* హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు. గోరంట్ల మాధవ్ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయారు. గురువారం ఉదయమే ఈ వీడియో సోషల్ మీడియా లో ప్రత్యక్షమైంది. ఆ తర్వాత ‘వైరల్’గా మారింది. ఈ వీడియోలో గోరంట్ల మాధవ్ పూర్తి నగ్నంగా కనిపించారు. మహిళతో మాట్లాడుతూ అసభ్య చేష్టలకు పాల్పడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఈ విధంగా చేయడం ఏమిటని సౌమ్య ప్రశ్నించారు. గోరంట్ల తీరు చూశాక వైసీపీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఈ విధంగానే ఉంటారా? అనే అనుమానం కలుగుతోందన్నారు.
* ఎంపీ గోరంట్ల మాధవ్‌పై టీడీపీ నేత చింతకాయల విజయ్ పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు భంగం వాటిల్లిందంటూ గోరంట్ల మాధవ్ కు విజయ్ తరపు లాయర్ వెంకటేష్ లీగల్ నోటీసులిచ్చారు. లీగల్ నోటీసుపై 7 రోజుల్లోగా సమాధానం చెప్పాలని లాయర్ పేర్కొన్నారు. తనకు, తన కుటుంబసభ్యుల గౌరవానికి భంగం కలిగే విధంగా గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారని చింతకాయల విజయ్ తెలిపారు. మాధవ్‌పై రూ.50 లక్షల పరువు విజయ్ నష్టం దావా వేశారు.
* కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీజేపీతో టచ్‌లో ఉన్నారని తాను అనలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అనని మాటను అన్నట్టు బ్రేకింగ్స్ పెట్టొదంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు. నిధుల విషయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మోదీని కలుస్తుంటారన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అన్నారు. చీకోటి వ్యవహారంలో కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయన్నారు.
* భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో మంకీ పాక్స్ హైరానా నెలకొంది. మణుగూరు మండలంలోని విజయనగరం గ్రామానికి చెందిన ఓ విద్యార్థికి మంకీ పాక్స్ లక్షణాలు అగుపించాయి. దీంతో వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. మధ్యప్రదేశ్‌లో చదువుతున్న విద్యార్థి.. రెండు రోజుల కిందట స్వగ్రామానికి వచ్చాడు. అయితే అతనిలో జ్వరం, ఇతర మంకీ పాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో మణుగూరు ప్రభుత్వ వైద్యాధికారి సూచనల మేరకు కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటలో అతని రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్ సిరం ఇనిస్టిట్యూట్‌కు పంపిస్తున్నారు వైద్యులు. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య ఇదే తరహాలో టెస్టులకు పంపించగా.. నెగెటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
* సాంఘిక సంక్షేమ శాఖలోని అధికారి ఒకరు ఏసీబీ వలకు చిక్కారు. ఆయనతోపాటు, అవినీతికి సహకరించిన అటెండరునూ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సోమయ్య అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో తన సొంత భవనాన్ని బాలుర హాస్టల్ నిర్వహణ కోసం అద్దెకు ఇచ్చారు. 5సంవత్సరాల నుంచి రావాల్సిన అద్దె బకాయిల కోసం నిత్యం కలెక్టరేట్‌కు తిరుగుతున్నారు. ఈ క్రమంలో.. బిల్లు చేసేందుకు కలెక్టరేట్‌లో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయ సూపరింటెండెంట్ కే.రామ్మోహన్ రూ.40వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సోమయ్య అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనలతో రామ్మోహన్‌ను సోమయ్య కలిశారు. ఆ రూ.40వేలను అటెండర్ షకీల్ అహ్మద్‌కి ఇవ్వాలని రామ్మోహన్ సూచించాడు. సోమయ్య వద్దనుంచి షకీల్ లంచం డబ్బులు తీసుకొని ఇవ్వగా.. రామ్మోహన్ తన టేబుట్ సొరుగులో పెట్టాడు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. వారిద్దరినీ పట్టుకున్నారు. రామ్మోహన్, షకీల్‌ని అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
* విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరేట్ అల్వా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అల్వాకు తాము మద్దతు ఇస్తున్నట్లు ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటించింది. మార్గరేట్ అల్వాకు మద్దతునివ్వాలని టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు మొత్తం 16 మంది టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు మార్గరెట్ అల్వాకు ఓటు వేయనున్నారు. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు.
