Movies

అమ్మ కోరిక తీర్చగలిగా..

అమ్మ కోరిక తీర్చగలిగా..

‘మహానటి’కి జాతీయ అవార్డు ప్రకటించినప్పుడు నాకన్నా మా అమ్మ మేనక ఎక్కువగా ఆనందించింది. నేను కూడా ఆ అవార్డు అమ్మకే వచ్చినంతగా సంబరపడిపోయా. మొత్తానికి నేను అనుకున్నది సాధించాననిపించింది. ఎందుకంటే … జాతీయ అవార్డు రావాలన్న కల నాది కాదు… మా అమ్మది మరి. అసలేమయ్యిందంటే.. ఒకప్పుడు ఓ సినిమాలో అమ్మకు జాతీయ అవార్డు వస్తుందని అనుకుందట కానీ… రాలేదట . దాంతో అమ్మ అప్పుడప్పుడూ ఆ సినిమాలోని తన పాత్ర గురించీ అవార్డు రాకపోవడం వెనుక ఉన్న కారణాలనూ బాధపడుతూ చెప్పేది . అది విన్నప్పుడల్లా ఏదో ఒక రోజు జాతీయ అవార్డును సొంతం చేసుకుని అమ్మ ఎదురుగా నిల్చోవాలని కలలు కనేదాన్ని. అది ‘మహానటి’ ద్వారా నెరవేరింది.