బ్రిటన్ ప్రధాని రేసులో గత కొన్ని రోజులుగా వెనుకబడ్డ రిషి సునాక్ కాస్త ముందడుగు వేశారు. తాజా సర్వేలో ఆయన లిజ్ ట్రస్ కంటే కేవలం 5పాయింట్ల వెనుకంజలో ఉన్నారు. 807మంది కన్జర్వేటీవ్ పార్టీ సభ్యులతో గత వారం నిర్వహించిన ఈ సర్వే ఫలితాన్ని మంగళవారం ప్రకటించారు. ఇందులో లిజ్ ట్రస్‌కు 48% మంది, రిషికి 43% మంది మద్ధతు తెలిపారు. మరో 9% మంది ఎటూ తేల్చుకోలేకపోయారు.