Politics

జగన్ రెడ్డి చేసే తప్పుల్లో ఆమెకూ భాగముంది – TNI రాజకీయ వార్తలు

జగన్ రెడ్డి చేసే తప్పుల్లో ఆమెకూ భాగముంది – TNI  రాజకీయ వార్తలు

* సీఎం జగన్ రెడ్డి చేసే తప్పుల్లో భారతిరెడ్డికీ భాగముందని.. తెదేపా నేత వంగలపూడి అనిత ఆరోపించారు. భర్తను వెనకేసుకురావడం, తెచ్చిన సూట్ కేసులు లెక్కేసుకోవడం, చేస్తున్న తప్పులను ప్రచార ఆర్భాటాలకు ఉపయోగించడం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకప్పుడు హారతికే పరిమితమయ్యే జగన్ భార్య భారతి.. నేడు భర్తను వెనకేసుకురావడం, తెచ్చిన సూట్కేసులు లెక్కేసుకోవడం, చేస్తున్న తప్పులను ప్రచార ఆర్భాటాలకు ఉపయోగించడం చేస్తున్నారని.. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి చేసే తప్పుల్లో భారతికి భాగముందని ఆరోపించారు. కొవిడ్ బాధితులకు కేంద్రం ఇచ్చిన రూ.11 కోట్లు నిధులను దారి మళ్లించడం దోపిడీ విధానమేనని ఆక్షేపించారు.కరోనా సోకిన వారికి రూ.2వేలు అకౌంటులో జమ చేశామంటున్నా, లెక్కలు చెప్పే దమ్ము, ధైర్యం ఎవరికైనా ఉందా అని సవాల్‌ విసిరారు. సామాజిక న్యాయం అంటూ జగన్ భజన బృందం ప్రజల చెవుల్లో పూలు పెడుతోందని విమర్శించారు. నిత్యావసర సరుకుల సరఫరా పేరుతో ప్రజల సొమ్ముతో 9,800 వాహనాలు కొని రూ.650 కోట్లు ప్రజాధనాన్ని దోచారని దుయ్యబట్టారు. మహిళల అభయహస్తం నిధులు రూ.200 కోట్లు దారి మళ్లించి స్వాహా చేశారని అనిత ఆరోపించారు.

*తెలంగాణ విద్యా విధానం దేశానికే ఆదర్శం : మంత్రి మల్లారెడ్డి
తెలంగాణ సర్కారు గురుకులాలు, మైనారిటీ రెసిడెన్సీ పాఠశాలలు ఏర్పాటు చేసి దేశంలోనే విద్యారంగానికి ఆదర్శంగా నిలుస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు కార్పొరేట్‌ వసతులు కల్పిస్తూ.. సీఎం కేసీఆర్‌ విద్యారంగానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.మంగళవారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎ.వి. కన్‌స్ట్రక్షన్‌ సౌజన్యంతో విద్యార్థుకు ఉచిత నోట్‌బుక్స్‌ పంపిణీ చేసే కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి హాజరై విద్యార్థులకు నోట్‌ బుక్స్‌ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాల కల్పనతో పాటు నాణ్యమైన విద్యనందించడానికి ప్రభుత్వం సుమారు రూ. 7289 కోట్లతో మన ఊరు-మనబడి, మన బస్తీ- మనబడి కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రభుత్వ బడులను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దిందన్నారు.