* శ్రీశైలం జలాశయం నుంచి అధికారులు మూడుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 83,949 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తుండగా జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 2,27,284 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. ఈ జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రసుత్తం 884.80 అడుగుల వరకు నీరు ఉంది.ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్ద్యం 215.80 టీఎంసీలు కాగా 214.36 వరకు టీఎంసీలు నీరు నిల్వ ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి 63,418 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
* పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎంపీలను అరెస్టు చేసే అంశంపై రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు ఓ ప్రకటన చేశారు. సభా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఎంపీలను అరెస్టు చేయడం లేదా ప్రశ్నించరాదు అన్న అభిప్రాయాలు కొందరిలో ఉన్నాయని, కానీ ఆ అది సరైన విధానం కాదు అన్నారు. ఎంపీలు కూడా సాధారణ వ్యక్తుల వంటివారే అని అన్నారు. క్రిమినల్ ఆరోపణలు ఉన్న కేసుల్లో.. ఆ ఎంపీలకు సభ ఎటువంటి రక్షణ కల్పించలేదని వెంకయ్య తెలిపారు. సభకు హాజరుకావాలన్న ఉద్దేశంతో కేసుల విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని చైర్మెన్ చెప్పారు. చట్టాన్ని, న్యాయ ప్రక్రియను గౌరవించడం మన విధిగా భావించాలని వెంకయ్య తెలిపారు. కొన్ని రోజుల క్రితం రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
*మావోయిస్టుల కు వ్యతిరేకంగా పాడేరులో వెలసిన వాల్ పోస్టర్లు కలకలం రేపుతోంది. అల్లూరి ఆదివాసీ యువజన సంఘం పేరిట పోస్టర్లు వెలశాయి. గిరిజనులకు ఉపయోగపడని వారోత్సవాలు వద్దని, అమాయక గిరిజనులను ఇంఫార్మర్ నెపంతో చంపుతున్నారని పోస్టర్లో పేర్కొన్నారు. సెల్ టవర్లు పేల్చి ప్రభుత్వ పథకాలను, మా గిరియువత విజ్ఞాన అవకాశాలను దూరం చేస్తున్నారని అన్నారు. రోడ్లు రాకుండా చేసి అభివృద్ధికి దూరంగా బతకమన్నారు. మావోయిస్టులారా మీరు ఎక్కడవుంటే అక్కడ వినాశనం, విధ్వంసం అంటూ పోస్టర్లు వెలిశాయి.
*అఫ్ఘానిస్థాన్ దేశంలో ఫైజాబాద్ నగరంలో భూకంపం సంభవించింది తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ట్వీట్ చేసింది.150 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపంతో ఫైజాబాద్ ప్రజలు భయంతో వణికిపోయారు.ఈ భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు. భూమి కంపించడంతో ప్రజలు భయకంపితులై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
*అత్యాచారం కేసులు, చిన్నారులపై జరిగే లైంగిక అత్యాచారం (పోక్సో) కేసులను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో 12 ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. అత్యాచారం, పోక్సో కేసుల పరిష్కారం కోసం దేశంలో 1,023 ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని 2019 అక్టోబర్లో నిర్ణయించినట్లు తెలిపారు.ప్రస్తుతం దేశంలో 728 ఫాస్ట్ట్రాక్ ప్రత్యేక కోర్టులు పని చేస్తున్నట్లు చెప్పారు. ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టుల కాలపరిమితిని ఒక ఏడాదికి పరిమితం చేయాలని ముందుగా నిర్దేశించినా తదుపరి 2023 మార్చి 31 వరకు వీటిని కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికి దేశంలోని అన్ని ఫాస్ట్ట్రాక్ ప్రత్యేక కోర్టుల్లో కలిపి లక్షకుపైగా కేసులను పరిష్కరించినట్లు తెలిపారు.
*ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022 తుది ఫలితాలు ఈ నెల 6న వెలువడనున్నాయి. అభ్యర్థుల స్కోరుతోపాటు ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేయనుంది. జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను జూలై 25 నుంచి 30 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 6.29 లక్షల మంది హాజరయ్యారు.
*ప్రజా గాయకుడు, రచయిత దివంగత వంగపండు ప్రసాద్ విగ్రహాన్ని నగరంలోని ఆర్కే బీచ్‌రోడ్డులో ఏర్పాటుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఏపీ సృజనాత్మక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈవిగ్రహాన్ని గురువారం సాయంత్రం సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సీదిరి అప్పలరాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వంగపండు సామాన్యుల గళాన్ని జనబాహుళ్యం చేసి అసమాన్యుడని అనిపించుకున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే నాగిరెడ్డి, వంగపండు కుమార్తె ఉష, ప్రజాగాయకుడు దేవిశ్రీ, అభిమానులు పాల్గొన్నారు.
*నరసరావుపేట మునిసిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ అధికారుల తనిఖీలు.. ఏ పని కావాలన్న మధ్యవర్తుల ప్రమేయం ఉండాల్సిందే అంటున్నా స్థానికులు నరసరావుపేట మునిసిపల్ కార్యాలయంలో చలానా 750 రూపయలు పనికి 2000 వేల రూపాయల వసూలుటి పట్టాల విషయంలో సచివాలయ సిబ్బంది బేర సారాలు పట్టా ఒకరికి,స్థలం ఇంకొకరికి సిబ్బంది తీరుతో ప్రజలకు తీవ్ర ఇబ్బంది
*సూళ్లూరుపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు.. సూళ్లూరుపేట నుండి స్పందన లో ఏసీబీ కి వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ తనికీలు చేస్తున్నాం..ఈ దాడులకు ముఖ్య కారణం టౌన్ బిల్డింగ్ ప్లానింగ్ విషయంలో అధికారులు వేధిస్తున్నారని ఏసీబీ ఫిర్యాదు చేసిన స్థానికులు..ఈ దాడుల్లో సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ నరేంద్ర వద్ద 1.93.000 వేలు రూపాయలు ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు…అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బందికి సంబంధించి రికార్డ్స్ ను మరియు నగదును తనికీలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు..
*తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. శనివారం జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అనంతరం జేపీ నడ్డా , అమిత్ షా ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చేరిక, మునుగోడు ఉప ఎన్నికపై చర్చించనున్నట్లు సమాచారం. రాజగోపాల్‌ను పార్టీలోకి ఢిల్లీలో చేర్చుకోవాలా? లేక పాదయాత్ర సందర్భంగా మునుగోడులో కాషాయ కండువా కప్పలా అనే దానిపై కూడా సమాలోచనలు జరపనున్నారు. అలాగే పాదయాత్ర జరుగుతున్న తీరు, తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులను జాతీయ నేతలకు వివరించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మునుగోడులో వాస్తవ పరిస్థితులపై అమిత్ షా నివేదికలు తెప్పించుకున్నారు. ఉప ఎన్నిక కోసం కమలం పార్టీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది.
* కేంద్రంలోని మోదీ సర్కార్ పెంచుతున్న ధరలకు వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. కడప జిల్లా వేంపల్లిలో పీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల సామాన్యుడు బ్రతుకలేని పరిస్థితి వచ్చిందని అన్నారు.పెట్రోలు, వంటగ్యాస్, నూనెగింజలు, తదితర నిత్యావసర ధరలను అసాధరణ రీతిలో పెరిగిపోయానని అన్నారు. ఏపీలో పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయని తెలిపారు.
*ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది: సోమువీర్రాజు
ఏపీ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు స్పష్టం చేశారు. రాజధానిని అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని సూచించారు. ఇక వామపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కమ్యూనిస్టులు పాదయాత్ర చేస్తామంటున్నారని, అయితే వారు ఎప్పుడు, ఎవరితో కలిసి నడుస్తారో వాళ్లకే తెలియదని తెలిపారు