Politics

సీఎం జగన్కు.. ఈసారి వారి నుంచి రిటర్న్ గిప్ట్ తప్పదు – TNI రాజకీయ వార్తలు

సీఎం జగన్కు.. ఈసారి వారి నుంచి రిటర్న్ గిప్ట్ తప్పదు – TNI  రాజకీయ వార్తలు

* ముఖ్యమంత్రి జగన్కు ఉద్యోగుల నుంచి ఈసారి కచ్ఛితంగా రిటర్న్ గిప్ట్ ఉంటుందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆయన మండిపడ్డారు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు చేసిన ఉద్యమం ముఖ్యమంత్రికి నచ్చలేదన్న అశోక్ బాబు.. దాన్ని దృష్టిలో పెట్టుకునే టీచర్లను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ తరువాత నాశనమైన వ్యవస్థ.. విద్యా వ్యవస్థేనని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్కు ఉద్యోగుల నుంచి ఈసారి కచ్ఛితంగా రిటర్న్ గిప్ట్ ఉంటుందని అన్నారు. నేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ పేరుతో ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు తప్పుపడుతున్నారని చెప్పారు. ఇప్పటికే పాఠశాలల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నారని గుర్తు చేశారు.విలీన ప్రతిపాదన వల్ల కొన్ని వందల పాఠశాలలు మూతపడతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు చేసిన ఉద్యమం ముఖ్యమంత్రికి నచ్చలేదన్న అశోక్ బాబు..దాన్ని దృష్టిలో పెట్టుకునే టీచర్లను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

*దేశాభివృద్ధిలో యువ‌త భాగ‌స్వామ్యం కావాలి : మంత్రి కేటీఆర్
దేశ అభివృద్ధిలో యువ‌త భాగ‌స్వామ్యం కావాల‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హైద‌రాబాద్‌లోని మ‌హీంద్రా యూనివ‌ర్సిటీ నిర్వ‌హించిన తొలి స్నాత‌కోత్స‌వంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. దేశ జ‌నాభాలో సగానికి పైగా 27 ఏండ్ల వారేన‌ని తెలిపారు. ప్ర‌స్తుతం యువ‌త ఆవిష్క‌ర‌ణ‌ల్లో చాలా చురుకుగా ఉంద‌ని కొనియాడారు. నాయ‌కులు కేవ‌లం రాజ‌కీయాల‌కే ప‌రిమితం కాకుండా, ఆర్థిక అంశాల‌పై దృష్టి సారించాల‌ని కేటీఆర్ సూచించారు.దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన విద్యార్థులు మ‌హీంద్రా యూనివ‌ర్సిటీలో చ‌దువుతున్నార‌ని త‌న‌కు తెలుస‌న్నారు. అయితే హైద‌రాబాద్‌, తెలంగాణ‌లో ఉన్న ఉద్యోగ అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని, అందుకు మీ అంద‌ర్నీ ప్రోత్సాహిస్తున్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఇన్నోవేష‌న్, ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్ర‌మోట్ చేసేందుకు తెలంగాణ చాంపియ‌న్ స్టేట్‌గా ఉంద‌న్నారు. ఇత‌ర రాష్ట్రాల్లో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించింద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడ‌ల్‌గా నిలిచింద‌ని చెప్పడానికి తాను గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

