Movies

హిమాలయాలకు వెళ్ళా.

హిమాలయాలకు వెళ్ళా.

మహాభారతం చదివాక … ఒక్కసారైనా హిమాలయాలకు వెళ్లి మంచుకొండల్ని చూడాలని అనుకునేదాన్ని. కానీ షూటింగ్లూ, ఇతర పనుల వల్ల ఇన్నాళ్లూ అది కుదరలేదు. చివరకు ఎలాగైనా వెళ్లాలనుకున్న నేను … కాస్త బ్రేక్ తీసుకుని చార్ధామ్ యాత్రను పూర్తిచేసేందుకు సిద్ధమయ్యా . అనుకున్నట్లుగానే హిమాలయాలను చూడటమే కాదు … చార్ధామ్ యాత్ర (యమునోత్రి, గంగోత్రి, కేదార్నా, బద్రీనాథ్ ) నూ పూర్తిచేయగలిగా. అవన్నీ చూశాక … మాటల్లో చెప్పలేని అనుభూతి పొందానంటే నమ్మండి… అక్కడికి వెళ్లొచ్చాక నా ఆత్మవిశ్వాసమూ పెరిగింది.