Movies

ఆ గుర్తింపు కోరుకున్న

ఆ గుర్తింపు కోరుకున్న

నటీనటులెవరైనా … తమ సినిమాలు బాగా హిట్టవ్వాలని కోరుకోవడం సహజం. కానీ నేను మాత్రం … ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచీ పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకునేదాన్ని . చివరకు ‘పుష్ప’తో నా కోరిక తీరింది. ఎక్కడికి వెళ్లినా అభిమానులు’ శ్రీవల్లి ‘ అని పిలుస్తుంటే ఏదో సాధించిన భావన కలిగింది. అదొక్కటేకాదు … ఇళయ దళపతి విజయ్ తెరను పంచుకోవడం కూడా నాకున్న కలల్లో ఒకటి. అన్నింటికీ మించి కిందటి సంవత్సరం ఓ హిందీ సినిమా షూటింగ్లో భాగంగా నా పుట్టినరోజు వేడుకలను అమితాబ్ బచ్చన్ సర్తో కలిసి జరుపుకున్నా. ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి.