DailyDose

21న ‘ఈడీ’ ఎదుట కాంగ్రెస్‌ భారీ నిరసన – TNI తాజా వార్తలు

21న ‘ఈడీ’ ఎదుట కాంగ్రెస్‌ భారీ నిరసన – TNI  తాజా వార్తలు

* కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా గాంధీ కుటుంబాన్ని వేధిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిండెట్‌ అంజన్‌కుమార్‌యాదవ్‌ ఆరోపించారు. ఈనెల 21న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈడీ విచారణకు హాజరవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌ ముందు నిరసన తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమానికి జనసమీకరణ, ఏర్పాట్లపై గాంధీభవన్‌లో సోమవారం నేతలు సమావేశమయ్యారు.అనంతరం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లురవితో కలిసి అంజన్‌కుమార్‌యాదవ్‌ విలేకరులతో మాట్లాడారు. 21న ఉదయం 11గంటలకు నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని, ఇందులో పార్టీ సీనియర్‌ నేతలంతా పాల్గొంటారని చెప్పారు. 22న అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవడానికే సోనియా, రాహుల్‌గాంధీలపై ఈడీ కేసులు పెడుతున్నారని పార్టీ నేతలు గీతారెడ్డి, మల్లు రవి ఆరోపించారు

*వర్షాలు కారణంగా రాష్ట్రంలో వాయిదా పడ్డ ఎంసెట్ పరీక్షల రీషెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈనెల 30, 31 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఆగస్టు 1న ఈ-సెట్ నిర్వహణ.. ఆగస్టు 2 నుంచి 5 వరకు పీజీ ఈ-సెట్ పరీక్షలు జరగనున్నాయి

*శ్చిమగోదావరి: జిల్లాలోని తణుకు పట్టణంలో అంతర్రాష్ట్ర నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న పోతులమూడీ సత్తిబాబు అలియాస్ కుక్కల సత్తిని అరెస్టు చేసినట్లు తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు మీడియాకు వెల్లడించారు. నిందితుడి వద్ద పదహారున్నర కాసుల బంగారం, హోండా యాక్టివా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 3.60 లక్షలు ఉంటుందని అంచనా. మరో మూడు లక్షల విలువైన బంగారు ఆభరణాలను రికవరీ చేయాల్సి ఉందని ఎస్సై వెల్లడించారు. నిందితుడిపై పీడీ యాక్టు అమలు చేయడానికి నివేదించనున్నట్లు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలో నిందితుడిపై సుమారు 20 కేసులు నమోదు ఉన్నాయన్నారు. కేసులో సహకరించిన పట్టణ ఎస్ఐ వీరబాబు, సిబ్బందికి ఎస్సై ఆంజనేయులు అభినందనలు తెలిపారు.

*రుషికొండ పర్యవరణ ఉల్లంఘనలపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతుంది. రుషికొండ వ్యవహారాల కేసులో తనను కూడా ఇంప్లీడ్ చేయాలని వైసీపీ నర్సాపురం రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటీషన్ దాఖలు చేశారు.ఈ కేసులో ఇప్పటికే హైకోర్టులో2 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు సూచనల మేరకు రఘురామ పిటీషన్‌ను అనుమతించాలని న్యాయవాది ఉమేష్ చంద్ర హైకోర్టులో వాదించారు. ఉమేష్ చంద్ర వాదనలను పరిగణలోకి తీసుకుని రఘురామరాజు పిటీషన్‌ను సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు అనుమతినిచ్చింది. రఘురామరాజు తరపున రుషికొండ పర్యావరణ ఉల్లంఘనలపై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. రఘురామ పిటీషన్‌పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీజే నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రుషికొండ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 27కి హైకోర్టు వాయిదా వేసింది

*శాసనసభ నుంచి విధానపరిషత్‌కు ఎన్నికైన కాంగ్రెస్‌ సభ్యుడు ఇబ్రహీం రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఆగస్టు 11న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది. 2024 జూన్‌ 17వరకు అవధి కల్గిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక కోసం ఈనెల 25న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. అదే రోజు నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమై ఆగస్టు 1వరకు కొనసాగుతుంది. మరుసటి రోజు వీటిని పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఆగస్టు 4వరకు గడువు ఉంటుంది. అవసరమైతే ఆగస్టు 11న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పో లింగ్‌ నిర్వహిస్తారు. శాసనసభలో ఉన్న బలం దృష్ట్యా అధికార బీజేపీ ఈ స్థానాన్ని సులభంగా కైవసం చేసుకోవచ్చునని భావిస్తున్నారు.

*తిరుత్తణి మురుగన్‌ ఆలయానికి బంగారు పూత పూసిన నెమలి వాహనాన్ని భక్తుడు విరాళంగా అందజేశారు. తిరువళ్లూర్‌ జిల్లా తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయం ఆరు దివ్యక్షేత్రాల్లో ఐదవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆలయ ఉత్సవాల్లో ప్రసిద్ధిచెందిన తిరుకల్యాణం, మాఢవీధుల్లో స్వామివారు నెమలి, భూత, అశ్వ, గజ, మూషిక, వృషభ, పులి తదితర వాహనాల్లో విహరిస్తుంటారు. ఈనేపథ్యంలో తమిళనాడు తొండ మండలం ఆది శైవ వేళాలర్‌ సంఘం ఆధ్వర్యంలో రూ.20 లక్షల వ్యయంతో బంగారు పూత పూసిన నెమలి వాహనాన్ని ఆదివారం ఆలయ అధికారులకు విరాళంగా అందజేశారు.

*విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. తండ్రి అభ్య‌ర్థ‌నను తిర‌స్క‌రించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: త‌మిళ‌నాడులోని క‌ల్ల‌కురుచ్చిలో 12వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థిని ఆత్మ‌హ‌త్య కేసులో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రెండ‌వ అటాప్సీ రిపోర్ట్‌ను రిలీజ్ చేయ‌కూడ‌ద‌ని ఆ విద్యార్థిని తండ్రి పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది. రెండ‌వ‌సారి పోస్టుమార్టమ్ నిర్వ‌హించాల‌ని సోమ‌వారం మ‌ద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ డాక్ట‌ర్ల ప్యానెల్‌లో తాము సూచించిన డాక్ట‌ర్ ఉండాల‌ని ఆ విద్యార్థిని తండ్రి సుప్రీంను ఆశ్ర‌యించారు. ఈ కేసును బుధ‌వారం విచారించ‌నున్న‌ట్లు సుప్రీంకోర్టు వెల్ల‌డించింది. స్కూల్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య నేప‌థ్యంలో క‌ల్ల‌కురుచ్చిలో భారీ హింస చోటుచేసుకున్న‌ది. వంద‌ల సంఖ్య‌లో స్కూల్ బ‌స్సుల‌కు నిప్పుపెట్టారు. క్లాస్‌రూమ్ ఫ‌ర్నీచ‌ర్‌ను ధ్వంసం చేశారు. రాష్ట్రంలో భారీ హింస చెల‌రేగుతోంద‌ని, ఇవాళ రీపోస్టుమార్ట‌మ్ జరుగుతోంద‌ని, ఆ పోస్టుమార్ట‌మ్‌పై స్టే ఇవ్వాల‌ని అమ్మాయి తండ్రి అభ్య‌ర్థించారు. దీనికి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ స‌మాధానం ఇస్తూ ఈ అంశం హైకోర్టు ప‌రిధిలో ఉంద‌ని, హైకోర్టును న‌మ్మ‌లేరా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప‌దేప‌దే లాయ‌ర్ అభ్య‌ర్థ‌న‌లు చేయ‌గా.. సుప్రీంకోర్టు వాటిని తిర‌స్క‌రించింది.

*హ‌ర్యానాలో మైనింగ్ మాఫియా చెల‌రేగుతోంది. డీఎస్పీ సురేంద్ర సింగ్‌ను మైనింగ్ మాఫియా వాహ‌నంతో ఢీకొట్టి చంప‌డం ప‌ట్ల కాంగ్రెస్ మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్ నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డింది. ఖ‌ట్ట‌ర్ రాష్ట్రాన్ని ఎలా మార్చాల‌ని కోరుకుంటున్నార‌ని కాంగ్రెస్ నిల‌దీసింది.

*నుపుర్ శ‌ర్మ‌కు సుప్రీంలో తాత్కాలిక ఊర‌ట ల‌భించింది. ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన నుపుర్ శ‌ర్మ‌ను ఇప్పుడు అరెస్టు చేయ‌డం కుద‌ర‌దు అని ఇవాళ‌ సుప్రీంకోర్టు తెలిపింది. జ‌స్టిస్ సూర్య కాంత్‌, జేబీ ప‌ర్దివాలాతో కూడిన ధ‌ర్మానం ఈ తీర్పునిచ్చింది. నుపుర్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో దేశంలో ప‌లు చోట్ల అల్ల‌ర్లు చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ఆమెపై అనేక రాష్ట్రాల్లో కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ఉద‌య్‌పూర్‌లో నుపుర్ వ్యాఖ్య‌ల‌ను అనుకూలంగా పోస్టు చేసిన ఓ వ్య‌క్తిని ఇద్ద‌రు ముస్లింలు దారుణంగా న‌రికి చంపిన విష‌యం తెలిసిందే. దేశంలో మ‌త‌విద్వేషాలు ర‌గ‌ల‌డానికి నుపుర్ వ్యాఖ్య‌లే కార‌ణ‌మ‌ని ఇటీవ‌ల సుప్రీం అభిప్రాయ‌ప‌డిన విష‌యం కూడా తెలిసిందే. ఆగ‌స్టు 10వ తేదీన మ‌ళ్లీ నుపుర్ శ‌ర్మ పిటిష‌న్‌పై కోర్టు విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ది. నుపుర్‌పై వివిధ ప్రాంతాల్లో న‌మోదు అయిన ఎఫ్ఐఆర్‌ల‌ను ర‌ద్దు చేసే రీతిలో ఆమె హైకోర్టును ఆశ్ర‌యించేందుకు దారుల్ని వెతుకుతామ‌ని కోర్టు తెలిపింది. నుపుర్ శ‌ర్మ దేశానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని గ‌తంలో సుప్రీం పేర్కొన్న‌ విష‌యం తెలిసిందే.

*కలెక్టర్ల తీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ను కలెక్టర్లు లైట్ తీసుకున్నట్లు తెలిసింది. వివిధ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకం అందించే కార్యక్రమంలో కలెక్టర్ల తీరుపై సీఎం జగన్ మండిపడ్డారు. స్క్రీన్‌పై ఇన్ని ఖాళీలు పెట్టుకొని కార్యక్రమం ఎలా చేస్తున్నారంటూ సీఎం మండిపడ్డారు. వెంటనే కలెక్టర్లను పిలిపించాలని అధికారులకు జగన్ ఆదేశించారు.

*ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వరద బాధితులను పరామర్శించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈనెల 21న కోనసీమ జిల్లా పి.గన్నవరం, రాజోలులో చంద్రబాబు పర్యటిస్తారు. 22వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, ఆచంటలో వరద బాధితులను పరామర్శిస్తారు.

*ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిమి లేకుండా కురిసిన వర్షాలకు జలాశయాలు నిండుకుండలా దర్శనమిచ్చాయి. వంగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహన ప్రాంతాలు నీట మునిగాయి. సీఎం కేసీఆర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి మాట్లాడారు. మునుపెన్నడూ ఈ స్థాయిలో వర్షాలు కురవలేదని, క్లౌడ్ బరస్ట్ చేసి కృత్రిమ వర్షాలు కురిపించడం వల్ల అపార నష్టం సంభవించిందని వ్యాఖ్యానించారు. అయితే క్లౌడ్‌ బరస్ట్‌పై గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వచ్చిన వరదలు క్లౌడ్‌ బరస్ట్‌ వల్ల సంభవించలేదన్నారు. ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలేనని, ఈసారి కొంచెం ఎక్కువగా వరదలొచ్చాయని గవర్నర్ పేర్కొన్నారు.

*హెచ్‌ఐవీ తీవ్రత జిల్లాలో చాలా వరకు తగ్గిందని జిల్లా ఎయిడ్స్, కుష్టు నివారణ అధికారి రాణి సంయుక్త పేర్కొన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ ప్రభావం ఏ ప్రాంతాలలో, ఏ సమూహాలలో, ఏ వయసు వారికి సోకుతున్నదో తెలుసుకోవడానికి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో 3 రోజుల వర్క్‌ షాపు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డబ్లు్యహెచ్‌ఓ కన్సల్టెంట్‌ సుకుమార్, డీపీఎం బాలాజీ, జిల్లా సూపర్‌ వైజర్‌ సాక్షి గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

*గిరిజనులైన లంబాడీలు (బంజారాలు) ఎంతో పవిత్రతో జరుపుకునే మొదటి పండుగ సీత్ల పండుగ. ఆ రోజు సీత్లా భవానీని పూజిస్తారు. కలరా వంటి మహమ్మారులు ప్రబలకుండా భవానీ కాపాడుతుందని బంజారాల నమ్మకం. తండాలో ఉన్న పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు వంటివి పెరగాలనీ, దూడలకు పాలు సరిపోను ఉండాలనీ, గడ్డి బాగా దొరకాలనీ, క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలనీ, అటవీ సంపద తరగకూడదనీ, సీత్ల తల్లికి మొక్కులు తీర్చు కుంటారు

*పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని.. ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ మాట్లాడటాన్ని తప్పుపట్టారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. పువ్వాడ అజయ్‌ అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన గ్రామాల ప్రజల కోసం ఏమి చేయాలో తమకు తెలుసునని స్పష్టం చేశారు. ‘ఆయా గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే ఏపీని కూడా కలపాలని అడుగుతాం. ఏపీ ఆదాయం తగ్గింది ఇప్పుడు హైదరాబాద్‌లో కలిపేస్తారా?’ అని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ.

*వంట గ్యాస్‌ లీకవడంతో మంటలు చెలరేగగా.. ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించకూడదని భావించిన ఓ గిరిజన మహిళ ధైర్యంతో..చాకచక్యంగా వ్యవహరించి గ్యాస్‌ సిలిండర్‌ను ఆరుబయటకు తీసుకొచ్చి పడేయడంతో పెనుప్రమాదం తప్పింది. వివరాలిలా ఉన్నాయి. గుమ్మలక్ష్మీపురం మండలంలోని పెదఖర్జ పంచాయతీ బొద్దిడి గ్రామానికి చెందిన మండంగి సుజాత సోమవారం ఉదయం ఇంట్లో గ్యాస్‌పొయ్యిపై వంట చేస్తుండగా గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. వంట గది పురిపాక కావడంతో మంటలు ఎగసిపడడం గమనించిన ఆమె గ్యాస్‌ సిలిండర్‌ పేలితే పెనుప్రమాదం జరుగుతుందని ఊహించి ఎవరికీ ఎటువంటి నష్టం జరగకూడదని భావించి, సిలిండర్‌ను పొయ్యి నుంచి వేరు చేసి, ఆరుబయటకు తీసుకొచ్చి మురుగునీటి కాలువలో పడేసింది. ఈ విషయాన్ని గమనించిన చుట్టు పక్కల వారు వంటగదిలోని మంటలతో పాటు గ్యాస్‌ సిలిండర్‌లోని మంటను ఆర్పివేశారు. ఈ సంఘటణలో ప్రాణాలకు తెగించి సాహసం చేసిన మహిళ ఎడమ చేతికి కొంతమేర కాలిన గాయాలయ్యాయి. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ధైర్యంగా వ్యవహరించిన ఆమెను గ్రామస్తులంతా అభినందిస్తున్నారు.

*ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపిన ఫిషింగ్ హార్బర్‌ల ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వంగా గీత కోరారు. ఈ మేరకు రెండో రోజు పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా ఎంపీ వంగా గీత మీడియాతో మాట్లాడారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని తెలిపారు

*ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపిన ఫిషింగ్ హార్బర్‌ల ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వంగా గీత కోరారు. ఈ మేరకు రెండో రోజు పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా ఎంపీ వంగా గీత మీడియాతో మాట్లాడారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని తెలిపారు. అన్నవరం నుంచి జీఎంఆర్ఎస్ఈజడ్ వరకు ప్రత్యేక రైల్వే లైన్ వేయాలని సూచించారు. విభజన చట్టంలో ఉన్న అంశాలతో పాటు ఇతర అభివృద్దికి కేంద్రం సహకరించాలని కోరారు. మహారాష్ట్రలో భారీ వర్షాల వల్లే గోదావరికి వరదలు వచ్చాయని ఎంపీ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు పెంచడం వల్ల భద్రాచాలం మునిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు.

*క్లౌడ్ బరస్ట్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వచ్చిన గోదావరి వరదలు క్లౌస్ బరస్ట్ వల్ల కాదని ఆమె అన్నారు. ఇవి ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలే అని.. కాకపోతే ఈసారి కాస్త ఎక్కువ వరదలు వచ్చాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. యానాంలో వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తమిళిసై ఈ వ్యాఖ్యలు చేశారు.

*ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిమి లేకుండా కురిసిన వర్షాలకు జలాశయాలు నిండుకుండలా దర్శనమిచ్చాయి. వంగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహన ప్రాంతాలు నీట మునిగాయి. సీఎం కేసీఆర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి మాట్లాడారు. మునుపెన్నడూ ఈ స్థాయిలో వర్షాలు కురవలేదని, క్లౌడ్ బరస్ట్ చేసి కృత్రిమ వర్షాలు కురిపించడం వల్ల అపార నష్టం సంభవించిందని వ్యాఖ్యానించారు. అయితే క్లౌడ్‌ బరస్ట్‌పై గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వచ్చిన వరదలు క్లౌడ్‌ బరస్ట్‌ వల్ల సంభవించలేదన్నారు. ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలేనని, ఈసారి కొంచెం ఎక్కువగా వరదలొచ్చాయని గవర్నర్ పేర్కొన్నారు.

* పోలవరం జాప్యానికి ఏపీ ప్రభుత్వ అసమర్ధతే కారణమని కేంద్రం పేర్కొంది. పోలవరంపై ఏపీ వైఖరిని తప్పు కేంద్రం పట్టింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు జలశక్తి సహాయశాఖ మంత్రి బిశ్వేశ్వర్ లిఖిత పూర్వక సమాధానం చెప్పారు. పోలవరం గడువును మరోసారి కేంద్రం పొడిగించింది. 2024 జులై నాటికే పోలవరం పూర్తి సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తెలిపారు. వ్యూహాత్మక ప్రణాళికా లేకపోవడం వల్ల కూడా పోలవరం జాప్యం అవుతోందన్నారు. ఏపీకి పోలవరం ప్రాజెక్టు అమలు చేస్తున్న ఏజెన్సీతో సమన్వయ లోపం కూడా పోలవరం జాప్యానికి ప్రధాన కారణమేనని చెప్పారు. కరోనా కూడా పోలవరం జాప్యానికి మరో కారణంగా భావించారు.

* కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా గాంధీ కుటుంబాన్ని వేధిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిండెట్‌ అంజన్‌కుమార్‌యాదవ్‌ ఆరోపించారు. ఈనెల 21న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈడీ విచారణకు హాజరవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌ ముందు నిరసన తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమానికి జనసమీకరణ, ఏర్పాట్లపై గాంధీభవన్‌లో సోమవారం నేతలు సమావేశమయ్యారు.అనంతరం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లురవితో కలిసి అంజన్‌కుమార్‌యాదవ్‌ విలేకరులతో మాట్లాడారు. 21న ఉదయం 11గంటలకు నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని, ఇందులో పార్టీ సీనియర్‌ నేతలంతా పాల్గొంటారని చెప్పారు. 22న అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

*జగన్‌ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే మాయను పదేపదే ప్రదర్శిస్తోంది. పీడీ ఖాతాల పేరుతో నిత్యం నిధులను భారీఎత్తున మళ్లించుకుపోతోంది. కేంద్ర పథకాల నిధులు మొదలు ఉద్యోగులు దాచుకున్న సొమ్ములవరకు దేనినీ వదలిపెట్టడం లేదు. చివరకు కొవిడ్‌ అవసరాలకు ఉద్దేశించిన విపత్తు నిధులనూ లాగేసుకుంది. 2020-21లో ఎస్‌డీఆర్‌పఫ్‌ ఖాతా నుంచి కొవిడ్‌ బాధితుల కోసం నిర్దేశించిన నిధులను వ్యవసాయ శాఖ పీడీ ఖాతాలోకి మళ్లించిన వ్యవహారంపై స్వయంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని.. జగన్‌ సర్కారుకు చీవాట్లు పెట్టిన విషయం తెలిసిందే. పీడీ ఖాతాకు మళ్లించిన రూ. 1100 కోట్లను తిరిగి జమ చేయాలని ఆదేశించింది.

*వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ముగ్గురు డాక్టర్లను సస్పెండ్‌ చేస్తూ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్యాజువాలిటీ విభాగంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన డాక్టర్లు రితీష్‌, రంజిత్‌, రోగులకు కుట్లు వేసేందుకు రూ.350 డిమాండ్‌ చేసిన డాక్టర్‌ అంజాద్‌ అలీని సస్పెండ్‌ చేశారు.

*సెలవులు ముగిసినా పాఠశాలలను తెరవకుండా విధులకు హాజరుకాని ఇద్దరు ఉపాధ్యాయులను డీఈవో సస్పెండ్‌ చేశారు. నల్లగొండ జిల్లా డిండి మండలంలో సోమవారం ఈ ఘటన జరిగింది. కందుకూరు, శాంతిగూడెం, బ్రహ్మణపల్లి, రుద్రాయిగూడెం, వావిల్‌కోల్‌, ఎర్రగుంటపల్లి, రమాంతపూర్‌, సింగరాజుపల్లి, తవక్లాపూర్‌, మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలల్లో జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి సోమవారం తనిఖీలు చేశారు. వారం రోజుల సెలవులు ముగిసిన తర్వాత కూడా తమ తమ పాఠశాలలను తెరవకుండా నిర్లక్ష్యం వహించిన శాంతిగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు సంధ్య, బ్రాహ్మణపల్లి పాఠశాల ఉపాధ్యాయుడు గొడుగు శ్రీనివా్‌సలను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

*సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి ఆషాడ బోనాల సందర్భంగా సోమవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తెలుగులో మాట్లాడారు. తనకు తెలుగు భాష అంటే ఎంతో మక్కువని, అందుకే తెలుగులో మాట్లాడుతున్నానని చెప్పారు. తెలంగాణలో ప్రజలు భక్తిప్రపత్తులతో చక్కగా పూజలు చేస్తారని కొనియా డారు. మహంకాళి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉంటాయని అన్నారు.

*ప్రజల కళ్లు తెరిపించడానికే భారీ వర్షాలు కురిపించానని సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర రంగం కార్యక్రమంలో భవిష్యవాణి చెప్పింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఆషాఢ బోనాల జాతరలో భాగంగా సోమవారం ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రాంగణంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10.25గంటలకు అవివాహిత స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ‘నాకు పూజలు సరిగ్గా అందుతున్నాయా, లేదా? మీరే చెప్పండి. ప్రతి ఏడాది నా నోటితో చెప్పించాలని అనుకుంటున్నారే తప్ప పూజలు సరిగ్గా జరపడం లేదు. నా బిడ్డలని ఈ విషయాన్ని నా కడుపులోనే దాచుకుంటున్నాను. గర్భాలయంలో శాస్త్రబద్ధంగా పూజలు జరిపించాలి-మొక్కుబడిగా కాదు. నా రూపంలో నాకు పూజలు చేయండి. చిన్నప్పటి నుంచి ఎన్ని రూపాల్లో మారుస్తారు? నా ఆభరణాలు, నా పట్టు వస్త్రాలు నాకు పెడుతున్నారు. మీరేంటి.. నాకు పెట్టేది? అది మీ గొప్పతనమా? నా ఆగ్రహాన్ని తట్టుకోలేరు. అందుకే కొండంత కాకపోయినా, రవ్వంత ఆగ్రహాన్ని చూపిస్తున్నాను. నా భక్తులు నన్ను కళ్లారా దర్శించుకునేలా చేస్తాను. భక్తులకు ఎలాంటి ఆపదా లేకుండా చూస్తాను. భక్తులకు సంతోషం కలిగేలా చూస్తాను’ అంటూ భవిష్యవాణి వినిపించారు.

*మానవ అక్రమ రవాణా నిరోధానికి రాష్ట్రంలో పది యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్లు(ఏహెచ్‌టీయూ) స్థాపించినట్లు ఏపీ సీఐడీ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత పదమూడు జిల్లాల రాష్ట్రంలో ఏలూరు, గుంటూరు, అనంతపురంలో మాత్రమే ఏహెచ్‌టీయూలు ఉండేవని, కేంద్రం ఇచ్చిన నిధులతో తాజాగా పది యూనిట్లు ప్రారంభించినట్లు వివరించింది. అయితే ఉమ్మడి 13 జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున ఉండగా, నూతన జిల్లా కేంద్రాల్లోనూ వాటిని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సీఐడీ అధికారి సరిత తెలిపారు.

*రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రధాని నరేంద్రమోదీ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలను నెరపడం సిగ్గుచేటని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ప్రాంతీయ పార్టీలను ఈడీ దాడులతో బెదిరించి మద్దతుగా మలుచుకోవడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నాయకులు కూడా ఇందుకు తలొగ్గారని ఆయన విమర్శించారు. తిరుపతిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీజేపీని వ్యతిరేకించే పార్టీలకే తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ల్యాండ్‌మైన్‌లా వ్యవహరిస్తున్నారని, అది ఎపుడు ఎక్కడ పేలుతుందోనని ఎద్దేవా చేశారు.

