ఉమ్మడి కుటుంబంలో ఉన్న సంతోషం మరెక్కడా దొరకదని, అందుకే విదేశీ సంబంధాలు వద్దనుకున్నానని చెబుతున్నది హీరోయిన్ ఉర్వశీ రౌటేలా. విదేశీయుడిని వివాహం చేసుకుంటే ఇక్కడ కుటుంబానికి దూరమవుతాం అనేది ఆమె అభిప్రాయం. ‘కాబిల్’, ‘పాగల్ పంటి’, ‘హేట్ స్టోరీ 4’ వంటి చిత్రాతో హిందీలో నాయికగా గుర్తింపు తెచ్చుకున్న ఈ తార తెలుగులో ‘బ్లాక్ రోజ్’ అనే సినిమాలో నటిస్తున్నది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఉర్వశీ మాట్లాడుతూ…‘ఆయన కోసం విదేశాలకు వెళ్తే కుటుంబానికి దురమవుతా. స్వదేశంలో కుటుంబంతో ఉంటే నేనిక్కడ, ఆయన అక్కడ అవుతాం. నా జీవితంలో ఈ రెండు సందర్భాలను కోరుకోవడం లేదు.నాకు ఉమ్మడి కుటుంబంతో కలిసి ఉండటం ఇష్టం. వారితో దొరికే సంతోషాలు, బాంధవ్యాలు మరెక్కడా లభించవు. ఇటీవల ఈజిప్ట్ నుంచి నాకో సంబంధం వచ్చింది. అతనో పేరున్న గాయకుడు. కానీ వాళ్ల సంస్కృతీ సంప్రదాయాలకు మనకు కుదరదు. అందుకే వద్దని చెప్పా.’ అని తెలిపింది.