*ఆ 5 గ్రామాల‌ను ఇవ్వాల‌ని కోరుతున్నాం.. అర్థం చేసుకోండి : మంత్రి పువ్వాడ‌
భ‌ద్రాచ‌లం వ‌ర‌ద ముంపు బాధితుల ఆవేద‌న‌ను అర్థం చేసుకోవాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రులకు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజ‌య్ విజ్ఞ‌ప్తి చేశారు. భ‌ద్రాచ‌లం ప‌క్క‌నే ఉన్న గ్రామాల‌ను తిరిగి తెలంగాణ‌కు ఇవ్వాల‌ని కోరుతున్నాం.. అర్థం చేసుకోవాల‌ని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌ల కోసం మాట్లాడిన వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించి, విమ‌ర్శించ‌డం స‌రికాద‌న్నారు. వ‌ర‌ద స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం కోసం క‌లిసి ప‌ని చేద్దామ‌ని విజ్ఞ‌ప్తి చేశారు.ఏపీ మంత్రులు బొత్స స‌త్యనారాయ‌ణ‌, అంబ‌టి రాంబాబు వ్యాఖ్య‌లు బాధాక‌ర‌మ‌ని పువ్వాడ అజ‌య్ కుమార్ పేర్కొన్నారు. త‌న మాట‌ల్లో త‌ప్పేమిటో అర్థం కావ‌డం లేద‌న్నారు. భ‌ద్రాచ‌లం ప్ర‌జ‌లు, ఆల‌యం నీట మున‌గ‌కుండా ఉండాల‌నేది త‌మ ఉద్దేశ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. క‌ర‌క‌ట్ట‌ల నిర్మాణానికి 5 గ్రామాల‌కు ఇవ్వాల‌ని కోరుతున్నామ‌ని తెలిపారు. విలీన గ్రామాల‌ను కేటాయించాల‌ని కోరితే.. హైద‌రాబాద్ ఇస్తారా అన‌టం.. అసంద‌ర్భం.. అర్థ‌ర‌హితం అని అజ‌య్ పేర్కొన్నారు.

*తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధం… ఓపెన్ సవాల్ చేస్తున్నాం: తంగిరాల సౌమ్య
నందిగామలో టీడీపీ ఫ్లెక్సీలు చించడంపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్లెక్సీలు చించిన విషయంలో వైసీపీ పై సౌమ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని… ఓపెన్ సవాల్ చేస్తున్నామన్నారు. ‘‘మీకు జ్ఞానం లేదా ఇలాంటి చర్యలు చేసి మరింత దిగజారిపోతున్నారు. బ్యానర్లు చూసుకోవడానికి మీకు ఈ రెండు సంవత్సరాలే చివరి చూపు. మీరు చేసే చేష్టలకు అట్టు కాదు, బిర్యానీ పెడతాం. బ్యానర్లను చించివేయడం సిగ్గుమాలిన చర్య. అన్న క్యాంటీన్ కి వచ్చే ఆదరణ చూసి ఇలాంటి సిగ్గుమాలిన చర్య పాల్పడుతున్నారు. కెమెరా లేని చోట రెక్కీ నిర్వహించి ఈ విధంగా ఫ్లెక్సీని చించివేశారు’’ అంటూ సౌమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

*ప్రశ్నించే గొంతుని నొక్కొద్దు: ఆర్కే శిరీష
NIA అధికారులు తన ఇంటిపై దాడి చేయడం సమంజసం కాదని మావోయిస్ట్‌ దివంగత అగ్ర నేత భార్య ఆర్కే శిరీష( RK sirisha) అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని.. వైద్య పరీక్షల కోసం విజయవాడ వెళ్లానని అన్నారు. ఉదయం తాను ఇంట్లో లేని సమయంలో NIA అధికారులు తనిఖీలు చేశారని.. తన ఇంట్లో నలుగురు తలదాచుకున్నారని సమాచారం వచ్చిందని అధికారులు చెప్పడం విస్మయాన్ని కలిగించిదన్నారు. అంతేకాకుండా మావోయిస్ట్‌ల దగ్గర డంప్‌ స్వాధీనంలో కొంతమంది విరసం నేతల పేర్లు ఉన్నాయని చెప్పడంలో అధికారుల అంతర్యమోమిటో తెలియదన్నారు. మావోయిస్ట్‌లకు డబ్బులు పంపిస్తున్నారంటూ NIA అధికారులు చేస్తున్న ఆరోపణలు ఆవాస్తవమని చెప్పారు. ఎప్పటికైనా కుళ్లిపోయిన సమాజంపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వస్తుందని హెచ్చరించారు. ప్రశ్నించిన గొంతుని నొక్కే ప్రయత్నం అధికారులు చేస్తున్నారని ఆర్కే శిరీష ధ్వజమెత్తారు.

