
దేశాన్ని, రాష్ట్రాన్ని రాజకీయ నాయకులు నాశనం చేస్తున్నారని, బీజేపీ చేసిన తప్పుడు సర్వేలపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్, 36 శాతం, బీజేపీ 30 శాతం ఓట్లు అని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సర్వే సంస్థ ‘ఆరా’ అధినేత మస్తాన్‌‌పై హైకోర్టులో పిటిషన్ వేస్తున్నామని చెప్పారు. మహారాష్ట్రలో ఈడీని అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేసిందని ఆరోపించారు.ఈవీఎంలను బ్యాన్ చేసేందుకు పోరాటం చేస్తానని, 18 ప్రధాన పార్టీల నేతలను కలుస్తానని కేఏ పాల్ చెప్పారు. బీజేపీకి టీఆర్ఎస్ బీ టీం అని అన్నారు. కోర్టులు ఇస్తున్న కొన్ని తీర్పులు ఊహాజనీతంగా ఉన్నాయని, సుప్రీంకోర్టు జడ్జికి రాజ్యసభ ఇచ్చారని, పోస్టులకు, పొజిషన్లకు జడ్జీలు భయపడుతున్నారని అన్నారు. ఆరా మస్తాన్ పిచ్చి పిచ్చి సర్వేలు చేస్తే ఊర్లలో తిరగనివ్వరన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు అన్ని రంగాల్లో విఫలమయ్యారన్నారు. ప్రజాశాంతి పార్టీకి 60 శాతం ఓటు బ్యాంకు ఉందని చెబుతూ.. ఆరా మస్తాన్ రిపోర్ట్‌ను చించేశారు. హైదరాబాద్‌లో బీజేపీ సమావేశాలకు సుమారు రూ. 2 వేల కోట్ల మేర ఖర్చు చేశారన్నారు. బండి సంజయ్ మోదీని దేవుడని అనడం ఏంటని కేఏ పాల్ ప్రశ్నించారు.

*షరతులతో విదేశీ విద్యా పథకం చేపట్టడం మోసగించడమే: Ashokbabu
షరతులతో విదేశీ విద్యా పథకాన్ని చేపట్టడం మోసగించడమే అని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అని మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ హయాంలో 4,900 మందికి విదేశీ విద్య కల్పించామని తెలిపారు. తమ జీవోతో 100 మంది కూడా ఉచితంగా విదేశాల్లో చదవలేరని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే గతంలో అమలైన విధంగా విదేశీ విద్యను కొనసాగించాలని డిమాండ్ చేశారు. జీవో 39ని రద్దు చేయకుంటే ఉద్యమిస్తామని ఎమ్మెల్సీ అశోక్‌బాబు హెచ్చరించారు.

*ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం: ఎంపీ CM ramesh
ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమని ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… పేదల ఆకలి కేకలు వైసీపీ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. పేదలను విస్మరించిన ప్రభుత్వం మనుగడ సాగించిన దాఖలాలు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్ క్రింద విద్యార్ధులకు విద్యా కానుకగా అందిస్తోందని తెలిపారు. మీడియాకు పత్రికా ప్రకటన కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు జగన్ స్టిక్కర్ వేసుకొని అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అవినీతి, శాంతి భద్రతల సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. అరాచకాలు, అక్రమాలు, దోపిడీ తప్ప అభివృద్ధి చేసింది శూన్యమని ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలు చేశారు.

*Rajya Sabhaలో తెలంగాణ గొంతుకను వినిపిస్తా..: ఎంపీ Lakshman
విభజన హామీల అమలుకు ప్రయత్నిస్తానని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్అ న్నారు. గురువారం ఆయన తో మాట్లాడుతూ రాజ్యసభలో తెలంగాణ గొంతుకను వినిపిస్తానని స్పష్టం చేశారు. ఏ కారణాలతో విభజన హామీలు అమలు కాలేదో రాష్ట్ర ప్రజలకు తెలుసునని అన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కదారి పట్టిస్తోందని, టీఆర్ఎస్ సర్కార్ అవినీతితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదోగతి పాలైందని విమర్శించారు. తాను ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైనప్పటకీ సొంత రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. టీఆర్ఎస్‌లో అనేక మంది ఎమ్మెల్యేలు, నేతలు అయిష్టంగా కొనసాగుతున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు.

