జయాపజయాలతో సంబంధం లేకుండా చేతినిండా సినిమాలతో బిజీగా దూసుకుపోతోంది పూజా. వదంతులు తనపై ఏమాత్రం ప్రభావం చూపవనే ఈమె… ఒత్తిడిని ఎలా దూరంగా ఉంచుతుందంటే.. ‘భిన్న సమయాలు, భాషలు, వ్యక్తులు, వాతావరణాల్లో పని.. ఒత్తిడి సహజమేగా! అయితే జయపజయాలను పట్టించుకోను. నేనెంత వరకూ కష్టపడ్డానన్నదే చూసుకుంటా. రోజూ యోగా, వ్యాయామం తప్పక చేస్తా. ఇవి శరీరాన్నీ, మనసునీ ఆరోగ్యంగా ఉంచుతాయి. మనసు బాగాలేకపోయినా ఆందోళన కలిగినా మా బామ్మ ముందు వాలిపోతా. నా చిన్న నాటి సంగతులు, చిలిపి విషయాలు.. ఎన్నో మాటల్లో దొర్లుతాయి. నచ్చిన నవలను మళ్లీ మళ్లీ చదువుతున్న భావన. దీంతో సమయమే తెలియదు. పైగా మానసికానందం’.