* ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి రిజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు హాజరయ్యారు. ఇప్పటికే గడప గడపకు వెళ్తున్న ఎమ్మెల్యేలు.. మూడేళ్లలో ప్రజలకు ప్రభుత్వం ఏం చేసిందో వివరిస్తున్నారు. అత్యంత ప్రాధాన్య కార్యక్రమంగా గడప గడపకు మన ప్రభుత్వం చేపట్టారు. ప్రతినెలా ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో సీఎం జగన్ సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం రెండో నెల సమీక్షను సీఎం జగన్ నిర్వహిస్తున్నారు.
*రోడ్లు, భవనాల శాఖ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రూపొందించిన పత్రికా వ్యాసాల సంకలనం ‘సాధన’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉదయం హనుమకొండలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ పుస్తకంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విశ్లేషించిన తీరు గొప్పగా ఉందన్నారు. ఇలాంటి మరెన్నో పుస్తకాలను రచించాలని మెట్టు శ్రీనివాస్‌ను అభినందించారు.
*హిందువులకు మైనారిటీ హోదా కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం 1992లోని సెక్షన్ 2(సీ) ప్రకారం కేవలం ఆరు మతాలకు చెందిన ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్సీలు, సిక్కులు, జైనులను మైనారిటీలుగా ప్రకటించడాన్ని పిటిషనర్ సవాల్ చేశారు. జనాభా ప్రకారం జిల్లాల వారీగా మైనారిటీలను గుర్తించి, రాష్ట్రాల వారీగా ప్రజలకు ఆ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. హిందూ ఆధ్యాత్మిక నేత దేవకినందన్ ఠాకూర్ ఈ మేరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
*భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బత్ర సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు వేర్వేరు అత్యున్నత క్రీడా సంఘాలలో కీలక సభ్యుడిగా ఉన్న ఆయన మూడింటి నుంచి తప్పుకున్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోసీ), ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్), ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ లలో కీలక బాధ్యతలకు ఆయన రాజీనామా చేశారు.
*ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని స్పష్టం చేసింది.మంగళ, బుధవారాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నా యని తెలిపింది.
*ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్వాతంత్య్రదినోత్సవాన్ని జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 1.62 కోట్ల మువ్వన్నెల జెండాలను ఆవిష్కరించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా వెల్లడించారు. దేశభక్తి భావనను పెంపొందించడమే ముఖ్యోద్దేశంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నది.
*మహారాష్ట్రలో ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన పార్టీకి కష్టాలు తప్పడం లేదు. ఇటీవల ఆ పార్టీని వరుసగా పలువురు నేతలు వీడుతూ వస్తున్నారు. తాజాగా మాజీ ప్రతిపక్షనేత, మాజీ మంత్రి రాందాస్ కదమ్ పార్టీకి రాజీనామా చేశారు. ఇంతకు ముందు ఆయన తనయుడు ఎమ్మెల్యే యోగేశ్ కదమ్ షిండే వర్గంలో చేరారు. ఇటీవల రవాణా మంత్రి అనిల్ పరాబ్‌తో రాందాస్‌కు విభేదాలున్నాయని, ఈ క్రమంలో ఆయన పార్టీని వీడుతారనే ఊహాగానాలు వినిపించాయి.
* నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఆదివారం విద్యార్థులు తమ న్యాయమైన 12 డిమాండ్లను పూర్తిస్థాయిలో తక్షణమే పరిష్కరించాలని ఆర్‌జీయూకేటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో నూతన ఇన్‌చార్జి వైస్ చాన్సలర్(వీసీ) వెంకటరమణ విద్యార్థులతో చర్చలు జరిపారు. త్వరలో డిమాండ్లను పరిష్కరిస్తామని పేర్కొంటూ.. ఈ నెల 24 వరకు వీసీ గడువు కోరారు. ట్రిపుల్ ఐటీలో మూడు మెస్‌లను రద్దు చేసి నిబంధనల ప్రకారం కొత్త టెండర్లు పిలవాలని విద్యార్థులు పేర్కొన్నారు. కొత్త ల్యాప్‌టా్‌పలు అందివ్వాలని.. రెగ్యులర్ చాన్స్‌లర్, వైస్ చాన్స్‌లర్ నియామకం తదితర డిమాండ్లను వీసీ ముందుంచారు. దీంతో స్పందించిన వీసీ ఆర్‌జీయూకేటీ విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్, ఒక జత షూస్ సరఫరా కోసం టెండర్లను పిలుస్తామన్నారు.
