2019లో యూఏఈ ప్రభుత్వం ప్రవాసులకు దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా 10, 5ఏళ్ల కాలపరిమితో గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తోంది. ఈ వ్యవస్థ యూఏఈలో విదేశీయులకు నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనంకు ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసాలు ఆటోమెటిక్‌గా పునరుద్ధరించబడతాయి. ఇక దీర్ఘకాలిక రెసిడెన్సీ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు దుబాయ్‌లో 65వేల మంది గోల్డెన్ వీసా నుంచి ప్రయోజనం పొందారు. తాజాగా దుబాయ్ సర్కార్ ఈ గోల్డెన్ వీసాదారులకు ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లను అందించే ఈసాద్ ప్రివేలజ్ కార్డును ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈసాద్ కార్డు సభ్యులకు ప్రత్యేకమైన ఆఫర్లు, డిస్కౌంట్స్ ఉంటాయి.
ఈ కార్డును దుబాయ్ పోలీసులు జారీ చేస్తారు. దుబాయ్‌లో ఐదేళ్లు, పదేళ్ల గోల్డెన్ వీసాలు ఉన్నవారికి ఈ కార్డును పూర్తి ఉచితంగా అందించనుంది. లాంగ్‌టర్మ్ రెసిడెన్సీ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు దుబాయ్‌లో 65వేల మంది గోల్డెన్ వీసా నుంచి ప్రయోజనం పొందారు. పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లు, ప్రత్యేక ప్రతిభ ఉన్నవారు, సైన్స్ పరిశోధకులు, ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు, వైద్యులు, నిపుణులు, సంస్కృతి, కళలో సృజనాత్మక రంగాలలో గోల్డెన్ వీసాదారులకు ఈ కార్డులను అందజేయనున్నారు. యూఏఈ సహా ప్రపంచవ్యాప్తంగా 92 దేశాలలో 7,237 బ్రాండ్స్, వ్యాపారాలలో ఈసాద్ కార్డుదారులకు ప్రత్యేకమైన ఆఫర్లు, డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ అబ్దుల్లా మహమ్మద్ అల్ బస్తీ వెల్లడించారు. దుబాయ్ గోల్డెన్ వీసాదారులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దుబాయ్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి, దుబాయ్ ఆర్థిక, పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్ హెలాల్ సయీద్ అల్మర్రి కోరారు.