DailyDose

పార్లమెంట్‌ సమావేశాలు.. కాంగ్రెస్‌ కీలక నేతల భేటీ – TNI తాజా వార్తలు

పార్లమెంట్‌ సమావేశాలు.. కాంగ్రెస్‌ కీలక నేతల భేటీ  – TNI  తాజా వార్తలు

* సామాన్య ప్రజలను ప్రభావితం చేసే ఎల్‌పీజీ, ధరల పెరుగుదలకు కాంగ్రెస్‌ ప్రాధాన్యం ఇస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్‌ అగ్రనేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ బృందం సమావేశం దాదాపు గంటపాటు కొనసాగింది. ఈ సమావేశంలో రాబోయే సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై నేతలు నిర్ణయించారు.సామాన్యులకు భారంగా మారుతున్న ధరల పెరుగుదలతో పాటు పలు సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ప్రాధాన్యం నిర్ణయించినట్లు ఖర్గే సమావేశం అనంతరం విలేకరులకు తెలిపారు. అలాగే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ స్కీమ్‌ అగ్నిపథ్‌ అంశాన్ని సైతం లేవనెత్తనున్నట్లు చెప్పారు. పార్టీ నేత రాహుల్‌ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారని తెలిపారు. ఇదిలా ఉండగా.. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18న ప్రారంభమై.. ఆగస్ట్‌ 12 వరకు కొనసాగనున్నాయి.దేశంలో నిరుద్యోగం, రూపాయి పతనంతో పాటు తూర్పు లఖడ్‌లోని సరిహద్దు వెంట పరిస్థితులపై కాంగ్రెస్‌ పార్లమెంట్‌లో చర్చకు డిమాండ్‌ చేయనున్నది. వ్యవసాయ చట్టాలు రద్దు చేసిన సందర్భంలో కనీస మద్దతు ధరకు సంబంధించిన కమిటీని ఏర్పాటు చేయాలనే డిమాండ్లపై కాంగ్రెస్‌ కేంద్రాన్ని ప్రశ్నించాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. మరో వైపు పార్టీ సంస్థాగత ఎన్నికలు, అధ్యక్షుడి ఎన్నికపై సైతం చర్చించినట్లు సమాచారం. సమావేశంలో పార్టీ సీనియర్‌ నేతలు అధిర్ రంజన్ చౌదరి, పీ చిదంబరం, జైరాం రమేశ్‌, కే సురేష్, మాణికం ఠాగూర్ పాల్గొన్నారు.

*తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా నిర్వహించారు. బుధవారం రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. గురుపౌర్ణమి కావడంతో విశేషంగా భక్తులు విచ్చేశారు.పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెప్తున్నాడు. ఈ కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈఓ ర‌మేష్‌బాబు, వీజీఓ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీహరి, పార్ పత్తేదార్ ఉమామహేశ్వరరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

*ఏపీలో మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న నిరవధిక సమ్మె గురువారం నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలు జిల్లాలో కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మున్సిపల్‌ వినూత్న నిరసన తెలిపారు. వైఎస్సార్‌ విగ్రహం వద్ద అర్దనగ్నంగా మోకాళ్లపై కూర్చుండి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెత్త ట్రాక్టర్లు బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.

*వరద బాధితులను పరామర్శించడానికి పంటులో వెళ్లిన అధికారులకు పెను ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లాలో భారీ వర్షాలకు గ్రామాలు నీట మునిగాయి. వరద గ్రామాల్లో ప్రజలను పరామర్శించేందుకు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్‌‌, అధికారులు చిన్నపాటి పంటులో రుద్రమకోటకు వెళ్లారు. అక్కడి నుంచి వేలేరుపాడు వద్ద లాంచ్‌లో కలెక్టర్‌, ఎమ్మెల్యే, అధికారులు ఎక్కగా మరో పంటులో ఉన్న ఎంపీపీ లక్ష్మీదేవి, జడ్పీటీసీ రామలక్ష్మి, వైసీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, ఎస్సై సాధిక్‌ లాంచి ఎక్కే సమయంలో బోల్తా పడి నీటిలో పడ్డారు. అప్రమత్తమైన లాంచీ నిర్వాహకులు నీటిలోకి దిగి వారిని క్షేమంగా లాంచీలోకి చేర్చారు.

*యాదాద్రి: జిల్లాలోని నారాయణపూర్ మండలం మర్రిబాయి తండాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి చెందగా… మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మిషన్ భగీరథ ట్యాంకు వద్ద కరెంట్ పనులు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు నాంపల్లి మండలం లింగోటం గ్రామానికి చెందిన అనిల్ (21), ప్రశాంత్ (17)గా గుర్తించారు. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా, విద్యుత్ సరఫరా నిలిపివేయక పోవడంతో ప్రమాదం జరిగినట్టు సమాచారం.

*ఉమ్మడి భూపాలపల్లి జిల్లాను వరదలు ముంచెత్తుతున్నాయి. గోదావరికి అతి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి తీరం పల్లెలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పునరావసానికి వేలాది మంది బాధితుల తరలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మేడిగడ్డకు రికార్డ్ స్థాయిలో 24.50 లక్షల క్యూసెక్కుల వరద చేరింది. గోదావరి పరివాహక పల్లెలు ప్రమాదపుటంచున ఉన్నాయి.

*భారీ వర్షాల కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాలైన ఐదు జిల్లాలు ఆగమయ్యాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… వాతావరణ శాఖ అలర్ట్ చేసినప్పటికీ రాష్ట్ర సర్కార్ సిద్ధం కాలేదని అన్నారు. వానలకు రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయని… చాలా మంది చనిపోతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్ హౌస్ వదలడం లేదని… రాజకీయాలకే పరిమితం అవుతున్నారని మండిపడ్డారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. తమ వంతు బాధ్యతగా సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మంచిర్యాల, ములుగు, ఆదిలాబాద్‌లో మాజీ మంత్రులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారన్నారు. హైదరాబాద్‌ను వదిలి సీఎం కేసీఆర్ ఫీల్డ్‌లోకి వెళ్ళాలని మహేష్ కుమార్ గౌడ్ హితవుపలికారు

*వర్షాలు, వరదలు తాజా పరిస్థితులపై మెదక్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక ప్రజా ప్రతినిధుల సహాయం తీసుకొని సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.

*గోదావరి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. గురువారం స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాలలో పర్యటించిన మంత్రి… వరదతో కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలించారు. అనంతరం ఏబీఎన్‌తో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని, అధికారయంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో ఉంచామని తెలిపారు. మరో మూడు రోజుల పాటు వరదల ప్రభావం ఉంటుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గోదావరి పరివాహక ప్రాంతాల వైపు వెళ్లొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.

*ప్ర‌జాగ్ర‌హాన్ని త‌ట్టుకోలేక మాల్దీవుల‌కు పారిపోయిన శ్రీలంక అధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్స ఇవాళ అక్క‌డ నుంచి సింగ‌పూర్‌కు వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. బుధ‌వారం రాజీనామా చేస్తాన‌ని చెప్పిన రాజ‌ప‌క్స‌ అక‌స్మాత్తుగా మాల్దీవుల‌కు పారిపోయారు. అయితే లంక‌లో సంక్షోభం ముదురుతున్న నేప‌థ్యంలో మాల్దీవులు కూడా సుర‌క్షితం కాద‌ని గ్ర‌హించిన రాజ‌ప‌క్స‌ .. సింగ‌పూర్‌కు వెళ్ల‌నున్న‌ట్లు తాజా సమాచారం. రాణిల్ విక్ర‌మ‌సింఘేను తాత్కాలిక అధ్య‌క్షుడిగా ప్ర‌క‌టించ‌డంతో లంక‌లో ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారింది. లంకేయులు ఎక్క‌డ త‌న‌పై దాడి చేస్తారో అన్న ఉద్దేశంతో మాల్దీవుల నుంచి ప్ర‌త్యేక జెట్‌లో సింగ‌పూర్‌కు వెళ్లేందుకు రాజ‌ప‌క్స‌ ప్ర‌య‌త్నాలు చేప‌ట్టారు. ప్రైవేట్ జెట్‌ను ఏర్పాటు చేయాల‌ని మాల్దీవుల ప్ర‌భుత్వాన్ని కోరిన‌ట్లు తెలుస్తోంది. అధ్య‌క్షుడు గొట‌బాయ నుంచి రాజీనామా లేఖ అంద‌లేద‌ని పార్ల‌మెంట్ స్పీక‌ర్ తెలిపారు.