*గోదావరి వరద కారణంగా లక్ష్మీ పంప్‌హౌ్‌సలోకి చేరిన నీటిని తోడేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎక్కువ రోజులు మోటార్లు నీటిలో ఉంటే నష్టం ఎక్కువయ్యే అవకాశం ఉండడంతో త్వరగా బయటకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో ఆదివారం సాయంత్రం నాగార్జునసాగర్, హైదరాబాద్ నుంచి 500 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటార్లతోపాటు పైపులు, ప్యానల్ బోర్డులు, ఇతర సామగ్రిని లక్ష్మీపం్‌పహౌస్ వద్దకు తరలించారు. ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం నుంచి పంప్‌హౌ్‌సలో నీటిని తోడే ప్రక్రియ ప్రారంభించనున్నారు. సాధ్యమైనంత త్వరగా నీటిని బయటకు పంపి మోటార్ల వద్ద పేరుకుపోయిన బురద, చెత్తాచెదారాన్ని తొలగించనున్నారు. ఆ తర్వాత మోటార్లను ఓపెన్ చేసి ఆరబెట్టే ప్రక్రియ చేపట్టనున్నారు.
*హన్మకొండ: నగరంలోని గణపతి ఇంజనీరింగ్ కాలేజీలో కరెంట్ కొరత ఏర్పడింది. దాని ప్రభావంతో ఎంసెట్ పరీక్షలు రాసే విద్యార్థుల ఇక్కట్లు పడుతున్నారు. ఉదయం 9 నుంచి ఒంటిగంట వరకు జరగాల్సిన ఇంజనీరింగ్ పరీక్ష ఆలస్యమైంది. ఇంకా పరీక్ష హాల్‌లోనే విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్నం 2గంటలకు జరిగే మరో పరీక్ష కరెంట్ లేక ఆలస్యమైంది. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలోపడ్డారు.
*గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలో మరణాలు అగడం లేదు. డయేరియాతో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. ఈ రోజు తెల్లవారుజామున కొలుసు మహేష్ (62) అనే సంవత్సరాల వ్యక్తి డయేరియాతో మృతి చెందాడు. తెంపల్లి గ్రామంలో సరైన వైద్యం అందడం లేదంటూ గ్రామస్తులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో డ్రెనేజి వ్యవస్థను సరిదిద్దకపోతే డయేరియా మరింత ప్రబలే అవకాశం ఉందని గ్రామస్తుల అవేదన వ్యక్తం చేస్తున్నారు.
*గడిచిన నాలుగేళ్లలో రైతుల ఆదాయం 1.3 నుంచి 1.7 రెట్లు పెరిగినట్లు భారతీయ స్టేట్ బ్యాంక్(ఎ్‌సబీఐ) పరిశోధనలో తేలింది. 2018 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2022లో వారి ఆదాయంలో ఆశించదగ్గ స్థాయిలో పెరుగుదల ఉందని ఈ పరిశోధన వివరించింది. మహారాష్ట్రలో సొయాబీన్, కర్ణాటకలో పత్తి రైతుల ఆదాయం ఈ నాలుగేళ్లలో దాదాపు రెట్టింపైందని వివరించింది. రైతుల ఆదాయం పెరుగుదలతో.. దేశ జీడీపీలో వ్యవసాయం వాటా 14.2ు నుంచి 18.8శాతానికి పెరిగిందని వెల్లడించింది. 5,000 వేల కోట్ల డాలర్ల మేర వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు జరిగినట్లు పేర్కొంది. అయితే.. సుగంధ ద్రవ్యాల ధరలు పడిపోవడంతో.. కొన్ని కేటగిరీల రైతుల ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడినట్లు పేర్కొంది. ఈ కేటగిరీలో మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్కతోపాటు.. రబ్బరు పంటలు ఉన్నట్లు వివరించింది.
*గడప గడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహిస్తున్నారు. గత నెల 8న గడప గడపకు సమీక్షలో ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్ తీసుకున్నారు. పరిస్థితి మెరుగు పర్చుకుని గ్రాఫ్ఎ మ్మెల్యేలు, నేతలు ఉన్నారు. ప్రత్యర్థులు, విపక్షనేతల ఇళ్లకు కూడా వెళ్లి.. గడప గడప కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్ ఆదేశించనున్నారు. అయితే గడప గడపకు వెళ్తే ప్రజలు తిట్ల దండకం అందుకుంటుండడంతో.. ఆ పేరు చెబితే ఎమ్మెల్యేలు గజగజా వణుకుతున్నారు.
*గడప గడపకు మన ప్రభుత్వంపై జగన్ సమీక్ష నిర్వహించారు. గత నెల 8న గడప గడపకు సమీక్షలో ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ తీసుకున్నసంగతి తెలిసిందే. పరిస్థితి మెరుగు పర్చుకుని గ్రాప్ పెంచుకోకపోతే మార్పు తప్పదని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈసారి ఎవరి గ్రాఫ్ ఏంటో అని ఎమ్మెల్యేలు, నేతలు ఆందోళనలో పడ్డారు. ప్రత్యర్థులు, విపక్షనేతల ఇళ్లకు కూడా వెళ్లి గడప గడప కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్ ఆదేశించనున్నారు. గడప గడపకు వెళ్తే ప్రజలు తిట్ల దండకం అందుకుంటుండడంతో.. గడప గడప పేరు చెబితే గజగజా ఎమ్మెల్యేలు వణుకుతున్నారు.
* సీఎం జగన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో చొరవ చూపాలని లేఖలో పేర్కొన్నారు. ప్రతి ఏటా జులై, ఆగస్టు మాసాల్లో వచ్చే వరదల కారణంగా పోలవరం నిర్వాసితులు పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులకు ఇప్పటివరకు పునరావాస ప్యాకేజీ అందలేదన్నారు.
* కొవిడ్-19కు టీకాలు ప్రారంభించిన 18నెలల్లోనే భారత్ 200 కోట్ల టీకాల మార్కును దాటి చరిత్ర సృష్టించింది. 2021, జనవరి 16న భారత్‌లో కరోనా టీకా కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు శనివారం రాత్రి వరకూ దేశవ్యాప్తంగా 199.97 టీకాలను అందించారు. వీటిలో 5.48 కోట్ల బూస్టర్ డోసులు కూడా ఉన్నాయి. 100 కోట్ల డోసులను చేరుకునేందుకు భారత్‌కు 277 రోజులు పట్టింది. కేవలం 79 రోజుల్లోనే 150 కోట్లను చేరుకోగా.. 200 కోట్ల టీకాలు పూర్తయ్యేందుకు 191రోజుల సమయం పట్టింది. కాగా.. టీకాలు 200 కోట్ల మార్కును దాటడం పట్ల ప్రధాని మోదీ ట్విటర్‌లో హర్షం వ్యక్తం చేశారు. ‘‘భారత్ మరోమారు చరిత్ర సృష్టించింది. టీకాలు 200 కోట్ల మార్కు దాటిన సందర్భంగా భారతీయులందరికీ అభినందనలు. ఈ కార్యక్రమానికి పాటుపడిన వారందరి పట్ల గర్వంగా ఉంది’’ అని మోదీ ట్వీట్ చేశారు.
