DailyDose

‘కోర్టు ఆంక్షలు ఆంధ్రాకేనా? ఒరిస్సాకు వర్తించవా?’ – TNI తాజా వార్తలు

‘కోర్టు ఆంక్షలు ఆంధ్రాకేనా? ఒరిస్సాకు వర్తించవా?’  – TNI  తాజా వార్తలు

* కొఠియాలో మరోసారి ఆంధ్రా – ఒరిస్సా సరిహద్దు సమస్య చెలరేగుతుందని మాజీ ఎమ్మెల్సీ సంధ్యారాణి అన్నారు. వైసీపీ ప్రభుత్వ మెతక వైఖరిపై టీడీపీ మండిపడింది. కోర్టు ఆంక్షలు ఆంధ్రాకేనా? ఒరిస్సాకు వర్తించవా? అని ఆమె ప్రశ్నించారు. మన ఆస్తులు ద్వంసం చేసినా.. అధికారులు దూకుడు పెంచరా? అని కూడా ప్రశ్నించారు. ఒరిస్సా ముఖ్యమంత్రితో జగన్ చర్చల ఫలితం నీరుగారినట్టేనా? అని ప్రశ్నించారు. మన ఖనిజ సంపదను దోచేయడానికి ఒరిస్సా దూకుడు పెంచిందన్నారు.

* మైహోమ్ సిమెంట్ పరిశ్రమ యూనిట్-4 విస్తరణ పనులు చేపట్టారు. సర్వేనెంబర్ 1057లోని 113 ఎకరాల భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాలను తహశీల్దార్, గ్రామపంచాయతీ అధికారులు నిలిపివేశారు. రెండోసారి మైహోమ్ ఇండస్ట్రీస్ కంపెనీకి ఆదేశాలు జారీ చేశారు. అధికారుల ఆదేశాలపై మైహోమ్ యాజమాన్యం 2 రోజుల సమయం కోరింది. ప్రస్తుతం నిర్మాణ పనులను అధికారులు అడ్డుకున్నారు. వారంలో అనుమతులు తీసుకోకపోతే అక్రమకట్టడాల కూల్చివేత చేపడతామని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.

*కొఠియాలో మరోసారి ఆంధ్రా – ఒరిస్సా సరిహద్దు సమస్య చెలరేగుతుందని మాజీ ఎమ్మెల్సీ సంధ్యారాణి అన్నారు. వైసీపీ ప్రభుత్వ మెతక వైఖరిపై టీడీపీ మండిపడింది. కోర్టు ఆంక్షలు ఆంధ్రాకేనా? ఒరిస్సాకు వర్తించవా? అని ఆమె ప్రశ్నించారు. మన ఆస్తులు ద్వంసం చేసినా.. అధికారులు దూకుడు పెంచరా? అని కూడా ప్రశ్నించారు. ఒరిస్సా ముఖ్యమంత్రితో జగన్ చర్చల ఫలితం నీరుగారినట్టేనా? అని ప్రశ్నించారు. మన ఖనిజ సంపదను దోచేయడానికి ఒరిస్సా దూకుడు పెంచిందన్నారు.

*ఏపీలో పలువురు సీసీఎస్ ఆఫీసర్లను బదిలీలు చేశారు. రవిశంకర్ నారాయణ్‌ను డీసీఏడీ జనరల్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఏపీ స్టేట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్‌గా ఐఆర్‌ఎస్‌ సీహెచ్ రాజేశ్వరరెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

*గుంటూరు: నగర తూర్పు నియోజకవర్గం వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. నెహ్రూ‌నగర్‌లో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభంలో ఎమ్మెల్యే అసహానం వ్యక్తం చేశారు. నగర డిప్యూటీ మేయర్ పట్ల ఎమ్మెల్యే అగౌరవంగా ప్రవర్తంచినట్లు తెలిసింది. తనకు పోటీగా వస్తున్నావని డిప్యూటీ మేయర్ సజీలాపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. తనను కాదని ముందుకు ఎలా వస్తావని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కాదని నియోజకవర్గంలో ఏం చేయాలేవని హెచ్చరించారు. ఎమ్మెల్యే ముస్తఫా తీరుతో అధికారులు , ప్రజా ప్రతినిధులు విస్తుపోయారు. అలాగే ఎమ్మెల్యే తీరు పట్ల డిప్యూటీ మేయర్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.

*రాజోలులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ముంపు ప్రాంతాల పర్యటనలో పిక్ పాకెటర్స్ చేతివాటం చూపారు. సోంపల్లిలో మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు పర్సును కేటుగాళ్లు కొట్టేశారు. రూ.35 వేలు నగదు, రెండు ఏటీఎం కార్డులతో పర్సును అపహరించారు. అలాగే మరో ఇరవై మంది వరకు పర్సులు పోగొట్టుకున్నట్లు సమాచారం. పర్సు అపహరణపై మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

* రాజోలులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ముంపు ప్రాంతాల పర్యటనలో పిక్ పాకెటర్స్ చేతివాటం చూపారు. సోంపల్లిలో మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు పర్సును కేటుగాళ్లు కొట్టేశారు. రూ.35 వేలు నగదు, రెండు ఏటీఎం కార్డులతో పర్సును అపహరించారు. అలాగే మరో ఇరవై మంది వరకు పర్సులు పోగొట్టుకున్నట్లు సమాచారం. పర్సు అపహరణపై మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

*శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది.శ్రీశైలం ప్రాజెక్ట్‎కు ఇన్‌ఫ్లో 81,553 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 57,751 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 882.50 అడుగులుగా కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 202.04 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.

*ఏపీలో ఆగస్టు 2 నుంచి బీజేవైఎం సంఘర్షణ యాత్ర చేపట్టనున్నట్లు బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. జగన్‌ సర్కార్ తప్పిదాలపై ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు. మహిళలకు రక్షణ లేదన్నారు. అలాగే దిశ చట్టానికి పదును లేదని ఆయన మండిపడ్డారు. అత్యధిక అప్పులు చేసిన అప్పుల అప్పారావు జగన్ అని ఆదినారాయణరెడ్డి విమర్శించారు. మూడేళ్లలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చలేదన్నారు. దోపిడీ, అవకతవకలు, దాడులకు వ్యతిరేకంగా బీజేపీ యాత్ర ఉంటుందని తెలిపారు.