*అప్పుల రాష్ట్రంగా ఏపీకి కీర్తి: పట్టాభి
దేశంలోనే అత్యధికంగా అప్పుల రాష్ట్రంగా ఏపీకి కీర్తి సంపాదించిదని టీడీపీ నేత పట్టాభి ఎద్దేవాచేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సూట్‌ కేసు కంపెనీలతో సీఎం జగన్‌ , ఎంపీ విజయసాయిరెడ్డి బ్యాంకులను కొల్లగొడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీఎస్ డీసీ పేరుతో బ్యాంకుల నుంచి రూ.25 వేల కోట్ల రుణాలు తీసుకున్నారని తెలిపారు. కార్పొరేషన్ల పేరుతో డబ్బులు తీసుకువచ్చి దారి మళ్లించారని ఆరోపించారు. ఆర్‌బీఐ కూడా కార్పొరేషన్ల అప్పుపై ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు. ఏపీలో ఆర్థిక ఉగ్రవాదాన్ని చూసి ఆర్బీఐ నిబంధనలు కఠినతరం చేసిందని తెలిపారు. కార్పొరేషన్లకు అప్పులపై రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన గ్యారింటీని, క్రైటీరియాగా తీసుకుని అప్పులు ఇవ్వడానికి వీల్లేదని ఆర్బీఐ చెప్పిందని గుర్తుచేశారు. రాష్ట్ర బడ్జెట్ అవసరాల కోసమే ఏపీఎస్ డీసీ అంటూ జీవో 80 విడుదల చేశారని, జీవో 80 జారీ ఆర్బీఐ మార్గదర్శకాల ఉల్లంఘనేనని పట్టాభి పేర్కొన్నారు.

*ఏపీలో విద్యావ్యవస్థను నాశనం చేశారు: అశోక్‌బాబు
ఏపీలో విద్యావ్యవస్థను నాశనం చేశారని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం టీచర్లపై కక్షసాధింపు చర్యలకు దిగిందని, ఇదే విషయాన్ని అన్ని సంఘాలు చెబుతున్నాయని తెలిపారు. ఉద్యోగుల నుంచి ఈసారి సీఎం జగన్‌ కు కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని తెలిపారు. మెర్జింగ్‌తో వందల స్కూళ్లు మూలన పడుతున్నాయని, పీఆర్సీ పై ఉద్యమం చేసినందుకు టీచర్లను వేధిస్తున్నారని అశోక్‌బాబు మండిపడ్డారు.

*Kaleswaram: వల్లే గోదావరికి ముంపు పెరిగింది: డీకే అరుణ
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపాల వల్లే గోదావరి)కి ముంపు పెరిగిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అరుణ మంచిర్యాలలో పర్యటించారు. ఈసందర్భంగా అరుణ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ముంపు ప్రాజెక్టుగా మారిందన్నారు. వేల ఎకరాల్లో పంటలు, పల్లెలు మునగడానికి టీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత విధానాలే కారణమని మండిపడ్డారు.ఇతర రాష్ట్రాల్లో రైతులకు సహాయం అందించే సీఎం కేసీఆర్‌(CM KCR)కు ఇక్కడి ప్రజల కన్నీళ్లు మాత్రం కనిపించడం లేదన్నారు. సొంత రాష్ట్ర రైతులకు కన్నీళ్లను మిగిల్చిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలోకి ఎక్కారని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్న సందేహం ప్రజల్లో నెలకొందన్నారు.నూతనంగా నిర్మించిన మాత శిశు ఆస్పత్రి వరద ముంపునకు గురవడం కేసీఆర్ ముందుచూపునకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. తక్షణమే వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు

*ప్రత్యక్ష రాజకీయాలకు యడియూరప్ప గుడ్‌బై -శికారిపుర స్థానం కుమారుడికి అప్పగింత
బీజేపీ సీనియర్‌ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. తన సొంత నియోజకవర్గం శివమొగ్గ జిల్లా శికారిపుర స్థానాన్ని రెండో కుమారుడు బీవై విజయేంద్రకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. శివమొగ్గ జిల్లా అంజనాపురలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మైసూరు ప్రాంతం నుంచి విజయేంద్ర పోటీ చేయాలనే డిమాండ్‌ ఉండేదని, ప్రస్తుతం శికారిపురను అప్పగిస్తున్నందున మరోవైపు ఆలోచించే అవసరమే లేదన్నారు. యడియూరప్ప 1983 నుంచి 8 సార్లు శికారిపుర ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో ఒకసారి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.