*రాష్ట్రంలో 1986లో వచ్చిన వరద నివారణలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరావు సమర్థవంతంగా పని చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆదివారం ఐటీడీఏ సమావేశ మందిరంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు 1986 నాటి వరద నివారణ చర్యల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగంలో 80వ దశకంలో గోదావరి వరదల సమయంలో అప్పుడు మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకున్నారు. తుమ్మల సూచనలను దృష్టిలో ఉంచుకొని కరకట్టల అభివృద్ధి, పాలెంవాగు, మోడికుంట వాగు, ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
*తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ వర్సిటీ ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈమేరకు కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, 2022ను కేంద్ర విద్యా శాఖ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సమాచారమిచ్చింది. ఈ మేరకు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే, ఆమోదించబోయే బిల్లుల జాబితాలో ఈ బిల్లును చేర్చుతూ ఉభయసభల సచివాలయాలు బులెటిన్ విడుదల చేశాయి. ఈ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది.
*క్లౌడ్ బరస్ట్, అంతర్జాతీయ కుట్ర అంటూ సీఎం కేసీఆర్ కాకమ్మ కథలు చెప్తున్నారని వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు. కేసీఆర్ తీరు మోకాలికి, బోడిగుండుకు ముడేసినట్లుగా ఉందన్నారు. విదేశీ కుట్రల సమాచారం ఉన్న ఆయనకు వరద నష్టం ఎంతన్న సమాచారం తెలుసా.. లేదా.. అని ప్రశ్నించారు.
*బోనాల ఉత్సవాలు తెలంగాణ ప్రజలకు ప్రత్యేకమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. లష్కర్ బోనాల మహోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షాలు కురిసి పంటలు పండాలని ఆకాంక్షించానని తెలిపారు. కరోనా పూర్తిగా తొలగిపోవాలని అమ్మవారిని ప్రార్థించానని, కరోనా పూర్తిగా తొలగిపోవాలని అమ్మవారిని ప్రార్థించానని కిషన్రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతరకు ఆలయం ముస్తాబయ్యింది. అమ్మవారి ఆలయాన్ని పూలు, తోరణాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బోనాల జాతర సందర్భంగా రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
*గోదావరి వరద కారణంగా లక్ష్మీ పంప్‌హౌ్‌సలోకి చేరిన నీటిని తోడేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎక్కువ రోజులు మోటార్లు నీటిలో ఉంటే నష్టం ఎక్కువయ్యే అవకాశం ఉండడంతో త్వరగా బయటకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో ఆదివారం సాయంత్రం నాగార్జునసాగర్, హైదరాబాద్ నుంచి 500 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటార్లతోపాటు పైపులు, ప్యానల్ బోర్డులు, ఇతర సామగ్రిని లక్ష్మీపం్‌పహౌస్ వద్దకు తరలించారు. ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం నుంచి పంప్‌హౌ్‌సలో నీటిని తోడే ప్రక్రియ ప్రారంభించనున్నారు. సాధ్యమైనంత త్వరగా నీటిని బయటకు పంపి మోటార్ల వద్ద పేరుకుపోయిన బురద, చెత్తాచెదారాన్ని తొలగించనున్నారు. ఆ తర్వాత మోటార్లను ఓపెన్ చేసి ఆరబెట్టే ప్రక్రియ చేపట్టనున్నారు.
*బీజేపీ జుమ్లాలు, అబద్ధాలు, అది ప్రచారం చేసే ఫేక్ న్యూస్‌పై జీఎస్టీని విధిస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే 10 ట్రిలియన్ డాలర్లు దాటి ఉండేదని మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు. జుమ్లా నిర్భర్ భారత్ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. ఆదివారం ఆయన చేసిన ఈ ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశమైంది. కేంద్రప్రభుత్వ విధానాలపై కేటీఆర్ కొన్ని రోజులుగా ట్విటర్‌లో విమర్శలు గుప్పిస్తున్నారు.
*నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఆదివారం విద్యార్థులు తమ న్యాయమైన 12 డిమాండ్లను పూర్తిస్థాయిలో తక్షణమే పరిష్కరించాలని ఆర్‌జీయూకేటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో నూతన ఇన్‌చార్జి వైస్ చాన్సలర్(వీసీ) వెంకటరమణ విద్యార్థులతో చర్చలు జరిపారు. త్వరలో డిమాండ్లను పరిష్కరిస్తామని పేర్కొంటూ.. ఈ నెల 24 వరకు వీసీ గడువు కోరారు. ట్రిపుల్ ఐటీలో మూడు మెస్‌లను రద్దు చేసి నిబంధనల ప్రకారం కొత్త టెండర్లు పిలవాలని విద్యార్థులు పేర్కొన్నారు. కొత్త ల్యాప్‌టా్‌పలు అందివ్వాలని.. రెగ్యులర్ చాన్స్‌లర్, వైస్ చాన్స్‌లర్ నియామకం తదితర డిమాండ్లను వీసీ ముందుంచారు. దీంతో స్పందించిన వీసీ ఆర్‌జీయూకేటీ విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్, ఒక జత షూస్ సరఫరా కోసం టెండర్లను పిలుస్తామన్నారు.
* వరద ప్రభావిత జిల్లాల్లో 24 గంటల పాటు పనిచేసేలా ప్రభుత్వం వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో మొత్తం 289 వైద్య శిబిరాల్లో ఆదివారం ఒక్కరోజే 11 వేల మందికి చికిత్సలు అందజేసింది. గడిచిన రెండు రోజుల్లో 24,674 మందికి వైద్య సేవలు అందించారు. సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో బాధితులకు వేగంగా వైద్య సేవలందిస్తున్నట్లు ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం బులెటిన్‌ను విడుదల చేశారు. తీవ్ర జ్వరం, తలనొప్పి, నీరసం, కళ్లు ఎర్రబడటం, డయేరియా, ఆకలి మందగించడం వంటి లక్షణాలుంటే వెంటనే సమీపంలోని హెల్త్ క్యాంపులకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
* విజయవాడ చిన్నారికి మంకీపాక్స్కా దని నిర్ధారణ అయింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ కుటుంబంలో చిన్నారికి మంకీ పాక్స్ సోకినట్లు తొలుత వైద్యులు అనుమానించారు. చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో ఆ కుటుంబాన్ని ఐసోలేషన్ లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు చిన్నారి శాంపిల్స్ పంపించారు. చిన్నారితోపాటు కుటుంబసభ్యులకు చెందిన నమూనాలను కూడా ల్యాబ్‌కు పంపినట్లు డాక్టర్లు చెప్పారు. పరీక్షల్లో మంకీపాక్స్ నెగెటివ్‌గా తేలిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు వెల్లడించారు.
*సీఎం జగన్‌కు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉంటేనే విద్యుత్ ఉత్పత్తి చేయాలనే నిబంధనను తెలంగాణ ప్రభుత్వం పాటించడం లేదని లేఖలో పేర్కొన్నారు. మూడేళ్లుగా రాయలసీమ ప్రాంత వాసులు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. త్రాగు నీటికి ఇబ్బందులు పడుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.
*గడిచిన నాలుగేళ్లలో రైతుల ఆదాయం 1.3 నుంచి 1.7 రెట్లు పెరిగినట్లు భారతీయ స్టేట్ బ్యాంక్(ఎ్‌సబీఐ) పరిశోధనలో తేలింది. 2018 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2022లో వారి ఆదాయంలో ఆశించదగ్గ స్థాయిలో పెరుగుదల ఉందని ఈ పరిశోధన వివరించింది. మహారాష్ట్రలో సొయాబీన్, కర్ణాటకలో పత్తి రైతుల ఆదాయం ఈ నాలుగేళ్లలో దాదాపు రెట్టింపైందని వివరించింది. రైతుల ఆదాయం పెరుగుదలతో.. దేశ జీడీపీలో వ్యవసాయం వాటా 14.2ు నుంచి 18.8శాతానికి పెరిగిందని వెల్లడించింది. 5,000 వేల కోట్ల డాలర్ల మేర వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు జరిగినట్లు పేర్కొంది. అయితే.. సుగంధ ద్రవ్యాల ధరలు పడిపోవడంతో.. కొన్ని కేటగిరీల రైతుల ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడినట్లు పేర్కొంది. ఈ కేటగిరీలో మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్కతోపాటు.. రబ్బరు పంటలు ఉన్నట్లు వివరించింది.
*రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకులను తన వాహనంలో స్థానికుల సహకారంతో ఎక్కించి విశాఖ కేజీహెచ్‌లో చేర్పించి అనకాపల్లి డీఎస్పీ బి. సునీల్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న తెలుగుతల్లి ఫ్లైఓవర్ వంతెనపై ఆదివారం ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు వంతెనపై జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్ ప్రమాదాన్ని చూసిన వెంటనే తన వాహనాన్ని ఆపి స్థానికుల సహకారంతో గాయపడిన ముగ్గురి యువకులను తన వాహనంలో ఎక్కించి చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. డీఎస్పీ సునీల్‌ను పలువురు అభినందించారు.
*హైదరాబాద్ ఆటగాడు జి. సాయికార్తీక్ రెడ్డి జోడీ ఐటీఎఫ్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను నెగ్గింది. ట్యునీసియాలో జరిగిన ఫైనల్లో సాయికార్తీక్-మనీష్ జోడీ 3-6, 6-3, 10-8తో భారత్‌కే చెందిన నిక్కి కలియండ పూనాచ-రిత్విక్ చౌధురిపై నెగ్గి విజేతగా నిలిచింది.
*‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు జరిగే ఈ కార్యక్రమం ద్వారా పౌరుల్లో దేశభక్తి భావనను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉందన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా.. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా న్యూఢిల్లీ నుంచి ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ పాల్గొన్నారు.
* బీజేపీ జుమ్లాలు, అబద్ధాలు, అది ప్రచారం చేసే ఫేక్ న్యూస్‌పై జీఎస్టీని విధిస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే 10 ట్రిలియన్ డాలర్లు దాటి ఉండేదని మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు. జుమ్లా నిర్భర్ భారత్ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. ఆదివారం ఆయన చేసిన ఈ ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశమైంది. కేంద్రప్రభుత్వ విధానాలపై కేటీఆర్ కొన్ని రోజులుగా ట్విటర్‌లో విమర్శలు గుప్పిస్తున్నారు.
*’ఏపీ ప్రభుత్వం సోమవారం మరో రూ. రెండు వేల కోట్ల అప్పు తీసుకురానున్నది. ఈ అప్పుతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై 19 నాటికి అంతే కేవలం 3 నెలల 20రోజుల్లో చేసిన అప్పు రూ.36,190 కోట్లు. కానీ ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం ఈ ఆర్ధిక సంవత్సరానికి ఏపీకి రుణపరిమితి రూ.28వేల కోట్లు మాత్రమే’నని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
*రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఆదివారం విజయవాడలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి నాగోతు హరికృష్ణ, రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి మాట్లాడారు. డీఎస్సీ నిర్వహించి 24వేల టీచర్ పోస్టులు భర్తీచేయాలని డిమాండ్ చేశారు.
