Movies

ప్రభాస్ గుడ్ బాయ్ అంటున్న హీరోయిన్

ప్రభాస్ గుడ్ బాయ్ అంటున్న హీరోయిన్

‘కెరీర్‌లో ఎంతో మంది హీరోలతో కలిసి పనిచేశా. కానీ ప్రభాస్‌లాంటి ఉదాత్తమైన వ్యక్తిత్వం ఉన్న హీరోను చూడలేదు’ అని చెప్పింది కథానాయిక కృతిసనన్‌. ప్రస్తుతం ఈ భామ పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కృతిసనన్‌ సీత పాత్రలో నటిస్తున్నది. ఈ సందర్భంగా ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో ప్రభాస్‌ను ప్రశంసలతో ముంచెత్తింది కృతిసనన్‌. ప్రభాస్‌తో మరో సినిమా చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘ప్రభాస్‌ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహ నటుల నుంచి లైట్‌బాయ్‌ వరకు ప్రతి ఒక్కరితో వినమ్రంగా ఉంటారు. ముఖ్యంగా ఆయన కళ్లలో ఏదో తెలియని స్వచ్ఛత, ఆకర్షణ కనిపిస్తాయి. ఆ కళ్లలోని భావాల్ని అర్థం చేసుకుంటే చాలు ఆయన హృదయం తాలూకు సున్నితత్వం ఏమిటో తెలిసిపోతుంది. ‘ఆదిపురుష్‌’లో రాముడి పాత్రకు ప్రభాస్‌ పరిపూర్ణంగా న్యాయం చేస్తున్నాడు’ అని చెప్పింది. ప్రస్తుతం కృతిసనన్‌ బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.