* భవిష్యత్ తరాల కోసమే యుద్ధం.. వారితోనే నా పోరాటం: చంద్రబాబు
క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల నిర్మాణంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌ నియామకాలు కాని 30 నియోజకవర్గాలపై దృట్టిసారించి వారంలోగా నియామకాలు పూర్తి చేయాలన్నారు. ప్రకృతి నాశనమయ్యేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారన్న చంద్రబాబు.. ప్రకృతి విలయ తాండవం చేస్తే తట్టుకోలేమని హెచ్చరించారు. వైకాపా సర్కారు కొండల్ని, చెరువుల్ని అక్రమంగా తవ్వేస్తుందని.. ఈ అక్రమ తవ్వకాలపై సీఎస్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల నిర్మాణంపై జోనల్ ఇన్‌ఛార్జ్‌లతో తెదేపా అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌ నియామకాలు కాని 30 నియోజకవర్గాలపై దృష్టి సారించి, వారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో క్లస్టర్, యూనిట్ నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా బూత్ కమిటీల నియామకం ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. ఆగస్టు మొదటి వారం నుంచి 15వ తేదీలోపు సెక్షన్ల నియామకం పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకోసం జోనల్ ఇన్‌ఛార్జ్‌లు సంబంధిత జోనల్ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని.. నిర్దేశిత సమయంలోపు కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జోన్-1 ఇన్‌ఛార్జ్‌ బుద్ధా వెంకన్న, జోన్-2 ఇన్‌ఛార్జ్‌ ప్రత్తిపాటి పుల్లారావు, జోన్-3 ఇన్‌ఛార్జ్‌ డోలా బాలవీరాంజనేయస్వామి, జోన్-4 ఇన్‌ఛార్జ్‌ అనగాని సత్యప్రసాద్, జోన్-5 ఇన్‌ఛార్జ్‌ అమర్నాథ్ రెడ్డిలకు పలు ఆదేశాలు ఇచ్చారు. వీరితో పాటు ఈ సమీక్షలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ప్రోగ్రామ్స్ కమిటీ ఇన్‌ఛార్జ్‌ మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు.

*తెదేపా నిర్ణయం ఆశ్చర్యం కలిగించలేదు – రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తెలుగుదేశం పార్టీ మద్దతు పలకడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా పేర్కొన్నారు. దిల్లీలో రెండుసార్లు జరిగిన విపక్షాల సమావేశానికి ఆ పార్టీని ఎందుకు పిలవలేదో తనకు తెలియదని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గువాహటి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.‘రాష్ట్రపతి ఎన్నిక అసాధారణ పరిస్థితుల్లో జరుగుతోంది. రాజ్యాంగాన్ని పరిరక్షించడం ప్రధాన సవాలుగా నిలుస్తోంది. ప్రభుత్వమే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. తన అధికారాలను దుర్వినియోగం చేస్తోంది. ఆత్మ ప్రభోధానుసారం ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు. విపక్షాల నేతృత్వంలోని ప్రభుత్వాలను కూల్చివేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలను వినియోగించుకుంటోందని యశ్వంత్‌ సిన్హా ఆరోపించారు. హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి తనకు ఘనస్వాగతం పలికి గట్టి మద్దతు పలికిందని పేర్కొన్నారు.

*వైసీపీ, టీడీపీలు రాహు కేతువులు: తులసిరెడ్డి
రాష్ట్రపతి ఎన్నికల్లో స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీ, టీడీపీలు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాయని, ఈ రెండు పార్టీలు రాహు కేతువులని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.తులసిరెడ్డి విమర్శించారు. బుధవారం కడపలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ దేశానికి పట్టిన శనిగ్రహమని, రాష్ట్రాన్ని నమ్మించి మోసం చేసిన నంబర్‌వన్‌ ద్రోహి అన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిన మోదీకి వైసీపీ, టీడీపీ మద్దతు తెలపడం విడ్డూరంగా ఉందన్నారు.

*ఎన్డీయే బానిసత్వాన్ని వీడండి: శైలజానాథ్‌
ఏన్డీయే బానిసత్వాన్ని వీడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డికి ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ సూచించారు. నూఢిల్లీలో ఉన్న ఆయన బుధవారం ప్రతికా ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీయే అభ్యర్థికిు బేషరతు మద్దతు ప్రకటించడం ద్వారా రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని జగన్‌ తాకట్టు పెట్టారని అన్నారు. రాష్ట్రంలో వరద సహాయం లేకపోవడం, సకాలంలో జీతాలు ఇవ్వలేకపోవడం, రోడ్లు వేయలేకపోవడం, ప్రత్యేక హోదా సాధించలేకపోవడం జగన్‌రెడ్డి వైఫల్యాలకు నిదర్శనమన్నారు. ఎన్నికల ముందుకు ప్రతిరోజూ చెప్పిన ప్రత్యేక హోదాను ఎందుకు సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ చేతిలో ఎన్నిసార్లు మోసపోతారని శైలజానాథ్‌ నిలదీశారు.

*వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం: మనోహర్‌
వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యంగా మారిందని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో జనసేన క్రియాశీలక సభ్యుడు ఆచంట సూరిబాబు ఇటీవల ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన భార్య సూర్యకుమారికి రూ.5 లక్షల చెక్కును మనోహర్‌ బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వైసీపీ పాలనలో రాష్ట్రం ఎటుపోతుందో అర్ధంకావడం లేదు. అభివృద్ధి పక్కనపెట్టి తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదు. ప్రజాశ్రేయస్సు కోరే పార్టీ జనసేన. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ జనసేన ఉంటుంది’’ అని మనోహర్‌ అన్నారు.