*మద్యం విక్రయాలలో అవినీతి ద్వారా నెలకు రూ.250 కోట్లు జగ న్ ప్యాల్‌సకు చేరుతోందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ప్రశ్నించేవారి గొంతు నొక్కడమే ఈ ప్రభుత్వ ధ్యేయమన్నారు. జగన్‌కు ఓటేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆదివారం విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రేపల్లె మండలంలో కల్తీ మద్యం సేవించి మృతిచెందిన బాధితుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించడానికి తాను బయలుదేరగా, తన ఫోన్‌ను ట్యాప్ చేసిన పోలీసులు తన కారును ముట్టడించారన్నారు. ఒక హంతకుడిని నిర్బంధించిన రీతిలో తనను పోలీసులు చుట్టుముట్టారన్నారు. ‘‘కొద్ది రోజుల క్రితం వరకు ఉత్తరాంధ్రకే పరిమితమైన విజయసాయిరెడ్డి ట్యాక్స్ ఇప్పుడు రాష్ట్రమంతా వ్యాపించింది. ఎక్సైజ్ శాఖకు డమ్మీ మంత్రిని పెట్టి అరాచకం చేస్తున్నాడు. గుట్కా నాణ్యత గురించి కొడాలి నానికి తెలిస్తే, మద్యం నాణ్యత గురించి వైసీపీ కార్యకర్తల ను అడిగితే తెలుస్తుంది. గజదొంగ విజయసాయి రెడ్డికి చంద్రబాబును విమర్శించే స్థాయి లేదు. చంద్రబాబును పది మాటలంటే, నేను వంద మాటలంటాను. విజయసాయు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన శాస్తి తప్పదు’’ అని బుద్దా వెంకన్న విమర్శించారు.
*పోలీసు బలగాల మొహరింపులు, టీడీపీ ద్వితీయశ్రేణి నేతలపై నిఘా.. ఇళ్లముందు బారికేడ్ల ఏర్పాటు.. ఇదీ టీడీపీ నాయకులు, శ్రేణుల ఇళ్ల ముందు ఆదివారం నాటి పరిస్థితి. పోటుమెరకలో కల్తీ మద్యం తాగి చనిపోయినట్లు ప్రచారం జరుగుతున్న బాధిత కుటుంబాలను పరామర్శించి సాంత్వన చేకూర్చేందుకు ఆదివారం టీడీపీ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ పర్యటించబోతోందని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ శనివారం రాత్రి ప్రకటించారు. అప్పటినుంచి టీడీపీ నాయకులపై పోలీసుల నిఘా మొదలైంది. శనివారం రాత్రి 11 గంటలకే పదుల సంఖ్యలో పోలీసులు అనగాని ఇంటితో పాటు పరిసరాలను అదుపులోకి తీసుకున్నారు. నిజనిర్ధారణ కమిటీలో సభ్యులుగా ఉన్న మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, అశోక్‌బాబు, పటాభి, బుద్దా వెంకన్నలను గడప దాటకుండా పోలీసులు కట్టడి చేశారు. నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డి, చిలకలూరిపేటలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌లను గృహ నిర్బంధం చేశారు.
*ఈమె పేరు పిట్టల శేషమ్మ. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాతకోట వైసీపీ సర్పంచ్. అప్పులు చేసి గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేశారు. బీసీ, ఎస్సీ కాలనీలో తాగునీటి పనుల కోసం రూ.3 లక్షలు ఖర్చు పెట్టారు. జగనన్న కాలనీల్లో రూ.3 లక్షలతో రెండు బోర్లు, రైతుపల్లెలో రూ.1.32 లక్షలతో బోరు, గ్రామంలో వీధి దీపాలు, పైపు లీకేజీ పనుల కోసం మొత్తం 8 నుంచి 10 లక్షల రూపాయల వరకూ ఖర్చు చేశారు. వాటికి సంబంధించిన బిల్లులు రాలేదు. సర్పంచ్‌ల ఖాతాల్లోని 14, 15వ ఆర్థిక సంఘం నిధులు డ్రా చేసుకుందామంటే వాటిని కూడా ప్రభుత్వం ఖాళీ చేసింది. అధికారులను అడిగితే తమ చేతిలో ఏమీలేదని, జగనన్న ఎప్పుడు వేస్తే అప్పుడు తీసుకోండని చెబుతున్నారు. దీంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక హైదరాబాద్ బాట పట్టారు. సర్పంచ్ కూతురు హైదరాబాద్‌లో ఉండడంతో వారంలో మూడు నాలుగు రోజులు అక్కడకు వెళ్లి అక్కడ చేపలు అమ్ముకొని తిరిగి గ్రామానికి వస్తారు. దీంతో నెలకు రూ.20 వేల వరకు ఆదాయం వస్తోందని ఆమె చెప్పారు. ఈమె భర్త నాగశేషులు గ్రామంలోనే ఆర్‌ఎంపీగా పని చేస్తున్నారు. సర్పంచ్‌గా గెలిచి గ్రామాభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేశామని, తీరా పనులు చేశాక బిల్లులు రాకపోవడంతో తమ పరిస్థితి దిగజారిందని, ఇప్పటికైనా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే బిల్లులు విడుదల చేసి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
* శ్రీశైల జలాశయంలోకి ఎగువ నుంచి 3,05,897 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. ఆదివారం జూరాల నుంచి 1,53,312 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,52,585 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 861.40 అడుగులకు చేరింది. గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎంసీలకు గాను ప్రస్తుతం 110.3410 టీఎంసీలుగా నమోదైంది. తెలంగాణ విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 25,427 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఏపీ విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదు.
