NRI-NRT

సాగినలో సాయి సమాజ్ లోగో ఆవిష్కరణ

సాగినలో సాయి సమాజ్ లోగో ఆవిష్కరణ

ఉత్తరమెరికాలోని మిచిగన్ స్టేట్ , సాగినాలో సాయి సమాజ్ ఆఫ్ సాగినా లోగోని ప్రముఖ నేపథ్య గాయకులు మనో ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఆయనతో పాటు స్థానిక వైద్యులు డాక్టర్ రఘురాం సర్వేపల్లి లోగోని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయి సమాజ్ ఆఫ్ సాగినా వ్యవస్థాపకులు డాక్టర్ మురళీ గింజుపల్లి మాట్లాదుతూ… ఇక్కడ ప్రతి గురువారం ప్రవాస భారతీయులందరు కలిసి భక్తి శ్రద్దల సాయిబాబా హారతులు మరియు భజనలు నిర్వహిస్తున్నామని, ఎంతో బిజీ షెద్యూల్ ఉన్నప్పటికి, మనో తమ ఆహ్వానం మేరకు వచ్చి లోగోని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
Whats-App-Image-2022-07-19-at-8-08-47-PM
అలాగే, ఆగస్టు 11, 12, 13 తేదీలలో ఇక్కడ జరిగే సాయి బాబా విగ్రహ ప్రతిష్టలో భక్తులందరు పాల్గొనవల్సిందిగా ప్రవాస భారతీయులను ఆహ్వానించారు. మనో మాట్లాడుతూ, ఇక్కడ కు వచ్చి, బాబా హారతిలో పాల్గొని, భక్తులందరిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తదనంతరం జరిగిన మనో సంగీత విభావరి కార్యక్రమాన్ని స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ వెంకట్ చౌదరి ముల్పూరి సాయిబాబా ప్రార్థనా గీతంతో ప్రారంభించారు. తరువాత మనోతో పాటు స్థానిక గాయకులు శివాని అన్నాదురై సుమేధా వడ్లమూడి, శైలి అన్నాదురై, శాంతి, వల్లి మరియు రోహిణి జితేందర్ లు హింది, తెలుగు, మరియు తమిళం భాషా పాటలతో ఆహుతలని ఉర్రూతలూగించారు.
Whats-App-Image-2022-07-19-at-8-08-46-PM-1
ఈ కార్యక్రమంలో మనో, డాక్టర్ బుచ్చిబాబు మరియు శ్రీమతి సామ్రాజ్యం కొండపనేని శాలువా మరియు పూలబోకెలతొ సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ గింజుపల్లి, డాక్టర్ లీలా పాలడుగు, శ్రీనివాస్ వేమూరి, నీలిమ వేమూరి, హరిచరణ్ మట్టుపల్లి, లక్ష్మి మట్టుపల్లి, సెల్వి విష్ణుకుమార్, కృష్ణ జన్మంచి, డాక్టర్ రమా ముల్పూరి, శ్రీమతి సుజని గింజుపల్లితోపాటు సుమారు 150 మంది ప్రవాస భారతీయులు పాల్గిన్నారు.