* ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన గౌతమి జూనియర్ కాలేజీ చైర్మన్, ప్రిన్సిపల్ సత్యనారాయణపై హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల గౌతమి కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఓ విద్యార్థినికి ప్రిన్సిపల్ ఫోన్‌లో మాయమాటలు చెప్పి.. సినిమాకు తీసుకెళ్లాడు. సినిమా హాల్లో అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడు సత్యనారాయణ.మళ్లీ ఆమెకు ఫోన్ చేసి నీకు స్పెషల్ క్లాస్ తీసుకుంటాను.. కాలేజీకి రావాలని కోరాడు. దీంతో భయపడ్డ బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి పేరెంట్స్ హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, సత్యనారాయణను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు
*పెనమలూరు నియోజకవర్గం పరిధిలో విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై శుక్రవారం తాడిగడప వద్ద రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ద్విచక్ర వాహనాన్ని లారీ డీ కొనటంతో ప్రమాదంలో మహిళ మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*మహిళపై అత్యాచారం కేసులో మాజీ సీఐ నాగేశ్వరరావు కస్టడీ ముగిసింది. ఐదు రోజులపాటు నాగేశ్వర్ రావును వనస్థలిపురం పోలీసులు విచారించారు. కస్టడీ ముగిసిన నేపథ్యంలో పోలీసులు ఈరోజు నాగేశ్వర్‌రావును హయత్‌నగర్ కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం జ్యూడీషియల్ రిమాండ్‌కు మాజీ సీఐను తరలించారు. మహిళపై అత్యాచారం, కిడ్నాప్, ఆక్సిడెంట్ కేసులపై ఏసీపీ పురుషోత్తం రెడ్డి విచారించారు. బాధితురాలు ఇంటి దగ్గర నుండి యాక్సిడెంట్ అయిన ఇబ్రహీంపట్నం చెరువు వరకు పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు.
*సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి దేవాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. గత మూడు నెలలుగా జీతం రావట్లేదంటూ ఉద్యోగి వెంకటేష్ ఆలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. వెంటనే మహంకాళి పోలీసులు అతడిని వారించి అదుపులోకి తీసుకున్నారు. తనకు జీతం రాకుండా ఆలయ ఈఓ అడ్డుకుంటున్నాడని వెంకటేష్ ఆరోపించాడు. అయితే వెంకటేష్‌కు ఇటీవలే పర్మినెంట్ అవ్వడంతో జీతం ఆలస్యమయ్యిందని ఈవో చెప్పుకొచ్చారు. కమిషనర్ కార్యాలయం నుంచి రావాలని, రెండు రోజుల్లో జీతం వస్తుందన్నారు. వెంకటేష్ దాదాపు రూ.20 లక్షలు అప్పులు చేసాడు అప్పుల బాధతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఈవో వెల్లడించారు.
*ఆటో వాహనాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో సీఐ ఆంజనేయులు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన మేకల మోహన్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడి వద్ద రూ.12 లక్షల విలువైన ఆరు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. తణుకు పరిసర ప్రాంతాల్లో ఆటోలను చోరీ చేసి తెలంగాణ రాష్ట్రంలో విక్రయిస్తున్నట్లు సీఐ వెల్లడించారు. రూరల్ ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు మోహన్‌కు సహకరించిన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు.
*డాక్టర్‌గా చలామణి అవుతున్న నకిలీ వైద్యుడి ని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రష్యా యూనివర్సిటీ నకిలీ ఎంబీబీఎస్స ర్టిఫికేట్‌తో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఎండి ఫిజీషియన్‌గా పని చేస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఫేక్ డాక్టర్‌తో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. నకిలీ ఎంబీబీఎస్ డాక్టర్ సర్టిఫికెట్‌తో పాటు, స్టాంపులు, కారు, బైక్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది
*శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుల్లో ఇద్దరిపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. దీంతో వారివద్ద 3.4 కిలోల బంగారాన్ని అక్రమ తరలిస్తున్నారని గుర్తించారు. దాని విలువ రూ.1.87 కోట్లు ఉంటుందని చెప్పారు. మలద్వారంతోపాటు లోదుస్తుల్లో బంగారం దాటి తరలిస్తున్నారని వెల్లడించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామన్నారు.
*ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు, ఇప్పటి వరకు 14 వేల మంకీపాక్స్ కేసులు నమోదు, 70 దేశాలకు పాకిన మంకీపాల్స్ కేసులు, ఆఫ్రికాలో మంకీపాక్స్‌తో ఐదుగురు మృతిభారత్‌లో కొత్తగా 21,180 కరోనా పాజిటివ్ కేసులు నమోదుమరో 60 మంది కరోనా బాధితులు మృతి
*లోన్ యాప్ (Loan App) నిర్వాహకులపై ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. వారి ఆగడాలు మాత్రం ఆగడంలేదు. ప్రతి రోజూ ఎవరో ఒకరు లోన్ యాప్ బారిన పడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా, బయ్యారానికి చెందిన శ్యామ్ సుందర్ అనే యువకుడు బలయ్యాడు. అత్యవసరంగా డబ్బులు అవసరం కావడంతో హ్యాండీ లోన్ యాప్ ద్వారా రూ. 3,500 రుణం తీసుకున్నాడు. స్పాట్‌లోనే రూ. 1224 వడ్డీ కింద కట్ చేసుకున్నారు. మిగతా సొమ్ము శ్యామ్ సుందర్‌కు ఇచ్చారు. వారం రోజుల తర్వాత బాధితుడు రూ. 3,500 చెల్లించాడు. అయినా లోన్ యాప్ నిర్వాహకులు లోన్ సొమ్ము కట్టాలంటూ వేధింపులకు గురిచేశారు. మళ్లీ కట్టకపోవడంతో శ్యామ్ సుందర్ ఫోటోలను మార్పింగ్ చేసి న్యూడ్‌గా మార్చి అతని బంధువులు, స్నేహితులకు పంపి వేధించారు. ఈ క్రమంలో బాధితుడు సెల్ఫీ వీడియోలో తన బాధను వ్యక్తం చేశాడు. లోన్ యాప్‌ల జోలికి ఎవరూ పోవద్దని, వాళ్లు అందరినీ మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. లోన్ యాప్ మోసాలపై వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
* అన్నమయ్య జిల్లా పీలేరు మండలం మేళ్లచెరువు గ్రామం చీపాటి వారి పల్లె వద్ద.. అక్రమంగా తరలిస్తున్న రూ.20 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీల సమయంలో కార్లలో తరలిస్తున్న దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. తమిళనాడుకి చెందిన 16 మంది కూలీలతో పాటు అయ్యప్ప అనే స్మగ్లర్ ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
* ఒంగోలు హైవే పక్కన నిలిపి ఉన్న లగేజీ ఆటోలో రూ.2.70 లక్షలు నగదు, సెల్‌ఫోన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు డ్రైవర్ ఒంగోలు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన ఒంగోలు సమీపంలోని మూక్తినూతలపాడు వెళ్లే అడ్డరోడ్డు వద్ద బుధవారం రాత్రి రెండు గంటల సమయంలో జరిగింది. నెల్లూరు జి ల్లా గుడ్లూరు మండలం పురేటిపల్లికి చెందిన బత్తుల అనీల్‌కుమార్ ఏపీ 39 Oaa 1073 నంబరు గల ఆటోలో తన గ్రామానికి చెందిన రైతుల పత్తిని గుంటూ రు తీసుకెళ్లాడు. అక్కడ 30 కింట్వాళ్ల పత్తిని విక్రయించగా రూ.2.70 నగదు వచ్చింది. ఆ మొత్తాన్ని ఆటోలోని డ్యాష్ బోర్డులో ఉంచి, అక్కడే సెల్‌ఫోన్ పెట్టి రాత్రి 1.30 సమ యంలో రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపివేసి నిద్రపోయాడు. అయితే 2 గంటల సమ యంలో నిద్రలేచి చూసే సరికి నగదు, సెల్‌ఫోన్ కనిపించలేదు. దీంతో వెంటనే తాలు కా పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*దంపతుల హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిదర్‌రెడ్డి గురువారం తీర్పు చెప్పారు. నారాయణఖేడ్ మండలం సత్యగామ గ్రామానికి చెందిన భార్యాభర్తలు బాయిని అంబయ్య, బాయిని సుశీలను 2016 ఆగస్టు 13వ తేదీన అదే గ్రామానికి చెందిన ఉబిడి సురేష్(27) అతి దారుణంగా హత్య చేసి, వారి ఒంటిపై ఉన్న నగలను ఎత్తుకెళ్లాడు. నారాయణఖేడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం నేరం రుజువు కావడంతో సురే్‌షకు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.వెయ్యఇ జరిమానా విధిస్తూ సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిదర్‌రెడ్డి గురువారం తీర్పుచెప్పారు.