*ఇలాగైతే గెలవడం కష్టమే: రఘరామకృష్ణరాజు
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎంపీ రఘరామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేశారని, ఫలితంగా పాఠశాలలను మూసేస్తున్నారని పేర్కొన్నారు. 11 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ ఔట్ అయ్యారని తెలిపారు. ప్రభుత్వ తీరులో మార్పు రాకపోతే 175 సీట్లు కాదు కదా..అసలు గెలిచే స్థాన్లాల్లో గెలవడం కూడా కష్టమని పేర్కొన్నారు. రాజకీయ నాయకుడు అబద్ధాలు చెప్పి మోసం చేస్తే ప్రజలు చెప్పులతో నిలదీయాలని గతలో జగన్ పేర్కొన్నారని, ప్రస్తుతం ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై కేసులు, దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

*పిల్లలను గ్లోబల్ స్టూడెంట్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి బొత్స
పిల్లలను గ్లోబల్ స్టూడెంట్లు గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం ‘‘మన బడి – నాడు నేడు’’ లో భాగంగా సత్యనారాయణపురంలోని ఓ ఉన్నత పాఠశాలలో 44 లక్షలతో అదనపు తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ ధిల్లీ రావు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33 కోట్లతో 28 ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ… ‘‘సీఎం జగన్ చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు ఉండాలి. నూతన జాతీయ విద్యా విధానం అమలు చేస్తున్నాం.‘‘మన బడి – నాడు నేడు’’ ద్వారా ఈ ఏడాది 8 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. నూతన విద్యా విధానం ద్వారా అంగన్వాడీ‌ల్లో 1,2 తరగతులు చెప్పే స్కూల్ టీచర్లు అందులో ఉంటారు. గతంలో ఒకే టీచర్ అన్ని సబ్జెక్ట్‌లను బోధించేవారు. ఈ అకడమిక్ సంవత్సరం నుంచి మూడోతరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులో ఉంటారు. పాఠశాలల్లో కొన్ని లోపాలను సరిదిద్దుతున్నాం.. భావి తరాలు మరింత అభివృద్ధి చెందాలి. పిల్లల చదువుల పట్ల రాజకీయాలు చేయడం మానుకోవాలి.. తల్లిదండ్రులు వారి ధ్యాసలో పడకుండా పిల్లల అభివృద్ధికి సహకరించాలి.

*కోతలు, అరకొర చెల్లింపులే.. : దేవినేని
వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్‌రెడ్డి పై ట్విటర్‌ వేదికగా మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జగన్ ప్రభుత్వంలో కోతలు, అరకొర చెల్లింపులే ఉన్నాయి. నాడు చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమంతో ఏపీని అగ్రగామిగా నిలిపారు. నేడు బటన్ నొక్కడమే సీఎం జగన్‌ పని. క్రాప్‌ ఇన్సూరెన్స్‌ (Crop Insurance) లోనూ భారీ దోపిడీ జరిగింది. ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాల్లో ఎంత నగదు జమచేశారో.. శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా?’’ అని దేవినేని ఉమ ట్విటర్‌‌లో డిమాండ్ చేశారు.

*వే జగన్ రెడ్డి ప‌త‌నానికి దారులు: లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్‌ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘హ‌త్య‌లు, దాడుల‌తో టీడీపీ కేడ‌ర్‌ని భ‌య‌పెట్టాల‌నుకుంటున్న జ‌గ‌న్ రెడ్డి గారూ! శిశుపాలుడిలా మీ పాపాలు పండిపోయాయి. ప్ర‌జావ్య‌తిరేక‌త తీవ్రం కావ‌డంతో, రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం మీరు చేయిస్తున్న హ‌త్య‌లు, దాడులే మీ ప‌త‌నానికి దారులు. రొంపిచ‌ర్ల మండ‌ల టీడీపీ అధ్య‌క్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి పై హత్యాయత్నం ముమ్మాటికీ మీ వైసీపీ గూండాల ప‌నే. బాల‌కోటిరెడ్డికి ఏమైనా జ‌రిగితే వైసీపీ స‌ర్కారుదే బాధ్య‌త‌. దాడిలో ఏకంగా వైసీపీ ఎంపీపీ భ‌ర్త పాల్గొన్నాడంటే..మీ రౌడీమూక‌లు ఎంత‌గా బ‌రితెగించాయో అర్థం అవుతోంది. ఫ్యాక్ష‌న్‌ మ‌న‌స్త‌త్వం బ్ల‌డ్‌లోనే ఉన్న మీ పాల‌న‌లో ప‌ల్నాడు ప్రాంతం ర‌క్త‌సిక్త‌మ‌వుతోంది. ఇక‌నైనా హ‌త్యారాజ‌కీయాలు, దాడులు ఆపండి. లేదంటే ఇంత‌కి నాలుగింత‌లు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా వుండండి. జ‌గ‌న్‌రెడ్డి అధికారం, పోలీసులు అండ‌గా వున్నార‌ని రెచ్చిపోతున్న వైసీపీ నేత‌లకు ఇదే చివ‌రి హెచ్చ‌రిక‌. మేము తిర‌గ‌బ‌డితే, మీ వెంట వ‌చ్చేది ఎవ‌రు? వైసీపీ అధికారం కోల్పోతే మిమ్మ‌ల్ని కాపాడేదెవ‌రు?’’ అని నారా లోకేష్ అన్నారు.

*వరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఎందుకు సందర్శించలేదు?..sailjanath
గోదావరి వరద ముంపు ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున సందర్శించామని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవి కోసమే పని చేస్తున్నారని, ప్రజల కోసం పని చేయటం లేదని విమర్శించారు. ఇది ప్రకృతి వైపరీత్యమని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్లాస్టిక్ డేరాల కింద జనాలు నివసిస్తున్నారని, ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి రూ. 25 వేలు, నిత్యవసర సరుకులను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్రం నుంచి పోలవరం నిధులు వస్తేనే పోలవరం పూర్తవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెపుతుందని, పోలవరంలో ముంపు ప్రాంతాలలో తక్షణమే సహాయకచర్యలు చేపట్టాలని శైలజానాథ్ కోరారు. పరిహారం కింద జగన్మోహన్ రెడ్డి రూ. ఆరు లక్షల కాదు.. పది లక్షలు ఇస్తామన్నారని, తక్షణమే రూ. 10 లక్షలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21 తేదీన సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలవడం అన్యాయమన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా 21న ధర్నా కార్యక్రమాలు చేపడతామన్నారు. సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ కేసులతో ఇబ్బంది పెట్టడం, అది రాజకీయ కక్షేనని, ఇటు వంటి రాజకీయ కక్షలకు పాల్పడేవారికి ప్రజాస్వామ్యంలో చోటు ఉండదని శైలజానాథ్ అన్నారు

*పిల్లలను గ్లోబల్ స్టూడెంట్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి బొత్స
పిల్లలను గ్లోబల్ స్టూడెంట్లు)గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ
వ్యాఖ్యానించారు. మంగళవారం ‘‘మన బడి – నాడు నేడు’’ లో భాగంగా సత్యనారాయణపురంలోని ఓ ఉన్నత పాఠశాలలో 44 లక్షలతో అదనపు తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ ధిల్లీ రావు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33 కోట్లతో 28 ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ… ‘‘సీఎం జగన్ చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు ఉండాలి. నూతన జాతీయ విద్యా విధానం అమలు చేస్తున్నాం.‘‘మన బడి – నాడు నేడు’’ ద్వారా ఈ ఏడాది 8 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. నూతన విద్యా విధానం ద్వారా అంగన్వాడీ‌ల్లో 1,2 తరగతులు చెప్పే స్కూల్ టీచర్లు అందులో ఉంటారు. గతంలో ఒకే టీచర్ అన్ని సబ్జెక్ట్‌లను బోధించేవారు. ఈ అకడమిక్ సంవత్సరం నుంచి మూడోతరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులో ఉంటారు. పాఠశాలల్లో కొన్ని లోపాలను సరిదిద్దుతున్నాం.. భావి తరాలు మరింత అభివృద్ధి చెందాలి. పిల్లల చదువుల పట్ల రాజకీయాలు చేయడం మానుకోవాలి.. తల్లిదండ్రులు వారి ధ్యాసలో పడకుండా పిల్లల అభివృద్ధికి సహకరించాలి.కేరళ తరహాలో విద్యార్థులు ఉన్నత విద్యనందిపుచ్చుకొని రాణించాలనేదే ప్రభుత్వ లక్ష్యం’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు

*సీఎం నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు
ప్రజలు వరదల్లో అల్లాడుతుంటే సీఎం జగన్‌రెడ్డి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అన్నిటికీ బటన్ నొక్కే సీఎం…వరద బాధితుల సహాయం బటన్ ఎందుకు నొక్కలేదు.వరద సహాయం ఇవ్వాల్సి వస్తుందని ….బటన్ నొక్కే చేయి సీఎం దాచుకున్నట్లు ఉన్నారు. విపత్తులకు చంద్రబాబు ఎదురెళ్తారు….సీఎం జగన్ వెనుక ఉంటారు. వరద బాధితులపై కేసులు పెట్టగల సమర్థుడు జగన్. వరదల్లో గత ప్రభుత్వాలు ఏమి చేశాయో సీఎం జగన్ చరిత్ర తెలుసుకోవాలి.వరద బాధిత కుటుంబానికి 2వేల రూపాయలు ఇస్తే సరిపోదు….. 10 వేల రూపాయలు ఇవ్వాలి. 75కేజీల బియ్యం,కందిపప్పు,నూనె అందించాలి’’ అని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు

*పోలవరంతో భద్రాచలానికి ముప్పు: పువ్వాడ అజయ్
పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు ఉందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ఎత్తు తగ్గించేందుకు కేంద్రం బాధ్యత తీసుకోవాలన్నారు. భద్రాచలం పక్కన ఉన్న 5 గ్రామాలను తామే ఆదుకున్నామని చెప్పారు. పార్లమెంట్ )లో బిల్లు పెట్టి 5 గ్రామాలను.. తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. భారీ వరదలు వస్తే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి బాధితులను కలిశారా? అని ప్రశ్నించారు. గవర్నర్ పర్యటిస్తే ఏం ఉపయోగం.. కేంద్ర మంత్రులు వస్తే ఉపయోగమని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇసుక, నోటూ, మూటలు తప్ప ఇంకేమీ తెలీదని విమర్శించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ )పై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వత శత్రువులు.. మిత్రులు ఉండరని మంత్రి పువ్వాడ వ్యాఖ్యానించారు.

*షిండే వర్గంపై కస్సుమన్న సంజయ్ రౌత్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని సేన తిరుగుబాటు వర్గాన్ని ”పాములు” అంటూ శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సంబోధించారు. ”పాముల పడగలను మర్ధించడం మాకు తెలుసు. పాములున్నాయనే భయంతో అడవిని విడిచిపిట్టి వెళ్లేవాళ్లం కాదు. జై మహారాష్ట్ర!!” అంటూ మంగళవారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు. శివసేన పార్టీకి చెందిన 18 మందిలో ఎంపీల్లో 12 మంది ఎంపీలు సీఎం షిండేతో టచ్‌లో ఉన్నారని, రెబల్ వర్గంలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని, ఈ ఎంపీలంతా లోక్‌సభలో ప్రత్యేక బృందంగా వ్యవహరించనున్నారని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో సంజయ్ రౌత్ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.

