* ఏడాది క్రితం శంకుస్థాపన చేసిన రోడ్డు పనులు.. ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ మాట చెప్పిందెవరో కాదు.. స్వయాన కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిధులు లేకపోవటం వల్ల ముత్తుకూరు రోడ్డు పూర్తి కాలేదని.. ప్రజలకు వివరణ ఇచ్చారు. ఆలూరు నియోజకవర్గంలో 40 రోడ్లు బాగా లేవని స్వయంగా చెప్పిన ఆయన ఆగస్టు 15న నిధులు వస్తాయని, పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని.. హామీ ఇచ్చారు.
* రేషన్ దుకాణాలు ఎక్కడా మూతపడవు: మంత్రి కారుమూరు
రాష్ట్రంలో 1.46 లక్షల రేషన్ కార్డులు ఉంటే కేంద్రం ఉచిత బియ్యం ఇచ్చింది కేవలం 89 లక్షల మందికేనని రాష్ట్ర పౌరసఫరాల శాఖ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే పదే పదే కేంద్రానికి విజ్ఞప్తులు చేసినా ఇప్పటికీ పట్టించుకోలేదన్నారు. 89 లక్షల రేషన్ కార్డుదారులతో పాటు అందరికీ ఉచిత బియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆగస్టు మొదటి తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా ఉచిత బియ్యం ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. రేషన్ దుకాణాలు ఎక్కడా మూతపడవని, అలాగే రేషన్ కార్డులూ తగ్గించబోమని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియని, గడచిన మూడేళ్ల కాలంలో రూ. 16 వేల కోట్లు పౌరసరఫరాలకు వ్యయం చేశామని మంత్రి కారుమూరు నాగేశ్వరరావు తెలిపారు
* కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఏం సాధించారు?: YS Sharmila
పక్క రాష్ట్ర సీఎంను ఇంటికి పిలిచి స్వీట్లు తినిపించినప్పుడు పోలవరం వల్ల ఇబ్బంది అవుతుందని కేసీఆర్ఎం దుకు అనలేదని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాతే వరద ఎక్కువ వచ్చిందని… అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఏం సాధించారని ప్రశ్నించారు. కాళేశ్వరం లోపాల బాధ్యత ఎవరు తీసుకుంటారని నిలదీశారు. కలర్ ఫోటోలకు, టూరిజం స్పాట్‌గా మాత్రమే కాళేశ్వరం పనికొచ్చిందని విమర్శించారు. కడెం ప్రాజెక్టు గేట్లు మార్చాలన్న డిమాండ్లను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్టు గేట్లు పనిచేయకపోవడం వల్లే ఇంత పెద్ద వరద వచ్చిందన్నారు. 33 మంది సిబ్బంది ఉండాల్సిన కడెం ప్రాజెక్టు దగ్గర ముగ్గురే ఉన్నారని తెలిపారు. బాధితుల డిమాండ్ మేరకు కరకట్ట నిర్మించాలని డిమాండ్ చేశారు. వరదల్లో గూడు కోల్పోయినవారికి డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు కట్టివ్వాలని షర్మిల అన్నారు.
* వైసీపీ ప్రభుత్వ అసమర్ధత వల్ల పోలవరంలో విధ్వంసం: దేవినేని ఉమా
వైసీపీ ప్రభుత్వ అసమర్ధత వల్ల పోలవరంలో విధ్వంసం జరిగిందని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ హయాంలో పోలవరానికి రూ.10,584 కోట్ల ఖర్చు అయ్యిందని చెప్పారు. కాగా.. వైసీపీ మూడేళ్ల పాలనలో రూ.2,742 కోట్ల ఖర్చు జరిగిందన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని దేవినేని ఉమా వ్యాఖ్యలు చేశారు.
