అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్చిచ్చు చెలరేగింది. మరిపోసా కౌంటీలో పలు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. యోస్‌మైట్ నేషనల్ పార్కు సమీపంలో ప్రారంభమైన కార్చిచ్చు ఉగ్రరూపం దాల్చింది. అధికారులు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అక్కడి 2,600 నివాసాలు, వ్యాపార సంస్థల్లోని 6 వేల మందిని వేరే చోటుకు తరలించారు. 400 మంది ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు. కౌంటీలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.