NRI-NRTSports

పి.వి.సింధుని సన్మానించిన సింగపూర్ తెలుగు సమాజం

Auto Draft

సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్- 2022లో అత్యంత ప్రతిభాపాటవాలు, విశ్వాసాన్ని ప్రదర్శించి టైటిల్ సాధించిన తెలుగు తేజం పి.వి.సింధుకు సింగపూర్ తెలుగు సమాజం ప్రత్యేకంగా అభినందనలు తెలిపి సన్మానించింది. వరుస విజయాలతో దూసుకు పోతూ.. తన కెరియర్ లోనే ఫస్ట్ సూపర్ 500 టైటిల్ తో పాటు ఈ ఏడాది మూడో టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.. సింధు భారతదేశంతో పాటు తెలుగువారందరిని గర్వపడేలా చేసిందని, భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత కీర్తి శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. రానున్న కామన్ వెల్త్, వరల్డ్ ఛాంపియన్‌షిప్ గేమ్స్‌లో కూడా విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
07182022113420n32
PV Sindhuని సన్మానించిన సింగపూర్ తెలుగు సమాజంఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గానికి సింధు కృతజ్ఞతలు చెప్పారు. తెలుగు సమాజం నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకుని సేవలను కొనియాడారు. జూలై 31న సింగపూర్ తెలుగు సమాజం నిర్వహించనున్న బ్యాట్మింటన్ టోర్నమెంట్‌లో పాల్గొనే క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సమాజం ఆగష్టు13న నిర్వహించనున్న నారీ(లేడీస్ నైట్) కార్యక్రమాన్ని సింగపూర్‌లోని వనితలు వినియోగించుకోవాలని సూచించారు.