* అనేక మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారు: ఈటల
బీజేపీ అధిష్టానం ఆదేశాలతో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తామని ఎమ్మెల్యే, మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం దేవరకద్ర నియోజకవర్గంలో ‘ప్రజా ఘోస- బీజేపీ భరోసా’ కార్యక్రమానికి వెళ్తూ.. జడ్చర్లలో ఈటల మీడియాతో మాట్లాడుతూ.. అనేక మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరతారనుకుంటున్నానని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేసీఆర్‌తో ఇష్టంలేని కాపురం చేస్తున్నారని, ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి.. నియోజకవర్గాల్లో పనుల కోసమే టీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారని, తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
*పోలవరం నిర్వాసితులకు జగన్ క్షమాపణ చెప్పాలి: రామకృష్ణ
పోలవరంనిర్వాసితులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిక్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. గోదావరికి వరదలు పోటెత్తి పోలవరం పరిసర ప్రాంతాలు నీటి మునిగి, నిర్వాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నిర్వాసితులను ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఫలితంగా నిర్వాసితులు తమ గ్రామాలను తెలంగాణలో కలపాల్సిందిగా కోరుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితులకు పరిహారం ఇచ్చి, పోలవరం పూర్తి చేయడంలో కపట వైఖరి అనుసరించడం శోచనీయమని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఇళ్లు నిర్మించి పునర్వాసం కల్పించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
*వరద బాధితులను ఏపీ సర్కార్ ఆదుకోవడం లేదు: సీఎం రమేష్
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్వి మర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… పంచాయితీల నిధులు దారి మల్లించి, వాటిని ఇతర అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సర్పంచ్‌లను ఢిల్లీకి తీసుకునచ్చి నిధులు మంజూరు గురించి కేంద్రమంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తెలంగాణ(లో భద్రాచలం సమీప ప్రాంతాల్లో వరదలకు కారణం పోలవరం కాదని… కాళేశ్వరం ప్రాజెక్టు ల నుంచి నీటిని ఒక్కసారిగా వదలడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని సీఎం రమేష్ అన్నారు.
*గోదావరి కన్నా కాంగ్రెస్, బీజేపీ కన్నీటి వరదే ఎక్కువ! : మంత్రి నిరంజన్‌రెడ్డి
ఐదువందల ఏళ్ల తర్వాత వచ్చిన అత్యంత భారీ వరదలని ఓ వైపు కేంద్ర జలసంఘం చెబుతుంటే.. అవేవీ పట్టించుకోకుండా కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గోదావరి వరదల కంటే కాంగ్రెస్, బీజేపీ నేతల కన్నీటి వరద ఎక్కువగా ఉందం టూ మండిపడ్డారు. హైదరాబాదులో ఆదివారం మాట్లాడుతూ కాళేశ్వరం నుంచి ఒక్క ఎకరానికి నీళ్లు రాలేదని, కాళేశ్వరానికి ఇప్పటి వరకు రూ.95 వేల కోట్లు ఖర్చుచేేస్త రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నార ని తెలిపారు. తెలంగాణకు అన్యాయం చేసే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును నిర్మించిన రాజశేఖర్‌రెడ్డిని తమ వాడని తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంకలు గుద్దుకుంటూ చెబుతున్నారని విమర్శించారు. అదే రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్… నీటి లభ్యత ఉన్న చోటనే రీడిజైన్ చేసి కాళేశ్వరం ఎత్తిపోతలను నిర్మిేస్త కాం గ్రెస్, బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. కేంద్ర జల వనరుల నిపుణులే కాళేశ్వరాన్ని ఇంజనీరింగ్ అద్భుతమని చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం కక్షపూరిత వైఖరి అవలంబిస్తోందని మంత్రి ఆరోపించారు.
*మోదీ పన్నుల ప్రధాని..పనుల ప్రధాని కాదు: జగదీష్‌రెడ్డి
మంత్రి జగదీష్‌రెడ్డి ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ పన్నుల ప్రధాని..పనుల ప్రధాని కాదని అన్నారు. తల్లిపాలపై తప్ప అన్నింటిపై మోదీ పన్నులు వేస్తున్నారని ఆరోపించారు. వ్యాపారాలు, కాంట్రాక్టుల్లో బిజీగా ఉండి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గాన్ని మర్చిపోయారని పేర్కొన్నారు. కోమటి రెడ్డి ఆదివారం చేసిన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి స్పందించారు.