*వేద విద్యార్థులకు స్మార్త పరీక్షలను, వేద విద్యలో సమ, ఘన, జట పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థకు ఇచ్చేందుకు దేవదాయ శాఖ సన్నాహాలు చేసింది. భీమవరం కేంద్రంగా నడిచే ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ పురోహిత సమాఖ్యకు ఈ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధపడింది. మరోవైపు పరీక్షలకు సంబంధించిన సిలబ్‌సను కూడా సదరు సంస్థతో కలిసి మార్చిలో బ్రాహ్మణ్‌ కార్పొరేషన్‌, దేవదాయ శాఖ కలిసి విడుదల చేశాయి. ప్రైవేటు సంస్థకు బాధ్యతలు ఎలా అప్పగిస్తారని, ఇది దేవదాయ శాఖ చట్టానికి విరుద్ధమని బ్రాహ్మణ్‌ చైతన్య వేదిక ప్రశ్నించింది. దీనిపై బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్‌శర్మ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో దేవదాయ శాఖ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. గతంలో మాదిరిగానే పరీక్షలు, సిలబస్‌ సిద్ధం చేసే కార్యక్రమం జరిగేవిధంగా నిర్ణయం తీసుకుంది.

* తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణను గోదావరి నదీ బోర్డుకు అప్పగించాలంటూ కేంద్ర జల్‌శక్తి శాఖ జారీ చేసిన గెజిట్‌ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ గోదావరి బోర్డు చైర్మన్‌కు సోమవారం లేఖ రాశారు. రాష్ట్రంలో పెద్దవాగు ఒక్కటే ఉమ్మడి ప్రాజెక్టు అని, మిగిలినవన్నీ తెలంగాణ ప్రాంతంలో నీరందించడానికి నిర్మించినవేనని లేఖలో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో ఆ ప్రాజెక్టులకు సంబంధం లేదన్నారు. పెద్దవాగు నిర్వహణను బోర్డుకు అప్పగించడానికి ఇదివరకే అంగీకరించామని ఆయన గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును గెజిట్‌లో షెడ్యూల్‌ 2(బోర్డు ప్రత్యక్ష నియంత్రణ) నుంచి షెడ్యూల్‌ 3(బోర్డు పరోక్ష నియంత్రణ) పరిధిలోకి మార్చాలని విజ్ఞప్తి చేశారు.

*తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణను గోదావరి నదీ బోర్డుకు అప్పగించాలంటూ కేంద్ర జల్‌శక్తి శాఖ జారీ చేసిన గెజిట్‌ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ గోదావరి బోర్డు చైర్మన్‌కు సోమవారం లేఖ రాశారు. రాష్ట్రంలో పెద్దవాగు ఒక్కటే ఉమ్మడి ప్రాజెక్టు అని, మిగిలినవన్నీ తెలంగాణ ప్రాంతంలో నీరందించడానికి నిర్మించినవేనని లేఖలో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో ఆ ప్రాజెక్టులకు సంబంధం లేదన్నారు. పెద్దవాగు నిర్వహణను బోర్డుకు అప్పగించడానికి ఇదివరకే అంగీకరించామని ఆయన గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును గెజిట్‌లో షెడ్యూల్‌ 2(బోర్డు ప్రత్యక్ష నియంత్రణ) నుంచి షెడ్యూల్‌ 3(బోర్డు పరోక్ష నియంత్రణ) పరిధిలోకి మార్చాలని విజ్ఞప్తి చేశారు.

*కేంద్ర ప్రభుత్వంతో హనీమూన్‌ సమయం ముగిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాండ్‌ బాజా బారాతేనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. అప్పుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పట్ల కేంద్రం ఎలా కఠిన వైఖరి అవలంబిస్తుందో, ఏపీ సర్కార్‌ పట్ల కూడా అదే విఽధానాన్ని పాటించే అవకాశాలున్నాయన్నారు. లిక్కర్‌ కార్పొరేషన్‌ పేరిట ఇప్పటికే రూ.8,500 కోట్లు రుణంగా తీసుకున్నారని, మరో రూ.2 వేల కోట్లు తీసుకోబోతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.28 వేల కోట్ల రుణ పరిమితిని మాత్రమే కేంద్రం విధించిందని, అయితే ఇప్పటికే రూ.38,500 కోట్ల రుణాలు చేసిందన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ కేసులను వాదించే లాయర్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం వాదనలు విన్న తర్వాత మూడు నెలల వ్యవధిలో లేదా ఆరు నెలల్లోపు తీర్పు ఇవ్వాలని స్పష్టంగా ఉందన్నారు.

*ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటు నిధులు మొత్తం ఇచ్చేశామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ ఛౌధరి వెల్లడించారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఆ ఏడాది ఆర్థిక సంవత్సరం ఆఖరు వరకు (2014 జూన్‌ 2 నుంచి 2015 మార్చి 31 వరకు) రెవెన్యూ లోటు రూ.4117.89 మాత్రమే అని ఖరారు చేశామని, ఆ మొత్తాన్ని విడుదల చేశామని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారంలోక్‌సభలో వైసీపీ ఎంపీ ఎన్‌.రెడ్డప్ప అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని 7 వెనుకబడిన జిల్లాలకు కలిపి ఏటా రూ.350 కోట్ల చొప్పున ఇప్పటి వరకు రూ.1750 కోట్లు విడుదల చేశామని వైసీపీ ఎంపీలు వంగా గీత, మిథున్‌ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ ఛౌధరి తెలిపారు.

*గోదావరి వరదల కారణంగా నిరాశ్రయులైన ప్రజలందరికీ కుటుంబానికి రూ.25 వేలు తక్షణ సహాయంగా అందించాలని పీసీసీ ప్రెసిడెంట్‌ శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో వరద ముంపునకు గురై మెరక ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్న వరద భాధితులను సోమవారం ఆయన పరామర్శించారు.

