ఉక్రెయిన్ యుద్ధం వల్ల శరణార్ధులుగా మారిన చిన్నారులతో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా గడిపారు. పోలాండ్‌లో ఉన్న వేర్వేరు శరణార్థి శిబిరాలను ఆమె సందర్శించారు. యూనిసెఫ్‌తో అనుబంధం ఉన్న ప్రియాంకా .. పోలాండ్ టూర్‌కు చెందిన ఫోటోలను తన ఇన్‌స్టాలో అప్డేట్ చేసింది. పిల్లలతో ఆడుకుంటున్న, పెయింటింగ్ వేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. శరణార్థి శిబిరాల్లో సేద తీరుతున్న చిన్నారులకు ఆమె గిఫ్ట్‌లు కూడా ఇచ్చింది. తన ఇన్‌స్టాలో ఆమె ఓ నోట్ కూడా రాసింది. ఉక్రెయిన్ సంక్షోభం వల్ల చెల్లాచెదురైన చిన్నారులకు మానసిక సాంత్వక కల్పించేందుకు యూనిసెఫ్ అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రియాంకా వెల్లడించింది. సైకాలజిస్టులు అందుబాటులో ఉన్నట్లు చెప్పింది.