*గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం నుంచి రెండు రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో (కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా) ఐదు నియోజక వర్గాలు ఆచంట, పి.గన్నవరం, రాజోల్, పాలకొల్లు, నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వరద ముంపు గ్రామాల్లో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు పర్యటనకు బయలుదేరనున్నారు. ఆయోధ్య లంక, నాగుల్లంక, మనెపల్లి, అప్పనపల్లి, రాజోల్, దొడ్డిపట్ల, అబ్బురాజుపాలెం, గంగాధర పాలెం, లక్ష్మీపురం, పొన్నపల్లి తదితర గ్రామాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది.
*తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ బోర్డు ఎన్నికల్లో అక్రమాలపై జిల్లా కలెక్టర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. 12 డైరెక్టర్ పోస్టులకు ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో అక్రమాలు, దొంగ ఓట్ల కారణంగా పోలింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
*తెంపల్లిలో ఎమ్మెల్యే వంశీ అనుచరులను స్థానికులు నిలదీశారు. డయేరియాతో అవస్థలు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిరోజులుగా అవస్థలు పడుతున్నా పరామర్శించలేదని వంశీపై మండిపడ్డారు. కలెక్టర్, మండల అధికారులు వచ్చి వెళుతున్నారు తప్ప పరిష్కారం జరగటం లేదని తెంపల్లి వాసులు చెబుతున్నారు. తమకు న్యాయం జరగాలంటూ అధికారులను స్థానికులు నిలదీశారు.
*గన్నవరం మండలం, తెంపల్లి గ్రామంలో స్థానికులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో మంచి నీరు కలుషితంతో ఐదుగురు మృ చెందారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా గ్రామానికి చేరుకుని వీదుల్లో పర్యటించారు. అనంతరం అధికారులు సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే మంచి నీటి పైప్ లైన్ పనులు ప్రారంభించాలని ఆర్‌డబ్ల్యూఎస్అ ధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే అధికారులు తాత్కాలిక పనులు ప్రారంభించారు. ఇలా తాత్కాలిక పనులు చేసి చేతులు దులుపుకుంటే.. మళ్ళీ అనారోగ్య సమస్య తలెత్తితే ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటని గ్రామస్తులు ప్రశ్నించారు. శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఫ్ల కార్డులు పట్టుకొని బైటాయించారు. గ్రామ సమస్యలు వెంటనే పరిష్కారించాలని నినాదాలు చేశారు. అధికారులు వచ్చి గ్రామానికి న్యాయం చేసేవరకు ధర్నా విరమించేది లేదంటూ గ్రామస్తులు స్పష్టం చేశారు.
*విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించేందుకు వామపక్ష విద్యార్థి సంఘాలు యత్నించాయి. విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం ఈరోజు విద్యాసంస్థల రాష్ట్ర బంద్‌కు వామపక్ష విద్యార్థులు పిలుపునిచ్చాయి. బంద్‌లో భాగంగా విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తక్షణమే పెండింగ్ పాఠ్యపుస్తకాలు, యునిఫామ్స్ అందించాలని డిమాండ్ చేశారు. నూతన జాతీయ విద్యావిధానం 2020 రద్దు చేయాలన్నారు. పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయంబర్స్ విడుదల చేయాలన్నారు. విద్యార్ధులందరికి ఉచిత బస్ పాస్ అందించాలని పట్టుబట్టారు. మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచి, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలన్నారు. ప్రైవేట్, కార్పోరేట్ ఫీజుల నియంత్రణకై ఫీజులు నియంత్రణ చట్టాన్ని తీసుకుని రావాలని, విద్యారంగంలో ఖాళీగా ఉన్న అన్ని అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని వామపక్ష విద్యార్థులు డిమాండ్ చేశారు. కాగా ముట్టడికి వచ్చిన విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
*భద్రాద్రి రామయ్య సన్నిధిలో సుమారు 4వేల లడ్డూల ప్రసాదం పాడైపోయాయి. భక్తులు వస్తారని లడ్డు ప్రసాదాన్ని ఆలయ సిబ్బంది తయారు చేశారు. అయితే గోదావరి వరదల వల్ల భక్తుల సంఖ్య తగ్గడంతో లడ్డూలు పాడైపోయాయి. వారం క్రితం తయారు చేసిన లడ్డూలు భక్తుల లేక నిలువ ఉండి పాడైన వైనం నెలకొంది. 1 లక్ష రూపాయలకు పైగా విలువ గల లడ్డూలు పాడైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.
* కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ (GST) పెంచి పేదల నడ్డి విరుస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ విమర్శించారు. బుధవారం ఎమ్మెల్యే ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పాలనపై కూడా జీఎస్టీ పెంచడం దారుణమన్నారు. పెట్రోల్ , డీజిల్ ధరలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, తెలంగాణ పై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరూరి రమేష్ మండిపడ్డారు.
*రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది ఐఆర్‌సీటీసీ. ఇకపై రైళ్లలో భోజనం, స్నాక్స్ ధరలను ఏకంగా రూ.50 పెంచేసింది. ఈ విషయాన్ని ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ సర్క్యూలర్ కూడా జారీ చేసింది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, డుర్యాంటో ఎక్స్‌ప్రెస్‌లతో సహా భారతీయ ప్రీమియం రైళ్లకు ఈ క్యాటరింగ్ ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది. భారతీయ రైల్వే బోర్డు జూలై 15న జారీ చేసిన ఆర్డర్ ప్రకారం కొత్త ధరలు ఉంటాయని పేర్కొంది.
*దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లలో సానుకూల పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో మొదలగా.. రోజంతా గ్రీన్‌మార్క్‌లోనే కొనసాగాయి. ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లు భారీగా జరగ్గా.. మార్కెట్ బలాన్ని ఇచ్చినట్లయ్యింది.
*రోడ్లు వేయడం ప్రభుత్వం వంతు, వాటిని కాపాడుకోవడం ప్రజల బాధ్యత అని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బాన్సువాడ గ్రామీణ మండలం బోర్లం క్యాంప్ నుంచి బాన్సువాడ-గాంధారి ఆర్ అండ్ బీ రహదారి వరకు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డును స్పీకర్ పరిశీలించారు.
*కుక్కునూరు మండలం, శ్రీధర వేలూరులో అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై వరద బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ , తెలంగాణ సరిహద్దులో ఉన్న ఈ గ్రామం గోదావరి వరదలో చిక్కుకుంది. వరద బాధితుల సమీపంలోని గుట్టపై బాధితులు తలదాచుకుంటున్నారు. ఐదు రోజులు గడిచినా ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ ఇటువైపు రాలేదని, తమను పట్టించుకోవడమే మానేశారని మండిపడ్డారు.
*ఏపీ హైకోర్టు కు ఏడుగురు కొత్త న్యాయమూర్తులను నియమించారు. సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని న్యాయమూర్తుల నియామకంపై కొలీజియం సిఫార్సు చేసింది. ఏడుగురు న్యాయాధికారులకు జడ్జీలుగా పదోన్నతి కల్పించారు. వెంకట రవీంద్రబాబు, రాధాకృష్ణ కృప సాగర్, శ్యామ్‌సుందర్, శ్రీనివాస్ ఊటుకురు, బోపన్న వరహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి, మల్లికార్జునరావు, వెంకటరమణ పేర్లను జడ్జీలుగా కొలీజియం సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సును త్వరలో రాష్ట్రపతి ఆమోదం తెలపనున్నారు. ఏపీ హైకోర్టులో ఫిబ్రవరి నెలలో ఏడుగురు న్యాయమూర్తులను నియమించిన విషయం తెలిసిందే. న్యాయమూర్తులుగా కె. శ్రీనివాసరెడ్డి, జి రామకృష్ణప్రసాద్, ఎన్ వెంకటేశ్వర్లు, టి రాజశేఖర్‌రావు, ఎస్ సుబ్బారెడ్డి, సి. రవి, వి. సుజాతలను నియమించారు. జనవరి 29న కొలిజీయం భేటీలో సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలో జరిగిన సమావేశంలో సిఫారసు చేశారు.
*ఏపీ హైకోర్టు కు ఏడుగురు కొత్త న్యాయమూర్తులను నియమించారు. సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని న్యాయమూర్తుల నియామకంపై కొలీజియం సిఫార్సు చేసింది. ఏడుగురు న్యాయాధికారులకు జడ్జీలుగా పదోన్నతి కల్పించారు. వెంకట రవీంద్రబాబు, రాధాకృష్ణ కృప సాగర్, శ్యామ్‌సుందర్, శ్రీనివాస్ ఊటుకురు, బోపన్న వరహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి, మల్లికార్జునరావు, వెంకటరమణ పేర్లను జడ్జీలుగా కొలీజియం సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సును త్వరలో రాష్ట్రపతి ఆమోదం తెలపనున్నారు. ఏపీ హైకోర్టులో ఫిబ్రవరి నెలలో ఏడుగురు న్యాయమూర్తులను నియమించిన విషయం తెలిసిందే. న్యాయమూర్తులుగా కె. శ్రీనివాసరెడ్డి, జి రామకృష్ణప్రసాద్, ఎన్ వెంకటేశ్వర్లు, టి రాజశేఖర్‌రావు, ఎస్ సుబ్బారెడ్డి, సి. రవి, వి. సుజాతలను నియమించారు. జనవరి 29న కొలిజీయం భేటీలో సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలో జరిగిన సమావేశంలో సిఫారసు చేశారు.
*రాష్ట్రంలోని వరద ప్రాంతాల్లో గురువారం నుంచి మూడు రోజుల పాటు వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి షర్మిల పర్యటించనున్నారు. స్థానికంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిశీలించి.. ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యలను ఆరా తీయనున్నారు. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, శుక్రవారం ఉమ్మడి కరీంనగర్, శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలలోని వరద ప్రాంతాలను సందర్శిస్తారు. కాగా, 18 ఏళ్ల కింద కట్టిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ .. చెక్కు చెదరకుండా పని చేస్తుంటే.. రూ.లక్షల కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పంప్‌హౌస్‌లు మునిగి పోయాయని షర్మిల విమర్శించారు.
*రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు రూ.38.45కోట్లు కావాలని ఆర్ అండ్ బీ అధికారులు అంచనాలు రూపొందించారు. 515 చోట్ల రహదారులు దెబ్బ తిన్నాయని, పలుచోట్ల రోడ్లు తెగిపోయాయని అధికారులు తెలిపారు. 68 చోట్ల తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ట్రాఫిక్ పునరుద్ధరించామన్నారు. రోడ్ల నిర్వహణ నిధులతో పనులు చేపట్టామని, మరో వారం రోజుల్లో ట్రాఫిక్ పునరుద్ధరణ చర్యలు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు.
*భారీ వరదకు నీట మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం(సిరిపురం) పంప్‌హౌస్ అక్టోబర్‌కు, మేడిగడ్డ(కన్నెపల్లి) పంప్‌హౌస్ నవంబర్ కల్లా అందుబాటులోకి వస్తాయని నీటిపారుదల శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ పంప్‌హౌస్‌లు నీట మునగడంతో విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై అనేక విమర్శలు చేశాయి. దీంతో పంప్‌హౌస్‌ల పునరుద్ధరణపై ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. దీంతో అన్నారం పంప్‌హౌస్‌లో చేరిన నీటిని తోడుతుండటంతో పంపులు బయటపడుతున్నాయి. మేడిగడ్డలో పంపులు మాత్రం ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో నీళ్లను తోడేందుకు జనరేటర్లు తెప్పించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే, పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, డైరెక్టర్(ఎత్తిపోతల) సూర్యప్రకా్‌షతో నీటిపారుదల శాఖ సలహాదారుడు(ఎత్తిపోతల) పెంటారెడ్డి మంగళవారం విద్యుత్‌సౌధలో సమావేశమయ్యారు. ఆగస్టు నెలాఖరుకు ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని ట్రాన్స్ కో అధికారులు ఈ సమావేశంలో వెల్లడించారు.
*దేశంలో మంకీ పాక్స్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో 36 పడకలతో మంకీ పాక్స్ వార్డును ఏర్పాటు చేసింది. విదేశాల నుంచి వచ్చే వారికి మంకీ పాక్స్ లక్షణాలు కనిపిస్తే విమానాశ్రయం నుంచి నేరుగా ఇక్కడకు తీసుకొస్తారు. అనుమానితుల రక్తం, యూరిన్, గొంతు నుంచి ఐదు రకాల శాంపిల్స్ సేకరించి గాంధీ ఆస్పత్రికి పంపుతారు. ఫలితాల్లో అనుమానాలుంటే శాంపిల్స్‌ను మరోసారి పుణెకు పంపనున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే ఈ వార్డులో ప్రత్యేక చికిత్స అందించనున్నట్లు ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శంకర్ తెలిపారు.
*నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో : 29,365 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో : 4,138 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 532.80 అడుగులకు చేరింది. అలాగే ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలకు గాను… ప్రస్తుతం నీటి నిల్వ : 173.664 టీఎంసీలుగా నమోదు అయ్యింది.
*శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 2,52,967 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 19,070 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 876 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 168.2670 టీఎంసీలు కొనసాగుతుంది. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
*శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 2,52,967 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 19,070 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 876 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 168.2670 టీఎంసీలు కొనసాగుతుంది. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
*తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 74,503 మంది భక్తులు దర్శించుకున్నారు. నేడు ఆన్‌లైన్‌లో అంగప్రదక్షిణ టోకెన్లను విడుదల చేయనున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.42 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 30,884 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నేడు శ్రీవారి ఆలయంలో పల్లవోత్సవం జరగనుంది. ఆగస్ట్‌కు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్లను విడుదల చేయనున్నారు. రోజుకి 750 చొప్పున టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది.
* కందుకూరులో టీడీపీ నేతల ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రామాయపట్నం పోర్టు శంఖుస్థాపనకు సీఎం జగన్(Jagan) వస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలను గృహనిర్బంధం చేశారు. కందుకూరు సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని టీడీపీ నాయకులు భావించారు. అయితే సీఎంను కలిసేందుకు అనుమతి లేదంటూ మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, టీడీపీ ఇన్ ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
*మహాసేన మీడియా వ్యవస్థాపకులు రాజేష్ మహాసేనపై కేసు నమోదు అయ్యింది. శ్రీకాకుళం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రాజేష్‌పై అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై హైదరాబాద్‌కు చెందిన సన్నీ దీపక్ అనే వ్యక్తితో ఫేస్ బుక్‌లో తప్పుడు పోస్టులు పెట్టించారన్న రాజేష్‌పై ఆరోపణలను వచ్చాయి. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు… రాజేష్ కు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. మరికాసేపట్లో రాజేష్ మహాసేన శ్రీకాకుళం టూ టౌన్ పోలీసులు ముందు విచారణకు హాజరుకానున్నారు.
*నిజాంసాగర్ ప్రాజెక్ట్ లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్ట్‌లోకి 3500 క్యూసెక్కుల వరద నీటి ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1401.42 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 12.978 టీఎంసీలుగా కొనసాగుతోంది.
*డీఎంకే యువజన విభాగాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న ఉదయనిధి ఎదుగుదలను చూసి పార్టీ అధ్యక్షుడిగా సంతోషిస్తున్నానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. డీఎంకే యువజనవిభాగం 42వ వార్షికోత్సవాల సందర్భంగా ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 1980 జూలై 20న అప్పటి పార్టీ అధ్యక్షుడు కరుణానిధి సమక్షంలో మదురై ఝాన్సీరాణి పార్కులో యువజన విభాగాన్ని ప్రారంభించానని, ఆ విభాగంలోనే తాను దశాబ్దాల పాటు పార్టీకి సేవలందించానని, ఆ విషయాలన్నీ గుర్తుకు వచ్చినప్పుడల్లా మనస్సులో ఆహ్లాదం కలుగుతోందన్నారు. తాను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పార్టీ యువజన విభాగం నాయకత్వ బాధ్యతలను స్వీకరించిన ఉదయనిధి తనకంటే చక్కగా నిర్వహిస్తుండడంచూసి ముఖ్యమంత్రిగా, తండ్రిగా కాకుండా పార్టీ అధ్యక్షుడిగా మురిసిపోతున్నానని తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయనిధి నేతృత్వంలోని యువజనవిభాగం నిర్వహించిన ప్రచారం పార్టీ ఘన విజయానికి దోహదపడిందని స్టాలిన్ ప్రశంసించారు.
*ప్రముఖ శైవక్షేత్రం చిదంబరం నటరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఓ భక్తుడు సమర్పించిన బంగారు పూత శివకామసుందరి సమేత నటరాజస్వామివారి చిత్రపటాన్ని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వీఏ నటరాజన్ ఈ చిత్రపటాన్ని కుంభకోణంకు చెందిన ప్రముఖ శిల్పితో తయారు చేయించారు.
*పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును 44.5 మీటర్లకు పెంచేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ ఎత్తును వారం రోజుల్లో పెంచాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని రాష్ట్ర జల వనరుల శాఖ నివేదించడంతో మంగళవారం దీనిపై వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షిస్తామని సోమవారం రాత్రి సమాచారం ఇచ్చింది. మంగళవారం జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చీఫ్ ఇంజనీర్లు రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గోదావరికి జూలైలో వచ్చిన వరదను ఒక అనుభవంగా, గుణపాఠంగా తీసుకుని.. ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును 44.5 మీటర్లకు పెంచాలని నిర్ణయించామని జలవనరుల శాఖ తెలిపింది. 2మీటర్ల వరకూ నల్లమట్టి బెడ్‌గా వేస్తున్నామని.. మిగిలిన ఎత్తులో రాక్‌ఫిల్ చేస్తున్నామని వెల్లడించింది. ఇందుకోసం గతంలోని మెథాడాలజీనే అమలుచేస్తున్నామని తెలిపింది.
*భద్రాచలం పరివాహక ప్రాంతాల్లో తీవ్ర వరద పరిస్థితులు ఏర్పడడానికి ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలడంలో నిర్లక్ష్యం చేసినందువల్లే భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగిందన్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు వ్యాఖ్యలు బాధాకరమన్నారు. భద్రాద్రి రాముడు నీటిలో మునిగితే ఏపీ ప్రజలకైనా బాఽధ కలుగుతుందని, తమ సీఎం కేసీఆర్‌తో వారి ముఖ్యమంత్రి జగన్ చర్చలు జరిపేందుకు వారిద్దరూ కృషి చేయాలని సూచించా రు. అజయ్ మంగళవారం టీఆర్‌ఎ స్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భద్రాచలం రాముడు మునగకుండా చూడాలన్నారు.
* భద్రాచలం పరివాహక ప్రాంతాల్లో తీవ్ర వరద పరిస్థితులు ఏర్పడడానికి ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలడంలో నిర్లక్ష్యం చేసినందువల్లే భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగిందన్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు వ్యాఖ్యలు బాధాకరమన్నారు. భద్రాద్రి రాముడు నీటిలో మునిగితే ఏపీ ప్రజలకైనా బాఽధ కలుగుతుందని, తమ సీఎం కేసీఆర్‌తో వారి ముఖ్యమంత్రి జగన్ చర్చలు జరిపేందుకు వారిద్దరూ కృషి చేయాలని సూచించా రు. అజయ్ మంగళవారం టీఆర్‌ఎ స్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భద్రాచలం రాముడు మునగకుండా చూడాలన్నారు.
* ఆర్‌బీఐ నుంచి మరో రూ.2 వేల కోట్లు జగన్ సర్కార్ సమీకరించింది. ఆర్‌బీఐ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలంతో రుణం తీసుకున్నారు. రూ.1,000 కోట్లకు 8.03 శాతం అత్యధిక వడ్డీతో 14 ఏళ్ళ కాలపరిమితితో బాండ్లు వేలం అలాగే మరో రూ.1,000 కోట్లకు 8.02 శాతం వడ్డీతో 16 ఏళ్ల కాలపరిమితితో బాండ్లు వేయనున్నారు.
*నంద్యాల , నందికొట్కూరులో వైసీపీ (YCP), టీడీపీ మధ్య ఫ్లెక్సీల రగడ నెలకొంది. టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ శివనందా రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీ ని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని వైసీపీ శ్రేణులు తొలగించి వైసీపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు కేజీ రోడ్డుపై ధర్నాకు దిగారు. నందికొట్కూరులో వైసీపీ నాయకులు దౌర్జనానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ముం దు ఆందోళనకు దిగారు.
*రుషికొండపర్యవరణ ఉల్లంఘనలపై ఏపీ హైకోర్టు లో విచారణ జరుగుతుంది. రుషికొండ వ్యవహారాల కేసులో తనను కూడా ఇంప్లీడ్ చేయాలని వైసీపీ నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటీషన్ దాఖలు చేశారు.ఈ కేసులో ఇప్పటికే హైకోర్టులో2 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు సూచనల మేరకు రఘురామ పిటీషన్‌ను అనుమతించాలని న్యాయవాది ఉమేష్ చంద్ర హైకోర్టులో వాదించారు. ఉమేష్ చంద్ర వాదనలను పరిగణలోకి తీసుకుని రఘురామరాజు పిటీషన్‌ను సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు అనుమతినిచ్చింది. రఘురామరాజు తరపున రుషికొండ పర్యావరణ ఉల్లంఘనలపై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. రఘురామ పిటీషన్‌పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీజే నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రుషికొండ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 27కి హైకోర్టు వాయిదా వేసింది.
*టీడీపీ నేత కూనరవి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తరహాలోనే ఏపీలో కూడా త్వరలో అధికార మార్పిడి ఉంటుందన్నారు. దీనికి మంత్రి పెద్దిరెడ్డి నాయకత్వం వహించబోతున్నారని పేర్కొన్నారు. ఏపీలో బీజేపీ అధికార మార్పిడికి సహకరిస్తుందని కూనరవి చెప్పారు. నిన్న జరిగిన సమావేశంలో చాలా మంది ఎమ్మెల్యేలు సీఎం వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారని ఆరోపించారు.
* ఆర్‌బీఐ నుంచి మరో రూ.2 వేల కోట్లు జగన్ సర్కార్ సమీకరించింది. ఆర్‌బీఐ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలంతో రుణం తీసుకున్నారు. రూ.1,000 కోట్లకు 8.03 శాతం అత్యధిక వడ్డీతో 14 ఏళ్ళ కాలపరిమితితో బాండ్లు వేలం అలాగే మరో రూ.1,000 కోట్లకు 8.02 శాతం వడ్డీతో 16 ఏళ్ల కాలపరిమితితో బాండ్లు వేయనున్నారు.
* ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా 30 వారాంతరపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో సీహెచ్ రాకేష్ తెలిపారు. హైదరాబాద్ -తిరుపతిల మధ్య 07643 ప్రత్యేకరైలు ఈ నెల 25 ఆగస్టు 1, 8, 15, 22, 29 తేదీలలో హైదరాబాద్‌లో రాత్రి 7.30 గంటలకు బయలు దేరి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మార్గంలో ప్రయాణిస్తూ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతిలో ఈ ప్రత్యేక రైలు 07544 ఈ నెల 26 ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీలలో మధ్యాహ్నం 3 గంటలకు బయలు దేరి వచ్చిన మార్గంలోనే ప్రయాణిస్తూ మరుసటి రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఫ నరసాపూర్‌లో ఈ ప్రత్యేక రైలు 07613 ఈ నెల 26 ఆగస్టు 2, 9,16, 23, 30 తేదీలలో రాత్రి 8.45 గంటలకు బయలు దేరి పాలకొల్లు, భీమవరం, కైకలూరు, గుడివాడ, విజయవాడ, ఒంగోలు, గూడూరు, రేణిగుంటల మీదుగా మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతిలో ఈ ప్రత్యేక రైలు 07614 ఈ నెల 27 ఆగస్టు 3, 10, 17, 24, 31 తేదీలలో మధ్యాహ్నం 3 గంటలకు బయలు దేరి రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి, గుత్తి, డోన్, కర్నూల్, గద్వాల, జడ్చర్ల, హుందానగర్‌ల మీదుగా కాచిగూడకు ఉదయం 4 గంటలకు చేరుకుంటుంది.
*కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన లక్ష్మీ పంప్‌హౌస్‌లోని 17 మోటార్లు మునిగి ఆరు రోజులు గడిచింది. నీటిని ఎత్తిపోయడానికి ఇంజనీర్లు వివిధ ప్రాంతాల నుంచి భారీ జనరేటర్లను, మోటార్లను తరలించారు. నీటిని తోడేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ప్రకృతి సహకరించటం లేదు. కాళేశ్వరం దగ్గర మంగళవారం మళ్లీ గోదావరి ప్రవాహం పెరిగింది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పంప్ హౌస్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీనికి తోడు 500 హెచ్‌పీ మోటర్లను నడిపేందుకు కావాల్సిన జనరేటర్లు లేవు. హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నారు. మోటార్లు మునగడానికి ఒక రోజు ముందు లక్ష్మీ పంప్ హౌస్‌కు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఇప్పటి వరకు కరెంట్ సరఫరాను పునరుద్ధరించలేదు. దీంతో జనరేటర్లపై ఆధారపడాల్సి వస్తోంది. జనరేటర్లు వస్తే బుధ/గురువారం నుంచి పంప్‌హౌస్‌లో నీటిని ఎత్తిపోత ఓ కొలిక్కి వస్తుందని ఓ అధికారి తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని సరస్వతి పంప్‌హౌస్‌లో నీటి తొలగింపు కొనసాగుతోంది. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల వరకు 13 మీటర్ల లోతు నీటిని తోడారు. పంప్‌హౌస్ మొత్తం 23 మీటర్ల లోతు ఉండగా ఇంకా 10 మీటర్ల లోతులో నీటిని తోడాల్సి ఉంది. పూర్తిస్థాయిలో నీటిని తోడేందుకు ఇంకా మూడు రోజులు పట్టవచ్చని అంచనా. కాగా, లక్ష్మీ పంప్‌హౌస్‌ను పరిశీలించేందుకు మంగళవారం అక్కడికి వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును పోలీసులు అడ్డుకున్నారు. పంప్‌హౌస్‌లోకి ఎవరికీ అనుమతి లేదని తేల్చి చెప్పారు. మూడు రోజుల క్రితం భూపాలపల్లి మాజీ కలెక్టర్ ఆకునూరి మురళికి కూడా అనుమతినివ్వలేదు.
*రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు రూ.38.45కోట్లు కావాలని ఆర్ అండ్ బీ అధికారులు అంచనాలు రూపొందించారు. 515 చోట్ల రహదారులు దెబ్బ తిన్నాయని, పలుచోట్ల రోడ్లు తెగిపోయాయని అధికారులు తెలిపారు. 68 చోట్ల తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ట్రాఫిక్ పునరుద్ధరించామన్నారు. రోడ్ల నిర్వహణ నిధులతో పనులు చేపట్టామని, మరో వారం రోజుల్లో ట్రాఫిక్ పునరుద్ధరణ చర్యలు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు.
*భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా ప్రభావితమైన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో సహాయ, పునరావాస చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్ తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ అనుదీప్, ఇతర సీనియర్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలానికి ఒక సీనియర్ అధికారిని నియమించామని, ప్రతి గ్రామంలో మెడికల్, విద్యుత్తు, పారిశుద్ధ్య విభాగాల అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. బృందాలు సహాయక చర్యలను సమర్థంగా కొనసాగిస్తున్నాయని తెలిపారు. రాత్రికల్లా విద్యుత్తు సౌకర్యాన్ని పునరుద్ధరిస్తామన్నారు. ప్రతి గ్రామానికి ముగ్గురు, నలుగురు పంచాయతీ కార్యదర్శులను కేటాయించి, శానిటేషన్ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామన్నారు. జిల్లాలో 436 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు ఎలాంటి మలేరియా, డెంగీ కేసులు నమోదు కాలేదన్నారు.
*వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటా జ్వర సర్వే నిర్వహించాలని ప్రజారోగ్య డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. అదనపు సిబ్బందితో వరద ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల వైద్యాధికారులకు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలను నాలుగు డివిజన్లుగా విభజించి.. శానిటేషన్ పనుల్లో వేగం పెంచాలన్నారు. దోమలు, కీటకాల నివారణ చర్యలు చేపట్టాలని, మందులు, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు గుర్తించిన 297 రిస్క్ ప్రాంతాల్లో 670 మంది సిబ్బందితో పూర్తి స్థాయిలో పని చేయాలన్నారు. వరద ప్రభావిత 8 జిల్లాల్లో మంగళవారం 368 హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసి 18,558 మందికి చికిత్స చేశామని వివరించారు.
* వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసుకు సంబంధించి నెల్లూరు 4వ అదనపు కోర్టులో ఉన్న ఆధారాల చోరీ వ్యవహారంపై దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించడంపై తగిన ఉత్తర్వులిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐకి అప్పగిస్తే అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, మంత్రి కాకాణి చెప్పిన విషయాలను నమోదు చేసిన న్యాయస్థానం.. తీర్పును వాయిదావేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎ్‌సఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విదేశాల్లో వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ 2017లో కాకాణి పలు డాక్యుమెంట్లు విడుదల చేశారు.
*వైసీపీలో ఇటీవల అసమ్మతి గళం వినిపించిన కరణం ధర్మశ్రీకి ప్రభుత్వ విప్ పదవి దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తనకు మంత్రి పదవి దక్కలేదంటూ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బహిరంగంగానే అసమ్మతి వ్యక్తం చేశారు. ఆయన అనుచరులు రోడ్లపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు. టైర్లు కాలిస్తే మంత్రి పదవులు రావంటూ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్న గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తనకు మంత్రి పదవి దక్కనందుకు ధర్మశ్రీ భోరున విలపించారు. ఆ తర్వాత విశాఖ పర్యటనకు వెళ్లిన జగన్.. మంచి పదవి ఇస్తానంటూ ధర్మశ్రీని బుజ్జగించారు. ఆ వెంటనే అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. తాజాగా ఆయనకు ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు అప్పగిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.
* నిరుద్యోగులను బురిడీ కొట్టించే ముఠాలు పెరిగిపోతున్నాయి. ఆర్టీసీలో కండక్టరు, పోలీసు శాఖలో హోంగార్డు, ఆప్‌కో్‌సలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్నాయి. రూ.లక్షలు వసూలు చేస్తూ నిలువునా ముంచేస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నకిలీ నియామకాలు పెరిగి పోతుండడంతో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. నకిలీ ప్రకటనలు, నియామకాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ యువతను హెచ్చరిస్తున్నారు. అదేసమయంలో ముఠాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ముఠా విషయం రెండు నెలల కిందటే ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది.
*రాష్ట్రాభివృద్ధిలో ఓడరేవులు కీలక పాత్ర పోషిస్తాయని వైసీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, విభజన హామీల అమలు, అభివృద్ధి అంశాలపై రాజీలేని పోరాటం చేస్తున్నామని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో వారు విలేకరులతో మాట్లాడారు. విభజన హామీలను ప్రధాని మోదీ నెరవేర్చాలని కోరారు. రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుల్లో కొన్నిటిని రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని త్వరగా పూర్తిచేస్తుందని.. అయితే అన్ని ప్రాజెక్టుల విషయంలోనూ ఇది సాధ్యం కాదని చెప్పారు. ఏపీలో ఎయిర్‌పోర్టులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
*పాఠశాలల విలీన నిర్ణయాన్ని సొంత పార్టీలోని 60మంది ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారని, జగన్‌రెడ్డి తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు పేర్కొన్నారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం తుగ్లక్ పాలనను ఆదర్శంగా తీసుకున్నట్లుందని మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు.
