Movies

బాలీవుడ్‌లో కొత్తభామ

బాలీవుడ్‌లో కొత్తభామ

బుల్లితెర ప్రభావం ఎంతగా పెరిగిందంటే ఇక్కడ పేరున్న వాళ్లంతా వెండితెరపై అడుగుపెడుతుంటారు. అందం, ప్రతిభ గల నాయికలకు ఇలాంటి అవకాశాలు అతి త్వరగా వచ్చేస్తుంటాయి. ‘బిగ్‌బాస్‌ 13’ కార్యక్రమం ద్వారా టీవీ వీక్షకుల్లో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది షెహనాజ్‌ గిల్‌. ఈ గుర్తింపు ఆమెను బాలీవుడ్‌ హీరోయిన్‌ను చేసేసింది. సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న ‘కభీ ఈద్‌ కభీ దివాలీ’ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైందీ తార. పూజా హెగ్డే ఈ సినిమాలో నాయికగా నటిస్తున్నది. తాజాగా ఆమెకు మరో ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్‌ దక్కినట్లు సమాచారం. ‘వీర్‌ దే వెడ్డింగ్‌’ నిర్మాత రియా కపూర్‌ కొత్త సినిమాలో షెహనాజ్‌ గిల్‌ నాయికగా ఎంపికైంది. ఈ చిత్రంలో అనిల్‌ కపూర్‌, భూమి ఫెడ్నేకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రియా కపూర్‌ భర్త కరణ్‌ భూలానీ దర్శకత్వం వహిస్తున్నారు. యువతీ యువకుల మధ్య ఆధునిక సంబంధాల నేపథ్యంతో ఈ సినిమా సాగనుంది. ఆగస్టు నుంచి ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తున్నది.