*పన్నీర్‌సెల్వం స్థానాన్ని ఉదయ్‌కుమార్‌తో భర్తీ చేసిన అన్నాడీఎంకే
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వాన్ని పార్టీ నుంచి బహిష్కరించడంతో ఖాళీ అయిన అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థానాన్ని అన్నాడీఎంకే భర్తీ చేసింది. ఆ స్థానంలో మాజీ మంత్రి ఆర్‌బీ ఉదయ్‌కుమార్ ను నియమించింది. పార్టీ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి తెలిపారు. ఈ నెల 17న జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో తిరుమంగళం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయ్‌కుమార్‌ను డిప్యూటీ లీడర్‌గా ఎన్నుకున్నట్టు పళనిస్వామి తెలిపారు. అలాగే, లెజిస్లేచర్ పార్టీ డిప్యూటీ సెక్రటరీగా అగ్రి ఎస్ఎస్ కృష్ణమూర్తిని ఎన్నుకున్నట్టు చెప్పారు. కాగా, ఈ నెల 11న పన్నీర్‌సెల్వాన్ని అన్నాడీఎంకే బహిష్కరించింది

*సుప్రీం తీర్పు జగన్‌ సర్కారుకు చెంపదెబ్బ: బాబు
కరోనా విపత్తు నిధులను దారి మళ్లించడంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు జగన్‌ సర్కారుకు చెంప దెబ్బని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘1100 కోట్ల నిధులను దారి మళ్లించడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. దారి మళ్లించిన నిధులను ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఖాతాలో జమ చేయాలని సుప్రీం ఆదేశించడం ఇష్టానుసార పాలనకు చెంపపెట్టు. తప్పులు చేయడమే కాకుండా వాటిని సమర్థించుకోవడానికి వైసీపీ ప్రభుత్వం కొత్త తప్పులు చేస్తోంది. కరోనా లేదా వరదలు వంటి విపత్తులు నిధులనూ మళ్లించి పబ్బం గడుపుకోవడం బాధితులకు అన్యాయం చేయడమే’’ అని ఆయన ట్వీట్‌లో విమర్శించారు.

*పోలవరం ఎత్తు తగ్గిస్తేనే భద్రాద్రికి రక్షణ: తమ్మినేని
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే తప్ప భద్రాద్రికి రక్షణ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పోలవరంతో భద్రాద్రికి ముప్పు పొంచి ఉందని తమ పార్టీ తొలి నుంచి స్పష్టం చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు ఏపీపై ఒత్తిడి తేవాలన్నారు. భద్రాచలంలో సోమవారం ఆయన గోదావరి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ప్రతి వరద బాధిత కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

*కేసీఆర్‌ అహంకారం వల్లే కాళేశ్వరం మునక: ఈటల
సీఎం కేసీఆర్‌ ఇంజనీర్లు, నిపుణుల మాటలు పెడచెవిన పెట్టి అంతా తానే అన్నట్టు అహంకార ధోరణితో వ్యవహరించడం వల్లే కాళేశ్వరం పంప్‌హౌజ్‌లు నీట మునిగాయని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల, తలకొండపల్లిలలో జరిగిన ధర్నాల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో వరద వెనుక విదేశీ కుట్ర ఉందని పేర్కొనడం సీఎం కేసీఆర్‌ మతి భ్రమించిన వ్యాఖ్యలకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో అధికార పక్షమే ఆందోళనలు చేయటం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కాగా, బీజేపీ ధర్నాను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కంబాల పరమేశ్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

*ప్రాథమిక నివేదికలు అందిన వెంటనే.. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బృందాలు: కిషన్‌రెడ్డి
వరదల వల్ల సంభవించిన నష్టాలపై ప్రాథమిక నివేదికలు అందిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తాయని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం తాను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలిసి గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరదల వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలకు, వారి జీవనోపాధికి జరిగిన నష్టం గురించి వివరించానని పేర్కొన్నారు. వరద బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను వీలయినంత త్వరగా అందించాలని అధికారులను అమిత్‌ షా ఆదేశించారన్నారు. తెలంగాణకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు కేటాయించినప్పటికీ ఆ నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రతిపాదనలను పంపించలేదన్నారు.

