అందంలోనే కాదు నటనలోనూ సహజత్వానికి ప్రాధాన్యమిచ్చే సాయి పల్లవి.. ఒత్తిడిని జయించడంలోనూ తనది అదే మార్గమంటోంది. ‘కుటుంబమే నా లోకం. వాళ్ల నుంచి ఏ మాత్రం దూరంగా వచ్చినా ఆందోళన పడుతుంటా. పోలిక నాకు ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. అందుకే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండేదాన్ని. కానీ అభిమానులను దగ్గర చేసే మాధ్యమమదే. కాబట్టి, అప్పుడప్పుడూ నా పని, సొంత విషయాలను పంచుకుంటుంటా. సినిమా, చదువు.. ఇలా ఏదో ఒక విషయంలో బిజీగా ఉన్నంతసేపూ చుట్టూ లోకాన్నే మర్చిపోతా. ఒకసారి ఆ వాతావరణం నుంచి బయట పడ్డానంటే ఏదో ఏదో ఆలోచిస్తుంటా. దీంతో తెలియని ఒత్తిడి, ఆందోళన. నా చేతికెప్పుడూ ఓ జపమాల ఉంటుంది. అది మా తాతగారు ఇచ్చారు. అది నన్ను శాంతపరిచే సాధనం. దాన్ని రోజూ ధరిస్తా. దాంతో రోజూ 108సార్లు జపం, ధ్యానం చేస్తా. అప్పుడు నా ఆలోచనలు, భావోద్వేగాలు అదుపులోకి వచ్చేస్తాయి. ఇంట్లో ఉంటే మా చెల్లే నా స్ట్రెస్ బస్టర్. డ్యాన్స్ కూడా చేస్తా. అదే నా మనసు, శరీరం రెంటినీ ఫిట్‌గా ఉంచుతుంది’ అంటోంది.