* దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గురువారంతో పోలిస్తే.. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.300 మేర వృద్ధి చెందింది. మరోవైపు, వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. కేజీ వెండి రూ.310 మేర పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,820గా ఉంది. కిలో వెండి ధర రూ.59,500 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,820 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.59,500గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,820గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,500వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,820గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,500 వద్ద కొనసాగుతోంది.
• స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,793 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 20.31 డాలర్లుగా ఉంది.తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ: బిట్కాయిన్ విలువ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఒక బిట్కాయిన్ రూ.19,21,996 పలుకుతోంది. ఇథీరియం రూ.2వేలకు పైగా పెరిగింది. ప్రస్తుతం రూ.1,37,865 వద్ద కొనసాగుతోంది.
*AI ఆర్కెస్ట్రేషన్ ప్లాట్‌ఫారమ్, హైపర్‌సెన్స్, జియో ప్లాట్‌ఫారమ్‌లతో సుబెక్స్ లిమిటెడ్ తన పార్ట్‌నర్‌షిప్‌ను ప్రకటించింది. ఈ పార్ట్‌నర్ షిప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం వ్యాపారానికి సంబంధించిన 5G ప్రొడక్ట్ లైన్‌ను పెంచుతుంది. ఈ పార్ట్‌నర్‌షిప్ గురించి ప్రకటించడంతో నేడు సుబెక్స్ షేర్లు మాంచి జోష్‌మీదున్నాయి.
*దేశీయ కరెన్సీ వరుసగా రెండో రోజూ క్షీణించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 25 పైసలు పతనమైంది. దాంతో డాలర్-రూపీ ఎక్స్ఛేంజ్ రేటు 79.40కు చేరుకుంది. గడిచిన నాలుగు నెలలకు వాణిజ్య లోటు భారీగా పెరగడంతో పాటు అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు రూపాయికి గండి కొట్టాయి.
*దేశంలో 5జీ వాణిజ్య సేవలు వచ్చేనెల 29న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయని సమాచారం. ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2022’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 5జీ సేవలను ఆరంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 1 వరకు జరగనున్న ఐఎంసీలో దేశీయ, అంతర్జాతీయ టెలికాం కంపెనీలు, వెండా ర్లు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కంపెనీలు తమ 5జీ టెక్నాలజీలను ప్రదర్శించనున్నాయి.
* ఫ్యూచర్ రిటైల్ లెక్కల ఖాతాలను మార్కెట్ నియంత్రణ మండలి సెబీ జల్లెడ పడుతోంది. ఆర్థిక విషయాలకు సంబంధించి కంపెనీ ఏమైనా అక్రమాలకు పాల్పడిందీ లేనిదీ తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించింది. ఇందుకోసం మెస్సర్స్ చోక్సీ అండ్ చోక్సీ ఆడిట్ సంస్థను నియమించింది. ఆర్థిక వివరాలు, లావాదావీల వెల్లడిలే ఫ్యూచర్ రిటైల్ నిబంధనలు తుంగలో తొక్కిందనే సముచిత అనుమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెబీ తెలిపింది.
*లేదు లేదంటూనే వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎ్‌సటీ భారం మోపుతోంది. తాజా మామిడి పండ్లు, కాయలు తప్ప అన్ని రకాల మామిడి ఉత్పత్తులపైనా 12 శాతం చొప్పు జీఎస్‌టీ విధించింది. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) గురువారం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. దీంతో కుటీర పరిశ్రమగా చేసే మామిడి తాండ్ర, ఒరుగుల వంటి మామిడి ఉత్పత్తులపైనా 12 శాతం జీఎస్‌టీ పడనుంది. దీనికి తోడు ఐస్‌క్రీం పార్లర్లలో తినే ఐస్‌క్రీమ్‌పై విధించే జీఎ్‌సటీపైనా స్పష్టత ఇచ్చింది. ఈ ఐస్‌క్రీమ్‌లు 18% జీఎస్‌టీ పరిధిలోకి వస్తాయని తెలిపింది. గత ఏడాది అక్టోబరు 6 నుంచే ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) సదుపాయంతో ఈ బాదుడు అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది. పాత పన్ను బకాయిలను ఐస్‌క్రీమ్ పార్లర్లు ఐటీసీ లేకుండా పాత 5ు జీఎ్‌సటీతోనే చెల్లించవచ్చని పేర్కొంది.