*కర్నూలు: జిల్లాలోని ఆస్పరి మండలం కైరుప్పలలో మంత్రి జయరాంకు నిరసన సెగ తగిలింది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి జయరాంను ఖాళీ బిందెలతో మహిళలు అడ్డుకున్నారు. సహనం కోల్పోయిన మంత్రి మహిళ చేతిలోని బిందె లాక్కున్నారు. టీడీపీ, వామపక్షాలు అడిగితే పనులు చేయనని మంత్రి జయరాం పేర్కొన్నారు. మంత్రి జయరాం వ్యాఖ్యలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

*రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. శుక్రవారం 1,562 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 1244, బెంగళూరు గ్రామీణ )లో 45, ధారవాడలో 38, మైసూరులో 34, దక్షిణకన్నడలో 28, బెళగావిలో 27, బళ్లారిలో 27, తుమకూరు ఉడుపిలో 14 చొప్పున ఇతర జిల్లాల్లో అంతకులోపు నమోదయ్యాయి. 1107 మంది కోలుకోగా గడిచిన 24 గంటల్లో ఎవరూ మృతి చెందలేదు. 8,488 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులోనే 7,355 మంది ఉన్నారు.

*గాయని శ్రావణి భార్గవి తీరుపై తిరుపతి వాసులు మండ్డిపడ్డారు. ‘‘ఒకపరి కోకపరి వయ్యారిమై’’ కీర్తనను అశ్లీలంగా ప్రదర్శించడాన్ని పుణ్యక్షేత్రవాసులు తప్పుబట్టారు. శ్రావణి భార్గవి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి వాసులు మాట్లాడుతూ… తిరుపతిలో పుట్టడం అదృష్టంగా భావిస్తారన్నారు. స్వామి వారిని కీర్తిస్తూ అన్నమయ్య భక్తితో ఆలపించిన సంకీర్తనలను వింటూ ప్రపంచం మొత్తం భక్తి భావంతో పరవశిస్తోందని తెలిపారు. ‘‘ఒకపరి ఒకపరి వయ్యారమై’’ సంకీర్తనను గాయాని శ్రావణి భార్గవి తనకోసం చిత్రించకరించిన తీరు అభ్యంతరంగా ఉందన్నారు. ఒక సెలబ్రేట్ అనే గర్వంతో అన్నమయ్య కుటుంబంతో మాట్లాడారని తెలిపారు.

*వొడాఫోన్ ఐడియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షయ మూంద్రా సీఈఓగా నియమితులయ్యారు. రవీందర్ టక్కర్ నుంచి మూంద్రా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మూడేళ్ల పదవీకాలం ఆగస్టు 18తో ముగియనుంది. ఈ క్రమంలోనే మూంద్రా నియామకానికి టెలికాం కంపెనీ బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపింది.మూంద్రా స్థానంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ని కంపెనీ ఇంకా నియమించలేదు. టక్కర్.. ఎండీ, సీఈఓ పదవీకాలం ముగిసిన తర్వాత బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కొనసాగుతారు. జాయింట్ వెంచర్ కంపెనీ అయిన వొడాఫోన్ ఐడియా ప్రస్తుతం పెట్టుబడిదారుల కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ. 25,000 కోట్లు రాబట్టుకోవాలని చూస్తున్నట్లు టక్కర్ గతంలోనే వెల్లడించారు

*ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు దర్శించుకున్నారు. శనివారం ఉదయం కాలినడకన వచ్చి దుర్గమ్మ సేవలో తరించారు. దర్శనానంతరం టీడీపీ నేత మీడియాతో మాట్లాడుతూ.. ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని.. పడవ ప్రమాదంలో గోదారమ్మ తల్లి పునర్జన్మ ఇచ్చిందని తెలిపారు. అందరి దేవుళ్ళ ఆశీస్సులు, శ్రీ కనకదుర్గమ్మ, గోదావరి తల్లి ఆశీర్వాదంతో మళ్లీ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందని దేవినేని ఉమా చెప్పుకొచ్చారు.

*మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి సమాధి వద్ద నిర్మించనున్న స్మారకమందిరం వెనుకవైపు సముద్రంలో 42 మీటర్లు (134 అడుగులు) ఎత్తులో కలం ఆకారంలో ఓ స్మారక స్తూపాన్ని నిర్మించనున్నారు. ఈ స్థూపాన్ని నిర్మించడానికి రాష్ట్ర సముద్రతీర నియంత్రణా మండలి అనుమతులు మంజూరు చేసింది. మెరీనా తీరంలో 2.21 ఎకరాల విస్తీర్ణంలో రూ.39 కోట్లతో కరుణానిధి సమాధివద్ద స్మారక మండపం నిర్మంచనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌ గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. కరుణానిధి సినీ, రాజకీయ, జీవిత విశేషాలను సందర్శకులకు తెలిసేలా ఈ స్మారక మందిరంలో పలు నిర్మాణాలు చోటుచేసుకోనున్నాయి. డీఎంకే చిహ్నమైన ‘ఉదయించే సూర్యుడు’ ఆకారంలో నిర్మించనున్న ఈ స్మారక మందిరం వెనుకవైపు సముద్ర మట్టం నుంచి 42 మీటర్ల ఎత్తున కలం ఆకారంలో స్మారక స్తూపం నిర్మించేందుకు అనుమతులు లభించాయి. రూ.81 కోట్లతో రూపొందనున్న ఈ స్మారక స్థూపానికి కరుణ సమాధికి మద్య సందర్శకులు వెళ్లేలా ప్రత్యేక వంతెన కూడా నిర్మించనున్నారు. కన్నియాకుమారిలోని తిరువళ్లువర్‌ విగ్రహం కంటే ఈ కలం ఆకార స్మారక స్తూపం మరింత ఎత్తుంటుంది.. ప్రస్తుతం ఈ స్మారక స్తూపం నిర్మాణ పథకాన్ని కేంద్రప్రభుత్వ అనుమతి కోసం పంపినట్లు అధికారులు తెలిపారు.

*ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారనంగా మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆరు గేట్లు ఒక అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో : 7,612.52 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో : 3,600 .18 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా… ప్రస్తుత సామర్థ్యం 641.25 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను… ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 3.33 టీఎంసీలకు చేరింది.

*శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో శనివారం ఉదయం 11.30 ప్రాంతంలో మూడు గేట్లు ఎత్తివేయడం ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు.శ్రీశైలం జలాశయం గరిష్ట స్థాయికి చేరడంతో మూడు గేట్లను ఎత్తివేసి వరద నీటిన దిగువకు విడుదల చేశారు. ఏపీ జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

* ఆజాది కా అమృత మహోత్సవాలను పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు 9 నుంచి 18 వరకు నాలుగు రెవెన్యూ డివిజన్లలోనూ రథయాత్రలను చేపట్టనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌ ఈ మేరకు నగరంలో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రథయాత్ర ల ముగింపు కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ఆహ్వానించాలని నిర్ణయించామన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు కావస్తున్న శుభసందర్భంగా ప్రజల్లో జాగృతిని, దేశభక్తిని పెంపొందించేందుకే ఈ రథయాత్రలను తలపెట్టామని ఆయన పేర్కొన్నారు. పంద్రాగస్టు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో కోటి ఇళ్లపై జాతీయ పతాకం రెపరెపలాడేలా చూస్తామన్నారు. బీదర్‌ జిల్లాలోని గుర్టా నుంచి బయల్దేరే రథానికి రాజావెంకటప్పనాయక అని పేరు పెట్టామన్నారు. ఈ రథం కల్యాణ కర్ణాటక లోని అన్ని ప్రముఖ పట్టణాల మీదుగా సాగుతుందన్నారు. ధార్వాడ జిల్లాలోని కిత్తూరు నుంచి బయల్దేరే రథానికి రాణి కిత్తూరుచెన్నమ్మ రథం అని నామకరణం చేశామన్నారు. చిత్రదుర్గ నుంచి బయల్దేరే రథానికి ఒనకే ఓబవ్వ రథయాత్రగానూ, దక్షిణ కన్నడ నుంచి బయల్దేరే రథానికి రాణి అబ్బక్క రథం అని నామకరణం చేశామన్నారు. ఈ నాలుగు రథాలు తమ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని జిల్లాలు, ముఖ్యమైన నగరాలు పట్టణాల మీదుగా ప్రయాణించి బెంగళూరుకు చేరుకుంటాయన్నారు.

* భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ శాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరైనారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టుల నీటిమట్టాలపై అధికారులతో కేసీఆర్‌ సమీక్ష చేశారు. తెలంగాణ లో పలు జిల్లాల్లో ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే 18 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్‌ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దవుతోంది.

*బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండిసంజయ్మూ డో విడత పాదయాత్ర పై బీజేపీ ముఖ్యనేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు, రూట్ మ్యాప్‌పై చర్చించారు. ఆగస్ట్ 2 నుంచి మూడోవిడత పాదయాత్ర ఉంటుందని పార్టీలోని ముఖ్యనేతలు తెలిపారు. యాదగిరిగుట్ట నుంచి వరంగల్ భద్రకాళి దేవస్థానం వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది.ఆగస్ట్ 2వ తేదీన యాదగిరిగుట్టలో బహిరంగ సభకు బీజేపీ అధిష్ఠానం ప్లాన్ చేస్తోంది. బహిరంగ సభకు జాతీయ స్థాయిలోని ముఖ్యనేతలను పిలవాలని నిర్ణయం తీసుకుంది.పాదయాత్ర ఏర్పాట్లు, రూట్ మ్యాప్‌పై ఢిల్లీ నుంచి వర్చువల్‌గా బీజేపీ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్( , కరీంనగర్ నుంచి బండిసంజయ్ పాల్గొన్నారు.

*పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గట్టుప్పల్‌ )ని మండలంగా ప్రకటించాలని కొన్నేళ్లుగా ప్రజలు, నాయకులు ధర్నాలు చేస్తున్నారు. మండలంగా ప్రకటిస్తే మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చని పలుమార్లు ప్రభుత్వానికి పలు వినతులు కూడా ఇచ్చారు. అయితే ప్రభుత్వం ప్రజల అభ్యర్థనను అర్ధం చేసుకుని నూతన మండలంగా గట్టుప్పల్‌ని ప్రకటించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికాసేపట్లో జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏడేళ్ల క్రితమే గట్టుప్పల్‌ని మండలంగా ప్రకటించే ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏడేళ్లుగా గ్రామస్తులు ఉద్యమం చేస్తున్నారు. ఎట్టకేలకు మంత్రి జగదీష్‌రెడ్డి చొరవతో గ్రామస్తుల కల నెరవేరనుంది.ప్రభుత్వం గట్టుప్పల్‌ని నూతన మండలంగా ప్రకటిస్తుడడంతో గట్టుప్పల్ గ్రామస్తులు సంబురాలు చేసుకుంటున్నారు.

*తెలంగాణలో పలు జిల్లాల్లో ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే 18 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్‌ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దవుతోంది. సికింద్రాబాద్ , అల్వాల్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, చందానగర్, తార్నాక, బాలానగర్, జీడిమెట్ల, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసఫ్ గూడ, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షియర్ జోన్ ప్రభావంతోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

*బీజేపీ పై మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నాటక లో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఉంది, తెలంగాణ లో ఉన్న పథకాలు కర్నాటకలో ఎందుకులేవు? అని ప్రశ్నించారు. బీజేపీ అంటేనే జూటా పార్టీ… జూటా మాటలని మండిపడ్డారు. తెలంగాణలో రైతులకు పంట పెట్టుబడి సాయం ఇస్తున్నామని, కర్నాటకలో రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మీ ఉందా? అని హరీష్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ , బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని కమలం నేతలు చెబుతున్నారు. ఇదే విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించేందుకు టీఆర్‌ఎస్‌ను ఢీ కొంటున్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు కూడా ఏమాత్రం తగ్గకుండా బీజేపీని గట్టిగా ఎదుర్కోవాలని భావిస్తున్నారు.