* పేకాట స్థావరాలపై గురువా రం దాడులు చేసి పది మందిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. పేకాట ఆడుతున్నారన్ని విశ్వసనీయ సమాచారం మేరకు మిర్యాలగూడ మండల పరిధిలోని సుబ్బారెడ్డిగూడెం సమీపంలో రూరల్ ఎస్‌ఐ నర్సింహులు ఆధ్వర్యంలో దాడి చేశారు. పేకా ట ఆడుతున్న ఎండీ.ఇస్మాయిల్, శ్రీకాంత, మేడారం అంజి, అజయ్‌కుమార్ పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి నగదు రూ.30,100 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చండూరు మునిసిపాలిటీ పట్టణ పరిధిలోని అంగడిపేట శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నవీనకుమార్ తెలిపారు. నిందితుల నుంచి రూ.2030లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
*దంపతుల హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిదర్‌రెడ్డి గురువారం తీర్పు చెప్పారు. నారాయణఖేడ్ మండలం సత్యగామ గ్రామానికి చెందిన భార్యాభర్తలు బాయిని అంబయ్య, బాయిని సుశీలను 2016 ఆగస్టు 13వ తేదీన అదే గ్రామానికి చెందిన ఉబిడి సురేష్(27) అతి దారుణంగా హత్య చేసి, వారి ఒంటిపై ఉన్న నగలను ఎత్తుకెళ్లాడు. నారాయణఖేడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం నేరం రుజువు కావడంతో సురే్‌షకు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.వెయ్యఇ జరిమానా విధిస్తూ సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిదర్‌రెడ్డి గురువారం తీర్పుచెప్పారు.