*80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు.. వర్షాలెలా పడతాయో తెలియదా?: శశిధర్‌రెడ్డి
80 వేల పుస్తకాలు చదివిన సీఎం కేసీఆర్‌కు.. వర్షాలు ఎలా పడతాయో తెలియదా? అని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్‌వి డైవర్టు రాజకీయాలని విమర్శించారు. అంతర్జాతీయ కుట్ర వల్లే భారీ వర్షాలు పడ్డాయని సీఎం కేసీఆర్‌ చెప్పడం బాధాకరమన్నారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు గడిచినా రాష్ట్రస్థాయిలో విపత్తుల నిర్వహణ సమావేశాలు పెట్టలేదన్నారు. కేసీఆర్‌ రాజకీయ సలహాదారు ప్రశాంత్‌ కిషోర్‌ చిల్లర ఎత్తుగడల్లో భాగంగానే విదేశీ కుట్ర.. క్లౌడ్‌ బరస్ట్‌ అంటూ సీఎం కేసీఆర్‌ మాట్లాడారని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. కాగా, నిత్యావసరాలపై కేంద్రం జీఎస్టీని పెంచినందుకు నిరసనగా సోమవారం గాంధీభవన్‌ ఎదుట మహిళా కాంగ్రెస్‌ నేతలు మోదీ దిష్టిబొమ్మను దగ్ధంచేశారు.

*ఒక్క వరదకే కేసీఆర్‌కు ఎన్ని కష్టాలు?: షర్మిలt
క్లౌడ్‌ బర్‌స్టపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి షర్మిల సెటైరికల్‌గా స్పందించారు. ఈ మేరకు సోమవారం ఆమె ట్వీట్‌ చేశారు. ‘ఆంధ్రోళ్ల అణిచివేతలైపోయినయ్‌. ప్రతిపక్షాల పన్నాగాలు అయిపోయినయ్‌. తిరుగుబాటుదారుల వెన్నుపోట్లూ అయిపోయినయ్‌. జాతీయ పార్టీల జిమ్మిక్కులు.. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అయిపోయినయి. ఇక అంతర్జాతీయ కుట్రలు మొదలైనయ్‌..! ఒక్క వరదకే.. మన కేసీఆర్‌కు ఎన్ని కష్టాలొచ్చినయ్‌!?’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

*సోమువి అవగాహన లేని మాటలు: కొట్టు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏ మాత్రం అవగాహన లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసం తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వీర్రాజు ఆరోపించినట్లుగా హిందూ దేవాలయాల నిధుల మళ్లింపు వాస్తవం కాదన్నారు. కాగా, దుర్గగుడి ఘాట్‌రోడ్డులో ప్రమాదాల దృష్ట్యా, ఘాట్‌ రోడ్డు మూసివేసి ప్రతి ఒక్కరికీ రాజగోపురం ద్వారానే ఆలయప్రవేశం కల్పించే ఆలోచన కూడా ఉందని తెలిపారు. కాగా, పవన్‌ ఎంవోయూ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. వైసీపీ రహిత ప్రభుత్వం ఏర్పాటుకు పవన్‌ ఎవరు అని ప్రశ్నించారు. చంద్రబాబుతో ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు.

