నటనకు ఆస్కారమున్న ఓ బలమైన పాత్ర చేయాలంటే నిత్యా మీనన్ వైపు చూస్తారు దర్శకులు. నటిగా ఆమెకున్న గుడ్ విల్ అది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన నిత్యా…హీరోయిన్గా అరంగేట్రం చేసి పుష్కరకాలమవుతున్నది. ఇప్పటికి తను చేయాలనుకున్నది చేసే స్థాయికి చేరానని చెబుతున్నదీ తార. ఈ ఏడాది ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులు అలరించింది నిత్యా. ప్రస్తుతం ఆమె ఖాతాలో ‘19 (1) ఏ’, ‘ఆరమ్ తిరుకల్పన’ వంటి మలయాళ చిత్రాలతో పాటు తమిళంలో ధనుష్ సరసన ‘తిరుచిత్రాంబలం’ సినిమా ఉంది. తన నట ప్రయాణంపై ఇటీవల నిత్యా మీనన్ స్పందిస్తూ…‘నటిగా నేను ఒక ముద్ర వేశానని అంతా చెబుతుంటారు. అంత గొప్పగా కాకున్నా నటిగా నాకు నేను ఫర్వాలేదని అనుకుంటా. ఇన్నేళ్లకు నేను ఏ పాత్రలో నటించాలి, ఏది వదులుకోవాలి అనే స్పష్టతకు వచ్చాను. అలా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వచ్చింది. కథ అనేది చిత్రానికి ఆత్మ లాంటిది అనేది నా అభిప్రాయం. అలాంటి కథా బలమున్న చిత్రాలే నా తొలి ప్రాధాన్యత. ఈ మధ్య సినిమాకు చాలా పరిమితులు పెడుతున్నారు. సినిమాలకు ఇది ఓటీటీ కోసం, ఇది థియేటర్ రిలీజ్ కోసం అనే గీత గీయడమూ తప్పే. నా దృష్టిలో ప్రతి సినిమా థియేటర్ విడుదల కోసమే అనుకోవాలి’ అని చెప్పింది