*శ్రీశైల జలాశయంలోకి ఇటు తుంగభద్ర, అటు కృష్ణా నదులు ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి. శ్రీశైలంలో సోమవారం 3,18,488 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ఇప్పటికి 131.8508 టీఎంసీల నీరు చేరింది. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు, కర్నూలు జిల్లాలోని సుంకేశుల జలాశయం నుంచి శ్రీశైలంలోకి వరద వస్తోంది. అలాగే, తుంగభద్ర జలాశయానికి 1,71,381 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో 31 గేట్లు ఎత్తి నదికి 1,63,090 క్యూసెక్కులు, హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, రాయచూరు మెయిన్‌ కెనాల్‌ తదితర కాలువలకు మరో 6,984 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న తుంగ జలాశయం నిండి 40,317 క్యూసెక్కులు, భద్ర జలాశయం నిండి 30,188 క్యూసెక్కుల వరద తుంగభద్ర డ్యాంలోకి వస్తోంది. అలాగే, కర్నూలు జిల్లా సంకేశుల జలాశయానికి 1,67,134 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 27 గేట్లు ఎత్తి దిగువనున్న శ్రీశైలానికి 1,65,122 క్యూసెక్కులు, కేసీ కాలువకు 2,012 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

*గురుకుల పాఠశా లలో ప్రవేశానికి రమ్మని మండలంలోని ఎల్లుట్ల గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌నా యుడుకు పాఠశాల సిబ్బంది ఫోన్‌ద్వారా సమాచారమిచ్చారు. దీంతో ఆయన సోమ వారం తన కుమార్తెలైన అర్చన, ఐశ్వర్య లు గురు కులంలో చేర్చడానికి ప్రిన్సిపాల్‌ ను కలువగా ఆమె నిరాకరిం చారు. పిల్లల ను ఎందుకు చేర్చుకోలేదంటూ చంద్ర శేఖర్‌ అడగగా ఈ నెల 15వ తేదీకే అడ్మిషన్‌లు క్లోజ్‌ చేసినట్లు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని వాపో యాడు. కాగా గురుకుల పాఠశాలలో ప్రవేశానికి వచ్చిన సుమారు 10 మంది దాకా విద్యార్థి నులను అడ్మిషన్‌ లేవని చెప్పడంతో నిరాశతో తల్లిదండ్రులు వెనుదిరిగారు. ఈ విషయమై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ శోభను వివరణ కోరగా గురుకులంలో చేరడానికి ఈ నెల 15వ తేదీ వరకే సమయం ఉందన్నారు. అడ్మిషన్‌లు క్లోజ్‌ కావడంతో చేర్చుకోలేదన్నారు

*తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 21, 22 తేదీల్లో గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, రాజోలు తదితర ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శిస్తారు. ముందుగా రాజమహేంద్రం వెళ్లి అక్కడి నుంచి వరద ప్రాంతాల పర్యటనకు వెళ్తారు. కాగా, విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించాలనుకుంటున్నప్పటికీ, ఇప్పటికీ వరద వీడకపోవడంతో అక్కడికి దాదాపు వెళ్లే పరిస్థితి లేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

*ఎన్టీఆర్‌ శత జయంత్యోత్సవాల సందర్భంగా ఈ నెల 20న తెలు గు విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వైస్‌ చాన్సలర్‌(వీసీ) ప్రొఫెసర్‌ టీ.కిషన్‌రావు తెలిపారు. నాలుగేళ్ల తర్వాత నిర్వహిస్తున్న స్నాతకోత్సవంలో 73 పీహెచ్‌డీలు, 21ఎంఫిల్‌ పట్టాలు అందజేస్తున్నామన్నారు. వివిధ విభాగాల్లో 112మందికి గోల్డ్‌ మోడల్స్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా త్వరలోనే తెలుగు వర్సిటీలోని ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో ఎన్టీఆర్‌ని స్మరిస్తూ ఒక రోజంతా కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్టీఆర్‌ శతజయంత్యోత్సవాలను నిర్వహించాలని వీసీ విజ్ఞప్తి చేశారు. స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్‌ను హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్యకు అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. యూనివర్సిటీలో కొత్తగా 19కోర్సులు తీసుకొచ్చామని, దేశంలో మొదటి సారిగా మాతృభాషలో లైబ్రరీ సైన్సెస్‌ కోర్సు అందుబాటులోకి వస్తోందన్నారు.

* కొత్త వైద్య విద్య కళాశాలల ఏర్పాటుకు దరఖాస్తులు కోరుతూ జాతీయ వైద్య మండలి సోమవారం ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే ఉన్న మెడికల్‌ కాలేజీల్లో సీట్లు పెంపు, కాలేజీ గుర్తింపు రెన్యువల్‌కు కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జూలై 21 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. కాగా, రాబోయే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో కాలేజీలో 100 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండేలా కరీంనగర్‌, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్‌, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, కామారెడ్డి, జనగాం జిల్లాల్లో కళాశాలల ఏర్పాటుకు నిర్ణయించింది. దీంతో ఈ ఎనిమిది వైద్య కళాశాలల కోసం జాతీయ వైద్య మండలికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేయనుంది.

* వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు ద్వారా ప్రజలకు విస్తృత సేవలందుతున్నాయి. 8 జిల్లాల్లోని 386 వైద్య శిబిరాల ద్వారా సోమవారం 20,998 మంది చికిత్స పొందారని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. భద్రాద్రి, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ములుగు, నిర్మల్‌, పెద్దపల్లి జిల్లాల్లో హెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 16 నుంచి ఇప్పటిదాకా వీటిల్లో 45,672 మందికి చికిత్స అందిందని పేర్కొంది. సోమవారం భద్రాద్రి జిల్లాలో అత్యధికంగా 116, మంచిర్యాలలో 113 హెల్త్‌ క్యాంపులు నిర్వహించారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పలు హెల్త్‌ క్యాంపులను ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు సందర్శించారు. ఇక, పెద్దపల్లి జిల్లాలో రిలీఫ్‌ క్యాంపులను డీఎంఈ రమేశ్‌రెడ్డి సందర్శించారు.

*వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ముగ్గురు డాక్టర్లను సస్పెండ్‌ చేస్తూ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్యాజువాలిటీ విభాగంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన డాక్టర్లు రితీష్‌, రంజిత్‌, రోగులకు కుట్లు వేసేందుకు రూ.350 డిమాండ్‌ చేసిన డాక్టర్‌ అంజాద్‌ అలీని సస్పెండ్‌ చేశారు.

*రేషన్‌ సరుకుల పంపిణీపై ఏపీ హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. ఈ సందర్బంగా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు సూటిప్రశ్నలు వేసింది. పక్కనే రేషన్ షాపు ఉన్నా ఇంటికి సరుకులు తెచ్చి ఇస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పనులు మానుకుని పేదలు సరుకుల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని.. రేషన్‌షాప్‌ (Ration Shop)కు వెళ్లి సరుకులు తెచ్చుకోలేని స్థితిలో పేదలు లేరని వ్యాఖ్యానించింది. సరుకుల పంపిణీ పేరుతో అదనంగా ఖర్చు చేస్తున్నారని.. ఆ డబ్బుతో పేదలకు మరిన్ని సరుకులు ఇవ్వొచ్చని హైకోర్టు సూచించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

*ఏపీ బీజేపీ నాయకులు నాగోతు రమేష్‌నాయుడు, రఘు, భాస్కర్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అన్నమయ్య ప్రాజెక్ట్ కట్ట ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. 60 రోజుల్లో వరద బాధితులకు ఇళ్లు కట్టిస్తామని సీఎం ఇచ్చిన హామీని వారు గుర్తు చేశారు. ప్రాజెక్ట్ ప్రమాదానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వాన్ని సమగ్ర నివేదిక కోరతామని ఎన్‌హెచ్ఆర్సీ సభ్యుడు జ్ఞానేశ్వర్ ముల్లే తెలిపారు.

*ఇటీవల కురిసిన వర్షానికి జిల్లాలో గోదావరి ఉప్పొంగి ప్రవహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నది ఉధృతి కొంత తగ్గుముఖం పట్టింది. కానీ వరద ప్రవాహం మాత్రం వస్తూనే ఉంది. ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు.. నది పరివాహక ప్రాంత ప్రజలను పునరావాసాలకు తరలించారు.అయితే ఈ వరదల్లో కొట్టుకుపోయి వేర్వేరు చోట్ల ముగ్గురు మృతి చెందారు. సఖినేటిపల్లి మండలం రామేశ్వరం వరద నీటిలో జారిపడి పేరిచెర్ల శ్రీనివాస్ (48) గల్లంతయ్యారు. మానేపల్లిలోని లంక గ్రామాల ప్రజలను పడవపై దాటించి ఇంటికి తిరిగి వెళుతుండగా కారాడి రామకృష్ణ.. జారిపడి వరద ఉధృతిలో కొట్టుకుపోయారు. ఆలమూరు మండలం బడుగువానిలంకలో గోదావరి ప్రవాహానికి బడుగు ఏసు (46) వ్యక్తి గల్లంతయ్యారు. ఇలా ముగ్గురు కూడా వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు.దాంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక బాధిత కుటుంబాలను ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వరద దాటికి జిల్లాలో చాలా చోట్ల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పంటలు నీటమునిగాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. దీంతో బాధితులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

* సోనియా, రాహుల్‌ గాంధీలపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ఈ నెల 21న నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసుకు భారీగా తరలి వచ్చి, ధర్నా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చారు. సోమవారం నాంపల్లిలోని ఇందిరాభవన్‌లో సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకుల సమావేశం గ్రేటర్‌ అధ్యక్షుడు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వర్కింగ్‌ ప్రెసిడెంట్లు అంజన్‌కుమార్‌ యాదవ్‌, గీతారెడ్డి, మల్లురవి, దాసోజు శ్రవణ్‌, వీ.హన్మంతరావు, మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ విచారణ పేరుతో కక్ష సాధిస్తూ, రాజకీయంగా దెబ్బ తీయాలని చూస్తోందని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలుస్తున్నారని, ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన కాంగ్రెస్‌ పార్టీ బలపడుతుందని అన్నారు

*వైకాపా నాయకులు జేబుదొంగల మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా మైనింగ్ మాఫియాకు పాల్పడుతున్నారని.. తెదేపా నేత రావి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులు చేస్తున్న మైనింగ్ మాఫియాకి నిరసనగా.. కృష్ణాజిల్లా గుడివాడలో తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు.