Politics

కేంద్రం పై నిప్పులు చెరిగిన రాహూల్ – TNI నేటి రాజకీయ వార్తలు

కేంద్రం పై నిప్పులు చెరిగిన రాహూల్ –  TNI  నేటి  రాజకీయ వార్తలు

*ఎన్డీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో ప్రజాస్వామ్యం చనిపోతోందని అన్నారు. ఇద్దరు-ముగ్గురు బడా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసం ఇద్దరు కలిసి దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు రాహుల్. శతాబ్ద కాలంగా నిర్మించుకున్న భారత దేశాన్ని మన కళ్ల ముందే ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై గళం ఎత్తితే ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపించారు. శుక్రవారం దిల్లీలో ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి రాహుల్.. భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “ప్రజాస్వామ్యం మరణాన్ని మనం చూస్తున్నాం. శతాబ్దకాలంపాటు ఇటుక ఇటుక పోగేసి నిర్మించిన భారత దేశం మన కళ్ల ముందే ధ్వంసమైపోతోంది. నియంతృత్వానికి ఎదురు నిలిచినవారిపై దాడులు చేస్తున్నారు, జైల్లో వేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, హింస.. ఇలా ప్రజాసమస్యలేవీ ప్రస్తావించరాదన్నదే వారి ఆలోచన. నలుగురు, ఐదుగురు ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇద్దరు, ముగ్గురు బడా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసం ఇద్దరు వ్యక్తులు నియంత పాలన సాగిస్తున్నారు.” అని మండిపడ్డారు రాహుల్ గాంధీ.నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతల్ని విచారించడంపై స్పందించారు రాహుల్. తమను ఎంతైనా ప్రశ్నించుకోవచ్చని అన్నారు. అసలు అక్కడ(హెరాల్డ్ కేసులో) ఏమీ లేదన్న విషయం అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించడమే తన పని అని.. అందుకు ప్రతిగా తనపై దాడి చేసినా ఏమాత్రం తగ్గబోనని స్పష్టం చేశారు.

* సోనియా, రాహుల్‌, ప్రియాంకా.. న‌లుపు దుస్తుల్లో నిర‌స‌న‌
కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఇవాళ న‌లుపు రంగు దుస్తుల్లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ధ‌ర‌ల పెరుగుద‌ల‌, ద్ర‌వ్యోల్బ‌ణంకు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు దేశ‌వ్యాప్త ఆందోళ‌న చేప‌ట్టారు. అయితే వాళ్ల‌కు మ‌ద్ద‌తుగా ఇవాళ సోనియా, రాహుల్‌, ప్రియాంకా గాంధీ, మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గేలు న‌ల్లు దుస్తులు వేసుకున్నారు. రాహుల్ బ్లాక్ క‌ల‌ర్ షర్ట్ వేసుకోగా, ప్రియాంకా బ్లాక్ సూట్ వేసుకున్నారు. ప్ర‌ధాని మోదీని హిట్ల‌ర్‌తో పోల్చారు రాహుల్‌. హిట్ల‌ర్ కూడా ఎన్నిక‌లు గెలిచాడ‌ని, అత‌ను ఎలా గెలిచాడ‌నుకుంటున్నారు, జ‌ర్మ‌నీలోని అన్ని ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల్ని త‌న గుప్పిట్లోకి తెచ్చుకున్నాడ‌ని, నాకు వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా అప్ప‌గిస్తే, అప్పుడు ఎన్నిక‌లు ఎలా గెల‌వాలో చూపిస్తాన‌ని రాహుల్ అన్నారు. ఏఐసీసీ ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ద్ద ప్రియాంకా వ‌ద్ద రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న చేప‌ట్టారు.

* వైసీపీ నుంచి ఎంపీ గోరంట్లను బహిష్కరించాలి : సీపీఐ నేత రామకృష్ణ
సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అశ్లీల వీడియో కాల్‌ వ్యవహారంపై సీపీఐ నాయకుడు రామకృష్ణ మండిపడ్డారు. వెంటనే ఎంపీని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉంటూ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని ఆయన తప్పుబట్టారు. మాధవ్‌ వ్యవహారం ఢిల్లీలోని ఎంపీల సెల్‌ఫోన్లోనూ చకర్లు కొడుతుందని తెలిపారు.
తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో దెబ్బతీశారని ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం నరేంద్ర మోదీ, అమిత్ షాకు లొంగిపోయి ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న సమస్యలపై పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. విభజన హామీలు,విశాఖ ఉక్కు కర్మాగారం గురించి కేంద్రంతో పోరాడడం లేదని అన్నారు. కేంద్రంతో పోరాడేది ఏమీ లేనందున వైసీపీ నాయకులందరూ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

* T Congressకు మరో దెబ్బ.. దాసోజు శ్రవణ్‌ రాజీనామా
తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. పార్టీకి కీలక నేత దాసోజు శ్రవణ్‌ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తో ప్రారంభమైన రాజీనామాల పర్వం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఆ తరువాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన పార్టీ మారుతారేమోననే ప్రచారాన్ని బలపరిచేలా ఉన్నాయి. ప్రస్తుతం దాసోజు శ్రవణ్ కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టి.కాంగ్రెస్‌లో విజయారెడ్డి చేరికపై దాసోజు శ్రవణ్‌ అసంతృప్తితో ఉన్నారు. దీంతో నేడు ఆయన తన రాజీనామాను ప్రకటించారు.

* దేశంలో ఆ ఇద్దరి ‘నియంత’ పాలన.. ప్రశ్నిస్తే దాడులే!’
ఎన్డీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో ప్రజాస్వామ్యం చనిపోతోందని అన్నారు. ఇద్దరు-ముగ్గురు బడా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసం ఇద్దరు కలిసి దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు రాహుల్. శతాబ్ద కాలంగా నిర్మించుకున్న భారత దేశాన్ని మన కళ్ల ముందే ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై గళం ఎత్తితే ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపించారు. శుక్రవారం దిల్లీలో ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి రాహుల్.. భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.”ప్రజాస్వామ్యం మరణాన్ని మనం చూస్తున్నాం. శతాబ్దకాలంపాటు ఇటుక ఇటుక పోగేసి నిర్మించిన భారత దేశం మన కళ్ల ముందే ధ్వంసమైపోతోంది. నియంతృత్వానికి ఎదురు నిలిచినవారిపై దాడులు చేస్తున్నారు, జైల్లో వేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, హింస.. ఇలా ప్రజాసమస్యలేవీ ప్రస్తావించరాదన్నదే వారి ఆలోచన. నలుగురు, ఐదుగురు ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇద్దరు, ముగ్గురు బడా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసం ఇద్దరు వ్యక్తులు నియంత పాలన సాగిస్తున్నారు.” అని మండిపడ్డారు రాహుల్ గాంధీ.నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతల్ని విచారించడంపై స్పందించారు రాహుల్. తమను ఎంతైనా ప్రశ్నించుకోవచ్చని అన్నారు. అసలు అక్కడ(హెరాల్డ్ కేసులో) ఏమీ లేదన్న విషయం అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించడమే తన పని అని.. అందుకు ప్రతిగా తనపై దాడి చేసినా ఏమాత్రం తగ్గబోనని స్పష్టం చేశారు.”వారు గాంధీ కుటుంబంపై ఎందుకు దాడి చేస్తారు? ఎందుకంటే.. మేము ఒక సిద్ధాంతం కోసం పోరాడతాం కాబట్టి. మాలాంటి వారు కోట్ల మంది ఉన్నారు. మేము ప్రజాస్వామ్యం కోసం, సమాజంలో సామరస్యం కోసం పోరాడతాం. ఎన్నో ఏళ్లుగా ఇలానే చేస్తున్నాం. మా కుటుంబం ప్రాణత్యాగాలు చేసింది. ఈ సిద్ధాంతం కోసం పోరాడేటప్పుడు అది మా బాధ్యత కూడా. రెండు వర్గాల మధ్య గొడవలు పెడుతుంటే, దళితుల్ని చంపేస్తుంటే, మహిళల్ని కొడుతుంటే చాలా బాధ కలుగుతుంది. అందుకే మేము పోరాడతాం. ఇది ఒక కుటుంబం కాదు.. ఒక సిద్ధాంతం” అని అన్నారు రాహుల్ గాంధీ.నిరుద్యోగం, ధరల పెరుగుదల విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ అగ్రనేత. దేశ ఆర్థిక రంగంలో అసలు ఏం జరుగుతుందో ఆమెకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఆమె రాజకీయ పార్టీకి అధికార ప్రతినిధిగా మాత్రమే ఉన్నారని విమర్శించారు. ఎన్నికల్లో భాజపా వరుస విజయాలపైనా తనదైన శైలిలో స్పందించారు రాహుల్. “హిట్లర్ కూడా ఎన్నికల్లో గెలిచేవాడు. ఎలా గెలిచాడు? జర్మనీలోని వ్యవస్థలన్నీ అతడి నియంత్రణలోనే ఉండేవి. నాకు వ్యవస్థ మొత్తాన్ని అప్పగించండి. ఎన్నికలు ఎలా గెలవాలో నేను చూపిస్తా” అని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత.

* ఇకపై రేవంత్‌రెడ్డి ముఖం చూడను: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
కాంగ్రెస్‌లో చెరుకు సుధాకర్ (Sudhakar) చేరికపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిమండిపడ్డారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెపెద్దతప్పు చేశారని విమర్శించారు. తనను ఓడించాలనుకున్న వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఇకపై రేవంత్‌రెడ్డి ముఖం చూడనని అన్నారు. పార్లమెంట్ సమావేశాల తర్వాతే మునుగోడుకు వెళ్తానని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.కాగా మీడియా ప్రశ్నలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అలాగే వెంకట్రెడ్డి తీరుపై కూడా మీడియా ప్రతినిధులు మండిపడ్డారు. పనికిరాని మునుగోడు గురించి అడుగుతున్నారని బాధగా ఉందని వెంకట్రెడ్డి అన్నారు. వరద సాయం గురించి ఇప్పటివరకు ఎవరూ ప్రస్తావించలేదన్నారు. ప్రధాని, హోంమంత్రి అపాయింట్మెంట్ కూడా కోరానన్నారు. గుజరాత్ తర్వాత.. తెలంగాణాయే ధనిక రాష్ట్రమని సీఎం కేసీఆర్ చెప్పారని, ఇప్పుడు పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి పడిపోయిందని విమర్శించారు. రాష్ట్రం ఇలా ఉన్నప్పుడు.. సీఎం కేసీఆర్ వరద బాధితులకు ఇంకేం సాయం చేస్తారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గురించి తాను మాట్లాడనని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు.

* ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ ఇవాళ మీడియాతో మాట్లాడారు. పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌జాస్వామ్య ఖూనీని తిల‌కిస్తున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. శ‌తాబ్ధం క్రిత‌మే ఇటుక ఇటుక పేర్చి నిర్మించిన ఇండియాను మ‌న కండ్ల ముందే నాశ‌నం చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. నియంతృత్వ పోక‌డకు వ్య‌తిరేకంగా పోరాటం చేసిన‌వాళ్ల‌ను దారుణంగా అటాక్ చేస్తున్నార‌ని, జైలులో వేస్తున్నార‌ని రాహుల్ విమ‌ర్శించారు. తాము ప్ర‌జ‌ల కోసం పోరాటం చేస్తున్న‌ట్లు తెలిపారు. నిత్యావ‌స‌ర ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని, నిరుద్యోగం పెరిగింద‌ని, స‌మాజంలో హింస కూడా అధిక‌మైన‌ట్లు రాహుల్ అన్నారు. కానీ వీటి గురించి మాట్లాడ‌కుండా ప్ర‌భుత్వం విప‌క్షాల‌ను అణిచివేస్తోంద‌న్నారు. కేవ‌లం న‌లుగురు లేదా అయిదుగురి ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌భుత్వం న‌డుస్తోంద‌ని, ఇద్ద‌రు ముగ్గురు చేసిన వ్యాపారానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుందోని ఆరోపించారు. సీడ‌బ్ల్యూసీ స‌భ్యులు, సీనియ‌ర్ నేతలు ఇవాళ ప్ర‌ధాని ఇంటిని చుట్టుమ‌ట్ట‌నున్నారు. ఇక లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ఎంపీలు చ‌లో రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు.

* ఇకపై రేవంత్‌ రెడ్డి ముఖం చూడను: ఎంపీ కోమటిరెడ్డి
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ముఖం చూసేది లేదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆయన ఫైరయ్యారు. తనను ఓడించాలని ప్రయత్నించిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. చెరుకును చేర్చుకునే విషయంలో రేవంత్‌ రెడ్డి పెద్ద తప్పు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకపై ఆయన ముఖం చేసేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల తర్వాతే మునుగోడుకు వెళ్తానని చెప్పారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ నేడు కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పైవిధంగా స్పందించారు.

* రూ. 15 మద్యం బాటిల్‌ను రూ. 200 అమ్ముతారా? : బొండా ఉమ
ఆంధ్రప్రదేశ్ లో మద్యం వ్యాపారంలో ప్రజాధనం దోపిడీకి గురవుతుందని టీడీపీ నాయకుడు బొండా ఉమ ఆరోపించారు. మద్యం వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. రూ. 15 లకే దొరికే మద్యంను రూ. 200కు విక్రయిస్తున్నారని విమర్శించారు. గత టీడీపీ హయాంలో మద్యం విక్రయాలను పారదర్శకంగా, బహిరంగంగా విక్రయించామని తెలిపారు. అయితే ఈ ప్రభుత్వం బేవరేజెస్‌ నుంచి ఎంతకు కొంటున్నారో బయటకు రాదని తెలిపారు.
మద్యం దుకాణాల్లో ఆన్‌లైన్‌ చెల్లింపులు కాకుండా నగదు మాత్రమే తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వద్దకు నగదు రూపేణా మొత్తం జమ అవుతుందని వివరించారు. అదాని డిస్టిలరీ రాష్ట్రంలో మూడువేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నదని ఈ డిస్టిలరీ ఎవరిదో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. అదాని కంపెనీ వైసీపీ నాయకులదని , బినామీపేర్లతో కంపెనీని నడిపిస్తున్నారని ఆరోపించారు.ప్రభుత్వం అమ్ముతున్న మద్యంలో రసాయనాల శాతం అధికంగా ఉందని ల్యాబ్‌ రిపోర్ట్‌ తేల్చి చెప్పిందని వెల్లడించారు. ఇటీవల ఏపీలో నిర్వహించిన మద్యం దుకాణాల వేలం బోగస్‌ అని అన్నారు. విజయవాడలో ముగ్గురు వైసీపీ నాయకులు సిండికేట్‌గా దుకాణాలను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.

* ప్రజాస్వామ్యం కళ్ళెదుట చచ్చిపోతోంది : రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కళ్ళెదుట ప్రజాస్వామ్యం చచ్చిపోతుండటాన్ని భారత దేశం చూస్తోందన్నారు. కేవలం నలుగురు వ్యక్తులు నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, శత్రుత్వం పెరిగిపోతున్నాయన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతుండటంపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నివాసం వద్ద ఘెరావ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యులు, సీనియర్ నేతలు పాల్గొంటారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలని తాము భావించామని రాహుల్ గాంధీ చెప్పారు. సమాజాన్ని ఏ విధంగా ముక్కలు చేస్తున్నారో చర్చించాలనుకున్నామన్నారు. పార్లమెంటులోనూ, వెలుపల ఈ అంశాలను లేవనెత్తాలనుకున్నామని, పార్లమెంటులో వీటిపై చర్చించేందుకు తమకు అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. తమను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇది నేటి భారత దేశ పరిస్థితి అని చెప్పారు. ప్రజా సమస్యలను లేవనెత్తకుండా నిరోధించడమే ప్రభుత్వ ఏకైక ఎజెండా అని ఆరోపించారు. కేవలం నలుగురు లేదా ఐదుగురి ప్రయోజనాలను కాపాడటానికి మాత్రమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యాపార దిగ్గజాల ప్రయోజనాలను కాపాడటం కోసం ఇద్దరు వ్యక్తులు నియంతృత్వాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ, మీడియా వంటి ముఖ్యమైన వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం తన సొంత మనుషులతో నింపుతోందన్నారు. దేశంలోని వ్యవస్థలు స్వతంత్రంగా లేవన్నారు. అన్ని వ్యవస్థలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నియంత్రణలో ఉన్నాయన్నారు. ప్రతి వ్యవస్థలోనూ కనీసం ఒక ఆరెస్సెస్ వ్యక్తి ఉన్నారన్నారు.

*పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ చేపట్టాలి: పవన్‌ కల్యాణ్‌
అచ్యుతాపురం సెజ్‌లో తరుచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. ఎంతమంది ప్రాణాలను హరించిందో ఎప్పటికీ మరచిపోలేమన్నారు. అచ్యుతాపురం సెజ్‌లో సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకై 125 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవడం దురదృష్టకరమన్నారు.అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లో తరుచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో.. ఎంతమంది ప్రాణాలను హరించిందో ఎప్పటికీ మరచిపోలేమన్నారు. అచ్యుతాపురం సెజ్‌లో సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకై 125 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనకు ప్రజా ప్రతినిధులు, అధికార గణం నిర్లిప్తతే కారణమని ఆరోపించారు. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.‘‘ఇదే కంపెనీలో నెల క్రితమే ఇలాంటి ప్రమాదమే జరిగింది. అప్పుడు 400 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇది పునరావృతం అయింది. అయితే ప్రమాదానికి కారణాలు ఏంటనే వివరాలను అధికారులు, ఇటు కంపెనీ ప్రతినిధులు చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రధానంగా ఔషధ, రసాయన, ఉక్కు, జౌళి కర్మాగారాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పరవాడ, దువ్వాడ, అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతాల చుట్టుపక్కల కాలనీవాసులు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో, ఏ విషవాయువు ప్రాణాలు తీస్తుందో అని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.రాష్ట్రం, దేశ ప్రగతికి పరిశ్రమలు ఎంతో అవసరం. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ ప్రగతి ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెట్టి కాదు. పారిశ్రామిక ప్రమాదాలు నివారణకు ప్రజాప్రతినిధులు, అధికారులు కలసికట్టుగా పనిచేయాలి. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలి. అవినీతికి తావులేకుండా ఆరోగ్యకరమైన పారిశ్రామిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం పని చేయాలి. ఎటువంటి వైఫల్యం ఎదురైనా అందుకు ప్రభుత్వంలోని పెద్దలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. గ్యాస్‌ లీకేజీ ప్రమాదంలో అస్వస్థతకు గురైన మహిళా కార్మికులకు ప్రభుత్వం మేలైన వైద్యాన్ని, పరిహారాన్ని అందించాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు.

*ఇంటి పక్కనే పాఠశాల ఉండాలంటే ఎలా?: బొత్స
పాఠశాలల విలీనంపై విద్యాశాఖ మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. విలీనాన్ని కేవలం కొద్ది మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఇంటి పక్కనే బడి ఉండాలంటే ఎలా? అని మంత్రి ప్రశ్నించారు. ఏదైనా చట్టం చేసే ముందు ప్రజాభిప్రాయం తీసుకోం కదా! అని స్పష్టం చేశారు. ‘ఇంటి పక్కనే పాఠశాల ఉండాలంటే ఎలా? మన వీధిలోనే బడి ఉంటుందా?’ అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ‘‘ప్రైవేటు పాఠశాలల్లో చదివించే తల్లిదండ్రులు పిల్లల్ని రోజూ బడిలో దింపి, తీసుకువస్తున్నారు కదా? అమెరికాలాంటి దేశాల్లో పాఠశాల ఉండే ప్రాంతంలో ఇళ్ల అద్దెలు, భవనాల ధరలు ఎక్కువగా ఉంటాయి. మంచి పాఠశాలకు అంత డిమాండ్‌ ఉంటుంది. అలాంటి ఆలోచన విధానం రావాలి. తరగతుల విలీనం కారణంగా విద్యార్థి కిలోమీటరు దూరం వెళ్లి, రావడం కష్టమన్నది తల్లిదండ్రులు అభిప్రాయం కావొచ్చు’ అని బొత్స పేర్కొన్నారు. ‘‘విలీనం మొదట మూడు కిలోమీటర్లు చేయాలనుకున్నా కిలోమీటరుకు తగ్గించాం. ఏదైనా చట్టం చేసే ముందు ప్రజాభిప్రాయం తీసుకోం కదా! ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ప్రజల అభిప్రాయమే చెబుతారు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని విధాన నిర్ణయాలు తీసుకుంటున్నాం. తరగతుల విలీనంలో ఎక్కడైనా సమస్యలు వస్తే పరిశీలిస్తాం. ఏదైనా ప్రయోగాత్మకంగా చేసినప్పుడు ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి’’ అని వెల్లడించారు.‘‘పాఠశాలల మ్యాపింగ్‌, విలీనం వల్ల ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు తగ్గిపోయాయని చాలామంది అంటున్నారు. ప్రవేశాలు జరుగుతున్నాయి. ఆగస్టు 15కు పూర్తవుతాయి. ఆ తర్వాత విద్యార్థుల సంఖ్య తెలుస్తుంది. ప్రవేశాలు తగ్గాయా? పెరిగాయా? అన్నది ప్రశ్న కాదు. ప్రభుత్వ బడులను మెరుగుపరిస్తే విద్యార్థులు వారంతటవారే వస్తారు. ప్రభుత్వ బడుల్లో చదవాలనే తపన, ప్రేరణ కల్పించాలి. నిర్బంధంగా ప్రైవేటు బడులు మూసి, ప్రభుత్వ పాఠశాలలు తీసుకురావాలన్నది మా అభిమతం కాదు. విద్యార్థి తనకు నచ్చినచోట చదువుకునే ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పరిస్థితులు కల్పించాలి. కొవిడ్‌ సమయంలో ఏడు లక్షలమంది విద్యార్థులు ప్రైవేటు బడుల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఎంతమంది ప్రవేశాలు పొందారో మొత్తం వివరాలు ఇస్తాం. దీంతోపాటు మా విశ్లేషణ ఇస్తాం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఎందుకు తగ్గారు? ఎందుకు పెరిగారనే విశ్లేషణ ఇస్తాం’’ అని తెలిపారు.