*నాబార్డు సేవలు అభినందనీయం: మంత్రి కాకాణి
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సహకార పౌరసరఫరాలు, విద్య, వైద్య, ఆరోగ్యం తదితర రంగాల్లో స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి నాబార్డు అందిస్తున్న ప్రోత్సాహకాలు అభినందనీయమన మంత్రి కాకాణి గోవర్దనరెడ్డి అన్నారు. నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ (నాబార్డు) ఐదో దశాబ్దంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సంస్థ 41వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సోమవారం విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి కాకాణి మాట్లాడుతూ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు నాబార్డు రూ. 1600 కోట్ల రుణసదుపాయం కల్పించిందని తెలిపారు.

*పోలవరంపై బహిరంగ చర్చకు సిద్ధమే: దేవినేని ఉమా
పోలవరంపై బహిరంగ చర్చకు తా ను సిద్ధమేనని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడారు. సీఎం జగన్‌రెడ్డి తప్పిదం వల్లే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల నిర్మాణ ప్రాంతంలో వరద నీరు నిలిచిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నే నిర్వాసితులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారని ధ్వజమెత్తా రు. సీఎంకి కనీస పరిజ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంటే యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. గోదావరి నది మీద పులిచింతల కట్టేంత తెలివైన వాళ్లు నిర్వాసితులను ఏ విధంగా కాపాడతారని ఎద్దేవాచేశారు. రాజశేఖర్‌రెడ్డి పార్ధివదేహం దగ్గరే జగన్‌రెడ్డి పోలవరం కాంట్రాక్టర్లతో ఆనాడు బేరం పెట్టాడని విమర్శించారు. జలవనరుల మంత్రి అంబటి రాంబాబు వాస్తవాలు తెలుసుకోకుండా మీడియాను తిడితే ఏం వస్తుందని అన్నారు.

*సుప్రీం తీర్పు జగన్‌ సర్కారుకు చెంపదెబ్బ: బాబు
కరోనా విపత్తు నిధులను దారి మళ్లించడంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు జగన్‌ సర్కారుకు చెంప దెబ్బని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘1100 కోట్ల నిధులను దారి మళ్లించడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. దారి మళ్లించిన నిధులను ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఖాతాలో జమ చేయాలని సుప్రీం ఆదేశించడం ఇష్టానుసార పాలనకు చెంపపెట్టు. తప్పులు చేయడమే కాకుండా వాటిని సమర్థించుకోవడానికి వైసీపీ ప్రభుత్వం కొత్త తప్పులు చేస్తోంది. కరోనా లేదా వరదలు వంటి విపత్తులు నిధులనూ మళ్లించి పబ్బం గడుపుకోవడం బాధితులకు అన్యాయం చేయడమే’’ అని ఆయన ట్వీట్‌లో విమర్శించారు.

*విపత్తు నిధులన్నీ సొంత ఖాతాలకు మళ్లింపు: యనమల
వరద బాధితులకు పునరావాస కార్యక్రమాల అమలులో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. విపత్తుల నిధులన్నింటినీ సొంత ఖాతాలకు మళ్లించుకునిబాధితులకు మొండిచెయ్యి చూపుతున్నారన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల పరిధిలోని వరద ప్రభావిత గ్రామాల్లో యనమల ఆధ్వర్యంలో టీడీపీ బృందం సోమవారం పర్యటించింది. బాధితులను పరామర్శించింది. శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ మం త్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు తదితరులు ఈ బృందంలో ఉన్నారు.

*విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చండి: మంత్రి సబితా
బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఇంఛార్జి వీసీ వెంకటరమణను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఆర్జీయూకేటీ ఇంఛార్జి వీసీగా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణ.. మంత్రితో భేటీ అయ్యారు. ఆర్జీయూకేటీలోని వివిధ సమస్యలపై చర్చించి పలు ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులను ఇప్పటికే మంజూరు చేశామని తెలిపారు. బోధన, భోజన, వసతి పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా.. విద్యార్థుల డిమాండ్లకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమం కోసం అధికారులు తీసుకునే చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు.