మలయాళ స్టార్ హీరోతో నిత్యా మీనన్ ప్రేమలో ఉన్నారనీ, త్వరలోనే వారిరువురూ ఏడడుగులు వేయబోతున్నారనీ సోషల్ మీడియాలో , పలు వెబ్ సైట్లతో వార్తలు షికారు చేశాయి. అయితే తన వివాహం గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని నిత్యా మీనన్ పేర్కొన్నారు. ఓ ఆంగ్ల మీడియాతో ఆమె మాట్లాడుతూ ఆ వార్తలను ఖండించారు. ‘ఈ విషయమైనా నిజమని తెలిశాకే దాన్ని పబ్లిష్ చేయండి’ అంటూ ఆమె ఈ సందర్భంగా మీడియాను కోరారు. ‘అలా మొదలైంది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిత్యా మీనన్ మంచి నటిగా గుర్తింపు పొందారు. ఈ ఏడాది పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ‘భీమ్లా నాయక్’ చిత్రంలో ఆమె నటించారు. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు.