68వ జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ప్రకటించింది. ఈ ఏడాది ఐదు కేటగిరిల్లో అవార్డులను విభజించారు. జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ చిత్రంగా సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ‘కలర్‌ఫొటో’ ఎంపికైంది. మరో చిత్రం ‘నాట్యం’ ఉత్తమ కొరియోగ్రఫీ కేటగిరీలో, ఉత్తమ సంగీత చిత్రంగా ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు జాతీయ పురస్కారాలు దక్కాయి. 30 భాషల్లో 305 ఫీచర్ చిత్రాలు ఎంట్రీకి వచ్చాయి. నాన్ ఫీచర్‌లో 148 చిత్రాలు స్ర్కీనింగ్ వచ్చినట్లు జ్యూరీ సభ్యులు తెలిపారు.
తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రం: `కలర్ ఫొటో`
బెస్ట్ కొరియోగ్రఫీ: `నాట్యం`
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: తమన్ (అల వైకుంఠపురములో)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్: `నాట్యం`
ఉత్తమ నటుడు: సూర్య (ఆకాశం నీహద్దురా), అక్షయ్ కుమార్ (తానాజీ)
ఉత్తమ వినోదాత్మక చిత్రం: తానాజీ (హిందీ)
ఉత్తమ చిత్రం: ఆకాశం నీ హద్దురా (తమిళం)