*మద్యం అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ప్ర స్ఫుటం కావడంతో ఎస్పీ మలికగర్గ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 19న మద్ది రాలపాడు మద్యం దుకాణం నుంచి ఒంగోలు తాలుకా పోలీస్‌స్టేషన్‌లో పనిచే స్తున్న కానిస్టేబుల్ కె.రాంబాబు అక్రమంగా మద్యం రవాణా చేస్తు ఎస్‌ఈబీ అ ధికారులకు పట్టుబడ్డాడు. ఈ విషయం ఆంధ్రజ్యోతిలో ప్రచరితం కావడంతో పా టుగా పోలీసు ఉన్నతాధికారులకు తెలిసింది. దీంతో మద్యం అక్రమ రవాణాలో కానిస్టేబుల్ ఉండటాన్ని తీవ్రంగా పరిగణించి ఎస్పీ, వెంటనే కానిస్టేబుల్ కె.రాం బాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
*పేకాట స్థావరాలపై గురువా రం దాడులు చేసి పది మందిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. పేకాట ఆడుతున్నారన్ని విశ్వసనీయ సమాచారం మేరకు మిర్యాలగూడ మండల పరిధిలోని సుబ్బారెడ్డిగూడెం సమీపంలో రూరల్ ఎస్‌ఐ నర్సింహులు ఆధ్వర్యంలో దాడి చేశారు. పేకా ట ఆడుతున్న ఎండీ.ఇస్మాయిల్, శ్రీకాంత, మేడారం అంజి, అజయ్‌కుమార్ పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి నగదు రూ.30,100 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. చండూరు మునిసిపాలిటీ పట్టణ పరిధిలోని అంగడిపేట శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నవీనకుమార్ తెలిపారు. నిందితుల నుంచి రూ.2030లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
*భర్తను కోల్పోయిన తనను అత్త ఆదరించడం లేదని, ఆమె ఆదరించి ఇంట్లోకి ప్రవేశం కల్పించే వరకు కదిలేది లేదంటూ ఓ కోడలు అత్తగారింటి ముందు గురువారం బైఠాయించింది. పీలేరు పట్టణం పాలాలవారివీధికి చెందిన కుమార్ ఆచారి, సరళ దంపతుల కుమారుడైన హరిప్రసాద్ ఆచారికి హైదరాబాదులోని కవాడిగూడకు చెందిన స్వర్ణతో 13 ఏళ్ల క్రితం పెద్దలు వివాహం జరిపించారు. వారికి పల్లవి (12), సంతోశ్ (10) ఇద్దరు పిల్లలు. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ హరిప్రసాద్ ఏడాదిన్నర క్రితం మరణించాడు. అంతకుమునుపే అతడి తండ్రి కుమార్ ఆచారి కూడా అనారోగ్యంతో చనిపోయాడు. ఈ నేపథ్యంలో భర్త చనిపోయిన తరువాత కొంతకాలం స్వర్ణ తన పిల్లలతో అత్త సరళ వద్ద ఉండేది. ఈ క్రమంలో వారి మధ్య మనస్పర్థలు ఏర్పడి అవి పెద్దవి కావడంతో పీలేరు పోలీసులకు ఫిర్యాదు చేసింది స్వర్ణ. కొంత కాలంపాటు ఇద్దరూ దూరంగా ఉంటే మంచిదన్న పోలీసుల సూచనతో రెండు నెలల క్రితం పిల్లలను అత్త వద్ద వదిలి తన పుట్టింటికి వెళ్లిన స్వర్ణ గురువారం అత్త ఇంటికి వచ్చింది.అయితే స్వర్ణను ఆమె అత్త ఇంట్లోకి అనుమతించకపోవడంతో ఆమె ఇంటి ముందు బైఠాయించింది. తనను, తన పిల్లలను వేరు చేయాలని చూస్తోందని, పేద కుటుంబానికి చెందిన తాను పిల్లలు లేకుండా ఎలా బతకాలని, చావైనా, బతుకైనా అత్తగారింటిలోనే తేల్చుకుంటానంటూ భీష్మించుకు కూర్చుంది. అయితే ఆమె అత్త మాత్రం తాను పిల్లలను ఇవ్వనని, పుట్టింటికి వెళ్లి బతుక్కోవాలని తెగేసి చెప్పడంతో చేసేదిలేక ఆమె మరోమారు పోలీసులను ఆశ్రయించింది. పీలేరులో పెద్దఎత్తున ఎర్రచందనం స్మగ్లర్లు దొరకడంతో వారిని జిల్లా ఎస్పీ ముందు ప్రవేశపెట్టేందుకు సీఐ, ఎస్‌ఐ రాయచోటికి వెళ్లడంతో శుక్రవారం వరకు వేచి చూడాలని స్టేషన్ సిబ్బంది తెలపడంతో స్వర్ణ వారి కోసం వేచి చూస్తోంది.
