గతంలో కళావతి, డీజే టిల్లు తదితర పాటలకు స్టె్ప్పులేసి ఫ్యాన్స్‌ను అలరించిన లయ తాజాగా మరో ట్రాక్‌కు కాలు కదిపింది. అదికూడా యూఎస్ వీధుల్లో . ఇంతకీ లయ ఏ పాటకు డ్యాన్స్ చేసిందో తెలుసా. రీసెంట్గా వచ్చిన నాని ‘అంటే సుందరానికి సినిమా.. స్వయం వరం సినిమాలో పక్కింటి అమ్మాయిలా ఎంతో అందంగా కనిపించి అభిమానుల మనసుదోచుకుంది నటి లయ. . అభినయ పరంగానూ మంచి మార్కులు కొట్టేసిందీ అందాల తార. తెలుగులో టాప్ హీరోలతోనూ కలిసి నటించింది. ఇక ప్రేమించు సినిమాలో అంధురాలి పాత్రలో ఆమె అభినయానికి ఏకంగా నంది పురస్కారం వరించింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందింది. సినిమాల్లో ఎంతో క్రేజ్ ఉండగానే ఎన్నారైతో పెళ్లిపీటలెక్కిన లయ ఆతర్వాత కాలిఫోర్నియాలో సెటిలైంది. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో హ్యాపీగా గడుపుతున్నారు. కాగా సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటుందీ ముద్దుగుమ్మ . తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటుంది. అదేవిధంగా నచ్చిన పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటోంది.
*ఈసారి అమెరికా వీధుల్లో..
గతంలో కళావతి, డీజే టిల్లు తదితర పాటలకు స్టె్ప్పులేసి ఫ్యాన్స్‌ను అలరించిన లయ తాజాగా మరో ట్రాక్‌కు కాలు కదిపింది. అదికూడా యూఎస్ వీధుల్లో . ఇంతకీ లయ ఏ పాటకు డ్యాన్స్ చేసిందో తెలుసా. రీసెంట్గా వచ్చిన నాని ‘అంటే సుందరానికి సినిమా’ ప్రమోషన్ సాంగ్‌కు. తన డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ అందాల తార.. ‘అమెరికాలోని సిటీ వాక్-యూనివర్సల్ స్డూడియోస్ వద్ద ఈ ట్రెండింగ్ ట్రాక్‌ను ప్రయత్నించాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఫ్యాన్స్ నుంచి కామెంట్లు, లైక్స్ వర్షంలా కురుస్తున్నాయి. 2010లో విడుదలైన ‘బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం’ అనే సినిమాలో చివరిసారిగా కనిపించింది లయ. ఆతర్వాత మళ్లీ మూడేళ్ల క్రితం రవితేజ నటించిన ‘ అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో ఓ చిన్నపాత్రలో నటించింది. ఇక ఇదే సినిమాలో ఇలియానా చిన్నప్పటి క్యారెక్టర్లో లయ కూతురు శ్లోకా నటించి మెప్పించడం విశేషం.