* ఒడిసాతోపాటు శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా వంశధార నది పొంగి ప్రవహిస్తోంది. ఆదివారం రాత్రి హిరమండలంలోని గొట్టాబ్యారేజీ 21 గేట్లను 60 సెంటీమీటర్లు పైకెత్తి 39,604 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు.
* శ్రీశైల జలాశయంలోకి ఎగువ నుంచి 3,05,897 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. ఆదివారం జూరాల నుంచి 1,53,312 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,52,585 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 861.40 అడుగులకు చేరింది. గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎంసీలకు గాను ప్రస్తుతం 110.3410 టీఎంసీలుగా నమోదైంది. తెలంగాణ విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 25,427 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఏపీ విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదు.
*తుంగభద్ర పరవళ్లు తొక్కుతోంది. ఎగువనుంచి 1,71,245 క్యూసెక్కుల వదర తుంగభద్ర జలాశయంలోకి వచ్చి చేరుతోంది. దీంతో డ్యాం 31గేట్లు ఎత్తి, వచ్చిన నీటిని వచ్చినట్లు నదికి వదులుతున్నారు. డ్యాంకు ఉన్న 33 గేట్లలో ఆదివారం 20 గేట్లను 4 అడుగులు, 11 గేట్లను 2.5 అడుగుల మేర ఎత్తి 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని నదికి వదిలినట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, ఎస్‌ఈ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. డ్యాంలో 96.191 టీఎంసీల నిల్వ ఉంది.
*టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 8నెలల తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలో అడుగుపెట్టబోతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ను పురస్కరించుకొని ఓటువేసే నిమిత్తం సోమవారం ఆయన అసెంబ్లీకి రానున్నారు. గత నవంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు తన సతీమణి గురించి అసభ్యంగా మాట్లాడటాన్ని నిరసిస్తూ ‘ఈ ప్రభుత్వం గద్దె దిగేవరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోన’ని చంద్ర బాబు ప్రకటించారు. ఇప్పుడూ ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదని, కేవలం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసి వెనుదిరుగుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి.
* వైసీపీ తిరిగి అధికారంలో వస్తే రాష్ట్రం ఆధోగతి పాలవుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారాన్ని కట్టబెడితే వెనుకబాటుతనంలో బిహార్, రాజస్థాన్ రాష్ట్రాల సరసన ఏపీని చేర్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై సమస్యలను పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
*రోడ్లు, భవనాల శాఖ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రూపొందించిన పత్రికా వ్యాసాల సంకలనం ‘సాధన’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉదయం హనుమకొండలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ పుస్తకంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విశ్లేషించిన తీరు గొప్పగా ఉందన్నారు. ఇలాంటి మరెన్నో పుస్తకాలను రచించాలని మెట్టు శ్రీనివాస్‌ను అభినందించారు.