*విశాఖలో ప్రొఫెసర్ మురళి దారుణ హత్య గురయ్యాడు. మారికవలసలోని రైల్వే బ్రిడ్జి దగ్గర ప్రొ.మురళి మృతదేహం లభ్యమైంది. పది రోజుల క్రితమే మురళి హత్యకు గురైనట్లు పోలీసులు పేర్కొన్నారు. మురళి ఆఫ్రికాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న ఆఫ్రికా నుంచి విశాఖకు వచ్చిన మురళిని.. భార్య మృదుల తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. హత్య తర్వాత తన భర్త అదృశ్యమైనట్టు సీఎంపాలెం పీఎస్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. మృదులపై అనుమానంతో పోలీసులు ప్రశ్నించగా… తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. మృదుల ప్రియుడు శంకర్‌ను అరెస్ట్ పోలీసులు చేశారు.
*కర్నాటకలోని ఉడుపి జిల్లాలో ఘోర అంబులెన్స్ ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం కుందాపూర్ తాలూకా ప్రాంతంలోని టోల్ ప్లాజా వద్ద వేగంగా దూసుకొచ్చిన అంబులెన్స్.. టోల్ కౌంటర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లోని వారితో పాటుగా టోల్ సిబ్బంది కూడా గాయపడ్డారు. ఈ అంబులెన్స్ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద దృశ్యాలు ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి.
*వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని కోర్టు ఆదేశాలిచ్చింది. పీవోపీ విగ్రహాలు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే నీటి గుంటల్లోనే నిమజ్జనం చేయాలని సూచించింది. పీవోపీ విగ్రహాల నిషేధంపై గతంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలు జారీ చేసింది. పీసీబీ (PCB) మార్గదర్శకాలను సవాల్ చేస్తూ విగ్రహ తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. పీవోపీ విగ్రహాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి జీవో ఇవ్వలేదని హైకోర్టు పేర్కొంది. పీవోపీ విగ్రహాల నిషేధంపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం తెలిపింది. విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
*క్యాప్యూల్స్‌లో నింపిన హెరాయిన్‌ను కడుపులోకి మింగి సినీ ఫక్కీలో స్మగ్లింగ్ చేస్తున్న టాంజానియా వాసిని చెన్నై కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అతని కడుపులో క్యాప్సూల్స్ రూపంలో ఉన్న 1.266 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.9 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. టాంజానియాకు చెందిన వ్యక్తి ఈ నెల 14న ఉగాండాలోని ఎంతెబె నుంచి ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌లో చెన్నై విమానాశ్రయానికి వచ్చాడు. కస్టమ్స్ విభాగానికి చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆ వ్యక్తిని తనిఖీ చేయగా.. కడుపులో హెరాయిన్ క్యాప్సూల్స్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 1.266 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
*రాజమండ్రిలో వెండిని కొనుగోలు చేసి భీమవరం వస్తున్న తండ్రీ కొడుకులను ఇరువురు వ్యక్తులు అడ్డుకుని తాము పోలీసులమని చెప్పి 16 కేజీల వెండిని కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి ఉండి ఎస్‌ఐ గంగాధరరావు గురువారం అందించిన వివరాలు ఇలా వున్నాయి. భీమవరానికి చెందిన వెండి వస్తువులను తయారు చేసే వ్యాపారులైన తండ్రీ, కొడుకులు రామలింగేశ్వరరావు, యశ్వంత్‌లు ఈనెల 16న రాజమండ్రి వెళ్లి 16 కేజీల వెండిని కొనుగోలు చేసుకుని మోటార్‌సైకిల్‌పై వస్తున్నారు. ఉండి మండలం సాగపాడు వచ్చేసరికి ఇరువురు వ్యక్తులు తాము తాడేపల్లిగుడెం పోలీసులమని చెప్పి వారి వద్ద వున్న వెండికి, కొనుగోలు