Movies

సమంతకు అరుదైన గౌరవం

సమంతకు అరుదైన గౌరవం

‘ది ఫ్యామిలీమేన్ 2’ వెబ్‌సిరీస్‌తో జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించింది సమంత . అందులో రాజీ పాత్రతో సౌత్ అండ్ నార్త్ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలోని ఆమె ప్రత్యేక గీతం గురించి అందరికీ తెలిసిందే. ఆ ఒక్క పాటతోనూ అమ్మడి క్రేజ్ పీక్స్‌కు చేరింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. గుణశేఖర్పౌ రాణిక చిత్రం ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతుండగా, ‘ఖుషి, యశోద’ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. అసలు విషయానికొస్తే సామ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానం అందుకుంది. ఆగస్ట్ 12 నుంచి ఈ వేడుకు ప్రారంభం కానుంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ ఫెస్టివల్ దాదాపు రెండేళ్ళ తర్వాత తిరిగి ప్రారంభం కానుంది. ఈ ఫెస్టివల్‌లో సమంత తన కెరీర్, నటన, పరిశ్రమతో తన అనుబంధం లాంటి విషయాల్ని పంచుకోనుంది. ప్రస్తుతం ఈ వార్త ఇండియన్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది. చైతూ నుంచి విడిపోయాకా.. తన కెరీర్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సామ్‌కు వరుస అవకాశాలు దక్కడమే కాకుండా.. ఇలాంటి గౌరవాలు కూడా దక్కనుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా సమంత మాట్లాడుతూ.. ‘గతేడాది IFFMలో భాగమయ్యాను. ఇప్పుడు భారతీయ సినిమా ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రాతినిధ్యం వహించనుండడం నాకు చాలా గర్వంగా ఉంది. దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. భారతీయ సినిమాల్ని, భారతీయులు, సినీ ప్రేమికులు ఇలా ఇతరులందరినీ ఇలా ఒక్క చోట చేర్చడం అన్నది గొప్ప అనుభూతి’.. అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ రాజధాని నగరంలో సామ్ సినీ ప్రియుల్ని కలవనుంది.