సింగపూర్ “శ్రీ సాంస్కృతిక కళాసారథి” సంస్థ రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, కార్యవర్గ సభ్యులందరూ కలిసి “మా రెండేళ్ల ప్రయాణం” అనే కార్యక్రమం నిర్వహించారు.
సంస్థ వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్, కార్యవర్గ సభ్యులు రాధిక మంగిపూడి, ఊలపల్లి భాస్కర్, చామిరాజు రామాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమాలను నిర్వహించడం వెనుక తమ కృషి, ఎదుర్కొన్న సవాళ్లు, రూపకల్పన విధానం, సాంకేతిక ఇబ్బందులు గురించి ప్రసంగించారు.
తమ రెండేళ్ల ప్రస్థానంలో తమ సంస్థను కలుపుకొని ప్రోత్సహించిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్, తానా, మలేషియా తెలుగు సంఘం, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య, వీధి అరుగు నార్వే, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మొదలైన ప్రపంచవ్యాప్త సంస్థలకు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమన్వయకర్తగా సుబ్బు వి పాలకుర్తి వ్యవహరించగా, గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని సాంకేతిక నిర్వహణలో ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.