లావు అంజయ్య చౌదరి హయాంలో తానాలో రికార్డుల మీద రికార్డులు నెలకొంటున్నాయి. తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ, కోశాధికారి పోలవరపు శ్రీకాంతులను ఇటీవల అంజయ్య చౌదరి వర్గం పదవుల నుండి తొలగిస్తూ తీసుకొన్న నిర్ణయాన్ని కోర్టు అంగీకరించలేదు. ఈ విధానం సరికాదని వారిని పదవుల్లో కొనసాగించాలని మేరీలాండ్ కోర్ట్ తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. వారు యధావిధిగా తమ బాధ్యతలు నిర్వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని కోర్టు సూచనలు చేసింది.
storage direct