సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్‌లోని అవర్ టాంపనీస్ హబ్‌లో బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించింది. జూలై 30 మరియు 31 తేదీలలో ఉదయం 11 నుండి సాయంత్రం 6 గంటల వరకు బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా స్థానిక తెలుగు క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 140 మంది పురుషులు, 60 మంది మహిళలు, 50 మంది చిన్నారులు ఉన్నారు. ఈ రెండు రోజుల టోర్నీలో వివిధ విభాగాల్లో 400+ మ్యాచ్‌లు నిర్వహించి విజేతలను ప్రకటించారు. STS అధ్యక్షుడు కోటిరెడ్డి మాట్లాడుతూ క్రీడలు మన శక్తిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయని, వినోదానికి సాధనంగా నిలుస్తాయన్నారు. విజేతలకు స్పాన్సర్లతో బహుమతులు పంపిణీ చేశారు. నిర్వాహకులు మల్లికార్జున్ పాలెపు, శ్రీనివాస్ రెడ్డి పుల్లన్నగారి, కార్యదర్శి సత్య చిర్ల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
సింగపూర్‌లో ఉల్లాసంగా బ్యాడ్మింటన్ పోటీలు
Related tags :