కొంత కాలంగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన అమిత్ షాను కలవడంతో ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ను గద్దెదించే పార్టీలో చేరుతానని గతంలో ఆయన ప్రకటించారు. అయితే ఏ పార్టీ అనే దానిపై స్పష్టంగా చెప్పలేదు. ఆదివారం హైదరబాదులో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆరోపంచారు. పార్టీ కార్యకర్తలతో చర్చించకుండా ఏ నిర్ణయం తీసుకోనని స్పష్టం చేశారు. TRS నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. తన రాజీనామాతో మునుగోడు అభివృద్ధి చెందుతుంది అనుకుంటే రాజీనామా చేసేందుకు సిద్ధమేనని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
*పార్టీ మారడం చారిత్రక అవసరం: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
టీఆర్ఎస్‌ను ఓడించే సత్తా బీజేపీ కి మాత్రమే ఉందని, పార్టీ మారడం చారిత్రక అవసరమని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి వెళ్తానని ప్రకటించారు. ఇప్పుడు సమయం వచ్చింది అనుకుంటున్నానని పేర్కొన్నారు. కేంద్రమంత్రి అమిత్‌షాతో రాజకీయాలపై మాట్లాడలేదని, తెలంగాణలోని పరిస్థితులపై అమిత్‌షాతో చర్చించానని తెలిపారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రం జీతాలు ఇవ్వలేని స్థితికి వచ్చిందని చెప్పారు. హుజురాబాద్ ఉపఎన్నికతో పోయిన ప్రతిష్టను.. మునుగోడు ఉపఎన్నికతో తిరిగి తెచ్చుకోవాలని సీఎం కేసీఆర్యోచిస్తున్నారని తెలిపారు. తనపై కేసీఆరే దుష్ప్రచారం చేయిస్తున్నారని, మునుగోడుకు ఉపఎన్నిక రావాలని తాను కోరుకోవడం లేదన్నారు. కేసీఆర్‌ను ఎదురుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని తప్పుబట్టారు. కొత్తగా వచ్చిన వాళ్ల కింద పనిచేయాలంటే ఇబ్బందేనని, జైలుకెళ్లి వచ్చిన వాళ్లు కూడా నీతులు చెప్తే ఎలా? అని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు.
*వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: పయ్యావుల
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ తప్పలేదంటూ వైసీపీ ప్రభుత్వ పెద్దలు రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్నారని పీఏసీ ఛైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి నేడు సాక్షి పత్రికలో కథనాలు రాస్తున్నారని, మీరు చెబుతున్నది వాస్తవాలైతే గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వం పాలన, ఈ మూడేళ్ల వైసీపీ పాలనలో చేసిన అప్పులపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎఫ్ఆర్బిఎం నిబంధనలు గాలికి వదిలేశారని చెబుతున్నవారు… అప్పుడు నిద్ర పోయారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఆరోజు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఈ రోజు ఆర్బీఐ ( చెప్పింది.. ఇంకొకరు చెప్పారంటూ టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయంటూ చెప్పడం శుద్ధ అబద్ధమన్నారు. పొరపాట్లు జరిగి ఉంటే బయటపెట్టాలన్నారు. వైసీపీ పాలనపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
*మంత్రి గుమ్మనూరిపై ఈడీ దర్యాప్తు జరపాలి: వర్ల
పశ్చిమబెంగాల్ మంత్రి పార్థు చటర్జీకి పట్టిన గతే ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరామ్‌కు పట్టాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఆదివారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మంత్రి జయరామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌తో విచారణ జరిపిస్తే… బెంగాల్ మంత్రిని అరెస్టు చేసినట్లే జయరాజ్‌నూ అరెస్టు చేయొచ్చు. సీఎంకి ఏమాత్రం నైతిక విలువలున్నా ఈడీ దర్యాప్తునకు ఆదేశించాలి. కార్మిక శాఖ అధికారుల బదిలీల్లో మంత్రి ఎన్ని లక్షలు దిగమింగారో లెక్క తేల్చాలి. కార్మిక శాఖ అధికారుల బదిలీ విషయంలో కమిషనర్ కార్తికేయ మిశ్రా తన మాట వినలేదని మంత్రి ఆయన ఉత్తర్వులను పక్కనపెట్టారు. జాయింట్ కమిషనర్‌ని అధీనంలోకి తెచ్చుకుని, ఆయనతో ఉత్తర్వులు ఇప్పించారు. ఈ మొత్తం వ్యవహారంపై సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని వర్ల డిమాండ్ చేశారు.