*జగన్‌ ప్రభుత్వం పేదల ద్రోహి: సోము వీర్రాజు
రాష్ట్రంలోని పేదలకు నరేంద్ర మోదీ ప్రభత్వం ఉచితంగా అందిస్తోన్న బియ్యాన్ని వైసీపీ ప్రభుత్వం సరఫరా చేయడం లేదంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. నిరుపేదల పట్ల జగన్‌ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పౌర సరఫరాల గోడౌన్ల ముందు గురువారం ఉదయం 10 గంటలకి ధర్నా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద ఏపీలోని 2.68 కోట్ల మందికి 25 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కేంద్రం ఉచితంగా అందించింది. ఈ పథకాన్ని సెప్టెంబరు వరకూ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. జగన్‌ ప్రభుత్వం ఆ బియ్యాన్ని వారికి అందించడం లేదు. రాష్ట్రంలోని నిరుపేదల ఆకలి తీర్చాలన్న డిమాండ్‌తో ఏపీ బీజేపీ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగుతున్నాం. 18న మండల కేంద్రాల్లోని రేషన్‌ డిపోల ముందు బీజేపీ శ్రేణులు స్థానిక పేదలతో కలిసి ధర్నా చేస్తాయి’’ అని వీర్రాజు చెప్పారు.

*రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారు: Shailajanath
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో వరదలకు సహాయం లేకపోవడం, సకాలంలో జీతాలకు నిధులు రాకపోవడం, రోడ్లు వేయలేకపోవడం, ప్రత్యేక హోదా సాధించుకోక పోవడం సీఎం వైఫల్యానికి నిదర్శనమన్నారు. జగన్ మోహన్ రెడ్డి నోటి నుంచి కనీసం కేంద్రం నుంచి వచ్చే నిధులు సాధించుకోవాలన్న మాట కూడా రావడంలేదని ఆరోపించారు. జగన్‌ను ఎన్నుకున్నది సీఎం హోదాతో ఆయన ఎంజాయ్ చేయడానికో.. సొంత విషయాలు మాట్లాడుకోవడానికి కాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి అడక్కుండానే ఎగబడి ఎన్డీఏ (NDA) అభ్యర్థికి మద్దతు ఇచ్చారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

*Jagan చెప్పే మాటలు నేతి బీరలో నెయ్యి చందం: Yanamala
సీఎం జగన్ రెడ్డి చెప్పే మాటలు నేతబీరకాయలో నెయ్యి చందంలా ఉన్నాయని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్ రెడ్డికి ప్రచారం చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలను పరిష్కరించడంపై లేదని పేర్కొన్నారు. సామాజిక న్యాయంపై, సమసమాజ, నవ సమాజ స్థాపనలపై జగన్ రెడ్డికి చిత్తశుద్ది లేదన్నారు. జగన్ రెడ్డి చెబుతున్న సామాజిక న్యాయం పెద్ద బూటకమన్నారు. జగన్ చేస్తున్న సామాజిక న్యాయం కంటే ఆయన చేసిన సామాజిక అన్యాయమే ఎక్కువని యనమల పేర్కొన్నారు. ప్రతీ సంక్షేమ పథకంలో నిబంధనలు పెట్టి లక్షలాది మందిని తొలంగించారని ఆరోపించారు. దళితులు, గిరిజనులు, బీసీలపై దాడులు, హత్యలు చేయించారన్నారు. సామాజిక న్యాయం కోసం మూడు సంవత్సరాలలో జగన్ రెడ్డి ఏం చేశాడో చెప్పాలని నిలదీశారు. జగన్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా సంక్షేమంలో పెట్టిన కోతలపై శ్వేతపత్రం విడుదల చేయాలని యనమల పేర్కొన్నారు.

*జాతీయ చిహ్నంపై అనవసర రాద్ధాంతం: Lanka dinakar
నూతన పార్లమెంట్ భవన నిర్మాణం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నం పైన అనవసర రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ నేత లంకా దినకర్మం డిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… విగ్రహంలో సింహం గుణగణాలను మార్చారని విమర్శ చేసే వారికి సద్గుణం ప్రాప్తించాలని కోరుకున్నారు. విగ్రహం పరిమాణం పెరిగినప్పుడు గంభీరంగా కనబడడం సహజం, సింహం గుణగణాలు ఎక్కడైన మారిపోతాయా అని ప్రశ్నించారు. “సత్యమేవ జయతే నుంచి సింహమేవ జయతే” కి మారింది అనేవారు, రేపు అసలు సింహాలేందుకు అన్నా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యలు చేశారు. విమర్శించడానికి అవకాశం లేనప్పుడు ఇటువంటి ప్రచారాలు చేస్తారని లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

*మంత్రులు ఇళ్లకే పరిమితమయ్యారు: రఘునందన్‌
తెలంగాణలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుంటే.. ప్రజల బాగోలు చూడాల్సిన మంత్రులు ఇళ్లకే పరిమితమయ్యారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు విమర్శించారు. బుధరవారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోయినా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. వర్షాలకు ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని, వరద సహాయక చర్యల్లో మంత్రులు పాల్గొనాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల మాక్‌ పోలింగ్‌ శిక్షణకు తాను హాజరయ్యానని ఆయన తెలిపారు.