సమంత కెరీర్ లో మిగితా సినిమాలన్ని ఒక ఎత్తు. పుష్ప సినిమాలోని స్పెషల్ సాంగ్ ఊ అంటావా మరో ఎత్తు. ఎందుకంటే ఈ ఒక్క సాంగ్ ఆమెకు పాన్ ఇండియా ఫేవరేట్ హీరోయిన్ గా మార్చింది. సల్మాన్ ఖాన్ కు కూడా ఈ పాటంటేనే బాగా ఇష్టం.బాలీవుడ్ ఎందరో ప్రముఖులు సమంత పాటకు స్టెప్పులేశారు.ఇప్పుడు ఇదంతా ఎందుకంటరా.. త్వరలో సామ్ మరోసారి ఇలాంటి సాంగ్లో కనిపించబోతుదంట. ప్రస్తుతం సమంత యశోద అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ఓ పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తైందని ఇటీవలే యూనిట్ తెలిపింది. ప్రస్తుతం ఆ పాటను సమంతపై చిత్రీకరిస్తోంది యూనిట్. హైదారబాద్ లో వేసిన ప్రత్యేమైన సెట్ లో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. మణిశర్మ అందించిన మాస్ సాంగ్ కు మాస్ స్టెప్స్ వేస్తోందట సమంత. ఈ పాట ఊ అంటావా ను మంచి ఉండేలా యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. సమంత కెరీర్ లో యశోద తొలి పాన్ ఇండియా ఫిల్మ్. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.