*అన్యాయం చేస్తే కోర్టుకు సమాధానం చెప్పాల్సి వస్తుంది: కొల్లు రవీంద్ర
టిడ్కో ఇళ్ల లబ్దిదారుల పక్షాన టీడీపీ పోరాడుతుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వాస్తవ లబ్దిదారులకు అన్యాయం చేస్తే కోర్టుకు సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. టీడీపీ హయాంలో మచిలీపట్నంలో 6,400 టిడ్కో ఇళ్లు నిర్మించి లబ్దిదారులకు ఫ్లాట్లు కేటాయించామని గుర్తుచేశారు. ఆ ఇళ్లను వైసీపీ తమ కార్యకర్తలకు కట్టబెట్టాలని చూస్తోందన్నారు. ఇళ్ల స్థలాల పూడిక పేరుతో పేర్నినాని, కొడాలి నాని వాటాలు వేసుకున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపేందుకు టీడీపీ సిద్ధమవుతోందన్నారు.
*వరద రాజకీయాలను తెరపైకి తెస్తున్నారు: మంత్రి సురేష్ఎ
త్తు, ముంపు గ్రామాల వ్యవహారం ముగిసిన అధ్యాయమని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లేని పోని వివాదాలకు తెరలేపడం సరికాదన్నారు. రాజకీయంగా అక్కడ ప్రతిపక్షాలతో పోటీపడలేకే.. వరద రాజకీయాలను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ఇవి వారి స్వార్థపూరిత మాటలు తప్ప వేరొకటి కాదన్నారు. తాము ఎక్కడా తమ పరిధి దాటలేదని ఆదిమూలపు సురేష్ తెలిపారు.
*మోదీ సర్కార్ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోంది: తులసిరెడ్డి
కేంద్రప్రభుత్వం పై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ సర్కార్ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఈడీ, సీబీఐ (CBI) సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ , కేంద్రమంత్రి అమిత్‌షాకు కాంగ్రెస్ నేతలు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మోదీ పాలనలో దేశం, జగన్ పాలనలో ఏపీ పరిస్థితి దారుణంగా మారిందన్నారు. సీఎం జగన్రా ష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని తులసిరెడ్డి దుయ్యబట్టారు.
* లంకకు వచ్చిన పరిస్థితులు రావటానికి ఎంతో సమయం పట్టదు: తులసిరెడ్డి
ఈడీ, సీబీఐ వంటి సంస్థలను కేంద్రంలోని భాజపా.. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులపై కక్షపూరిత రాజకీయాలకు ఉపయోగిస్తుందని.. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. మూడేళ్లలో జగన్ పాలనలో అప్పులు ఎక్కువయ్యాయని.. రాష్ట్రంలో శ్రీలంకకు వచ్చిన పరస్థితులు రావటానికి ఎంతో సమయం పట్టదని విమర్శించారు.ఈడీ, సీబీఐ వంటి సంస్థలను కేంద్రంలోని భాజపా.. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులపై కక్షపూరిత రాజకీయాలకు ఉపయోగిస్తోందని.. ఏపీసీసీ కార్యనిర్వాక అధ్యక్షులు తులసిరెడ్డి అన్నారు. ఈడీ విచారణ అనంతరం సోనియా, రాహుల గాంధీలు అగ్ని పునీతులుగా బయటకు వస్తారని అన్నారు. మూడేళ్లలో జగన్ పాలనలో అప్పుల ఆంధ్రప్రదేశ్, మద్యాంధ్రప్రదేశ్, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అయిందన్నారు. పరిస్థితి ఇలానే ఉంటే.. శ్రీలంక లో ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో రావడానికి ఎంతో సమయం పట్టదని విమర్శించారు.