*అధికారంలోకి వస్తే కాళేశ్వరం అవినీతిపై విచారణ: ఎంపీ ఉత్తమ్‌
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తామని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ( అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…కాళేశ్వరంఅవినీతిలో దోషులు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టమని హెచ్చరించారు. తుమ్మడి హట్టి దగ్గర డ్యాం నిర్మిస్తాం, గ్రావిటీతో నీళ్లు పారేలా చేస్తామన్నారు.కాళేశ్వరం ఇరిగేషన్‌ కాదు, టూరిజం ప్రాజెక్టు అని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు పూర్తయితే సాగర్ ఎండిపోతుందన్నారు.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నష్టం జరుగుతుందన్నారు.ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిలిపేలా సుప్రీంకోర్టు నుంచి స్టే తీసుకువస్తామని తెలిపారు.టీఆర్ఎస్, బీజేపీవి రాజకీయ డ్రామాలని ఎద్దేవా చేశారు.తెలంగాణ ముందస్తు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌దే గెలుపునని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు.

*బియ్యం రవాణా వేగవంతం చేయాలి: గంగుల
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైస్‌మిల్లుల్లో ధాన్యం మిల్లింగ్‌ ప్రారంభమైందని, ఎఫ్‌సీఐ బియ్యం రవాణాను, ర్యాక్‌ మూవ్‌మెంట్‌ను వేగవంతంచేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్‌సీఐ హైదరాబాద్‌ రీజియన్‌ జనరల్‌ మేనేజర్‌తో మాట్లాడారు. అదే క్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లింగ్‌ ప్రక్రియను వేగవంతంచేసేలా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు.

*వైతాళికులను స్ఫూర్తిగా తీసుకోవాలి: శ్రీనివా్‌సగౌడ్‌
తెలంగాణ వైతాళికుల స్ఫూర్తి ఈ తరానికి అందించే ప్రయత్నంలో భాగంగా వారిని స్మరించుకుంటున్నామని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి దాశరథి రచనలు స్ఫూర్తిగా నిలిచాయని గుర్తుచేశారు. శుక్రవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దాశరథి కృష్ణమాచార్య 98వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పేరిట నెలకొల్పిన పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త వేణు సంకోజుకు ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌.. కవి వేణు సంకోజును సత్కరించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో మేధావుల పాత్ర గొప్పదని, స్వరాష్ట్రంలోనూ మేధావులు, సాహితీవేత్తలు జరుగుతున్న మార్పును సమాజానికి అందించే ప్రయత్నం చేయాలన్నారు. పురస్కారగ్రహీత వేణు సంకోజు మాట్లాడుతూ చాలా కాలం తర్వాత తన రచనకు గుర్తింపు లభించిందని కంటతడి పెట్టారు.

*కేసీఆర్‌ అనాలోచిత చర్యల వల్లే నష్టం: డీకే అరుణ
సీఆర్‌ అనాలోచిత చర్యల వల్లనే వరద ముంపుతో ప్రజలకు భారీ నష్టం వాటిల్లిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో ముంపునకు గురైన కాలనీలను శుక్రవారం ఆమె పరిశీలించారు. స్వయంగా ఇంజనీర్‌లా వ్యవహరించిన కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు మునిగిందో ప్రజలకు చెప్పాలన్నారు.

*వరద బాధితులందర్నీ ఆదుకుంటాం: పువ్వాడ
వరద బాధితులెవరూ అధైర్యపడొద్దని, అంద ర్నీ ఆదుకుంటామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ భరోసా ఇచ్చారు. వరద ముంపునకు గురైన భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని సున్నంబట్టి, పర్ణశాల, రేగుబల్లి తదితర గ్రామాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. సున్నంబట్టిలో ఇటీవల విద్యుదాఘాతం కారణంగా భార్యతోపాటు వరదల్లో సర్వం కోల్పోయిన మద్ది ప్రసాదరెడ్డి, స్థానిక మహిళలతో మంత్రి మాట్లాడారు. మైదాన ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇస్తే తక్షణం గ్రామాన్ని ఖాళీ చేస్తామని బాధితులు మంత్రికి విన్నవించారు. అందుకు స్పందించిన మంత్రి.. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి మెరక ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పర్ణశాల వరద బాధితులతోనూ ఆయన మాట్లాడారు.

