NRI-NRT

చికాగోలో అజాదీ కా అమృత మహోత్సవాలలో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శన

చికాగోలో అజాదీ కా అమృత మహోత్సవాలలో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శన

కాన్సలేట్ జనరల్ ఆఫ్ ఇండియా,చికాగో వారు అజాదీ కా అమృత మహోత్సవాలలో భాగంగా చికాగో నగరంలో ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు సభికులను మంత్రముగ్దులను చేశాయి.భారత ప్రభుత్వం జాతీయ స్దాయిలో పోటీలు నిర్వహించి36 కళారూపాలను ఎంపిక చేయగా కూచిపూడి నృత్య విభాగంలో ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎంపికైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన శివశ్రీ నృత్య కళానికేతన్ బృందాన్ని భారత ప్రభుత్వం అమెరికాకు పంపింది.గురు డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ ప్రతిభను చాటేలా నృత్య ప్రదర్శనలు సభికుల ప్రశంసలు పొందాయి.ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మాజీ ఉపసభాపతి శ్రీమండలి బుద్ద ప్రసాద్ గురు రఘుపాత్రుని శ్రీకాంత్ ని సత్కరించారు.భారతీయ కళారూపాలలో కూచిపూడి నృత్యం ప్రపంచ ప్రఖ్యాతి సాధించడం గర్వదాయకమని,కూచిపూడి తెలుగు జాతికి జీవనాడి వంటిదని శ్రీ బుద్ద ప్రసాద్ అన్నారు.శ్రీకాకుళంజిల్లాలో పేదకుటంబాలనుంచి వచ్చిన పిల్లలకు నృత్య శిక్షణ యిచ్చి భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన గురు శ్రీకాంత్ ని అభినందించారు.ఈ కార్యక్రమంలో కాన్సలేట్ శ్రీవినోద్ గౌతమ్,ఇండియా హబ్ నిర్వాహకులు శ్రీవినోజ్ చనుమోలు,డాక్టర్ శ్రీరామ్ శొంఠి,శ్రీమతి అపర్ణ అయ్యలరాజు ప్రభృతులు ప్రసంగించారు.

Whats-App-Image-2022-07-23-at-4-50-51-AM-2
Whats-App-Image-2022-07-23-at-4-50-51-AM-1
Whats-App-Image-2022-07-23-at-4-50-51-AM
చికాగోలో అజాదీ కా అమృత మహోత్సవాలలో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శన
Whats-App-Image-2022-07-23-at-4-50-40-AM
Whats-App-Image-2022-07-23-at-4-50-39-AM