*విశాఖపట్నాన్ని విషాదపట్నం గా మార్చేశారు:లోకేష్
జగన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రెండు నెలల వ్యవధిలోనే రెండుసార్లు గ్యాస్ లీకేజ్ ఘటనలు జరిగాయంటే ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వ లెక్క లేనితనం స్పష్టమవుతొందన్నారు. విశాఖపట్టణంలో జే గ్యాంగ్‌ కబ్జాలు, దౌర్జన్యాలు, ప్రమాదాలు, విషరసాయనాల లీకులతో ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్జీ పాలీమర్స్ మరణమృదంగం, సాయినార్ ఫార్మా విషాదం మరువకముందే, అచ్యుతాపురం సెజ్‌ సీడ్స్ కంపెనీలో రెండోసారి విషవాయువులు లీకై వందలమంది మహిళలు తీవ్ర అస్వస్థతకి గురి కావడం తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. ఉపాధి కోసం వచ్చిన మహిళల ప్రాణాలు పోయినా ఫర్వాలేదు…కమీషన్లు నెలనెలా అందితే చాలన్నట్టుంది వైసీపీ పాలన ఉందని మండిపడ్డారు. చనిపోయాక పరిహారం ఇవ్వడం కాదు సీఎం గారూ! వాళ్లు బతికేలా రక్షణ చర్యలు తీసుకోండని ఆయన సూచించారు.

*జనం కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారు: చంద్రబాబు
జగన్పా లనను ప్రశ్నించిన అందరిపై కేసులు పెట్టాలి అనుకుంటే… రాష్ట్రంలోని ఐదు కోట్ల మందిపై ఈ ప్రభుత్వం కేసులు పెట్టాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనపై గడపగడపలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేత వ్యక్తమవుతోందన్నారు. ‘‘కాలర్ ఎగరేసుకుని ఎమ్మెల్యేలు తిరగడం కాదు…. జనం కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారు. సంక్షేమంలో కోతలు, అభివృద్ది పనులపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం అసహనానికి లోనవుతుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఎమ్మెల్యేను విద్యా దీవెనపై ప్రశ్నించిన ఇంజినీరింగ్ విద్యార్థి జశ్వంత్‌పై కేసు పెట్టి అరెస్టు చెయ్యడం ప్రభుత్వం అసహనానికి ప్రత్యక్ష సాక్ష్యం. విద్యార్థులపైనా కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేస్తారా?.. పాలనను ప్రశ్నించిన ప్రతి వారిపై కేసు పెట్టాలి అని ఈ ప్రభుత్వం భావిస్తే…. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిపైనా జగన్ కేసులు పెట్టాల్సి ఉంటుంది.. వేపనపల్లి గ్రామంలో ఘటనకు వైసీపీ క్షమాపణ చెప్పి విద్యార్థిపై, అతనికి మద్దతుగా నిలిచిన గ్రామస్థులు, టీడీపీ నేతలపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలి… వెంటనే అందరినీ విడుదల చెయ్యాలి.. స్థానిక పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీ చర్యలు తీసుకోవాలి.’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

*దేవేందర్ రెడ్డి, విజయసాయిలపై వర్ల రామయ్య ఫిర్యాదు
టీడీపీ నాయకులపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు గుర్రంపాటి దేవేంధర్ రెడ్డి, విజయసాయి రెడ్డిలపై టీడీపీ నేత వర్ల రామయ్యసీఐడీ ఏడీజికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో నిస్సిగ్గుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఉన్న గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి, నారా లోకేష్‌పై తప్పుడు ప్రచారం చేశారన్నారు. రెండు రాజకీయ పార్టీల మధ్య శత్రుత్వం, ద్వేషం పెంచడమే దేవేంద్ర రెడ్డి ఉద్దేశంలా కనిపిస్తోందన్నారు. సామాజిక మాధ్యమాల్లో దేవేంధర్ రెడ్డి ప్రచారం చేసినట్లుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో 273, 274, 275, 276 సర్వే నంబర్లే లేవన్నారు.ఈనెల 3న ఏ2 విజయ సాయిరెడ్డి సైతం టీడీపీ నాయకుల హత్యా రాజకీయాల పేరుతో తప్పుడు వార్తలు ప్రచారం చేశాని వర్ల రామయ్య ఆరోపించారు. దీనిపై నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, అశోక్ బాబు పిర్యాదు చేసేందుకు మంగళగిరి రూరల్ సీఐని సంప్రదించిగా ఆయన బాధ్యతారాహత్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. తమ నాయకులపై అసభ్యకరంగా మాట్లాడారని, ఇప్పటి వరకు తమ పిర్యాదుపై ఎటువంటి కేసు నమోదు చేయలేదన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న దేవేంద్ర రెడ్డి, విజయసాయి రెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని, పిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులపై అసభ్యంగా ప్రవర్తించినందుకు సీఐ భూషణంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

* రాజగోపాల్‌రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధం: రేవంత్‌రెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తో బహిరంగ చర్చకు సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చండూరు చౌరస్తాలో బహిరంగ చర్చకు రెడీ అన్నారు. రాజగోపాల్‌రెడ్డి ఎలా ఎదిగారు.. ఆయనకు వచ్చిన కాంట్రాక్ట్‌లపై చర్చకు సిద్ధమా? అంటూ రేవంత్ సవాల్ చేశారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారారని విమర్శించారు.
రాజగోపాల్‌రెడ్డి ఏ పోరాటం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై రాష్ట్ర ప్రభుత్వం 120కి పైగా కేసులు పెట్టిందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజగోపాల్‌ ఏనాడైనా విమర్శించారా? అని ప్రశ్నించారు. రాజగోపాల్‌పై ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బలంగా పనిచేస్తున్నారని కొనియాడారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో వెంకట్‌రెడ్డి పాల్గొంటారని, వెంకట్‌రెడ్డి గౌరవం తగ్గేలా ఎప్పుడూ మాట్లాడలేదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

* ఎంపీ గోరంట్ల మాధవ్‌ను సస్పెండ్ చేయాలి: సౌమ్య
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ను సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు. గోరంట్ల మాధవ్‌ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్‌ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయారు. గురువారం ఉదయమే ఈ వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ తర్వాత ‘వైరల్‌’గా మారింది. ఈ వీడియోలో గోరంట్ల మాధవ్‌ పూర్తి నగ్నంగా కనిపించారు. మహిళతో మాట్లాడుతూ అసభ్య చేష్టలకు పాల్పడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఈ విధంగా చేయడం ఏమిటని సౌమ్య ప్రశ్నించారు. గోరంట్ల తీరు చూశాక వైసీపీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఈ విధంగానే ఉంటారా? అనే అనుమానం కలుగుతోందన్నారు.