చేసిన వస్తువులకు రసీదులు సరిగా లేవంటూ భయపెట్టారు. వారి నుంచి వెండి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషనకు రమ్మని చెప్పి ముందుగా వెళ్తూ మార్గ మధ్యంలో కనిపించకుండా పోయారు. తండ్రీ కొడుకులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వారి కోసం నిరీక్షించి పోలీసులకు విషయం వివరించారు. దాంతో ఉలిక్కిపడిన పోలీసులు ఇక్కడ నుంచి తమ వారు ఎవరు రాలేదని వాళ్లెవరో మిమ్మల్ని మోసం చేశారని వివరించారు. దీంతో వారు ఉండి పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
*బంగారు నాణేలు అని నమ్మించి అమాయకులను మోసం చేస్తున్న మూఠా సభ్యులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ కిరణ్ కుమార్‌రెడ్డి తెలిపిన మేరకు… అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం 75 వీరాపురం గ్రామానికి చెందిన ఎరికల శ్రీనివాస్ అలియాస్ రమేష్, ఎరికల బాలు, శెట్టూరు మండలం లింగదిడ్లపల్లికి చెందిన ఎరుకల శివశంకర్, కరిడిపల్లికి చెందిన ఎరికల గుజ్జల రామచంద్ర, గార్లదిన్నె మండలం కమలాపురం గ్రామానికి చెందిన నల్లబోతుల నాగేష్ అనే ఐదుగురు ఓ ముఠాగా సులువుగా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తు న్నారు. అందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ పలువురి విజిటింగ్ కార్డులు సేకరిస్తారు. అందులో ఉన్న ఫోన నెంబర్లకు ఫోన చేసి మీరు మాకు బాగా తెలుసు అంటూ మాటలు కలుపుతారు. తరువాత మా వద్ద బంగారు నాణేలు ఉన్నాయి తక్కువ ధరకే ఇస్తామని ఆశ చూపి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. 2021 సంవత్సరంలో విజయనగరానికి చెందిన జేసీబీ డ్రైవర్ సూర్యనారాయణకు ఫోన చేసి 3 కేజీలు బంగారు నాణేలు ఉన్నాయని, గార్లదిన్నె మండలం కల్లూరుకు రావాలన్నారు. కల్లూరు రైల్వే స్టేషన సమీపంలో సూర్యనారాయణ నుంచి సుమారు రూ.16 లక్షలు తీసుకుని నకిలీ బంగారు నాణేలు ఇచ్చారు. ఇంటికెళ్లి చూడగా అవి నకిలీవని తేలడంతో మోపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నకిలీ బంగారు నాణేల ముఠా సభ్యులు గుత్తికి వెళుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌రెడ్డి తలగాసిపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేయగా ముఠా సభ్యులు పట్టుబడ్డారు. వారిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు.
*సైబర్ నేరగాడు జీవన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని దుంగల్ పూర్ వద్ద జీవన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అతని వద్ద నుంచి రెండు సెల్ ఫోన్స్, రూ.1.80లక్షల నగదును స్వాధీనం చేశారు. గత సవత్సరం డిసెంబర్‌లో చిల్లకల్లు పోలీస్ ష్టేషన్‌లో జీవన్‌పై సైబర్ కేసు నమోదు అయ్యింది. అల్ట్రాటెక్ సిమెంట్‌లో పనిచేస్తున్న సంజయ్ మహేశ్వరి వద్ద నుండి ఓటీపీ ద్వారా రూ.2.40లక్షల నగదును సైబర్ నేరగాడు విత్ డ్రా చేసినట్లు నందిగామ ఏసీపీ నాగేశ్వరరెడ్డి ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు.
* ఆటో వాహనాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో సీఐ ఆంజనేయులు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన మేకల మోహన్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడి వద్ద రూ.12 లక్షల విలువైన ఆరు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. తణుకు పరిసర ప్రాంతాల్లో ఆటోలను చోరీ చేసి తెలంగాణ రాష్ట్రంలో విక్రయిస్తున్నట్లు సీఐ వెల్లడించారు. రూరల్ ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు మోహన్‌కు సహకరించిన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు.