ఇటీవలే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది నాయిక రుక్సర్ థిల్లాన్. ఆమె తాజాగా మరో ప్రాజెక్ట్‌కు సైన్ చేసింది. డెబ్యూ హీరో విక్రాంత్ నటిస్తున్న ‘స్పార్క్’ సినిమాలో ఒక నాయికగా ఎంపికైంది. ఈ చిత్రంలో మెహరీన్ ఫిర్జాదా హీరోయిన్గా నటిస్తున్నది. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరవింద్‌కుమార్ రవివర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ సినిమాలో ఇతర పాత్రల్లో వెన్నెల కిషోర్, సత్య, శ్రీకాంత్, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : అబ్దుల్ వాహబ్, సినిమాటోగ్రఫీ : అరవింద్‌కుమార్ రవివర్మ.