*మోక్షం పొందేందుకు అంకితభావంతో నిస్వార్థ సేవలు అందించాలని శ్రీవారి సేవకులకు వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచించారు. తిరుమలలోని సేవాసదన్ -2లో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఒడిశాకు చెందిన జై గంగా లైఫ్ అకాడమీ నిర్వాహకులు కిరణ్ మాట్లాడుతూ శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు సేవకులు ఎనలేని సేవలు అందిస్తున్నారన్నారు.

*మన ఊరు.. మన బడి పథకం అమల్లో భాగంగా 26,065 పాఠశాలల కోసం పిలిచిన గ్రీన్‌ చాక్‌ బోర్డుల కొనుగోళ్ల టెండర్‌ను రీకాల్‌ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇదే పథకంలో భాగంగా డ్యూయల్‌ డెస్‌లకు రూ.360 కోట్లు, ఫర్నిచర్‌కు రూ.195 కోట్లకు ఆహ్వానించిన టెండర్లను రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.164 కోట్ల విలువైన గ్రీన్‌ చాక్‌ బోర్డుల టెండర్‌ నంబర్‌ 45ను సవాల్‌ చేస్తూ కేంద్రీయ భండార్‌, వైట్‌ మార్‌ కంపెనీ సంయుక్తంగా వేసిన రిట్‌ పిటిషన్‌పై బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కే లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఏ సంజీవ్‌కుమార్‌ జోక్యం చేసుకుని గ్రీన్‌ చాక్‌ బోర్డుల టెండర్‌ను కూడా రద్దు చేసి మళ్లీ టెండర్లను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. ఈ హామీని హైకోర్టు రికార్డుల్లో నమోదు చేసి రిట్లపై విచారణ ముగిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. ఇదే పథకంలో పెయింటింగ్‌ టెండర్‌ను సవాలు చేసిన రిట్‌ పిటిషన్‌ హైకోర్టు విచారణలో ఉంది.

*భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 52 గేట్లు ఎత్తివేసి… 1206494 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1175494 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ 14.7392 టీఎంసీలుగా కొనసాగుతోంది.

*తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్‌మెంట్లు నిండి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 13 గంటల సమయం పడుతోంది. బుధవారం 71,289 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 33,210 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

*ప్రమాదకర స్థాయికి చేరిన కడెం ప్రాజెక్ట్‌ లోకి వరద ఉధృతి ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా… ప్రస్తుత నీటి మట్టం 692 అడుగులకు చేరింది. లెఫ్ట్ కెనాల్‌కు గండి పడటంతో ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. అయినప్పటికీ హైటెన్షన్ కొనసాగుతోంది.

*నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ కు భారీ స్థాయిలో వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్ట్‌లోకి 21760 క్యూసెక్కుల వరద నీటి ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగ ప్రస్తుతం నీటి మట్టం 1397.82 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 9.156 టీఎంసీలకు చేరుకుంది.

*లక్ష్మీ(మేడిగడ్డ)బ్యారేజీలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 22,15,760 క్యూసెక్కులకు చేరుకుంది. సరస్వతి(అన్నారం) బ్యారేజీలోని మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 14,77,975 క్యూసెక్కులు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి మట్టం 8.38 టీఎంసీలకు చేరుకుంది.

*నారాయణ అనే వ్యక్తి చావుకు కారణమైన ఎస్సై కరిముల్లాని మంత్రి కాకాని గోవర్ధన్‌ కాపాడుతున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. ఎస్సై కరిముల్లాని కోర్టు బోను ఎక్కించేదాకా వదిలిపెట్టబోమన్నారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ని ఆశ్రయించామన్నారు. ఎస్సై ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని సోమిరెడ్డి పేర్కొన్నారు.

* జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరద ఉధృతి అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వేలేరుపాడు మండలంలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఎడవెల్లి వద్ద ఎద్దు వాగు కాజ్వే పై ఇంకా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కుక్కునూరు మండలంలోని దాచారం, గోమ్ముగూడెం,బెస్తగూడెం, మద్దిగట్ల, లచ్చిగూడెం, రుద్రమకోట గ్రామాలు జల దిగ్బంధంలో ఉండిపోయాయి. దాదాపు 34 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద భయంతో మెరక ప్రాంతానికి నిర్వాసితులు తరలివెళ్తున్నారు. పునరావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

*ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరద భీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. కరెంటు సరఫరా నిలిచిపోయింది. మొబైల్, ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపైకి వరద నీరు చేరడంతో పలు గ్రామాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

*ప్రకాశం: జిల్లాలోని టంగుటూరు మండలం నాయుడుపాలెంలో టీడీపీ(TDP) ఎమ్మెల్యే స్వామి(Swamy) ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ తలపెట్టిన ఛలో నెల్లూరు కార్యక్రమానికి బయలు దేరిన ఎమ్మెల్యే స్వామిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. తనకు నోటీసులు ఇవ్వకుండా హౌస్ అరెస్ట్ చేశారంటూ ఎమ్మెల్యే స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

*గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు సరూర్ నగర్ చెరువు నిండు కుండలా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ నిండిపోయింది. మూడు గేట్లను ఎత్తి వరద నీటిని అధికారులు మూసీ నదిలోకి వదులుతున్నారు. సరూర్ నగర్ ముంపు కాలనీలు మునగకుండా జీహెచ్ఎంసీ ముందస్తుగా చర్యలు తీసుకుంటోంది. సరూర్ నగర్ చెరువు దిగువన 50కి పైగా కాలనీలున్నాయి.

*గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు సరూర్ నగర్ చెరువు నిండు కుండలా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ నిండిపోయింది. మూడు గేట్లను ఎత్తి వరద నీటిని అధికారులు మూసీ నదిలోకి వదులుతున్నారు. సరూర్ నగర్ ముంపు కాలనీలు మునగకుండా జీహెచ్ఎంసీ ముందస్తుగా చర్యలు తీసుకుంటోంది. సరూర్ నగర్ చెరువు దిగువన 50కి పైగా కాలనీలున్నాయి.

*సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని అతన్ని హతమార్చేందుకు కుట్ర పన్నిన ఉగ్రవాదుల పన్నాగాన్ని బీహార్ పోలీసులు గురువారం ఛేదించారు.2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని, జులై 12వతేదీన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని కుట్ర పన్నిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను బీహార్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. పాట్నా నగరంలో ఉగ్రవాదులైన అథర్ పర్వేజ్, ఎండీ జలాలుద్దీన్ లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోదీ పర్యటనకు 15 రోజుల ముందు అనుమానిత ఉగ్రవాదులు ఫుల్వారీ షరీఫ్‌లో శిక్షణ పొందారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

*అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. విలీన మండలాలు జల దిగ్బంధంలో ఉండిపోయాయి. అంతకంతకూ వరద ఉదృతి పెరుగుతోంది. ఎటపాక పోలిస్ స్టేషను వరద నీరు చుట్టుముట్టింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితులు ఎత్తైన ప్రదేశాలకు తరలిపోతున్నారు. అటు అల్లూరి జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ చింతూరులోనే మకాం వేశారు. పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని బాధితులకు అధికారులు సూచిస్తున్నారు.

*కులమత సంకెళ్లలో చిక్కుకుంటే దేశం పురోగమించలేదని, మానవ సంపదైన యువతరం సెక్యులర్ భావాలతో ఎదగాలని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కేంద్ర కార్యాలయంలో బుధవారం ప్రొఫెసర్ లక్ష్మణ్ సంపాదకత్వంలో వెలువరించిన ‘చరిత్రపుటల్లో తెలంగాణ’ గ్రంథాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు.

*కడెం ప్రాజెక్టుకు భారీగా పెరిగిన వరద ప్రవాహం చేరుకుంది. కడెం ప్రాజెక్టు పవర్ హౌస్ మీదుగా వరద ప్రవహిస్తుంది. కడెం గ్రామాన్ని వరద ప్రవాహం చుట్టుముట్టింది. అలాగే మైసమ్మ గుడి దగ్గర ప్రాజెక్టు ఎడమ కాల్వకు గండిపడింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

*ఏటా పదిహేను రోజుల పాటు శివభక్తులు ఎంతో భక్తిప్రపత్తులతో చేపట్టే ‘కన్వర్ యాత్ర’ పై ఉత్తరాఖండ్ ప్రభుత్వ యంత్రాంగం తాజా ఆదేశాలు ఇచ్చింది. కత్తులు, త్రిశూలాలు, ఇతర ప్రమాదకర వస్తువులతో వచ్చే యాత్రికులను అనుమతించేది లేదని తెలిపింది. జిల్లా సరిహద్దుల వద్దే అలాంటి వస్తువులను సీజ్ చేయాలని అన్ని పోలీస్ స్టేషన్లు, ఔట్ పోస్ట్ ఇన్‌చార్జులకు ఆదేశాలు జారీ చేసింది. జూలై 14 నుంచి కన్వర్ యాత్ర ప్రారంభం కానుంది.

*బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగస్ట్ 2వ తేదీ నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్ట నుంచి ప్రారంభించి వరంగల్ భద్రకాళీ ఆలయం వరకు యాత్ర కొనసాగించనున్నారు. సుమారు 26 రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నారు. గతంలో రెండు పర్యాయాలు సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు సాగునీరు, రుణ మాఫీ, పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు తదితర హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని బండి సంజయ్ ఆరోపిస్తూ వస్తున్నారు.

*బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగస్ట్ 2వ తేదీ నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్ట నుంచి ప్రారంభించి వరంగల్ భద్రకాళీ ఆలయం వరకు యాత్ర కొనసాగించనున్నారు. సుమారు 26 రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నారు. గతంలో రెండు పర్యాయాలు సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు సాగునీరు, రుణ మాఫీ, పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు తదితర హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని బండి సంజయ్ ఆరోపిస్తూ వస్తున్నారు.

*వైసీపీ ఎమ్మెల్యే రంగరాజుకు చేదు అనుభవం ఎదురయింది. లంక గ్రామాల్లో పడవలో పర్యటిస్తుండగా రాయిల్లంక దగ్గర గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామాల్లో ఎటువంటి సదుపాయాలు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పడవలో కలెక్టర్, ఎమ్మెల్యే ఉండగా గట్టుపై నుంచే లంకవాసులు గగ్గోలు పెట్టారు. కనీసం పడవ సౌకర్యం కూడా సక్రమంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పడవ పైనుంచే సమస్యలు విని గ్రామంలో దిగకండా రంగరాజు వెనుదిరిగారు.

*హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ నిండిపోవడంతో మూసీ లోకి నీటిని విడుదల చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఐదు రోజులుగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయిలో నిండింది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 అడుగులు. అయితే పూర్తి స్థాయిలో వరద నీరు చేరడంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగానే అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇంకా మూడు రోజులు తెలంగాణలో వర్షాలు ఉన్నందున హుస్సేన్ సాగర్ కు వరద వచ్చే అవకాశం ఉందని భావించి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల నాళాల నుండి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది..

*శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 1,03,247 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫో: నిల్‎గా ఉంది. జలాశయం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 827.80 అడుగులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటినిల్వ : 47.36 టీఎంసీలుగా ఉంది.

*ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.52 లక్షల క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. వదర ప్రవాహం నేపథ్యంలో సాయంత్రానికి మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి విపత్తుల శాఖ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాద్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో 7 ఎన్డీఆర్ఎఫ్( , 5 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. అల్లూరి జిల్లాలో 4, అంబేద్కర్ కోనసీమలో 3, ఏలూరులో 2, తూర్పుగోదావరి లో 1, పశ్చిమగోదావరి లో 2 బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని… జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచనలు చేశారు.

*ఏలూరు: జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరద ఉధృతి అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వేలేరుపాడు మండలంలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఎడవెల్లి వద్ద ఎద్దు వాగు కాజ్వే పై ఇంకా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కుక్కునూరు మండలంలోని దాచారం, గోమ్ముగూడెం,బెస్తగూడెం, మద్దిగట్ల, లచ్చిగూడెం, రుద్రమకోట గ్రామాలు జల దిగ్బంధంలో ఉండిపోయాయి. దాదాపు 34 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద భయంతో మెరక ప్రాంతానికి నిర్వాసితులు తరలివెళ్తున్నారు. పునరావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

*అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. విలీన మండలాలు జల దిగ్బంధంలో ఉండిపోయాయి. అంతకంతకూ వరద ఉదృతి పెరుగుతోంది. ఎటపాక పోలిస్ స్టేషను వరద నీరు చుట్టుముట్టింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితులు ఎత్తైన ప్రదేశాలకు తరలిపోతున్నారు. అటు అల్లూరి జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ చింతూరులోనే మకాం వేశారు. పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని బాధితులకు అధికారులు సూచిస్తున్నారు.

*భారీ వర్షాలు , వరద సహాయ చర్యలపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సమీక్ష నిర్వహించారు. 19,071 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. 223 శిబిరాల్లో 19,071 మందికి షల్టర్‌ కల్పించామని పేర్కొన్నారు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, భారీ నష్టం జరగలేదని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని సోమేశ్‌కుమార్‌ ప్రకటించారు. వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో రాష్ట్రంలో ఇటీవలే విత్తిన, మొలక దశలో ఉన్న వివిధ రకాల పంటలు నీట మునిగాయి. వర్షపాతం భారీగా ఉన్న ఆదిలాబాద్‌ జిల్లా లో 10 వేల ఎకరాల్లో పత్తి, 4 వేల ఎకరాల్లో సోయాబీన్‌, 3 వేల ఎకరాల్లో కంది పనికి రాకుండా మారాయి. ఈ జిల్లాల్లో 5.62 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా వేల ఎకరాల్లో నీట మునిగాయి. నిర్మల్‌ జిల్లా లో 12 వేల ఎకరాల్లోని పత్తి, మొక్కజొన్నలకు నష్టం వాటిల్లింది. మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. అల్లాదుర్గం, రేగోడ్‌, టేక్మాల్‌, హవేలీ ఘన్‌‌పూర్‌, నర్సాపూర్‌, శివ్వంపేట, తూప్రాన్‌, కౌడిపల్లి మండలాల్లో ప్రధాన పంటలతో పాటు కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి.

*నాంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జ్ ఫిరోజ్ ఖాన్‌ కు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి షో కాజ్ నోటీస్ జారీ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 90 లక్షలు ఓట్లు వస్తాయని పీసీసీ అంచనా వేస్తోంది.. కానీ ఫిరోజ్ ఖాన్‌ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీసీసీ అంచనాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తేసేట్లు ఉన్నాయని కమిటీ తప్పుపడుతూ ఈ మేరకు షో కాజ్ నోటీస్ ఇచ్చారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసింది.

* భద్రాచలం దగ్గర గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. 61.20 అడుగులకు వరద ఉధృతి చేరింది. భద్రాచలం దగ్గర గోదావరిలో 18,70,759 క్యూసెక్కుల ప్రవాహం ఉందని అధికారులు తెలిపారు. నేటి సాయంత్రానికి 70 అడుగులు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భద్రాచలం నుంచి పలు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి భారీగా వరద వస్తుండటంతో ఈ గండం గడిస్తే చాలు భగవంతుడా అంటూ గోదావరి పరివాహక ప్రాంత వాసులు వరద భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. గోదావరి తుదిప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి నెల్లిపాకవెళ్లే మార్గంలో పురుషోత్తపట్నం వద్ద వాహనాలను వెళ్లనీయకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. రహదారులపై వరద నీరు చేరడంతో ముందస్తు జాగ్రత్తగా ఏపీ, తెలంగాణ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

*తెలుగు రాష్ట్రాల విభజన హామీల అమలు కోసం 16న ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద మౌన దీక్ష చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలిపారు. బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. విభజన హామీల అమలు కోసం ఏపీ సీఎం జగన్‌, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, షర్మిల, ప్రవీణ్‌ కుమార్‌ సహా అన్ని పార్టీల వారు తనతో కలిసి దీక్షకు రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో తాను చేస్తున్న దీక్ష కోసం అవసరమైతే సీఎంలకు ప్రత్యేక విమానాలు పంపిస్తానన్నారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘‘గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్‌ సీబీఐ కేసులకు భయపడి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డారు. కేసీఆర్‌, బీజేపీకి బీ టీమ్‌. నన్ను తెలంగాణకు సీఎంని చేస్తే రూ.వేల కోట్ల పెట్టుబడులు తెస్తా. తెలంగాణ అభివృద్ధి చూసి ప్రధాని అయ్యే అవకాశం వస్తే ప్రపంచానికి ప్రజాశాంతి పార్టీ, తెలుగువారి సత్తా తెలియజేస్తా. జగన్‌ రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఏపీకి కంపెనీలు తీసుకురాలేక పోయారు’’ అని పాల్‌ విమర్శించారు.

* పర్యావరణ అనుమతుల నిబంధనలు పాటించనందుకు విశాఖలోని హెటిరో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెజ్‌, హెటిరో ల్యాబ్స్‌ సంస్థలకు రూ.6.94 కోట్ల జరిమానా విధించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)కు సంయుక్త కమిటీ సిఫారసు చేసింది. పర్యావరణ నిబంధనలు పాటించని కారణంగా ఈ సంస్థల పరిసరాలు కలుషితమవుతున్నాయని స్థానికుడు కంబాల అమ్మోరియా ఎన్జీటీని ఆశ్రయించారు. దీనిపై తనిఖీల కోసం గతంలో ట్రైబ్యునల్‌ సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తన నివేదికను ఎన్జీటీకి సమర్పించింది.

*జగనన్న విదేశీ విద్యా దీవెన జీవోలో జగన్‌ సర్కార్‌ కొత్త సాంప్రదాయానికి తెర తీసింది. గతంలో విదేశీ విద్యా స్కీమ్‌ సరిగ్గా అమలు కాలేదంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఏ ప్రభుత్వమైనా తమ స్కీమ్‌లను ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. అలా కాకుండా ఇప్పుడు స్కీమ్‌ను ఉత్తర్వుల్లోనే ప్రకటించింది. గతంలో లోపాలు ఉన్నాయంటూ జీవోలోనే పేర్కొనడం ఇదే తొలిసారి అని సచివాలయ వర్గాలు అంటున్నాయి. జగన్‌ సర్కార్‌‌లో చిత్ర విచిత్ర విధానాలు అవలంభిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*పోలీసుల చిత్రహింసలను నారాయణ అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా జూలై 14వ తేదీ చలో నెల్లూరుకు పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.

*‘‘చెరువులను చెర పడుతున్నారు. మట్టిని తవ్వుతున్నారు.. తరలిస్తున్నారు.. కాసులు పోగేసుకుంటున్నారు. పర్యావరణానికి హానికరంగా మారిన తవ్వకాలపై ప్రజల ఫిర్యాదులను ప్రతిపక్షాల ఆందోళనలను ఆలకించేవారే లేరు. పట్టించుకుని కట్టడి చేసేవారు లేరు. ప్రభుత్వం అండతో అక్రమ మైనింగ్ చేస్తున్నారు’’ అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రుషికొండ పర్యాటక ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం ఒక్క కొండతోనే ఆగిపోలేదు. లెక్కలేనన్ని అరాచకాలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారు. ఆ పరిసరాలన్నీ తమ సొంతం అన్నట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. పర్యాటకం పేరుతో అనుమతులు లేకుండా కొండలను ధ్వసం చేయడాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంది. రుషికొండపై నిర్మాణాల కోసం అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని, పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

*ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి చెబుతున్న మాటలు నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఉన్నాయని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. జగన్‌కు ప్రచారం చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలను పరిష్కరించడంపై లేదన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌రెడ్డి చెబుతున్న సామాజిక న్యాయం పెద్ద బూటకమని కొట్టిపారేశారు. అమ్మఒడి, విద్యాదీవెన, విద్యాకానుక, తెల్లరేషన్‌ కార్డులు, రైతు భరోసా.. ఇలా ప్రతి పథకంలోనూ కోతలు పెట్టారని, పథకాలపై నిబంధనలు పెట్టి లక్షలాదిమందిని తొలగించారని వివరించారు. దళితులు, గిరిజనులు, బీసీలపై దాడులు, హత్యలు పెరిగిపోయాయన్నారు. జగన్‌రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సంక్షేమ పథకాల్లో పెట్టిన కోతలపై శ్వేతపత్రం విడుదల చేయాలని యనమల డిమాండ్‌ చేశారు.

*‘మూఢ నమ్మకాలను నిరసిస్తూ, భారతీయ ఆధ్యాత్మికతలోని అసలైన సారాన్ని లోకానికి వినిపిస్తున్న సహస్రావధాని గరికపాటి నరసింహారావు ప్రవచనం వింటుంటే తాను తన్మయత్వం చెందుతానని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పారు. హ్యూమర్‌, గ్రామర్‌ నిండుగా, మెండుగా కలిగిన వ్యక్తి గరికపాటి అంటూ చమత్కరించారు. ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలోని దాశరథి కళావేదికపై గరికపాటి నరసింహారావును ‘పెంటమరాజు సుశీల, రంగారావు స్మారక సంస్కార్‌ అవార్డు’తో వెంకయ్యనాయుడు సన్మానించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ రాష్ట్రపతి, తాను, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి… ఇలా తామంతా ప్రాథమిక విద్యను మాతృభాషలోనే అభ్యసించామని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఆత్మనూన్యత వీడి, అమ్మభాషను నేర్చుకోవాలని ఆకాంక్షించారు. గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ కుల, మత, ప్రాంతాల ఆధారంగా వ్యక్తులను అంచనా వేసే జబ్బు సమాజం నుంచి వదిలిపోవాలన్నారు. పాఠశాలలో ఆంగ్లం తప్పనిసరి అయినట్లుగా, ఇంట్లో తెలుగును తప్పనిసరిగా బోధించాలని తల్లిదండ్రులకు సూచించారు.

*‘ఏమాత్రం క్రెడిబిలిటీ లేనివాడు చంద్రబాబు, క్యారెక్టర్‌ లేనివాడు పవన్‌కల్యాణ్‌. వీరిద్దరూ ఆంధ్రలో ఉండటం ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్బాగ్యం. ఎమ్మెల్యేగా రెండుచోట్ల ఓడిపోయిన వ్యక్తికి సిగ్గుంటే రాజకీయాల నుంచి విరమించుకోవాలి. రెండుచోట్లా ఓడిన వ్యక్తి మాటలకు విలువ ఇస్తున్నారంటే.. లేనిపోని ప్రాచుర్యం కల్పిస్తున్నారంటే.. ఈ ప్రభుత్వంపై కుట్ర చేయడం కాదా? ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి రాయని ఎల్లో మీడియా నిత్యం జగన్‌ను దించి, సీఎం సీట్లో చంద్రబాబును కుర్చో కూర్చోబెట్టాలనే ఉద్ధేశంతో అబద్దాలు రాస్తోంది. ఎవరెన్ని రాతలు రాసినా జగన్మోహన్‌రెడ్డి తలరాతను మార్చలేరు’ అని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. టీడీపీతో కలిసి పని చేస్తున్న చంద్రబాబు దత్తపుత్రుడు రైతులకు పరిహారం సరిగ్గా చెల్లించడం లేదని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పట్టాదారు పాసుపుస్తకం ఉండి ఆత్మహత్య చేసుకున్న ఏ ఒక్క రైతుకైనా, పంట సాగుదారు హక్కుపత్రం ఉండి ఆత్మహత్య చేసుకున్న ఏ కౌలురైతుకైనా రూ.7లక్షల చొప్పున పరిహారం అందలేదని రుజువు చేయగలరా? అని సవాల్‌ చేశారు. కాగా, ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా పథకాన్ని ప్రభుత్వం నోటిఫైడ్‌ చేసిన 31 పంటలకు వర్తింపజేయడానికి కేంద్రం అంగీకరించిందని మంత్రి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. బీమా ప్రీమియంలో మూడో వంతు కేంద్రం, మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ప్రస్తుత భారీ వర్షాలు, వరద వల్ల 1,800 ఎకరాల్లో వరి నారువళ్లు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా ఉందని, నారుమళ్లు దెబ్బతిన్న రైతులకు 80ు రాయితీపై విత్తనాలు ఇస్తామని ప్రకటించారు.

*ఆమె రాష్ట్ర మంత్రి. పరిపాలనలో భాగస్వామి. ప్రభుత్వ రికార్డుల్లో ప్రస్తావించిన తన పేరులో చిన్నపాటి సవరణ చేసుకోవాలని భావించారు. దీనికి సంబంధించి సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కు లేఖ రాశారు. ఇంకేముంది.. మంత్రి కాబట్టి రాత్రికిరాత్రి నిర్ణయం తీసుకుంటారని అనుకోవచ్చు. కానీ, అలా జరగలేదు. జీఏడీ నత్తనకడన స్పందించింది. కేవలం నాలుగైదు రోజుల్లో చేయాల్సిన పనిని 40 రోజుల వరకు సాగదీసింది. ఎట్టకేలకు మంత్రి పేరులో మార్పు చేసినా.. జరిగిన జాప్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మంత్రి విన్నపానికే ఇంత జాప్యమైతే.. ఇక, సామాన్యుల విన్నపాల పరిస్థితి ఏంటి? ఎన్నేళ్లు పడుతుందనే ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. విషయంలోకి వెళ్తే.. సీఎం జగన్‌ రెండో కేబినెట్‌లో అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్‌ చోటు దక్కించుకున్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే, మంత్రిగా ఆమె నియామకం తర్వాత ప్రభుత్వ రికార్డుల్లో ఆమె పేరును ‘ఉషశ్రీ చరణ్‌’గా ప్రస్తావిస్తున్నారు. దీంతో ఆమె తన పేరును సరిగా ప్రస్తావిస్తూ, ‘ఉషా శ్రీచరణ్‌’గా రికార్డుల్లో మార్పులు చేయాలని గత నెల 2న సాధారణ పరిపాలన శాఖకు లేఖ రాశారు. మంత్రి కాబట్టి వెంటనే ‘మార్పు’ జరిగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ, జీఏడీ నింపాదిగా స్పందించింది. రికార్డుల్లో మంత్రి పేరును ఉషా శ్రీచరణ్‌గా మార్పు చేసేందుకు ఏకంగా 40 రోజుల సమయం తీసుకుంది. ఎట్టకేలకు తాజాగా ఉత్తర్వులు(జీఓ 65) జారీ చేసింది. ఇదీ ఓ మంత్రి విన్నపంపై సర్కారు స్పందించిన వేగం. మంత్రి విన్నపానికే ఇలా స్పందిస్తే ఇక, సామాన్యుల పరిస్థితేంటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మంత్రి కాబట్టి కనీసం 40 రోజులకైనా ఉత్తర్వులు ఇచ్చారని, సామాన్యుల పరిస్థితి అయితే.. ఏడాదైనా పడుతుందని ప్రభుత్వ వర్గాలే చెబుతుండడం గమనార్హం.

*సామాన్యుల్లో సైతం రామాయణ, భారత ఇతిహాసాల పట్ల అమితాసక్తిని రేకెత్తించిన విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు అంటూ డెట్రాయిట్‌ తెలుగు సాహితీ సమితిలో వక్తలు కొనియాడారు. ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో డెట్రాయిట్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో సాహితీ సదస్సు జరిగింది. కార్యక్రమంలో ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, సహస్రావధాని మేడసాని మోహన్‌, తాళ్లూరి ఆంజనేయులు తదితరులు ప్రసంగించారు.

*తుంగభద్ర జలాశయం నిండుకుండను తలపిస్తోంది. గరిష్ఠ నీటి మట్టం 1633 అడుగులకుగాను, ప్రస్తుతం 1631.52 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, 99.898 టీఎంసీలకు చేరింది. రోజుకు సగటున పది టీఎంసీల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. దీంతో 30 గేట్లు 2.5 అడుగుల మేర ఎత్తి 1,15,344 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తునట్లు టీబీపీ బోర్డు ఎస్‌ఈ ఆర్‌.శ్రీకాంతరెడ్డి తెలిపారు. అలాగే, హెచ్చెల్సీ సహా వివిధ కాలువలకు 5,049 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నదితీర గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ కోటేశ్వరరావు హెచ్చరికలు జారీ చేశారు.

*జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 1,05,822 క్యూసెక్కుల నీరు వస్తోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను, ప్రస్తుతం 826.90 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకుగాను ప్రస్తుతం 46.5146 టీఎంసీల నీరు ఉంది.

*తీవ్ర అల్పపీడనం బుధవారం నాటికి దక్షిణ ఒడిసా పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనిపై సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించిన ఉపరితల ఆవర్తనం నైరుతి వైపునకు ఒంగి ఉంది. ఈ ప్రభావంతో బుధవారం కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఎక్కువచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు పడతాయని పేర్కొంది. బుధవారం కాకినాడ, అల్లూరి జిల్లాల్లో భారీ, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రుతుపవన కరెంట్‌ బలంగా ఉండడంతో సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయని, ఈనెల 16 వరకు కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. కాగా శుక్రవారం నుంచి రెండు మూడు రోజులపాటు ఏపీలో వర్షాలు తగ్గుతాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. కాగా, రాష్ట్రంలో జూలై 1 నుంచి 12 వరకు 45 మి.మీ.గాను 78.7 మి.మీ. (75 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది.

*మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి కరోనా బారినపడ్డారు. మూడు రోజుల నుంచి స్వల్ప జ్వరంతో ఇబ్బంది పడుతున్న ఆయన బుధవారం పరీక్ష చేయించుకోగా కొవిడ్‌ పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. దీంతో మధ్యాహ్నం ముఖ్యమంత్రిని కలవాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని హోం ఐసొలేషన్‌లోకి వెళ్లిపోయారు. బాలినేనికి కరోనా రావడం ఇది రెండోసారి. మంగళవారం ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశానికి కూడా ఆయన హాజరయ్యారు. గత మూడు రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని బాలినేని కోరారు.

*తీవ్ర అల్పపీడనం బుధవారం నాటికి దక్షిణ ఒడిసా పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనిపై సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించిన ఉపరితల ఆవర్తనం నైరుతి వైపునకు ఒంగి ఉంది. ఈ ప్రభావంతో బుధవారం కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఎక్కువచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు పడతాయని పేర్కొంది. బుధవారం కాకినాడ, అల్లూరి జిల్లాల్లో భారీ, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రుతుపవన కరెంట్‌ బలంగా ఉండడంతో సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయని, ఈనెల 16 వరకు కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. కాగా శుక్రవారం నుంచి రెండు మూడు రోజులపాటు ఏపీలో వర్షాలు తగ్గుతాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. కాగా, రాష్ట్రంలో జూలై 1 నుంచి 12 వరకు 45 మి.మీ.గాను 78.7 మి.మీ. (75 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది.

*రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పాలకు ధర పెంచాలంటూ ఏపీ డెయిరీకి.. కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ (కేఎంఎఫ్‌) ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. పాల సేకరణ ధర, రవాణా చార్జీలు భారీగా పెరగడంతో లీటరుకు రూ.5 పెంచాలని కోరినట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో 32 లక్షల మందికి ప్రభుత్వం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్‌ కింద పోషకాహారాన్ని అందిస్తోంది. ఈ మేరకు కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌తో ఏపీ డైరీ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం లీటరు పాలను రూ.49.75కి అందిస్తోంది. అయితే పాల సేకరణ ధర పెరిగిందని, రవాణా చార్జీలు, రా మెటీరియల్‌ రేట్లు కూడా పెరిగాయి కాబట్టి లీటరకు రూ.5 పెంచాలని ఏపీ డెయిరీని కేఎంఎఫ్‌ కోరినట్లు తెలిసింది. పాల ధరలకు సంబంధించిన ప్రతిపాదనలు ఏపీ డెయిరీ ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం.

*తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి కన్వీనర్లను నియమించింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ వివరాలను రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ప్రకటించారు. తూర్పుకాపు/గాజులకాపు: కంది మురళీనాయుడు(విజయనగరం), నాయీబ్రాహ్మణ: వి.శాంతారామ్‌(కుప్పం), శాలివాహన: ఎం.పోతులయ్య (ధర్మవరం), ఆరెకటిక: డి.నరేశ్‌ కుమార్‌(కర్నూలు), గాండ్ల: సీహెచ్‌ విశాలాక్షి(సింగనమల), దేవాంగ: బీరక ప్రసాద్‌(పాలకొల్లు), కొప్పుల వెలమ: అల్లు విజయకుమార్‌(గజపతినగరం), మత్స్యకార:ఎం.సింహాచలం(నెల్లిమర్ల), కళింగ వైశ్య: బి.గోవిందరాజులు(టెక్కలి), పాలఏకరి: జి.శివప్రసాద్‌నాయుడు(రాజంపేట), దూదేకుల: డాక్టర్‌ పి.బాబన్‌(నంద్యాల), అయ్యారక:బంగారు రమేశ్‌(శృంగవరపుకోట), యాట: ఓనం శ్రీనివా్‌స(చోడవరం), ఈడిగ: ఇ.అమరనాథ్‌గౌడ్‌(పత్తికొండ), కుర్ని: జి.తారానాథ్‌(కర్నూలు), కళింగ: ఎం.సత్యనారాయణ(పలాస), సూర్యబలిజ: డి.ఏడుకొండలు(గుంటూరు తూర్పు), కురాకుల: డి.నరసింహులు(నరసన్నపేట), పద్మశాలీ: ఎం.దేవేంద్రనాథ్‌ (విజయనగరం), వీరశైవ లింగాయత్‌ లింగబలిజ: ఎస్‌.వెంకట శివరాజు(కర్నూలు), కుంచిటి వక్కలింగ: వి.పాండురంగప్ప(మడకశిర) నియమితులయ్యారు.

* కడెం ప్రాజెక్టుకు భారీగా పెరిగిన వరద ప్రవాహం చేరుకుంది. కడెం ప్రాజెక్టు పవర్ హౌస్ మీదుగా వరద ప్రవహిస్తుంది. కడెం గ్రామాన్ని వరద ప్రవాహం చుట్టుముట్టింది. అలాగే మైసమ్మ గుడి దగ్గర ప్రాజెక్టు ఎడమ కాల్వకు గండిపడింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

* తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌వారం శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్‌ నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం జరిగింది. ఈ సందర్భంగా పెద్దజీయ‌ర్ స్వామి మ‌ఠంలో క‌ల‌శ స్థాప‌న, క‌ల‌శ పూజ‌, విష్వక్సేనారాధన, మేదినిపూజ, మృత్సంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. త‌ర్వాత సేక‌రించిన పుట్టమ‌న్నుకు ప్రత్యేక పూజ‌లు నిర్వహించి చాతుర్మాస సంక‌ల్పం స్వీక‌రించారు. అనంత‌రం పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామి ఆలయం పక్కనగల జీయంగారి మఠం వద్ద నుంచి శ్రీ చిన్నజీయంగారు, ఇతర శిష్యబృందంతో బయల్దేరారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ వరాహస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.

*మరో 3 రోజులు రాష్ట్రంలోని అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.ఈరోజు రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరో రెండు, మూడు చోట్ల ఉరుములు,మెరుపులతోపాటు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని అంచనా వేసింది. ఎల్లుండి కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.నిన్న వాయవ్య బంగాళాఖాతం.. పరిసర ప్రాంతాల్లో గుర్తించిన అల్పపీడన ప్రాంతం ఇవాళ దక్షిణ కోస్తా, ఒడిశా పరిసర ప్రాంతాలకు విస్తరించిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ పైన విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి వైపు వంపు తిరిగిందని తెలిపింది. రుతుపవన ద్రోణీ ప్రస్తుతం బికనీర్, కోటా, రైసెన్‌, మలంజ్‌ఖండ్‌, రాయ్‌పూర్‌ కేంద్రంగా వెళ్తుందని వివరించింది. దక్షిణ కోస్తా, ఒడిశా పరిసరాల్లో అల్పపీడన ప్రాంతం సముద్ర మట్టానికి 1.5కి.మీ వరకు ఉందని, అది ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించిందని తెలిపింది. 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుంచి 7.6కి.మీ వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణం వైపు వంపు తిరిగి ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

*గంజాయి సాగు చేసిన 11 మంది రైతులకు రైతుబంధు సహాయాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని మనూరు, సిర్గాపూర్‌, నారాయణఖేడ్‌, కంగ్టి, మండలాలకు చెందిన రాథోడ్‌ మేఘ్యానాయక్‌, విఠల్‌గొండ, మాణిక్‌గౌడ్‌, జాదవ్‌శారద, సంజీవ్‌, సాయిగొండ, భూత్‌పల్లి ఆనందయ్య, బూత్‌పల్లి సంజీవులు, మేత్రినాగ్‌గొండ, హుస్సేని మనెప్ప, బిరాదర్‌ రామప్ప, ఫకీర్‌ మహ్మద్‌లకు చెందిన పంట పొలాల్లో ఇటీవల గంజాయి మొక్కలను పట్టుకొని కేసులు నమోదు చేశారు. దీంతో వీరికి రైతుబంధు సహాయాన్ని నిలిపివేయాలని వ్యవసాయశాఖకు ఎక్సైజ్‌ శాఖ అధికారులు నివేదికను సమర్పించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఈ 11 మంది రైతులకు రైతుబంధును నిలిపివేస్తూ, ఈ నెల 12న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సీజన్‌కు రైతుబంధును నిలిపివేస్తూ, రైతుపట్టా పాసుపుస్తకం నంబర్లతో వ్యవసాయ అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

* డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 24, 25వ వార్షిక స్నాతకోత్సవం జూలై 15న స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ పింగళమ్‌ తెలిపారు. బుధవారం వర్సిటీ కా న్ఫరెన్స్‌ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 24, 25 వార్షిక స్నాతకోత్సవాలను ఒకేసారి నిర్వహిస్తున్నామన్నారు. 24వ స్నాతకోత్సవంలో 67మంది విద్యార్థులకు బంగారు, వెండి పతకాలు, నగదు బహుమతులు, గుండె వైద్య పరిశోధనల్లో అత్యుత్తమ సేవలందించిన వైద్యనిపుణుడు, తిరుపతి స్విమ్స్‌ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ జి.సుబ్రమణ్యంకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. 25వ స్నాతకోత్సవంలో 60 మందికి పతకాలు, నగదు బహుమతులు అందిస్తామన్నారు. పీహెచ్‌డీ చేసిన ఐదుగురికి, సూపర్‌ స్పెషాలిటీ డి గ్రీ ఒకరికి, గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలు 73 మందికి ప్రదానం చేస్తామన్నారు.

*ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని రైళ్లను ఈనెల 14 నుంచి 17 వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌-ఉందానగర్‌-సికింద్రాబాద్‌ ప్యాసింజర్‌ స్పెషల్‌, సికింద్రాబాద్‌-ఉందానగర్‌ మెము స్పెషల్‌, ఉందానగర్‌-సికింద్రాబాద్‌ మెము స్పెషల్‌, మేడ్చల్‌-ఉందానగర్‌ మెము స్పెషల్‌, ఉందానగర్‌-సికింద్రాబాద్‌ మెము స్పెషల్‌, సికింద్రాబాద్‌-ఉందానగర్‌-సికింద్రాబాద్‌ మెము స్పెషల్‌, సికింద్రాబాద్‌-మేడ్చల్‌ మెము స్పెషల్‌, మేడ్చల్‌-సికింద్రాబాద్‌ మెము స్పెషల్‌, సికింద్రాబాద్‌-బొల్లారం మెము స్పెషల్‌, బొల్లారం-సికింద్రాబాద్‌ మెము స్పెషల్‌ కొన్ని మార్గాల్లో ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07631) సికింద్రాబాద్‌ నుంచి జూలై 16, 23, 30వ తేదీల్లో రాత్రి 11.30 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 8.35 గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది. నర్సాపూర్‌-వికారాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెం బర్‌: 07632) నర్సాపూర్‌ నుంచి జూలై 17, 24, 31వ తేదీల్లో రాత్రి 8 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు వికారాబాద్‌ చేరుతుంది.

* తెలుగు రాష్ట్రాల విభజన హామీల అమలు కోసం 16న ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద మౌన దీక్ష చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలిపారు. బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. విభజన హామీల అమలు కోసం ఏపీ సీఎం జగన్‌, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, షర్మిల, ప్రవీణ్‌ కుమార్‌ సహా అన్ని పార్టీల వారు తనతో కలిసి దీక్షకు రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో తాను చేస్తున్న దీక్ష కోసం అవసరమైతే సీఎంలకు ప్రత్యేక విమానాలు పంపిస్తానన్నారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘‘గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్‌ సీబీఐ కేసులకు భయపడి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డారు. కేసీఆర్‌, బీజేపీకి బీ టీమ్‌. నన్ను తెలంగాణకు సీఎంని చేస్తే రూ.వేల కోట్ల పెట్టుబడులు తెస్తా. తెలంగాణ అభివృద్ధి చూసి ప్రధాని అయ్యే అవకాశం వస్తే ప్రపంచానికి ప్రజాశాంతి పార్టీ, తెలుగువారి సత్తా తెలియజేస్తా. జగన్‌ రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఏపీకి కంపెనీలు తీసుకురాలేక పోయారు’’ అని పాల్‌ విమర్శించారు.

*ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆదేశించారు. పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ హనుమంతరావు ఇతర ఉన్నతాధికారులతో మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, నల్లగొండ, నిర్మల్‌ జిల్లాల్లో 2,222 గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలిగిందని, పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరదతో కోతకు గురైన రోడ్ల వివరాలు, నష్టం అంచనా వేసి మరమ్మత్తులు చేపట్టాలని ఆయన సూచించారు.

* నగరంలో పనిచేస్తున్న 69 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కొంతకాలంగా బదిలీలు జరుగుతాయని ఊహాగానాలకు తెరవేస్తూ, బుధవారం ఆమోదముద్ర వేశారు. శాంతిభద్రతలు, వీఐపీల తాకిడి పరంగా అత్యంత కీలక పోలీస్టేషన్లయిన పంజాగుట్ట, సైఫాబాద్‌, బేగంబజార్‌, నారాయణగూడ ఠాణాల్లో అధికారులకు స్థానచలనం కలిగింది. ట్రాఫిక్‌, సీసీఎస్‌, ఎస్‌బీ విభాగాల్లోనూ బదిలీలు జరిగాయి. బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్త స్థానాల్లో చేరాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు.

*ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌లో 6 కొత్త ఒకేషనల్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. ఈ కొత్త కోర్సుల్లో భాగంగా.. కంప్యూటర్‌ సైన్స్‌ పరిధిలో సైబర్‌ ఫిజికల్‌ సిస్టం అండ్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ బిగ్‌డాటా అనలిటిక్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌ ప్రవేశపెడతారు. అలాగే ఎలకా్ట్రనిక్స్‌ విభాగంలో ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ వీడియో ఇంజనీరింగ్‌, బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ టెక్నీషియన్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు

*రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్‌ సరఫరా స్థితిగతులపై బుధవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తమ సిబ్బంది సరిహద్దుల్లో సైనికుల్లాగా విధులు నిర్వరిస్తున్నారన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం రాకుండా నెలరోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. వర్షాలకు రాష్ట్రంలో 2300 విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయని, వాటిలో ఇప్పటికే 1800పైగా తిరిగి ఏర్పాటు చేశామన్నారు. భూపాలపల్లి జిల్లాలోని సర్వాయిపేట 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు విద్యుత్‌ సరఫరా ఆగిందని దానిని మూడురోజుల్లో పునరుద్ధరిస్తామన్నారు.

*రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ అడ్మిషన్ల గడువును పొడిగించారు. ఈ మేరకు మోడల్‌ స్కూల్స్‌ డైరెక్టర్‌ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీన్ని అనుసరించి మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా.. రాష్ట్రంలోని పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతులకు ఇంగ్లిష్‌ మీడియం బోధనను ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు.

*గోదావరి, కృష్ణా నదులను బోర్డుల పరిధిలోకి తెస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ అమలు తేదీ సమీపించింది. గెజిట్‌ అమలుపై రెండు తెలుగు రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో రెండోసారి పెంచిన గడువు గురువారంతో ముగియనుంది. అయితే, గడువును మళ్లీ పొడిగించాలని గోదావరి బోర్డుతో పాటు కేంద్రప్రభుత్వానికి లేఖ రాయడానికి తెలంగాణ సర్కారు సిద్ధమైంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ గెజిట్‌ పట్ల అసంతృప్తిగా ఉన్నాయి. కేంద్ర జల్‌శక్తి శాఖ 2020 అక్టోబర్‌ 6న రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో గోదావరి, కృష్ణా నదుల పరిధిని నిర్ణయించింది. ఈ మేరకు 2021 జూలై 15న రెండు నదుల బోర్డులపై గెజిట్‌ జారీ చేసింది. ఆరు నెలల్లోపు ఈ రెండు నదులపై ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోకపోతే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని అందులో స్పష్టం చేసింది. గెజిట్‌ విడుదలైన 60 రోజుల్లోపు రెండు తెలుగు రాష్ట్రాలు వన్‌టైమ్‌ సీడ్‌ మనీ కింద చెరో రూ.200 కోట్లను బోర్టుల ఖాతాలో జమ చేయాలని తెలిపింది. అయితే గడువు ముగిసినా తెలంగాణ, ఏపీ ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో ప్రాజెక్టులకు అనుమతి, డబ్బుల డిపాజిట్‌ గడువును ఈ నెల 14 వరకు పొడిగించారు. మరోవైపు, తెలంగాణ ఏడు ప్రాజెక్టులకు అనుమతి కోరగా వాటిపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

*ధరల సెగతో అమెరికా గిజ గిజలాడుతోంది. జూన్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 9.1 శాతానికి చేరింది. అమెరికాలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇంత గరిష్ఠ స్థాయికి చేరడం గత 40 సంవత్సరాల్లో ఇదే గరిష్ఠం. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే జూన్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం అర శాతం పెరిగింది. చుక్కలంటిన గ్యాస్‌, ఆహార పదార్ధాల ధరలు, పెరిగిన అద్దెలు ఇందుకు ప్రధాన కారణం.

* భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. దీంతో భద్రాచలం వద్ద వేగంగా నీటిమట్టం పెరుగుతున్నది. ప్రస్తుతం రామయ్య పాదాల చెంత 17.14 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. నీటిమట్టం 58.50 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. అయితే ప్రమాద హెచ్చరికను దాటి ఐదు అడుగులకుపైగా నీరు ప్రవహిస్తున్నది. వరద ప్రవాహం కరకట్టను తాకడంతో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. ముంపు వాసులను పునరావాస కేంద్రాలను తరలించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. దీంతో ముంపు మండలాల్లోని 45 గ్రామాలకు చెందిన సుమారు 4,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే గోదావరి నీటిమట్టం 60 అడుగులకు చేరుకుంటుందని అధికారులు అంచనావేస్తున్నారు.

*శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 36 గేట్లను ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 4,18,510 క్యూసెక్కుల వరద వస్తుండగా, 4 లక్షల 50 వేల క్యూసెక్కుల నీరు నదిలోకి వెళ్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1087.40 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. 90.30 టీఎంసీల నీటినిల్వకు గాను ఇప్పుడు 74.506 టీఎంసీల నీరు ఉన్నది.

*ఎగువన భారీ వర్షాలతో కృష్ణమ్మకు వరద మొదలైంది. కర్ణాటకలో ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు పెద్దఎత్తున వరద నీరు వచ్చిచేరుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 1,06,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 18 గేట్లు ఎత్తి 1,06,772 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటినిల్ సామర్థ్యం 6.657 టీఎంసీలు కాగా, 6.896 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.జూరాల నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు పెడుతున్నది. జూరాల, తుంగభద్ర నుంచి 2 లక్షల క్యూసెక్కులకుపైగా నీరు వస్తున్నది. దీంతో పది రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉన్నది.

*కోనసీమ: జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గంలో గోదావరి నదీపాయలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. దాదాపు 21 లంక గ్రామాలను వరద నీరు చుట్టుముట్టాయి. పి.గన్నవరం, అయినవిల్లి, మామిడికుదురు మండలాల్లో కాజ్ వేలపై వరద నీరు పోటెత్తి ప్రవహిస్తోంది. అయినవిల్లి, అప్పనపల్లి, కనకాయలంక లంక కాజ్ వేల వద్ద నాటు పడవలపై ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. అయినవిల్లి మండలం పొట్టిలంక, కొండుకుదురు లంక, అయినవిల్లి లంక, మడుపల్లి లంక, పి.గన్నవరం మండలం ఊడిమూడిలంక, లంకల గన్నవరం, జొన్నల్లంక శివాయిలంక, చినకందాల పాలెం,వాడ్రేవుపల్లి,నాగుల్లంక, కె.ఏనుగుపల్లి గ్రామాల్లోకి వరదనీరు చేరింది. పాడి పశువులు ఏటిగట్లపైకి చేరాయి. పశుగ్రాసం లేక పాడి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. పి.గన్నవరం మండలంలోని తాటికాయలవారి పాలెం, యర్రంశెట్టి వారిపాలెం వంతెనల సమీపంలో వేసవిలో ఇసుక, మట్టి లారీలు తిరగడంతో ఏటిగట్టు కృంగింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

*ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.82 లక్షల క్యూసెక్కులు. నిరంతరం వరద ప్రవాహాన్ని విపత్తుల సంస్థ పర్యవేక్షిస్తోంది. సాయంత్రానికి మూడవ ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉంది. మూడవ ప్రమాద హెచ్చరిక వస్తే 6 జిల్లాల్లోని 42 మండలాల్లో 524 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అంబేద్కర్ కోనసీమ 20, తూర్పుగోదావరి లో 8 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం ఉంది. అల్లూరి జిల్లాలో 5, పశ్చిమ గోదావరి 4 మండలాలు.. ఏలూరులో 3, కాకినాడ 2 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ వెల్లడించారు. సంబంధిత జిల్లాల, మండలాల అధికారులను విపత్తుల సంస్థ అప్రమత్తం చేసింది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

*తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ లోని మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె నాలుగోరోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా గుంటూరు నగర పాలక సంస్థ ఎదుట మున్సిపల్ కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు మద్దతుగా టీడీపీ , జనసేన నేతలు ఆందోళనలో పాల్గొన్నారు.

* వర్షం, వరదల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… వారందరికీ తక్షణ సాయం కింద రూ.5000, నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు. ప్రజలంతా వరద నీటిలో కరెంటులేక అంధకారంలో మగ్గుతున్నారన్నారు. వారికీ రెండు క్రొవ్వొత్తులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. కలెక్టర్‌కు ఫోన్ చేస్తే అందుబాటులోకి రావటంలేదని అన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పనికిమాలిన వాగ్దానాలు ఇచ్చారని మండిపడ్డారు. ఆర్ & ఆర్ ప్యాకెజీ ఇవ్వకపోవడం వల్ల 7 మండలాల ప్రజలు ముంపుకు గురై ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఖాళీ చేసి వెళ్తే ప్రభుత్వం ప్యాకేజ్ ఇవ్వరనే భయంతో ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండిపోయారని గన్ని వీరాంజనేయులు తెలిపారు.

*కాకినాడలో జనసేన నేత నాదేండ్ల మనోహర్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఆయన వెంట కోనసీమ వెళ్తున్న వాహన శ్రేణికి పోలీసులు ఆటంకాలు సృష్టించారు. పోలీసుల తీరును నిరసిస్తూ తూరంగి వద్ద రోడ్డుపై జనసేన నేతలు బైఠాయించారు. అన్ని వాహనాలను ముమ్మిడివరంలోకి వెళ్ళడానికి అనుమతించాలని మనోహర్ కోరగా… కుదరదని పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీంతో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాల్లారేవు మండలం చోల్లాంగి వద్ద రోడ్డుపై బైఠాయించిన ధర్నాకు దిగారు. ఎట్టకేలకు దిగివచ్చిన పోలీసులు… వాహనాలకు అనుమతి ఇవ్వడంతో జనసేన శ్రేణులు అక్కడి నుంచి బయలుదేరారు.