*సాక్షి టీవీ ప్రసారాల‌ను త‌క్షణ‌మే నిలిపివేయాల‌ని వైకాపా ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు కేంద్రాన్ని కోరారు. లైసెన్స్‌ను వెంటనే రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాన్నారు. ఈమేరకు స‌మాచార‌, ప్రసారాల మంత్రి అనురాగ్ సింగ్‌ ఠాకూర్‌కు రఘురామ లేఖ రాశారు. సాక్షి టీవీ లైసెన్స్‌ ర‌ద్దు, ప్రసారాల నిలిపివేత‌కు సంబంధించి ఈ ఏడాది జనవరి 1న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టే ఈనెల 7తో ముగిసిందని రఘురామ లేఖలో పేర్కొన్నారు. ఇందిరా టెలివిజన్ లిమిటెడ్‌ సంస్థ పేరుతో సాక్షి టీవీ ప్రసారాలకు అనుమతి లేనందున వెంటనే ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానెల్‌ల జాబితా నుంచి సాక్షి ఛానెల్‌ని తొలగించాలని అనురాగ్‌ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు.

* రాజధాని పిటిషన్లపై ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజధాని పరిధిలో ఇతరులకు ఇళ్ల పట్టాలివ్వడంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అమరావతి మాస్టర్ ప్లాన్‌, భూకేటాయింపుల రూల్స్‌కు వ్యతిరేకంగా ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారని లాయర్‌ కారుమంచి ఇంద్రనీల్ వాదించారు. రాజధాని వాసులకే ఆ భూములపై హక్కులు ఉంటాయని లాయర్‌ తెలిపారు. రైతులకు ఖరారు చేశాకే మిగతావారి విషయం ఆలోచించాలని వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశామని ఏజీ కోర్టుకు తెలిపారు. కౌంటర్ అఫిడవిట్ అందలేదని పిటిషనర్ తరపు లాయర్లు తెలిపారు. తదుపరి విచారణ ఆగస్టు 29కి హైకోర్టు వాయిదా వేసింది.

* కాకినాడ జిల్లా ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజాను అరెస్టు చేసేందుకు సీఐడీ పోలీసులు భారీగా తరలిరావడం శుక్రవారం గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. రాజా ఇంట్లోకి వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించడం.. వారిని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో ఐదారు గంటలపాటు ఉద్రిక్త పరిస్థితులు రాజ్యమేలాయి. రాత్రి ఏడున్నర సమయంలో అదనంగా పోలీసు బలగాలు తరలివచ్చాయి. వారి సహాయంతో పోలీసు అధికారులు రాజా ఇంట్లోకి ప్రవేశించారు.

* ఆంధ్రప్రదేశ్‌ ఈస్ట్రన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఈపీడీసీఎల్‌) సీఎండీ కె.సంతో్‌షరావుకు ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హెచ్‌.హరినాఽథరావు పదవీ కాలం ముగియడంతో ఈ నియామకం చేపడుతూ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఉత్తర్వు జారీ చేశారు. ఈమేరకు సంతో్‌షరావు శుక్రవారం విశాఖలో బాధ్యతలు స్వీకరించారు.

*విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని నీతి ఆయోగ్‌ బృందానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వివరించారు. తాడేపల్లిలో శుక్రవారం ఆయనతో నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌చంద్‌ నేతృత్వంలోని బృందం భేటీ అయింది. తలసరి ఆదాయం, వ్యవసాయానుబంధ రంగాలు, విద్య వైద్య రంగాల్లో దేశ సగటు కంటే ఏపీ అధికంగా ఉందని నీతి ఆయోగ్‌ బృందం వెల్లడించగా.. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను గురించి సీఎం జగన్‌ వివరించారు. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చామని, తరగతి గదుల్లో డిజిటల్‌ ఉపకరణాలు సమకూరుస్తున్నామని, సబ్జెక్టుల వారీ బోధనా టీచర్లను నియమిస్తున్నామని నీతి ఆయోగ్‌ బృందానికి వివరించారు. ప్రభుత్వాసుపత్రుల్లోనూ .. బోధనాసుపత్రుల్లోనూ నాడు-నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు జగన్‌ తెలిపారు.

*పశ్చిమ తీరంలో ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఇంకా కర్ణాటక నుంచి తమిళనాడు వరకు మరో ద్రోణి విస్తరించింది. ఇదే సమయంలో బంగాళాఖాతం నుంచి కోస్తాపైకి తేమగాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో శుక్రవారం కోస్తాలో అనేకచోట్ల ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. రానున్న 24గంటల్లో కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు పడతాయని, ఆ తరువాత రెండు, మూడు రోజులు కూడా అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, శుక్రవారం కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఏడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. విశాఖ ఎయిర్‌పోర్టులో 32.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

* మున్సిపల్‌ కార్మికుల పోరాటం ఫలించింది. వారికి ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్స్‌ రూ.6 వేలు, జీతం రూ.15 వేలతో కలిపి మొత్తం రూ.21 వేలు ఖరారు చేస్తూ మున్సిపల్‌శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీ.వో. నంబర్‌ 109ను విడుదల చేసింది. ఇందులో ఆక్యుపేషనల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రూ.6 వేలను ప్రభుత్వం అందించనుండగా, రూ.15 వేల వేతనాన్ని ఆయా పట్టణ స్థానిక సంస్థలు చెల్లిస్తాయి.

*గోదావరి వరద తగ్గిపోయాక పరామర్శకు వచ్చిన మాజీ సీఎం చంద్రబాబు పబ్లిసిటీ కోసమే పడవ పైనుంచి పడిపోయారు’’ అని హోంమంత్రి తానేటి వనిత విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు వరదలో బురద రాజకీయం చేశారని ఆరోపించారు.

*ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలానికి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. పదకొండు రోజుల నుంచి వస్తున్న వరదతో జలాశయం నిండుకుండలా మారింది. శుక్రవారం రాత్రి 10:30గంటలకు జూరా ల నుంచి 31,563 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 61,456 క్యూసెక్కులు మొత్తంగా 93,019 క్యూసెక్కుల ప్రవాహం జలాశయానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 882.10 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను 199.7354 టీఎంసీల నీరు చేరింది. జలాశయం నీటిమట్టం దాదాపు పూర్తిస్థాయికి చేరుకోవడంతో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు శనివారం గేట్లు ఎత్తి నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేయనున్నారు. కాగా, శ్రీశైలంలో ఏపీ, తెలంగాణ విద్యుత్‌ కేంద్రాల ద్వారా జెన్కో అధికారులు విద్యుత్‌ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ఏపీ కేంద్రం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 30,249 క్యూసెక్కులు, తెలంగాణ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

* తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి గురువారం 25 టీవీఎస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు కానుకగా అందాయి. దాదాపు రూ.30 లక్షల విలువైన ఈ ద్విచక్రవాహనాలకు ప్రత్యేక పూజల అనంతరం తాళాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.

* కాకినాడ జేఎన్టీయూకే ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈసెట్‌-2022 ఆన్‌లైన్‌ ప్రవేశపరీక్ష ప్రశాంతగా ముగిసినట్లు కన్వీనర్‌ ఎ.కృష్ణమోహన్‌ తెలిపారు. ఉదయం పరీక్షకు 18,318మంది హాజరుకావాల్సి ఉండగా 17,180మంది హాజరయ్యారని, మధ్యాహ్నం 20,423మందికి 19,238మంది హాజరయ్యారని, మొత్తం 94శాతం హాజరు నమోదైందన్నారు. ఈనెల 24న ప్రాథమిక కీ విడుదల చేసి ఆగస్టు 6న ఫలితాలు ప్రకటించనున్నామన్నారు.

*నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం భూమిలో వైద్యకళాశాల భవనం నిర్మాణం చేసుకొనేందుకు హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతించింది. అయితే ఈ నిర్మాణం కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది.

* రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ జీవనాధారమైన భూములను రైతులు అప్పగించగా, ఒప్పందం ప్రకారం నిర్దిష్ట సమయంలో అభివృద్ధి చేసిన ప్లాట్లు తిరిగి అప్పగించడంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ విఫలమయ్యాయని వారి తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌ బాబు పేర్కొన్నారు. దీనివల్ల రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. సీఆర్డీఏ చట్ట నిబంధనల ప్రకారం భూసమీకరణ విధానం నోటిఫై అయిన దగ్గర నుంచి మూడేళ్లలో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాల్సి ఉన్నదని చెప్పారు.

*మంగళగిరి ఎయిమ్స్‌ నిర్మాణం వచ్చే నెలలో పూర్తవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎయిమ్స్‌ ఏర్పాటుకు రూ.1618 కోట్లు మంజూరు చేశామని, అందులో రూ.1137.92 కోట్లు విడుదల చేశామన్నారు.

*అమరావతిలో ఉన్న రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలించాలని 2020 ఫిబ్రవరిలో సీఎం ప్రతిపాదించారని, కానీ తమ వద్ద పూర్తిస్థాయి ప్రతిపాదనలు లేవని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. ‘హైకోర్టు ప్రధాన ధర్మాసనాన్ని కర్నూలు తరలించే అంశంపై రాతపూర్వక విజ్ఞప్తి వచ్చిందా? సానుకూలంగా నిర్ణయం తీసుకునే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందా?’’ అని లోక్‌సభలో వైసీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్‌, చింతా అనురాధ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి శుక్రవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. హైకోర్టుతో సంప్రదించి దాన్ని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కర్నూలుకు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఒక అభిప్రాయానికి వచ్చి కేంద్రానికి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

*శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది.శ్రీశైలం ప్రాజెక్ట్‎కు ఇన్‌ఫ్లో 81,553 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 57,751 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 882.50 అడుగులుగా కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 202.04 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.

*ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర బృందం ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, నేరడిగొండ మండలాల్లో ముంపు ప్రాంతాలను పరిశీలించి పంట నష్టంపై ఆరా తీసింది. ఉట్నూర్‌ మండల కేంద్రంలో పవర్‌ ప్రజంటేషన్‌ ద్వారా వరదల ఉధృతి, పంట నష్టాన్ని పరిశీలించింది. ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద తెగిపోయిన బ్రిడ్జిని పరిశీలించింది. అలాగే నేరడిగొండ మండలంలోని కుప్టి గ్రామం వద్ద కడెం నది పరివాహక ప్రాంతంలోని ముంపు పంట భూములను పరిశీలించి రైతులతో అధికారులు మాట్లాడారు. జరిగిన నష్టాన్ని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. నిర్మల్‌ లోనూ కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీతో కలిసి కడెం ప్రాజెక్టు ను సందర్శించారు.

*టిటిడికి శుక్ర‌వారం రూ.30 ల‌క్ష‌ల విలువైన 25 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను టివిఎస్ మోటార్స్ సంస్థ విరాళంగా అందించింది. ఈ మేర‌కు టివిఎస్ సంస్థ ప్ర‌తినిధులు శ్రీ‌వారి ఆల‌యం ఎదుట ఈ ద్విచ‌క్ర వాహ‌నాల‌కు పూజా కార్య‌క్ర‌మం నిర్వ‌హించి వాటి తాళాల‌ను టిటిడి ఈవో ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు. తిరుమ‌ల ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలను అందించిన టివిఎస్ సంస్థ‌కు ఈ సంద‌ర్భంగా ఈవో ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

*ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్‌కు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందిందని న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు. కర్నూల్‌కు హైకోర్టు తరలింపు హైకోర్టుతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. శుక్రవారం లోక్‌సభలో కర్నూల్‌కు హైకోర్టు తరలింపు అంశంపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్‌, చింతా అనురాధా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు సమాధానం ఇచ్చారు.ఏపీ హైకోర్టును అమ‌రావ‌తి నుంచి క‌ర్నూల్‌కు త‌ర‌లించాల‌నే ప్ర‌తిపాద‌న కేంద్రానికి అందింది. క‌ర్నూల్‌కు త‌ర‌లింపుపై హైకోర్టుతో సంప్ర‌దింపులు జ‌రిపి రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే నిర్ణ‌యం తీసుకోవాలి.హైకోర్టు నిర్వ‌హ‌ణ ఖ‌ర్చుల‌న్నీ రాష్గ్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది.హైకోర్టును క‌ర్నూల్‌కు త‌ర‌లింపుపై రాష్ట్ర ప్ర‌భుత్వం, హైకోర్టు క‌లిసి ఒక నిర్ణ‌యానికి రావాల్సి ఉంది.ఆ త‌ర్వాత ఆ ప్ర‌తిపాద‌న‌లు కేంద్రానికి పంపాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు కిరణ్‌ రిజిజు.

*ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 840 బార్లు ఏర్పాటు కానున్నాయి. ఈ-వేలం ద్వారా వీటిని వేలం వేయనున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ నిన్న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి 31 ఆగస్టు 2025 వరకు బార్లకు అనుమతినిస్తూ లైసెన్సులు మంజూరు చేస్తారు.నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకుని ప్రాసెసింగ్ ఫీజుతోపాటు నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజును మాత్రం ఈ నెల 28వ తేదీ వరకు చెల్లించొచ్చు. దరఖాస్తులు సమర్పించేందుకు జోన్ల వారీగా తేదీలు నిర్ణయించారు. రాష్ట్రంలో అత్యధికంగా విశాఖపట్టణంలో 128 బార్లు కొత్తగా ఏర్పాటు కానుండగా, ఆ తర్వాతి స్థానంలో విజయవాడ (110), గుంటూరు (67), నెల్లూరు (35) ఉన్నాయి..

*వెస్టిండీస్-భారత్ మధ్య జరుగుతున్న తొలి వన్డే ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠను రేపింది. ఎట్టకేలకు విజయం టీమిండియానే వరించింది. వెస్టిండీస్ జట్టుపై టీమిండియా 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. 309 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో వెస్టిండీస్ టీమ్ 6 వికెట్లను కోల్పోయి 305 పరుగులు చేసింది. మ్యాచ్ చివరి ఓవర్ వరకు పోరాడిన హోసేన్ 33, షెపర్డ్ 39 నాటౌట్‌‎గా నిలిచి టీమిండియా జట్టును కంగారు పెట్టించారు. కానీ విజయాన్ని అందించలేకపోయారు. వెస్టిండీస్ బ్యాటింగ్‎లో కైలే మేయర్స్ 75 రన్స్ చేయగా..బ్రాండన్ కింగ్ 54 రన్స్ చేసి రాణించారు. టీమిండియా బౌలర్లలో సిరాజ్, శార్దూల్, చాహల్ వీరి ముగ్గురికి రెండేసి వికెట్లు తీశారు.

*సంగారెడ్డి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ప్రాంగణంలోని మానసిక రోగుల పునరావాస కేంద్రం(ఇన్‌సెడ్‌-ఇంటిగ్రేటెడ్‌ న్యూలైఫ్‌ సొసైటీ ఫర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌)లోని సైకియాట్రిక్‌ రోగులను శుక్రవారం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో సుమారు 49 మంది సైకియాట్రిక్‌ రోగులను అంబులెన్స్‌ వాహనాల్లో తరలించారు. ఇప్పటికే ఆ కేంద్రంలో ఉండే అభాగ్యుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాల నుంచి నలుగురు డాక్టర్ల బృందం ఈ నెల 12న కేంద్రానికి వచ్చి వివరాలు సేకరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలోనే ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నిర్మిస్తున్నందున అందుకు వీలుగా పునరావాస కేంద్రాన్ని కూల్చి వేసేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆ కేంద్రాన్ని ఖాళీ చేయించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

* అమరావతిలో ఉన్న రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలించాలని 2020 ఫిబ్రవరిలో సీఎం ప్రతిపాదించారని, కానీ తమ వద్ద పూర్తిస్థాయి ప్రతిపాదనలు లేవని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. ‘హైకోర్టు ప్రధాన ధర్మాసనాన్ని కర్నూలు తరలించే అంశంపై రాతపూర్వక విజ్ఞప్తి వచ్చిందా? సానుకూలంగా నిర్ణయం తీసుకునే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందా?’’ అని లోక్‌సభలో వైసీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్‌, చింతా అనురాధ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి శుక్రవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. హైకోర్టుతో సంప్రదించి దాన్ని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కర్నూలుకు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఒక అభిప్రాయానికి వచ్చి కేంద్రానికి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

*నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం భూమిలో వైద్యకళాశాల భవనం నిర్మాణం చేసుకొనేందుకు హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతించింది. అయితే ఈ నిర్మాణం కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది.

*కాకినాడ జేఎన్టీయూకే ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈసెట్‌-2022 ఆన్‌లైన్‌ ప్రవేశపరీక్ష ప్రశాంతగా ముగిసినట్లు కన్వీనర్‌ ఎ.కృష్ణమోహన్‌ తెలిపారు. ఉదయం పరీక్షకు 18,318మంది హాజరుకావాల్సి ఉండగా 17,180మంది హాజరయ్యారని, మధ్యాహ్నం 20,423మందికి 19,238మంది హాజరయ్యారని, మొత్తం 94శాతం హాజరు నమోదైందన్నారు. ఈనెల 24న ప్రాథమిక కీ విడుదల చేసి ఆగస్టు 6న ఫలితాలు ప్రకటించనున్నామన్నారు.

*అనంతపురం జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌, తెలుగుదేశం పార్టీ పాతతరం నాయకుడు కేసీ నారాయణ (81) శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు. వారం క్రితం శ్వాసకోశ సమస్యలతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. గురువారం రాత్రి పరిస్థితి విషమించింది. ఆయన కోలుకోవడం కష్టమని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు గుంతకల్లులోని స్వగృహానికి తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో కేసీ నారాయణ తుది శ్వాస విడిచారు. గుంతకల్లు నియోజకవర్గ కేంద్రానికి చెందిన కేసీ నారాయణ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నారు. కేసీ నారాయణ మృతి వార్త తెలుసుకున్న టీడీపీ నాయకులు తరలివచ్చి నివాళులర్పించారు. కాగా, కేసీ నారాయణ మృతి బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వెలిబుచ్చారు.

* తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి గురువారం 25 టీవీఎస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు కానుకగా అందాయి. దాదాపు రూ.30 లక్షల విలువైన ఈ ద్విచక్రవాహనాలకు ప్రత్యేక పూజల అనంతరం తాళాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.

* గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వోల)కు ఈ నెల 24, 31వ తేదీల్లో నిర్వహించనున్న ట్రైనింగ్‌ పరీక్షలను వాయిదా వేయాలని వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ నెల 24వ తేదీన తొలి విడత లో జరిగే పరీక్షకు శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణాజిల్లా వరకు వీఆర్వోలు పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు. వరదల రీత్యా వీఆర్వోలు ముంపు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారని, పరీక్షలకు హాజరయ్యే పరిస్థితి లేదన్నారు.

*పశ్చిమ తీరంలో ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఇంకా కర్ణాటక నుంచి తమిళనాడు వరకు మరో ద్రోణి విస్తరించింది. ఇదే సమయంలో బంగాళాఖాతం నుంచి కోస్తాపైకి తేమగాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో శుక్రవారం కోస్తాలో అనేకచోట్ల ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. రానున్న 24గంటల్లో కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు పడతాయని, ఆ తరువాత రెండు, మూడు రోజులు కూడా అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, శుక్రవారం కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఏడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. విశాఖ ఎయిర్‌పోర్టులో 32.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

* ‘‘గోదావరి వరద తగ్గిపోయాక పరామర్శకు వచ్చిన మాజీ సీఎం చంద్రబాబు పబ్లిసిటీ కోసమే పడవ పైనుంచి పడిపోయారు’’ అని హోంమంత్రి తానేటి వనిత విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు వరదలో బురద రాజకీయం చేశారని ఆరోపించారు.

*మున్సిపల్‌ కార్మికుల పోరాటం ఫలించింది. వారికి ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్స్‌ రూ.6 వేలు, జీతం రూ.15 వేలతో కలిపి మొత్తం రూ.21 వేలు ఖరారు చేస్తూ మున్సిపల్‌శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీ.వో. నంబర్‌ 109ను విడుదల చేసింది. ఇందులో ఆక్యుపేషనల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రూ.6 వేలను ప్రభుత్వం అందించనుండగా, రూ.15 వేల వేతనాన్ని ఆయా పట్టణ స్థానిక సంస్థలు చెల్లిస్తాయి.

*ప్రస్తుతం ఏపీలో జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల విలీనం దిశగా అడుగులు వేస్తోంది. కొందరు పాఠశాలల విలీన ప్రక్రియను బహిరంగంగానే విమర్శిస్తున్నారు. విలీన ప్రక్రియ వల్ల ఉపాధ్యాయ పోస్టులు తగ్గే అవకాశం ఉందని కొంతమంది టీచర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ సురేష్‌ కుమార్ డీఈవోలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల విలీనానికి వ్యతిరేకంగా పత్రికలలో కథనాలు ప్రచురితమైతే కేసులు పెట్టాలని ఆదేశించారు. స్కూళ్ల విలీనాన్ని విమర్శిస్తూ పత్రికల్లో వచ్చే వార్తలపై దృష్టి సారించాలని సూచించారు.

*బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండిసంజయ్ మూడో విడత పాదయాత్ర పై బీజేపీ ముఖ్యనేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు, రూట్ మ్యాప్‌పై చర్చించారు. ఆగస్ట్ 2 నుంచి మూడోవిడత పాదయాత్ర ఉంటుందని పార్టీలోని ముఖ్యనేతలు తెలిపారు. యాదగిరిగుట్ట నుంచి వరంగల్ భద్రకాళి దేవస్థానం వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది.ఆగస్ట్ 2వ తేదీన యాదగిరిగుట్టలో బహిరంగ సభకు బీజేపీ అధిష్ఠానం ప్లాన్ చేస్తోంది. బహిరంగ సభకు జాతీయ స్థాయిలోని ముఖ్యనేతలను పిలవాలని నిర్ణయం తీసుకుంది.పాదయాత్ర ఏర్పాట్లు, రూట్ మ్యాప్‌పై ఢిల్లీ( నుంచి వర్చువల్‌గా బీజేపీ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ కరీంనగర్ నుంచి బండిసంజయ్ పాల్గొన్నారు.

*కృష్ణా జిల్లా చల్లపల్లి బాలికల వసతి గృహంలో ఏడుగురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి నుంచి వాంతులు, కడుపునొప్పితో విద్యార్థినిలు బాధపడుతున్నారు. వెంటనే విద్యార్థినులను వసతి గృహం సిబ్బంది చల్లపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. రాత్రి తిన్న ఆహారం కారణంగానే విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు భావిస్తున్నారు. విద్యార్థినిలను సంక్షేమ అధికారి సాల్మన్ రాజు పరామర్శించారు

* భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల మంత్రులకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మరీ మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కేసీఆర్‌ సూచించారు. అలాగే ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.

*మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కి సీఎం కేసీఆర్ఫో న్ చేశారు. భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో వరద పరిస్థితిపై కేసీఆర్ ఆరా తీశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఇంద్రకరణ్‌రెడ్డిని ఆదేశించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కేసీఆర్ సూచించారు. పది రోజుల పాటు కురుస్తున్న వర్షాలకు జిల్లా రైతాంగం చావు దెబ్బతింది. జిల్లాలో ప్రధాన పంటలన్నీ భారీ విస్తీర్ణంలో తుడిచి పెట్టుకపోయాయి. జిల్లావ్యాప్తంగా 50వేల ఎకరాలకుపైగా పత్తి పంట నీటి మునిగి మొక్కలు చనిపోగా మరో 12వేల ఎకరాల్లో కంది, ఇతర పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. వేలాది మంది రైతులు ప్రభుత్వ చేయూత కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే వర్షాలు కురియడంతో రైతాంగం కోటి ఆశలతో ఉత్సాహంగా పత్తి పంట సాగు చేపట్టింది. మొక్కలు మొలచి ఏపుగా పెరుగుతున్నాయనుకుంటున్న దశలో అతి వృష్టి కారణంగా రైతులు ఒక్కొక్క ఎకరాపై రూ.15వేలకుపైగా నష్ట పోయారు. ప్రస్తుతం మళ్లీ పంటలు నాటే పరిస్థితి కూడా లేదని రైతులు చెబుతున్నారు.

*చెస్ ఒలింపియాడ్ టార్చ్‌కు తిరుపతిలో ఘన స్వాగతం లభించింది. విద్యార్థులు, ప్రజలు ఘనంగా స్వాగతించారు. టార్చ్‌ ర్యాలీ తిరుపతిలోని ఎస్‌వీ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఐకానిక్ వేదిక మహతి ఆడిటోరియం వరకు కొనసాగింది. దారిపోడవునా వివిధ పాఠశాలల విద్యార్థులు బారులు తీరి నిల్చుండి టార్చ్‌కు స్వాగతం పలికారు. ఈ టార్చ్‌ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్, క్రీడాకారులు, ఎన్‌సీసీ కాడెట్స్ పాల్గొన్నారు. రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్‌కే రోజా ఈ ర్యాలీలో పాల్గొని విద్యార్థులు, క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

*అన్నమయ్య కీర్తనపై ప్రముఖ గాయని శ్రావణి భార్గవి చిత్రీకరించినా తీరును నిరసిస్తూ తిరుపతి వాసులు కొందరు ఇవాళ తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశారు. ‘ఒకపరి కోకపరి వయ్యారిమై’’ కీర్తనను అశ్లీలంగా ప్రదర్శించడాన్ని తప్పుబట్టారు. అన్నమయ్య కీర్తనలు ఇకపై ఎవరు కూడా తప్పుగా చిత్రీకరించకుండా ఓ చట్టాన్ని టీటీడీ తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

*పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థాన్ని దృష్టిలో ఉంచుకొని ప్ర‌భుత్వం కొత్త మండ‌లాల‌ను ఏర్పాటు చేయ‌డంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత హ‌ర్షం వ్య‌క్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో మూడు కొత్త మండ‌లాలు ఏర్పాటుకు ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. డొంగేశ్వ‌ర్, ఆలూరు, సాలూర కేంద్రంగా కొత్త మండ‌లాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. త‌మ ప్ర‌తిపాద‌నను ఆమోదించినందుకు సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ క‌విత జిల్లా ప్ర‌జ‌ల త‌ర‌పున ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రాష్ట్రంలో కొత్త‌గా 13 మండలాల‌ను ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

* మున్సిపాలిటీలో పని చేసే పారిశుధ్య కార్మికులకు రూ. 6 వేలు ఆరోగ్య భృతి చెల్లింపులపై ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం43 వేలమంది కార్మికులకు మేలుమున్సిపల్ కార్మికుల 15 వేల వేతనానికి అదనంగా 6 వేలు ఓ హెచ్ ఏను ప్రభుత్వం చెల్లించనుంది దీంతో పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ. 21 వేలకు పెరిగినట్లు అయ్యింది.తాజా ఉత్తర్వులతో 43 వేలమందికి పైగా కార్మికులకు మేలు జరగనుంది. ఇటీవల కాలం లో పలు డిమాండ్లతో పాటు ఆరోగ్య భృతిని ప్రస్తావిస్తూ.. సమ్మెకు దిగిన పట్టణ పారిశుద్ధ్య, ఒప్పంద కార్మికులు. ఈ తరుణంలో సీఎం జగన్‌ సమస్యలను తెల్చుకుని వెంటనే పరిష్కరించాలని పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఆదేశించడం.. కేబినెట్‌ కమిటీ ద్వారా సమస్య పరిష్కారం త్వరగతిన జరిగిందిఅంతేకాదు.. జీవో నం.233 ద్వారా ఇస్తున్న ఆరోగ్య భృతిని యథాతథంగా అమలు చేయనున్నట్లు తెలిపింది ఏపీ సర్కార్‌.

* వివిధ సందర్భాల్లో తమ వద్ద తగిన డేటా లేదంటూ కేంద్రం సమాధానం ఇవ్వడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సెటైర్‌ వేశారు.ఈ ప్రభుత్వం వద్ద డేటానే కాదు.. జవాబుదారీతనం కూడా లేదని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఎన్డీయే అనే పదానికి తనదైన నిర్వచనం ఇచ్చారు. ఎన్డీయే అంటే నో డేటా అవలైబుల్‌ అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ట్వీట్‌ చేశారు.ఆక్సిజన్‌ కొరత కారణంగా చనిపోవడం గానీ, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ఎవరూ చనిపోవడం గానీ జరగలేదన్న విషయం ప్రజలు నమ్మాలని ఈ ప్రభుత్వం కోరుకుంటోందని రాహుల్‌ గాంధీ అన్నారు. మూకదాడులు, జర్నలిస్టుల అరెస్టుల వంటి వాటిపైనా ప్రభుత్వం మౌనంగా ఉండడాన్ని తప్పుబట్టారు. ఈ ప్రభుత్వం వద్ద డేటా లేదు.. సమాధానం లేదు.. జవాబుదారీతనం అసలే లేదని ట్వీట్‌చేశారు.కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో నడకదారిన వెళ్లిన చాలా మంది మరణించారు. దీనిపై కేంద్రం అప్పట్లో తమ వద్ద అలాంటి డేటా ఏదీ లేదని పేర్కొంది. రెండో వేవ్‌ సందర్భంగా ఆక్సిజన్‌ కొరతతో అనేక మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు కూడా ఎవరూ తమ వద్ద ఆ డేటా లేదని కేంద్రం సమాధానం ఇచ్చింది. ఇలా పలు సందర్భాల్లో కేంద్రం తమ వద్ద డేటా లేదని సమాధానం ఇవ్వడంపై రాహుల్‌ ఈ విధంగా స్పందించారు.