దేశంలో విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు అంతకంతకూ తరిగిపోతున్నాయి. ఈ నెల 22తో ముగిసిన వారంలో మరో 1.152 బిలియన్ డాలర్లు క్షీణించి 571.56 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది. డాలర్‌తో పోల్చితే భారత కరెన్సీ రూపాయి మారకం విలువ క్రమేణా పడిపోతుండటం.. ఫారెక్స్ నిల్వలపై ఒత్తిడిని పెంచుతున్నది. కాగా, నిరుడు సెప్టెంబర్‌లో ఫారెక్స్ రిజర్వులు మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 642 బిలియన్ డాలర్లను తాకాయి. అయితే అప్పటితో పోల్చితే ఇప్పుడు 71 బిలియన్ డాలర్లు పతనమవడం ఒకింత ఆందోళనకు గురిచేస్తున్నది. అయితే బంగారం నిల్వల విలువ 145 మిలియన్ డాలర్లు పెరిగి 38.502 బిలియన్ డాలర్లకు చేరినట్టు ఆర్బీఐ వెల్లడించింది.
*హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే సిగ్నిటీ టెక్నాలజీస్ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి రూ.152.23 కోట్ల నికర అమ్మకాలపై రూ.15 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 62.16 శాతం, నికర లాభం 108.93 శాతం పెరిగాయి.
*జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో జీఎంఆర్ ఇన్‌ఫ్రా నష్టాలు భారీగా తగ్గించుకుంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.317.91 కోట్లు ఉన్న కంపెనీ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.112.99 కోట్లకు తగ్గాయి. కంపెనీ టర్నోవర్ రూ.1,011 కోట్ల నుంచి రూ.1,641.39 కోట్లకు పెరగడం ఇందుకు బాగా కలిసొచ్చింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ నిర్వహణలోని ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఆదాయం 79ు, హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఆదాయం 87ు పెరిగాయి. అయితే ఖర్చులు రూ.1,217.39 కోట్ల నుంచి రూ.1,751.64 కోట్లకు పెరగడం కంపెనీ పనితీరును దెబ్బతీసింది.
* దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. శుక్రవారం సెన్సెక్స్ 712.46 పాయింట్ల లాభంతో 57,570.25 వద్ద క్లోజవగా నిఫ్టీ 228.65 పాయింట్ల లాభంతో 17,158.25 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీ గత మూడు నెలల్లో ఇంత గరిష్ఠ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. దీంతో గత మూడు రోజుల్లోనే బీఎ్‌సఈలో నమోదైన కంపెనీల షేర్ల మార్కెట్ విలువ రూ.9.03 లక్షల కోట్లు పెరిగి రూ.266.58 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ హెవీ వెయిట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎ్‌ఫసీ ద్వయం ఇందుకు ప్రధానంగా దోహ దం చేశాయి. ప్రధాన కంపెనీల తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉండడం, ఎఫ్‌పీఐల పునఃప్రవేశం, ఇక వడ్డీ రేట్లు దూకుడుగా పెంచేది లేదన్న అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ చీఫ్ ప్రకటన శుక్రవారం దేశీ మార్కెట్‌ను ర్యాలీబాట పట్టించాయి.
*జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో జీఎంఆర్ ఇన్‌ఫ్రా నష్టాలు భారీగా తగ్గించుకుంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.317.91 కోట్లు ఉన్న కంపెనీ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.112.99 కోట్లకు తగ్గాయి. కంపెనీ టర్నోవర్ రూ.1,011 కోట్ల నుంచి రూ.1,641.39 కోట్లకు పెరగడం ఇందుకు బాగా కలిసొచ్చింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ నిర్వహణలోని ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఆదాయం 79ు, హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఆదాయం 87ు పెరిగాయి. అయితే ఖర్చులు రూ.1,217.39 కోట్ల నుంచి రూ.1,751.64 కోట్లకు పెరగడం కంపెనీ పనితీరును దెబ్బతీసింది.
*ఆంధ్రప్రదేశ్, విజయవాడలోని దుర్గా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కొరడా ఝుళిపించింది. ఈ బ్యాంక్ ఖాతాదారులు తమ డిపాజిట్ల నుంచి రూ.1.5 లక్షలకు మించి విత్‌డ్రా చేసుకోకుం డా ఆంక్షలు విధించింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితులు దిగజారడంతో ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంది. ఆరు నెలల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత బ్యాంక్ ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు.
*ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీ) జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.1.55 లక్షల కోట్ల ఆదాయంపై రూ.1,992 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఏకంగా రూ.5,941.37 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదలకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేకపోవడంతో కంపెనీకి భారీగా గండిపడింది.