నందమూరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దివంగత నటుడు నందమూరి తారక రామారావు కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి (52) ఆత్మహత్య చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సోమవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో ఆమె ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. ఉమా మహేశ్వరి మృతితో ఎన్టీఆర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోగా ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కాగా ఉమా మహేశ్వరి.. సీనియర్ ఎన్టీఆర్ నాలుగో కూతురు. ఇటీవలే ఆమె కూతురి వివాహం ఘనంగా జరిగింది.
ఎన్.టి.ఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య
Related tags :