*సోనియాపై ఈడీ వేధింపులు కక్ష సాధింపే: శైలజానాథ్‌
‘‘కక్ష సాధింపులో భాగంగానే సోనియా, రాహుల్‌ గాంధీలపై కేంద్ర ప్రభుత్వం ఈడీ కేసులతో వేధింపులకు పాల్పడుతోంది. నేషనల్‌ హెరాల్డ్‌ అనేది కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన వ్యవహారం. కావాలని పాత కేసును తెరిచి విచారణ పేరుతో వేధిస్తున్నారు’’ అని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ మండిపడ్డారు. సోనియాగాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ శుక్రవారం గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాకు హాజరై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం జగన్‌, ప్రధాని మోదీ అండ చూసుకొని అప్పులు పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు.

*దద్దమ్మ ప్రభుత్వం వల్లే వరద కష్టాలు: చింతమనేని
చేతగాని దద్దమ్మ ప్రభుత్వం వల్లే ముంపు మండలాల ప్రజలకు వరద కష్టాలు ఎదురవుతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ విమర్శించారు. శుక్రవారం సాయంత్రం ఆయన భద్రాచలం మీదుగా అల్లూరి జిల్లా యటపాక మండలం గుండాల వద్దకు చేరుకున్నారు. విజయవాడ- జగదల్‌పూర్‌ జాతీయ రహదారిపై వరదల కారణంగా పేరుకుపోయిన ఒండ్రుమట్టిని డోజరు సాయంతో తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం బాధ్యతల నుంచి వైదొలిగిందని, ఆ ఫలితంగానే ముంపు మండలాల్లో వరదల సమయంలో ఆదుకునే వారే కరువయ్యారన్నారు..

*హుద్‌ హుద్‌లోనూ ఫోజులే ఇచ్చారు: సజ్జల
‘‘చంద్రబాబు తన 40ఏళ్ల రాజకీయ జీవితాన్ని అబద్ధాలతోనే గడిపేస్తూ వచ్చారు. వరద ప్రాంతాల్లో ప్రచారం చేసుకోవడానికే పర్యటించారు. ఎక్కడ నుంచో తీసుకువచ్చిన బురద నీటిని చూపించారు. దానిని వరద బాధితులెవరూ నమ్మే పరిస్థితిలోలేరు’’ అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘‘ముంపు ప్రాంతాల పర్యటన సమయంలో పడవలో కూర్చున్నప్పుడు కూడా ప్రచారానికే పెద్దపీట వేస్తూ వచ్చారు. కెమెరాలకే ఫోకస్‌ చేస్తూ హావభావాలు పలికించారు. వరద సాయం కోసం రూ.9.40కోట్లు కలెక్టర్లకు మంజూరు చేశారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై సీఎం జగన్‌ 12నే సమీక్షను నిర్వహించారు’’ అని సజ్జల వివరించారు.

*వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని వదిలించుకోవాలి: యనమల
‘‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీని వదిలించుకోవాలి. లేదంటే భవిష్యత్‌ తరాలు ఇబ్బందులపడే పరిస్థితులు వస్తాయి. జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో స్థిరమైన వృద్ధి రేటు సాధించినట్లు చెప్పడం హస్యాస్పదం. లేని అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లు డప్పు కొట్టుకునే స్థితిలో ఉంది’’ అని రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. కాకినాడ జిల్లా తునిలో ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ‘‘తెలుగుదేశం ప్రభుత్వ హాయాంలో రెండకెల్లో ఉన్న వృద్ధిరేటు నేడు మైన్‌సకు చేరింది. ఆర్థిక వ్యవస్థ కుంటుపడడంతోపాటు, ద్రవోల్బణం 9 శాతానికి చేరింది. రాష్ట్రంలో ప్రజలు జీవించడం కష్టంగా మారింది. పరిశ్రమలు లేక, పెట్టుబడులు రాకపోవడంతో నిరుద్యోగ రేటు 12.5 శాతానికి పెరిగింది. అన్ని ధరలు పెరిగాయి. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలు చేస్తూ రోడ్లు ఎక్కే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని, వైసీపీ పార్టీని రాష్ట్ర ప్రజలు వదిలించుకుంటేనే ప్రగతి సాధ్యం. ’’ అని యనమల అన్నారు.

*తుగ్లక్‌ సీఎం కావడం ప్రజల దురదృష్టం: అయ్యన్న
రాష్ట్రానికి తుగ్లక్‌ జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ప్రజల దురదృష్టం. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది’’ అని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఆయన శుక్రవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘రాష్ట్రంలో తొమ్మిది పోర్టులు నిర్మించి 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని జగన్‌ ప్రకటించడం విడ్డూరంగా ఉంది. 10 వేల ఉద్యోగాలు వుండే పోర్టుల్లో లక్షలాది మందికి అవకాశం ఇవ్వడం ఎలా సాధ్యం? అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంలో వున్నట్టు జగన్‌ ప్రకటించారు. ఆ పనులు ఎక్కడ జరుగుతున్నాయో చూపించాలి. పత్రికల్లో హార్బర్‌ నిర్మాణంపై కథనాలు వస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం గమనార్హం’’ అని అన్నారు. ‘‘80 శాతం మంది విద్యార్థులకు ఇప్పటికీ విద్యా కానుక అందలేదు. పాఠశాలల విలీనంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రమంతటా విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాలు చేస్తున్నప్పటికీ సీఎం జగన్మోహన్‌రెడ్డి స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది. ఖర్చు తగ్గించుకోవడానికి విద్యార్థుల సంఖ్య తగ్గితే మంచిదన్న ఆలోచనలో సీఎం ఉన్నారు. కొవిడ్‌ నిధులు రూ.1,160 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించడం దారుణం’’ అని అయ్యన్న విమర్శించారు.

*డబ్బులు సంపాదించాలన్న ధ్యాస తప్ప మరోటి లేదు: అయ్యన్నపాత్రుడు
జగన్ఒ క వ్యాపారస్తుడు.. ఆయనకు డబ్బులు సంపాదించాలన్న ధ్యాస తప్ప మరొకటి లేదని తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. పాఠశాలల విలీనం తుగ్లక్ చర్య అన్నారు. 117 జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముఖ్యమంత్రి ఆటలాడడం తగదని హెచ్చరించారు. విద్యార్థుల ఉత్తీర్ణత పెరిగితే జగన్ గొప్పదనం.. స్టూడెంట్స్ ఫెయిల్ అయితే ఉపాధ్యాయుల వైఫల్యమా? అని ప్రశ్నించారు. విద్యార్థుల సంఖ్య తగ్గితే మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, బ్యాగ్స్, టీచర్స్ నియామకాలు, ప్రోమోషన్స్ ఉండవు.. అందుకే పాఠశాలల విలీనం నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాకానుక ఇప్పటికి 80 శాతం విద్యార్థులకు అందలేదన్నారు.జగన్ అన్నివర్గాల ప్రజలను మోసం చేశారు.. ఆఖరికి పిల్లలను కూడా మోసం చేశారని మండిపడ్డారు. సీఎం జగన్‌‌రెడ్డికి ఆలోచించే శక్తి లేదు.. మీరైన విద్యారంగాన్ని మెరుగు పరచాలని మంత్రి బొత్స సత్యనారయణ కి సలహా ఇచ్చారు. వర్షాకాలంలో ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు