బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ఇన్‌స్టా వేదికగా మరో సంచలన పోస్ట్ పెట్టారు. బాలీవుడ్ మాఫియా తనని వేధిస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఆమె.. ఇప్పుడు ఆ వ్యక్తలు ఎవరో చెప్పేసింది. ఇంతకీ ఆమె చేసిన సంచలన కామెంట్స్ ఏంటంటే? తనుశ్రీ దత్తా తాజాగా చేసిన షేర్ చేసిన పోస్టులో ఆమెను ఎవరు వేధిస్తున్నారో చెప్పేశారు. ప్రధానంగా నానా పటేకర్ పేరును ప్రస్తావించారు.తనకు ఏమైనా జరిగితే.. నానా పటేకరే బాధ్యులు అని షాకింగ్ కామెంట్ చేశారు తను శ్రీ. నాకు ఏదైనా జరిగితే.. నానా పటేకర్, ఆయన లాయర్.. బాలీవుడ్లో వారి స్నేహితుల మాఫియానే కారణం’ అని పేర్కొన్నారు తను శ్రీ.’సుషాంత్ సింగ్ రాజ్ పుత్ విషయంలో బయటకి వచ్చిన పేర్లే బాలీవుడ్ మాఫియాలో ఉన్నాయి. వీరందరికీ ఒకే లాయర్ కామన్‌గా ఉంటాడు.’వాళ్ల కేసులన్నీ ఆయనే డీల్ చేస్తుంటాడు. వారి సినిమాలు చూడకండి. ఇండస్ర్టీ నుంచి వారిని బహిష్కరించండి. కొంత మంది పరిశ్రమ వ్యక్తులు, పీఆర్ టీమ్ నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు’ అని తన ఇన్ స్టా పోస్ట్‌లో వివరించారు.’మళ్లీ కలుద్దాం’ అనే మాటను పోస్ట్ చివరలో జోడించారు తను శ్రీ.అయితే మరో సంచలన పోస్ట్‌తో తను శ్రీ దత్తా ముందుకు రావొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.ఇప్పుడు నానా పటేకర్ పేరును బయట పెట్టినట్లు.. ఇంకా ఎవరి పేర్లను ఆమె చెప్పనున్నారనేది చర్చనీయాంశంగా మారింది.