భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు GWTCS ఆధ్వర్యంలో సందర్భంగా వాషింగ్టన్ డీసీలో ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షురాలు సాయి సుధ పాలడుగు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన, మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. జెండాలను చేతబూని ప్రదర్శన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. క్రీడల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. భాను మాగులూరి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో అన్షుల్ శర్మ కౌన్సెలర్ ఇండియన్ ఎంబసీ, సత్యనారాయణ మన్నె, చంద్ర మల్లావతు, కృష్ణ లాం, రవి అడుసుమల్లి, రాజేష్ కాసరనేని, ఫణి తాళ్లూరు, శ్రీనివాస్ గంగా, యాష్ బద్దులూరి, సుశాంత్ మన్నె, సుష్మ అమృతలూరు తదితరులు పాల్గొన్నారు.
వాషింగ్టన్ డీసీలో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం

Related tags :