* సోదాల పేరిట ప్రజా సంఘాల కార్యకర్తల ఇళ్లపై ఎన్‌ఐఏ దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమని పలు ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. రాజద్రోహం, ఉపా వంటి వలస చట్టాలను, జీవించే హక్కు కాలరాస్తున్న ఎన్‌ఏఐ సంస్ధను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపా రద్దు పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా విజయవాడ ధర్నాచౌక్‌లో మంగళవారం ధర్నా జరిగింది. ఈ సందర్బంగా నేతలు దుడ్డు ప్రభాకర్ ఇంటిపైన, ప్రకాశం జిల్లా ఆలకూరపాడులోని ఆర్కే భార్య శిరీష ఇంటిపైన దాడిచేసి భీతావహ వాతావరణాన్ని సృష్టించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ దాడులను తక్షణమే ఆపాలని వారు డిమాండ్ చేశారు.
*రాష్ట్రంలో నూతన బార్ పాలసీ నిబంధనలకు ఎక్సైజ్ శాఖ స్వల్ప సవరణలు చేస్తూ.. ఉత్తర్వులు జారీచేసింది. తాజా పాలసీ ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్‌లోని లైసెన్సీ అక్కడి నుంచి 10కిలోమీటర్ల వరకు, మున్సిపాలిటీ లేదా నగర పంచాయతీల్లోని లైసెన్సీ 3కిలోమీటర్ల పరిధి వరకూ వెలుపల బార్ ఏర్పాటుచేసుకోవచ్చు. అయితే ఎక్కడైనా రెండు పట్టణ స్థానిక సంస్థల వెలుపల పరిధి కలుస్తుంటే… అక్కడ తక్కువ బార్ లైసెన్సు ఫీజు ఉన్న వారు బార్‌లు ఏర్పాటుచేయకూడదని తాజా సవరణల్లో పేర్కొంది.
*రాష్ట్రంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ బాక్సును అధికారులు కట్టుదిట్టమైన భద్రత నడుమ మంగళవారం దేశ రాజధాని ఢిల్లీకి తరలించారు. సోమవారం జరిగిన ఈ పోలింగ్‌లో శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత బ్యాలెట్ బాక్సుకు సీల్ వేసి శాసనసభా ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. మంగళవారం ఉదయం.. ఎన్నికల పరిశీలకులు చంద్రేకర్ భారతి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, అధికార పార్టీ పోలింగ్ ఏజెంట్‌గా వ్యవహరించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సమక్షంలో ఆ బ్యాలెట్ బాక్స్‌ను బయటకు తీశారు. అనంతరం ప్రత్యేక వాహనంలో గన్నవరం విమానాశ్రయానికి తరలించారు. అక్కడ నుంచి ఎయిరిండియా విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారు.
* కేరళ రాష్ట్రంలో మంకీపాక్స్ కేసు వెలుగుచూడటంతో ఆ రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు.ఇతర దేశాల నుంచి విమానాశ్రయాలు, ఓడరేవులకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులందరినీ క్షుణ్ణంగా పరీక్షించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశించింది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, చలి, అలసట, శోషరస కణుపుల వాపు, ముఖం, శరీరంలోని ఇతర ప్రాంతాలపై దద్దుర్లు రావడం మంకీపాక్స్ లక్షణాలని వైద్యులు చెప్పారు. 1958వ సంవత్సరంలో మంకీపాక్స్ వైరస్ కనుగొన్నారు.ఈ వైరస్ పై అధ్యయనం కోసం ఉంచిన ల్యాబ్ కోతుల్లో పాక్స్ లాంటి వ్యాధి వ్యాప్తి కనిపించింది.దీంతో ఈ వైరస్ కు మంకీ పాక్స్ అని పేరు పెట్టారు.
*ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో రాజకీయ అస్తిరత కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో లంకలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కొలంబోలోని ఇండియన్ హైకమిషన్ సూచించింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వాటికి అనుగుణంగా ప్రయాణాలు, పనులు చేసుకోవాలని తెలిపింది. అవసరమైతే తమను సంప్రదించాలని సూచించింది.