*రియల్ ఎస్టేట్ డెవలపర్ మాక్రోటెక్ డెవలపర్స్( Macrotech Developers (లోథా) మొత్తం ఈక్విటీలో దాదాపు 2 శాతం బీఎస్ఈ(BSE), ఎన్ఎస్ఈ(NSE)లలో బ్లాక్ డీల్(Block Deal) ద్వారా చేతులు మారింది. దీంతో గురువారం ఇంట్రా-డేలో మాక్రోటెక్ డెవలపర్స్ షేర్లు 8 శాతం పడిపోయి రూ.1,010కి చేరాయి.
*అదానీ పవర్ షేర్లు నేడు దడదడలాడించాయి. గురువారం నాటి ఇంట్రా-డేలో బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు 3 శాతం లాభపడి అదానీ పవర్ షేరు రికార్డు స్థాయిలో రూ. 352.30కి చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో కంపెనీ పన్ను తర్వాత ఏకీకృత లాభం (PAT) 17 రెట్లు పెరిగి రూ. 4,780 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.278 కోట్ల PATని పోస్ట్ చేసింది.
*విమానయాన సంస్థ ఇండిగో ‘స్వీట్ 16’ పేరిట ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించింది. సంస్థను ప్రారంభించి 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రకటించిన ఈ ఆఫర్ కింద పన్నులతో కలిపి రూ.1,616 ప్రారంభ ధరకే టికెట్ అందచేయనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ శుక్రవారం వరకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్ కింద టికెట్ బుక్ చేసుకునే వారు ఈ నెల 18 నుంచి వచ్చే ఏడాది (2023) జూలై 16 తేదీల మధ్య తమకు అనుకూలమైన రోజును ఎంచుకుని ప్రయాణించవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిమిత కాల ఆఫర్ కింద ఎన్ని టికెట్లు విక్రయించనున్నది వెల్లడించలేదు. ఇదిలా ఉండగా జూన్ 30వ తేదీతో ముగిసిన మొదటి త్రైమాసికంలో ఇండిగో రూ.1,064 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదు చేసిన నష్టంతో పోల్చితే ఇది 66.5 శాతం తక్కువ. క్యు1 ఆదాయం రూ.13,019 కోట్లకు పెరిగింది. ఇంధన ధరలు నాలుగింతలు పెరిగి రూ.1215 నుంచి రూ.5,990 కావడంతో వ్యయభారం పెరిగినట్టు పేర్కొంది.
*చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపె నీ వివోకు చెందిన భారత అనుబంధ విభాగమైన వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,217 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) గుర్తించింది. వివో మొబైల్ ఇండియా మన దేశంలో స్మార్ట్‌ఫోన్లు, వాటి యాక్సెసరీల తయారీ, అసెంబ్లింగ్, టోకు వర్తకం, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలు నిర్వహిస్తోంది. వివో ఇండియాపై దర్యాప్తులో భాగంగా డీఆర్‌ఐ అధికారులు కంపెనీ ఫ్యాక్టరీలో సోదాలు జరిపారని, దిగుమతులకు సంబంధించి కంపెనీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు లెక్కలు చూపిందనడానికి సోదాల్లో సాక్ష్యాలు లభించాయని ఆర్థిక శాఖ తన ప్రకటనలో పేర్కొం ది. తప్పుడు లెక్కలు చూపడం ద్వారా కంపెనీ రూ.2,217 కోట్ల కస్టమ్స్ సుంకాల ఎగవేతకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎగవేసిన సుంకాన్ని చెల్లించాల్సిందిగా వివో ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపింది. గతనెలలో వివో ఇండియాకు చెందిన ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు జరిపింది. దేశంలో పన్నులు ఎగవేసేందుకు స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో 2017-21 మధ్యకాలంలో రూ.62,476 కోట్ల టర్నోవర్‌ను చైనాలోని మాతృసంస్థకు తరలించిందని ఆ సందర్భంగా ఈడీ తెలిపింది. ఆ కాలానికి కంపెనీ మొత్తం టర్నోవర్ రూ.1,25,185 కోట్లలో ఇది సగానికి సమానం. కంపెనీకి దేశంలో ఉన్న అనుబంధ సంస్థల ద్వారా అక్రమంగా నిధులను చైనాకు దారి మళ్లించిందని దర్యాప్తు ఏజెన్సీ పేర్కొంది.