*వరద బాధితులను ఆదుకోవడంలో ఏపీ సర్కార్ విఫలం: చంద్రబాబు
వరద బాధితులను ఆదుకోవడంలో ఏపీ సర్కార్ విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కార్‌పై నమ్మకం కోల్పోవడంతోనే విలీన గ్రామాల్లో ఆందోళన చేస్తున్నారని తెలిపారు. నీరు, విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందుల్లో వరద బాధితులున్నారని పేర్కొన్నారు. విలీన మండలాల్లో 14 రోజులుగా కరెంట్ సరఫరా లేకపోవడం దారుణమన్నారు. వరద బురదను తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. వారం క్రితమే వరదలు తగ్గాయన్న వైసీపీ మంత్రులు.. విద్యుత్ సరఫరా, రాకపోకలు ఎందుకు పునరుద్ధరించలేదు? అని ప్రశ్నించారు. జగన్ సర్కార్ నుంచి వరద బాధితులకు సాయం అందకపోవడంతోనే..తెలంగాణలో కలపాలని విలీన గ్రామాల ప్రజల ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితికి జగన్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల ప్రశ్నలపై ఎదురుదాడి మాని.. ప్రజల అవస్థలు తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పెద్దలు గాలి మాటలు, పర్యటనలు మానుకోవాలన్నారు. వరద బాధితులను యుద్ధప్రాతిపదికన ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు
*మోదీ సర్కార్ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోంది: తులసిరెడ్డి
కేంద్రప్రభుత్వం కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ సర్కార్ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఈడీ, సీబీఐ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ కేంద్రమంత్రి అమిత్‌షాకు కాంగ్రెస్ నేతలు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మోదీ పాలనలో దేశం, జగన్ పాలనలో ఏపీ పరిస్థితి దారుణంగా మారిందన్నారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని తులసిరెడ్డి దుయ్యబట్టారు
*కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లోపం లేదు: నిరంజన్‌రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపం లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోదావరి వరదలు మానవ తప్పిదం కాదని, ప్రకృతి విపత్తు అని చెప్పారు. నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ కట్టడానికే 30 ఏళ్ల పట్టిందని విమర్శించారు. తాము మూడేళ్లలోనే ప్రాజెక్ట్‌లు పూర్తి చేశామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్ట్‌పై కొందరు సైంధవ పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు. వరదల వల్ల పంటనష్టం జరగలేదని, ఇది ఇష్యూ కాదని నిరంజన్‌రెడ్డి తోచిపుచ్చారు
*పార్టీ మారడం చారిత్రక అవసరం: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
టీఆర్ఎస్ )ను ఓడించే సత్తా బీజేపీ )కి మాత్రమే ఉందని, పార్టీ మారడం చారిత్రక అవసరమని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి వెళ్తానని ప్రకటించారు. ఇప్పుడు సమయం వచ్చింది అనుకుంటున్నానని పేర్కొన్నారు. కేంద్రమంత్రి అమిత్‌షా రాజకీయాలపై మాట్లాడలేదని, తెలంగాణలోని పరిస్థితులపై అమిత్‌షాతో చర్చించానని తెలిపారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రం జీతాలు ఇవ్వలేని స్థితికి వచ్చిందని చెప్పారు. హుజురాబాద్ ఉపఎన్నికతో పోయిన ప్రతిష్టను.. మునుగోడు ఉపఎన్నికతో తిరిగి తెచ్చుకోవాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని తెలిపారు. తనపై కేసీఆరే దుష్ప్రచారం చేయిస్తున్నారని, మునుగోడుకు ఉపఎన్నిక రావాలని తాను కోరుకోవడం లేదన్నారు. కేసీఆర్‌ను ఎదురుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని తప్పుబట్టారు. కొత్తగా వచ్చిన వాళ్ల కింద పనిచేయాలంటే ఇబ్బందేనని, జైలుకెళ్లి వచ్చిన వాళ్లు కూడా నీతులు చెప్తే ఎలా? అని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు
*వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: పయ్యావుల
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ తప్పలేదంటూ వైసీపీ ప్రభుత్వ పెద్దలు రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్నారని పీఏసీ ఛైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి , నేడు సాక్షి పత్రికలో కథనాలు రాస్తున్నారని, మీరు చెబుతున్నది వాస్తవాలైతే గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వం పాలన, ఈ మూడేళ్ల వైసీపీ పాలనలో చేసిన అప్పులపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎఫ్ఆర్బిఎం నిబంధనలు గాలికి వదిలేశారని చెబుతున్నవారు… అప్పుడు నిద్ర పోయారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఈ రోజు ఆర్బీఐ చెప్పింది.. ఇంకొకరు చెప్పారంటూ టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయంటూ చెప్పడం శుద్ధ అబద్ధమన్నారు. పొరపాట్లు జరిగి ఉంటే బయటపెట్టాలన్నారు. వైసీపీ పాలనపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
*కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో జగన్ సర్కార్ చెలగాటం: ఆనం
ఏపీ (AP)లో మద్యం అమ్మకాలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కల్తీ మద్యం తో ప్రజల ప్రాణాలతో జగన్ సర్కార్ చెలగాటమాడుతోందని, ఏ1, ఏ2 బినామీ కంపెనీల కల్తీ మద్యంతో ప్రజలు చనిపోతున్నారని ఆరోపించారు. హెరిటేజ్ పాల తో కల్తీ మద్యం బ్రాండ్‌లను పోలుస్తారా? అని ప్రశ్నించారు. బేవరేజస్ ఫోరెన్సిక్ ఆడిట్ కి సర్కార్ సిద్ధమా? అని ఆనం వెంకటరమణారెడ్డి సవాల్ చేశారు.
*వరద రాజకీయాలను తెరపైకి తెస్తున్నారు: మంత్రి సురేష్పో
లవరం ఎత్తు, ముంపు గ్రామాల వ్యవహారం ముగిసిన అధ్యాయమని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లేని పోని వివాదాలకు తెరలేపడం సరికాదన్నారు. రాజకీయంగా అక్కడ ప్రతిపక్షాలతో పోటీపడలేకే.. వరద రాజకీయాలను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ఇవి వారి స్వార్థపూరిత మాటలు తప్ప వేరొకటి కాదన్నారు. తాము ఎక్కడా తమ పరిధి దాటలేదని ఆదిమూలపు సురేష్ తెలిపారు.
*మోదీ సర్కార్ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోంది: తులసిరెడ్డి
కేంద్రప్రభుత్వం పై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ సర్కార్ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఈడీ, సీబీఐ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ , కేంద్రమంత్రి అమిత్‌షాకు కాంగ్రెస్ నేతలు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మోదీ పాలనలో దేశం, జగన్ పాలనలో ఏపీ పరిస్థితి దారుణంగా మారిందన్నారు. సీఎం జగన్రా ష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని తులసిరెడ్డి దుయ్యబట్టారు.
**మోదీ విధానాలు దేశ భద్రతకు ప్రమాదం: ఉత్తమ్
సాయుధ బలగాల విషయంలో మోదీ ప్రభుత్వ విధానాలు దేశభద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ మోదీ నిర్ణయాలు త్రివిధ దళాలను బలహీన పరుస్తున్నాయని ఆరోపించారు. చైనా, పాకిస్తాన్ నుంచి దేశానికి రెండు వైపులా ముప్పు పొంచి ఉన్న క్రమంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం సరికాదని సూచించారు. ఉండాల్సిన దానికంటే ఆర్మీలో 1,16,464 సైనికుల బలం తక్కువగా ఉందని, నేవీలో 13,597 మంది, ఎయిర్ ఫోర్స్‌లో 5723 మంది తక్కువగా ఉన్నారని వివరించారు. మాజీ ఎయిర్‌పోర్స్ అధికారిగా సిబ్బంది కొరత తనను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని తెలిపారు. ‘అగ్నిపథ్’ త్రివిధ దళాలను బలహీనపరుస్తోందన్నారు.
*కేసీఆర్‌కు జనం కష్టాలు పట్టవు: విజయశాంతి
సీఎం కేసీఆర్ , టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా జనం నానా ఇబ్బందులు పడుతుంటే.. కేసీఆర్ మాత్రం ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజలు కష్టాలు పట్టడం లేదన్నారు. వారు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరగకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. భారీ వర్షాల గురించి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా..ప్రభుత్వం మొద్దునిద్రపోతోందని సోషల్ మీడియాలో విమర్శించారు.
*ఇప్పటికంటే ఎక్కువ వరదలు సంభవించే ప్రమాదం: కేసీఆర్
భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మరో 2, 3 రోజులు భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికంటే ఎక్కువ వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు వారి కేంద్రాలను వదిలి వెళ్లకూడదన్నారు. గోదావరి నది ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహించే ప్రమాదం ఉందని సీఎం పేర్కొన్నారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసులు హెడ్‌క్వార్టర్స్ వదిలి వెళ్లవద్దని డీజీపీకి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
*మోదీ విధానాలతో దేశ భద్రతకు ముప్పు: ఉత్తమ్
ప్రధాని మోదీ విధానాలతో దేశ భద్రతకు ముప్పు అని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ నిర్ణయాలు త్రివిధ దళాలను బలహీనపరుస్తున్నాయని తప్పుబట్టారు. అగ్నిపథ్ ద్వారా త్రివిధ దళాల్లో సైన్యం బలగాన్ని తగ్గిస్తున్నారని మండిపడ్డారు. ఏడాదికి ఆర్మీ లో రిక్రూట్‌మెంట్స్‌ను 60 వేల నుంచి 40 వేలకు తగ్గించారని విమర్శించారు. అగ్నిపథ్ ద్వారా ఆర్మీలో 40 వేలు, నేవీలో 3 వేలు, ఎయిర్‌ఫోర్స్‌లో 3 వేల పోస్టులు ఇస్తున్నారని తెలిపారు. ఆర్మీ స్కిల్స్ చంపేసేలా అగ్నిపథ్ పథకం ఉందని దుయ్యబట్టారు. కావాల్సిన సైనిక బలానికి అనుగుణంగా రిక్రూట్‌మెంట్ చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. నిరుద్యోగం పెరగడం వల్లే అగ్నిపథ్ స్కిమ్‌లో రిజిస్టర్ చేసుకుంటున్నారని తెలిపారు. నాణ్యతా శిక్షణలో రాజీపడొద్దన్నారు. పాత విధానంలోనే సైనిక రిక్రూట్‌మెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. తొలిసారి ఒకే సమయంలో చైనా, పాక్‌తో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని, చైనా సరిహద్దు చర్యలను మోదీ పట్టించుకోకపోవడం దురదృష్టమని వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో చైనా గ్రామాలు నిర్మిస్తున్నా కేంద్రం పట్టించుకోవట్లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.
*రైతును ఆదుకోవడంలో ఉదారత ఏది?: సోమిరెడ్డి
‘‘గతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు టీడీపీ ప్రభుత్వం రైతులను ఉదారంగా ఆదుకొంది. ఇప్పుడు గోదావరి వరదల్లో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వంలో ఆ ఉదారత కొరవడింది’’ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం పాటి కూడా ఏపీ ప్రభుత్వం సాయం చేయడం లేదని విమర్శించారు. రైతులు ఇంత నష్టపోతే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని నిగ్గదీశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వరద బాధిత వ్యవసాయ, ఆక్వా రైతులకు, గాయపడిన, ఇళ్లు కోల్పోయిన బాధితులకు అందించిన సాయాన్ని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇస్తోన్న సాయాన్ని పోల్చుతూ వివరించారు. ప్రతి విషయంలోనూ రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
*విద్యా వ్యవస్థనూ నాశనం చేశారు: అశోక్‌బాబు
‘‘ఆంధ్రప్రదేశ్‌లో బాగా చదువుకొంటారని, చదువు చెబుతారని దేశం అంతా పేరు. ఈ రాష్ట్రానికి ఉన్న పెద్ద బలమే విద్య. జగన్ ప్రభుత్వం ఆ బలాన్ని కూడా నాశనం చేసేదాకా నిద్ర పోవడం లేదు’’ అని ఎమ్మెల్సీ పీ అవోక్ బాబు విమర్శించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆర్థిక రంగం తర్వాత విద్యా రంగమే ఎక్కువ నాశనం అయింది. ఏ ఫలితాలు వచ్చినా రాష్ట్రం అట్టడుగున కనిపిస్తోంది. పేద వర్గాల పిల్లలకు ఇళ్లకు దగ్గర్లో ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఉన్నత పాఠశాలల్లో విలీనం పేరుతో అందులో ఉన్న చిన్న పిల్లలను దూరంగా ఉన్న స్కూళ్లకు మార్చారు. నాడు నేడు పేరుతో వేల కోట్లు పాఠశాలల మీద గుమ్మరించారు. వైసీపీ నేతలు తిన్నంత తిన్నారు. ఇప్పుడు విలీనం పేరుతో ఆ పాఠశాలల నుంచి విద్యార్థులను ఇంకో చోటకు తరలించారు. తాళాలు వేయడానికా నాడు నేడు పేరుతో నిధుల ఖర్చు?’’ అని ప్రశ్నించారు.