Movies

విలన్‌గా కనిపించనున్న సంగీత దర్శకులు “కోటి”

విలన్‌గా కనిపించనున్న సంగీత దర్శకులు “కోటి”

తెలుగు, కన్నడ, తమిళ భాషలలో సుమారు 500 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి ఎంతో గుర్తింపు పొందిన కోటి విలన్ పాత్రలో సినిమాలో నటిస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. కాని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్లకు చెందిన సంకర బ్రదర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న “పగ పగ పగ” సినిమాలో ఈయన విలన్ పాత్ర పోషిస్తున్నారు.కోటి విలన్ పాత్రకు సంబంధించిన పస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకులు మెహర్ రమేష్ శుక్రవారం విడుదల చేశారు. చొప్పెల్లకే చెందిన అభిలాష్ సుంకర,దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న క్రైమ్ యాక్షన్ త్రిల్లర్ గా ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో విడుదుల కానుంది. రవి శ్రీ దుర్గాప్రసాద్ దర్శకత్వంలో సత్యనారాయణ సుంకర ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో బెనర్జీ, జీవీ.కె. నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాహుల్ హరిచంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు వంటి వారు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారని నిర్మాత సత్యనారాయణ సుంకర ఈ సందర్భంగా స్థానిక విలేకర్లకు తెలియజేశారు.